ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం....గుడ్ నైట్
పాకిస్తాన్‌లోని బజౌర్ జిల్లాలోని ఖార్ తహసిల్ ప్రాంతంలో జరిగిన భారీ పేలుడులో కనీసం 35 మంది మరణించారు, 200మంది గాయపడ్డారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) పార్టీ నిర్వహించిన కార్యకర్తల సదస్సులో పేలుడు సంభవించింది.
క్షతగాత్రులను ఆసుపత్రులకు చేర్చే పనిలో రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు 35 మందిని ఆసుపత్రికి తరలించారు.
గాయపడినవారు పెద్ద సంఖ్యలో ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా ఆస్పత్రిలో అధికారులు ‘హెల్త్ ఎమర్జెన్సీ’ ప్రకటించారు.
ఈ పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటన జరిగిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
తమ పార్టీ సమావేశంలో జరిగిన ఈ పేలుడును జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఫజల్) ప్రధాన కార్యదర్శి మౌలానా అబ్దుల్ గఫూర్ హైదరీ తీవ్రంగా ఖండించారు. కొందరు దేశంలో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టే కుట్రతో ఈ పని చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
యుక్రెయిన్‌పై శాంతి చర్చల ఆలోచనను తాను తిరస్కరించనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ఆఫ్రికా నాయకులతో సమావేశం తర్వాత శనివారం రాత్రి పుతిన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.ఆఫ్రికా, చైనా చొరవ శాంతి స్థాపనకు ఒక ప్రాతిపదిక కాగలదని ఆయన చెప్పారు.
యుక్రెయిన్ సైన్యం దాడులు చేస్తున్న సమయంలో కాల్పుల విరమణ పాటించడం కష్టమని పుతిన్ చెప్పారు.
అవతలి పక్షం కొన్ని ముందస్తు షరతులకు అంగీకరిస్తే తప్ప తాము చర్చలకు రాబోమమని రష్యా, యుక్రెయిన్ రెండూ గతంలో ప్రకటించాయి.
1991 నాటికి రష్యాతో యుక్రెయిన్ సరిహద్దులు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఆ స్థితిని పునరుద్ధరించాలని యుక్రెయిన్ డిమాండ్ చేస్తోంది. దీనిని రష్యా పూర్తిగా వ్యతిరేకిస్తోంది.
చర్చలు జరగాలంటే యుక్రెయిన్ క్షేత్రస్థాయి వాస్తవాన్ని అంగీకరించాలని రష్యా చెబుతోంది.
యుక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని పుతిన్ చెప్పారు.
రష్యాలో ప్రభుత్వాన్ని విమర్శించే కొందరిని అరెస్టు చేయడాన్ని ఆయన సమర్థించుకున్నారు. కొందరు వ్యక్తులు రష్యా లోపలి నుంచే రష్యాకు హాని చేస్తున్నారని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.