కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్... మిలిటెంట్ల కాల్పుల్లో ఇద్దరు భారత సైనికాధికారులు మృతి

భారత అధీనంలోని కశ్మీర్‌లోని అనంతనాగ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో భారత సైన్యానికి చెందిన ఒక కల్నల్, మరో మేజర్ మృతి.

లైవ్ కవరేజీ

  1. నిపా వైరస్ కోవిడ్ కంటే ప్రమాదకరం - ఐసీఎంఆర్ హెచ్చరిక

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  3. 'రష్యా ఒక పవిత్ర యుద్ధం చేస్తోంద'న్న ఉత్తర కొరియా అధ్యక్షుడు... కిమ్, పుతిన్ భేటీతో అమెరికా, దక్షిణ కొరియాలకు చిక్కులు తప్పవా?

  4. బ్రేకింగ్ న్యూస్, కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. మిలిటెంట్ల కాల్పుల్లో ఆర్మీ కల్నల్, మేజర్ మృతి

    ప్రతీకాత్మక చిత్రం

    ఫొటో సోర్స్, INDIAN ARMY

    ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

    కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో మిలిటెంట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యానికి చెందిన ఒక కల్నల్, ఒక మేజర్ మరణించారు.

    రాష్ట్రీయ రైఫిల్స్‌లోని ఒక యూనిట్‌కు కమాండింగ్ ఆఫీసర్‌గా కల్నల్ ఉన్నారని భారత ఆర్మీ తెలిపింది. జమ్ము కశ్మీర్ పోలీస్ విభాగానికి చెందిన ఒక అధికారి కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు వెల్లడించింది.

    ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు సైన్యం తెలిపింది.

    "పోలీసులు, సైన్యం నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం, సైన్యంలోని ఒక కల్నల్, ఒక మేజర్ మరణించారు. వీరిద్దరే కాకుండా పోలీస్ డీఎస్పీ కూడా చనిపోయారు’’ అని శ్రీనగర్‌కు చెందిన బీబీసీ ప్రతినిధి రియాజ్ మస్రూర్ చెప్పారు.

    "ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది" అని ఆయన చెప్పారు.

    రియాజ్ మస్రూర్ చెప్పినదాని ప్రకారం, ఈ ఆపరేషన్ నిన్న రాత్రి మొదలైంది.

    దీని గురించి ఆర్మీ కూడా ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది.

    సైన్యం

    ఫొటో సోర్స్, Twitter

  5. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై అభిశంసన విచారణ... ఈ కేసు ఏంటి?

  6. తల్లిదండ్రులు కన్నబిడ్డల మధ్య వివక్ష చూపిస్తారా?

  7. చాట్ జీపీటీని 'గూగుల్ కిల్లర్' అని ఎందుకు అంటున్నారు... ఏఐ రేసులో గూగుల్ ఎక్కడ?

  8. 'నా రొమ్ముల మధ్య ముఖం పెట్టాడు'.. ఆపరేషన్ థియేటర్లలో సీనియర్ల లైంగిక వేధింపులకు బలవుతున్న మహిళా సర్జన్లు

  9. కుల్‌దీప్ యాదవ్: ఫాస్ట్ బౌలర్ కావాలనుకుని స్పిన్నర్ ఎందుకు అయ్యాడంటే

  10. ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ 19కి వాయిదా

    nara chandrababu naidu

    ఫొటో సోర్స్, facebook/narachandrababunaidu

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్ట్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలంటూ ఏపీ హైకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిగింది.

    అనంతరం విచారణను ఈ నెల 19కి వాయిదా వేశారు.

  11. టవల్ ఎన్ని రోజులకు ఉతకాలి, ఉతక్కపోతే ఎలాంటి జబ్బులొస్తాయి

  12. బ్రేకింగ్ న్యూస్, పుతిన్‌ను కలిసిన కిమ్ జోంగ్ ఉన్.. రష్యాలోని వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ దగ్గర మీటింగ్

    Putin, Kim

    ఫొటో సోర్స్, Kremlin Telegram Channel

    రష్యా పర్యటనకు వెళ్లిన ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ ఆ దేశంలోని స్పేస్‌పోర్ట్‌ వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్‌కు చేరుకున్నారు.

    అక్కడ ఆయన పుతిన్‌ను కలిశారు.

    ఇద్దరు నేతలూ ఒకరికొకరు అభివాదం చేసుకున్నారని రష్యా వార్తా ఏజెన్సీ టాస్ వెల్లడించింది.

    ఇద్దరు నేతలు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న దృశ్యాలు కూడా రిలీజయ్యాయి.

  13. ఐఫోన్ 15: ధర ఎంత? ఫీచర్లు ఏమేం ఉన్నాయి

  14. లంకను కూల్చిన కుల్‌దీప్ - 41 పరుగుల తేడాతో భారత్ విజయం

    kuldeep yadav

    ఫొటో సోర్స్, Getty Images

    ఆసియా కప్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్‌డే మ్యాచ్‌ను భారత జట్టు గెలుచుకుంది.

    స్వల్ప లక్ష్యమే ఇచ్చినప్పటికీ శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ను భారత బౌలర్లు సమర్థంగా కట్టడి చేయగలగడంతో విజయం దక్కింది.

    రెండు జట్లలోనూ స్పిన్నర్లు చెలరేగడంతో తక్కువ స్కోర్లే నమోదయ్యాయి.

    శ్రీలంకపై సాధించిన ఈ విజయంతో భారత్‌ ఫైనల్ బెర్తు ఖాయం చేసుకుంది.

    Rohit Sharma

    ఫొటో సోర్స్, Getty Images

    మంగళవారం కొలంబోలో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు శ్రీలంకను 41 పరుగుల తేడాతో ఓడించింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 213 పరుగులకే ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ 53 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 39, ఇషాన్ కిషన్ 33 పరుగులు చేశారు. శుభమన్ గిల్ 19 పరుగులకే వెనుదిరిగాడు. చివర్లో అక్షర్ పటేల్ 26 పరుగులు చేయడంతో భారత్ స్కోర్ 200 దాటింది.

    లంక బౌలర్లలో దునిత్ వెల్లలాగె 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకోగా అసలంక 18 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నారు.

    ఈ ఇద్దరూ విజృంభించడంతో భారత బ్యాటర్లు ఒకరి తరువాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. 49.1 ఓవర్లలో అందరూ అవుటయ్యారు.

    మరోవైపు భారత్ సాధించిన 213 పరుగులలో 21 ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి.

    అయితే, 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన శ్రీలంక బ్యాటర్లు ఒకరి తరువాత ఒకరు అవుటవడంతో ఓటమి తప్పలేదు.

    మొత్తం 41.3 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు.

    భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 43 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోగా బుమ్రా, జడేజాలు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

    శ్రీలంక ఆటగాళ్లలో బౌలింగ్‌లో 5 వికెట్లు తీసుకున్న వెల్లలాగె బ్యాటింగ్‌లోనూ రాణించడంతో ఆ జట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.

    వెల్లలాగె 46 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 42 పరుగులు చేశాడు. ధనుంజయ డిసిల్వా 41, అసలంక 22 పరుగులు చేశారు.

    కాగా భారత్ తన చివరి సూపర్-4 మ్యాచ్‌ను శుక్రవారం బంగ్లాదేశ్‌తో ఆడనుంది.

    శ్రీలంక బ్యాటర్

    ఫొటో సోర్స్, Getty Images

  15. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్స్‌ను నిరంతరం బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీలో చూడండి.