లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వారి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు భోపాల్ పోలీసులు తెలిపారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్షాల ఐక్యతా సమావేశం ముగించుకుని వస్తుండగా ఈ ఘటన జరిగింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, ANI
ఎన్డీయేకి దేశం, దేశ భద్రతమే ముఖ్యమని, దేశ పురోగతికి, ప్రజల సాధికారతకు ప్రాధాన్యమిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
నేషనల్ డెమొక్రాటిక్ అలియెన్స్(ఎన్డీయే) కూటమి పార్టీల సమావేశం అనంతరం ఆయన ప్రసంగించారు.
మేకిన్ ఇండియా నినాదంతో దేశాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
ఎన్డీయే అంటే న్యూ ఇండియా డెవలప్‌మెంట్ యాస్పిరేషన్ అని వెల్లడించారు.
ఎన్డీయే మూడోసారి అధికారంలోకి వస్తే, భారత్ ప్రపంచంలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని అన్నారు.
తాము విపక్షంలో ఉన్నప్పుడూ, ఎల్లవేళలా అనుకూల రాజకీయాలనే చేసేవాళ్లమని చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాల స్కామ్‌లను వెలుగులోకి తీసుకొచ్చామని, కానీ ప్రజల్ని ఎప్పుడూ కించపరచలేదన్నారు.
అధికార ప్రభుత్వాలకు వ్యతిరేకంగా విదేశీ అధికారాలను వాడుకోలేదని, దేశ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన పథకాలకు ఇబ్బందులు కలుగ జేయలేదన్నారు.
రాజకీయాల్లో పోటీతత్వం ఉండాలని, శత్రుత్వం కాదని అన్నారు. ప్రజా వ్యతిరేక కూటములు ఎప్పటికీ సఫలం కావని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తోన్న విమానం అత్యవసరంగా మధ్యప్రదేశ్ భోపాల్‌లో ల్యాండ్ అయింది.
ప్రతికూల వాతావరణ పరిస్థితులతో వారి విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్లు భోపాల్ పోలీసులు తెలిపారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్షాల ఐక్యతా సమావేశం ముగించుకుని రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు దిల్లీకి తిరుగు పయమనయ్యారు.
వారు తిరిగి వచ్చే మార్గంలో వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1

పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, @BJP4India
దిల్లీలోని హోటల్ అశోక్‌లో ఎన్డీయే కూటమి సమావేశమైంది. బీజేపీతో పాటు 38 పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి.
ఈ కూటమి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. శివసేన షిండే వర్గంతోపాటు, ఆంధ్రప్రదేశ్ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, ANI
గతంలో యూపీయే కూటమిగా ఉన్న పార్టీలతోపాటు మరికొన్ని పార్టీ కలుపుకుని 26 పార్టీలతో కొత్త కూటమిగా అవతరించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు.
బెంగళూరులో జరిగిన విపక్ష పార్టీల సమావేశం అనంతరం జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన ఖర్గే, తమ కూటమికి ఇండియా అని నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఇండియా అంటే Indian National Developmental Inclusive Alliance అని ఆయన వివరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించే క్రమంలో ఈ సమావేశం అత్యంత కీలకమైందని, అందుకే 26 పార్టీలు ఈ సమావేశంలో పాల్గొన్నాయని మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.
ఈ కూటమి తదుపరి సమావేశం ముంబయిలో జరుగుతుందని, ఆ సమావేశంలో 11 మంది సభ్యులతో ఒక కమిటీ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఖర్గే వెల్లడించారు.
కూటమి భవిష్యత్ కార్యాచరణను ఈ కమిటీ రూపొందిస్తుందని ఆయన వెల్లడించారు.
ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతుండటంతో భయపడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇప్పుడు ఎన్డీయే కూటమి సభ్యులతో హడావుడి సమావేశం నిర్వహిస్తున్నారని ఖర్గే అన్నారు.
ఇప్పటి వరకు ఎన్డీయే కూటమి సభ్యులను బీజేపీ లెక్కచేయలేదని, విపక్ష పార్టీల సమావేశంతో ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు అన్ని రాష్ట్రాలకు తిరుగుతూ ఎన్డీయే సభ్యులను కలుస్తున్నారని మల్లికార్జున ఖర్గే అన్నారు.
తమ కూటమిలో 38 పార్టీలున్నట్లు ఎన్డీయే చెప్పుకుంటోందని, అందులో కొన్ని పేర్లు ఎవరికీ తెలియను కూడా తేలియవని ఖర్గే ఎద్దేవా చేశారు.

ఫొటో సోర్స్, ANI
రాహుల్ గాంధీ ఏం చెప్పారు?
‘‘ఇది మా రెండో సమావేశం. ఎంతో ప్రొడక్టివ్ పని జరిగింది. బీజేపీ సిద్ధాంతం, వారి ఆలోచలనలకు వ్యతిరేకంగానే ఈ పోరాటం. వారు దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు. నిరుద్యోగం పెరిగిపోతుంది. దేశ సంపదంతా కొంత మంది చేతుల్లోకే వెళ్తోంది. మాకు మేం ఒక ప్రశ్నను వేసుకున్నాం. ఈ పోటీ ఎవరి మధ్యలో? ఈ పోటీ విపక్షాలకు, బీజేపీకి మధ్యలో కాదు. దేశ ప్రజల గొంతుకను నొక్కివేస్తున్నారు. దేశ ప్రజల గొంతుకను వినిపించేందుకు ఈ పోరాటం. ఆ విధంగానే ఈ పేరును ఎంపిక చేశాం. ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్ అంటే భారత్ అని అర్థం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

ఫొటో సోర్స్, ANI
మమతా బెనర్జీ ఏమన్నారంటే...
భారత్‌ను రక్షించాల్సిన అవసరం ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
దేశాన్ని అమ్మేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. ఎన్‌డీఏ...మీరు ‘ఇండియా’ను ఛాలెంజ్ చేయగలరా? అని మమతా బెనర్జీ ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images/The India Today Group
కేరళకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ మంగళవారం కన్నుమూశారు. ఆయనకు 79 ఏళ్లు.
ఆయన కుమారుడు ఈ విషయాన్ని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారని పీటీఐ వార్తాసంస్థ చెప్పింది.
ఊమెన్ చాందీ ఆరోగ్యం చాలా కాలంగా బాగోలేదు. ఆయన బెంగళూరులో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
ఆయన మృతి పట్ల కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు కె.సుధాకరన్ సంతాపం ప్రకటించారు.
ఊమెన్ చాందీ 2004 నుంచి 2006 వరకు, 2011 నుంచి 2016 వరకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం!