'సులభ్ ఇంటర్నేషనల్' వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మృతి

'సులభ్ ఇంటర్నేషనల్' వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ దిల్లీలో కన్నుమూశారు.

లైవ్ కవరేజీ

  1. Caste Census: కులాల లెక్కలు వెల్లడించిన బిహార్... దేశవ్యాప్తంగా కులగణన చేస్తే రిజర్వేషన్ల వ్యవస్థే మారిపోతుందా?

  2. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  3. అఫ్గానిస్తాన్‌: ‘తిండి కోసం పాప ఉయ్యాల అమ్మేశా. ఏ దారి లేకపోతే నా పిల్లల్నీ అమ్ముకోవాల్సిందే’

  4. అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వాన్ని వదులుకొని మళ్లీ భారత పౌరుడిగా ఎందుకు మారారు?

  5. 'సులభ్ ఇంటర్నేషనల్' వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మృతి

    బిందేశ్వర్ పాఠక్

    ఫొటో సోర్స్, Getty Images

    'సులభ్ ఇంటర్నేషనల్' వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ కన్నుమూశారు.

    దిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌)లో ఆయన తుదిశ్వాస విడిచారు.

    ఆయన మృతిని సులభ్ ఇంటర్నేషనల్ సీనియర్ ఉపాధ్యక్షుడు ఆర్‌సీ ఝా ధ్రువీకరించారు.

    "సులభ్ ఇంటర్నేషనల్ హెడ్‌క్వార్టర్స్‌లో బిందేశ్వర్ జెండాను ఎగురవేశారు. మాతో కూడా మాట్లాడారు. అప్పుడు పూర్తిగా ఆరోగ్యంగానే కనిపించారు. కానీ, అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఎయిమ్స్‌కు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. తర్వాత కార్డియాక్ అరెస్ట్ కారణంగా మధ్యాహ్నం 1:30 నుంచి 2:00 గంటల మధ్య ఆయన చనిపోయారు’’ అని బీబీసీతో ఝా చెప్పారు.

    బిందేశ్వర్ పాఠక్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. తమిళనాడు అసెంబ్లీలో నిజంగానే జయలలిత చీర లాగారా... ఆ రోజు అసలేం జరిగింది?

  7. స్వతంత్ర భారతదేశం సాధించిన అతి పెద్ద విజయం ఏమిటి? అతిపెద్ద సమస్య ఏమిటి?

  8. ఫుడ్ సేఫ్టీ: పచ్చి గుడ్లు మంచివా? ఉడకబెట్టినవా

  9. రాడ్‌క్లిఫ్: ఐదు వారాల్లో ఒక్క గీతతో భారత్, పాకిస్తాన్‌లను విభజించిన బ్రిటిష్ లాయర్

  10. పెళ్లి చేసుకుంటానని మహిళను మోసం చేస్తే జైలు శిక్ష తప్పదా? భారతీయ న్యాయ సంహిత బిల్లు ఏం చెబుతోంది?

  11. ఎలక్షన్స్ 2024: పోలింగ్ కేంద్రాన్ని ఎలా నిర్ణయిస్తారు? పోలింగ్ స్టేషన్, పోలింగ్ బూత్‌ల మధ్య తేడా ఏమిటి?

  12. NEET: సరైన ర్యాంక్ రావట్లేదని తండ్రీ, కొడుకుల ఆత్మహత్య - గ్రౌండ్ రిపోర్ట్

  13. విద్యా ల‌క్ష్మి: చదువుకునేందుకు సులువుగా రుణాలిచ్చే ఈ పోర్టల్ గురించి తెలుసా?

  14. ఈశాన్య రాష్ట్రాల యువత ఇండిపెండెన్స్ డే గురించి ఏమనుకుంటోంది?

  15. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్‌తో సమాచార హక్కు చట్టం బలహీన పడుతుందా?

  16. రష్యాలోని పెట్రోల్ బంక్‌లో పేలుడు, 27 మంది మృతి

    రష్యా పెట్రోల్ బంకులో పేలుడు

    దక్షిణ రష్యాలోని డాజెస్తాన్‌లో ఓ పెట్రోల్ బంక్‌లో పేలుడు, మంటల కారణంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

    డాజెస్తాన్ ప్రాంతీయ రాజధాని మఖాచ్‌కలాలో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9.30 ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది.

    మఖాచ్‌కలా కాస్పియన్ సముద్ర తీరంలో ఉంది.

    పేలుడు కారణంగా 27 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.

    పేలుడుకు గల కారణాలు ఇప్పటివరకు తెలియనప్పటికీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఒక కార్లు నిలిపే ప్రదేశం నుంచి మంటలు మొదలై బంక్‌కు వ్యాపించడమే ఈ పేలుడుకి కారణమని కొందరు స్థానికులు చెప్తున్నారు.

    కార్లు నిలిపిన ప్రదేశంలో కార్ల మెంటెయినెన్స్ పని కారణంగా మంటలు మొదలయ్యాయని స్థానిక దర్యాప్తు కమిటీ ఒకటి చెప్పింది.

    కాగా మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు వైద్యులను ఉటంకిస్తూ రష్యా వార్తాపత్రిక ఇజ్వెస్టియా చెప్పింది.

  17. 100వ స్వాతంత్ర్య దినోత్సవానికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్

    మోదీ

    ఫొటో సోర్స్, Ani

    2047లో 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొనేనాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తంచేశారు.

    ‘‘దేశ శక్తి సామర్థ్యాలు, వనరులను పరిశీలించిన అనంతరం ఈ విషయం చెబుతున్నాను. అయితే, అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు మనం మూడు అంశాలను నిర్మూలించాల్సి ఉంటుంది. అవే అవినీతి, కుటుంబ, బుజ్జగింపు రాజకీయాలు’’ అని మోదీ అన్నారు.

    ‘‘కుటుంబ, బుజ్జగింపు రాజకీయాలు దేశాన్ని ధ్వంసం చేస్తున్నాయి. రాజకీయ పార్టీకి ఒక కుటుంబం మాత్రమే నేతృత్వం వహించడం ఏమిటి? వారి జీవిత మంత్రం ఏమిటంటే.. కుటుంబ పార్టీ, కుటుంబం తరఫున, కుటుంబం కోసం’’ అని మోదీ అన్నారు.

  18. ‘‘చంద్రయాన్‌లోనూ మహిళలదే కీలకపాత్ర’’

    రానున్న ఐదేళ్లలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని నమ్మకముందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

    అభివృద్ధిలో మహిళల పాత్ర గురించి మోదీ ప్రధానంగా ప్రస్తావించారు.

    ‘‘దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో, అభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిది. చంద్రయాన్ మిషన్‌లోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని జీ20 దేశాలు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాయి’’ అని మోదీ చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. ‘‘కొత్తగా విశ్వకర్మ పథకం’’

    సంప్రదాయ నైపుణ్యాలుండే కళాకారులు, నిపుణులను ప్రోత్సహించేందుకు రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్ల వ్యయంతో విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

    దేశంలో ధరల పెరుగుదలను నియంత్రించేందుకు చాలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాన మంత్రి వివరించారు. ఈ దిశగా తమ కృషి కొనసాగుతుందని తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. వీరప్పన్‌: తెలుగు ఐఎఫ్‌ఎస్ అధికారి శ్రీనివాస్‌ తలను నరికి కాలితో తన్నారా, అంతక్రూరంగా ఎందుకు చంపారు?