ఆసియా కప్: 213 పరుగులకు ఆలౌట్ అయిన భారత్, టార్గెట్ చేజింగ్‌లో తడబడుతున్న శ్రీలంక

పాకిస్తాన్ మీద రికార్డ్ విజయం సాధించిన భారత జట్టు మరునాడు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో 213 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే, టార్గెట్ తక్కువే అయినా శ్రీలంక కష్టాల్లో పడింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. ఆసియా కప్: భారత్ ఇచ్చిన 214 పరుగుల టార్గెట్‌ను ఛేదించడంలో తడబడుతున్న శ్రీలంక

    బుమ్రా

    ఫొటో సోర్స్, ANI

    ఆసియా కప్ టోర్నమెంట్లో భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. మొదటి బ్యాటింగ్ చేసిన భారతజట్టు ఈ మ్యాచ్‌లో 213 పరుగులకే ఆలౌట్ అయింది.

    శ్రీలంక జట్టు 214 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగినప్పటికీ ఆరంభంలోనే తడబడింది. ఏడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక జట్టు 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

    ఆ తరువాత 68 పరుగుల వరకు కాస్త నిలకడగా ఆడుతున్నట్లు కనిపించినప్పటికీ, ఆ తరువాత కూడా భారత బౌలర్లు వరసగా వికెట్లు పడగొడుతూ వచ్చారు.

    శ్రీలంక జట్టు 23 ఓవర్లు పూర్తయ్యేప్పటికి 93 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది.

    భారత బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా మొదట్లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. కుల్‌దీప్ నాయర్‌లు మరో రెండు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్‌కు ఒక వికెట్ లభించింది.

  3. పార్లమెంట్‌లో లైంగిక వేధింపులు: ‘అతను నా మెడకు దగ్గరగా ఊపిరి పీల్చుతూ, అసభ్యకరంగా మాట్లాడేవారు’

  4. పాత సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు చెత్త కాదు, లక్షల కోట్ల సంపద... ఎలాగో తెలుసా?

  5. ‘‘డీజిల్ వాహనాల అమ్మకాలపై అదనపు జీఎస్టీ లేదు’’- నితిన్ గడ్కరీ

    నితిన్ గడ్కరీ

    ఫొటో సోర్స్, FB/nitin gadkari

    డీజిల్ వాహనాల అమ్మకాలపై అదనంగా 10% జీఎస్టీ విధిస్తున్నట్లు వస్తున్న మీడియా కథనాలపై నితిన్ గడ్కరీ స్పష్టతనిచ్చారు. ఇందుకు సంబంధించి ఆయన ట్వీట్ చేశారు.

    ప్రభుత్వం దగ్గర అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని పేర్కొన్నారు.

    “2070 నాటికి జీరో కార్బన్, వాయు కాలుష్య నియంత్రణ లక్ష్యంతో, కాలుష్యానికి కారణమయ్యే ప్రమాదకరమైన డీజిల్ వంటి ఇంధనాల వినియోగాన్ని తగ్గించడంపై దృష్టి సారించాం.

    అదే సమయంలో ఆటో మొబైల్ అమ్మకాలలో వృద్ధి సాధించడంతోపాటు, పర్యావరణ హితమైన ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి సారించాల్సి ఉంది.

    ఈ ఇంధనాలు దేశీయంగా ఉత్పత్తి చేసినవే కాకుండా, తక్కువ ధర, ఇంధనాల దిగుమతికి ప్రత్యామ్నాయంగా, కాలుష్యరహితంగా వృద్ధి చేయాల్సిన అవసరం ఉంది” అని అన్నారు

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. ఎలక్షన్స్ 2024: సొంతూరులో ఓటరుగా నమోదు చేసుకుని, మరోచోట నుంచి ఓటు వేయవచ్చా? ఎన్నారైలు ఓటు వేయాలంటే ఎలా?

  7. యాంటీ బయాటిక్స్ వేసుకోవడం ప్రమాదకరమా,పేగు మీద ఎలాంటి ప్రభావం చూపుతాయి?

  8. బ్రేకింగ్ న్యూస్, చంద్రబాబు: రిమాండ్‌ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్

    నారా చంద్రబాబు నాయుడు

    ఫొటో సోర్స్, TDP/Facebook

    చంద్రబాబు నాయుడు అరెస్టు కేసులో ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్‌ను సవాలు చేస్తూ ఆయన తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

    ఈ పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు, దీనిపై బుధవారంనాడు విచారణ జరుపుతామని తెలిపింది.

  9. ఇస్లాం: సౌదీ యువరాజు రాజ్‌ఘాట్‌ను ఎందుకు సందర్శించ లేదు?

  10. లండన్ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన ఏపీ సీఎం జగన్

    జగన్ మోహన్ రెడ్డి

    ఫొటో సోర్స్, UGC

    ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని ఏపీకి తిరిగొచ్చారు.

    సీఎంకు స్వాగతం పలకడానికి భారీగా వైసీపీ నాయకులు గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. ఆయనకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

    అక్కడ నుంచి సీఎం జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లారు.

  11. మొరాకో భూకంపం: 2,800కి పెరిగిన మృతుల సంఖ్య

    మరకేశ్‌లో శిథిలాలను తొలగిస్తున్న సహాయక సిబ్బంది

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, మరకేశ్‌లో శిథిలాలను తొలగిస్తున్న సహాయక సిబ్బంది

    మొరాకో భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2,800కి పెరిగింది. గత శుక్రవారం ఈ దేశంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది.

    అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చాలా మంది తమ ఆప్తులను, బంధువులను ఈ మహా విపత్తులో కోల్పోయారు.

    మొరాకోలో కొనసాగుతోన్న సహాయక చర్యలలో స్పెయిన్, బ్రిటన్, ఖతార్‌కు చెందిన సహాయక బృందాలు పాల్గొన్నాయి.

    మరకేశ్ నగరానికి 45 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అల్ జజీరా తెలిపింది.

    ఆ దేశ టెలివిజన్ చెబుతోన్న వివరాల ప్రకారం, ఈ భూకంపంలో మృతుల సంఖ్య 2,862కి పెరగగా.. 2,562 మంది గాయాలు పాలయ్యారు.

  12. కేరళ: జ్వరం వల్ల అసహజ మరణాలు, కోజికోడ్‌లో హైఅలర్ట్

    వీణా జార్జ్

    ఫొటో సోర్స్, ANI

    జ్వరం వల్ల ప్రైవేట్ ఆస్పత్రిలో రెండు అసహజ మరణాలు సంభవించడంతో, కేరళ ఆరోగ్య విభాగం కోజికోడ్‌లో అలర్ట్ జారీ చేసింది.

    నిఫా వైరస్ వల్ల ఇద్దరు అనుమానాస్పదంగా మరణించినట్లు కేరళ ఆరోగ్య విభాగం తెలిపింది.

    చనిపోయిన వారిలో ఒకరి బంధువులు ప్రస్తుతం ఐసీయూలో ఉన్నట్లు చెప్పింది.

    ఈ విషయంపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

    2018 ప్రారంభంలో కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో నిఫా వైరస్ వచ్చింది. 2021లో కోజికోడ్‌లో నిఫాకు చెందిన మరో కేసు నమోదైంది.

    జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే ఈ వైరస్‌ని నిర్ధరించడం చాలా కష్టం.నిఫా వైరస్ వల్ల శ్వాసకోశ ఇబ్బందులతో పాటు, ఇన్ఫెక్షన్ లక్షణాలైన జ్వరం, ఛాతి నొప్పి, తలనొప్పి, అలసట ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

  13. కిమ్ జోంగ్ ఉన్ బుల్లెట్ ప్రూఫ్ రైలు ప్రత్యేకతలేంటి, ఇంకా ఆయన వాడే విలాస వాహనాలు ఎన్ని?

  14. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్స్‌ను నిరంతరం బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీలో చూడండి.