తాజా అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరకులు, సేవల మొత్తం విలువను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంటారు.
తాజా అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
ధన్యవాదాలు.
2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటు 7.2 శాతంగా నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) అంచనా వేసింది. ఎన్‌ఎస్‌వో బుధవారం ఈ డేటాను విడుదల చేసినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
2021-22లో రియల్ జీడీపీ 9.1 శాతంగా ఉంది.
ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరకులు, సేవల మొత్తం విలువను స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంటారు.
2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి వరకు) జీడీపీ 6.1 శాతంగా నమోదు కాగా, మొత్తం ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.2 శాతంగా ఉన్నట్లు అంచనా వేశారు.
నిరుడు అక్టోబర్ - డిసెంబర్ మధ్య మూడో త్రైమాసికంలో జీడీపీ 4.4 శాతంగా ఉంది.
2022 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 4.1 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో అది 6.1 శాతంగా నమోదైంది.
జీడీపీని ఎలా లెక్కిస్తారు?
జీడీపీని లెక్కించాలంటే నాలుగు విస్తృత అంశాలను కూడాలి.
మొదటిది ''వినిమయ వ్యయం'' - అంటే దేశ జనాభా వస్తువులు, సేవలను కొనుగోలు చేయటానికి చేసిన మొత్తం ఖర్చు.
రెండోది ''ప్రభుత్వ వ్యయం''. మూడోది ''పెట్టుబడి వ్యయం'' - అంటే ఒక ఫ్యాక్టరీ లేదా సముద్రం మీద వంతెన వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి చేసిన వ్యయం.
నాలుగోది.. చివరిది నికర ఎగుమతుల విలువ - అంటే ఎగుమతులు - దిగుమతుల మధ్య తేడా మొత్తం.
జీడీపీని నామినల్ జీడీపీ, రియల్ జీడీపీ అని రెండు రకాలుగా లెక్కిస్తారు.
నామినల్ జీడీపీలో.. అన్ని వస్తువులు, సేవల విలువను ప్రస్తుత ధరలతో (జీడీపీని లెక్కించిన సంవత్సరపు ధరలతో) లెక్కిస్తారు.
బేస్ ఇయర్ (పోల్చటానికి ఉపయోగించిన సంవత్సరం) ప్రకారం ద్రవ్యోల్బణాన్ని (ధరల పెరుగుదలను) సవరించినపుడు రియల్ జీడీపీ - అంటే నిజ జీడీపీ లభిస్తుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో వృద్ధి గురించి మనం మాట్లాడుకునేటపుడు ఈ రియల్ జీడీపీ గురించే మాట్లాడతాం.
జీడీపీ గణాంకాలను ఎనిమిది రంగాల నుంచి సేకరిస్తారు. అవి:
జీడీపీ ఎందుకంత ముఖ్యం?
ప్రభుత్వం, ప్రజలు నిర్ణయాలు తీసుకోవటానికి పరిగణనలోకి తీసుకునే కీలకమైన అంశాల్లో జీడీపీ కూడా ఒకటి.
జీడీపీ వృద్ధి చెందుతున్నదంటే దానర్థం ఆర్థిక కార్యకలాపాల విషయంలో దేశం బాగా పనిచేస్తోందని. ప్రభుత్వ విధానాలు క్షేత్ర స్థాయిలో ఫలిస్తున్నాయని. అవి సరైన దిశలో పయనిస్తున్నాయని.
జీడీపీ మందగించటం, తిరోగమనంలోకి జారిపోవటం జరుగుతున్నదంటే దానర్ధం.. ఆర్థికవ్యవస్థ పునరుత్తేజం చెందటానికి తోడ్పడేలా ప్రభుత్వం తన విధానాలను మెరుగుపరచుకోవాల్సి ఉంటుందని.
ప్రభుత్వమే కాకుండా వ్యాపారవేత్తలు, స్టాక్ మార్కెట్ మదుపుదారులు, వివిధ విధాన నిర్ణేతలు కూడా నిర్ణయాలు తీసుకోవటానికి జీడీపీ గణాంకాలను ఉపయోగించుకుంటారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
సీబీఐ అరెస్టు చేయకుండా కొన్ని షరతులు విధిస్తూ బెయిల్ ఇస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు చెప్పింది.
ఇప్పటివరకు జరిగిన విచారణను గమనిస్తే, అవినాష్ రెడ్డి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు గానీ, సాక్షులను బెదిరించినట్లు ఎక్కడా సీబీఐ చెప్పలేకపోయిందని, దీనిపై ఫిర్యాదులు కూడా లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది.
కేవలం ఘటన జరిగిన రోజు ఆధారాలు చెరిపేయడాన్ని మాత్రమే సీబీఐ ప్రస్తావించిందని న్యాయస్థానం తన తీర్పులు చెప్పింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇస్తున్నట్లు న్యాయస్థానం బుధవారం తీర్పు చెప్పింది.
కేసు విచారణలో సీబీఐకి సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. జూన్ నెలాఖరు వరకు ప్రతి శనివారం ఉదయం పది నుంచి సాయంత్రం 5 మధ్య సీబీఐ ముందు హాజరు అవ్వాలి.
అలాగే సీబీఐ విచారణకు పిలిచినప్పుడు కూడా వెళ్లాలని ఆదేశించింది.
అవినాష్ రెడ్డికి విధించిన షరతులేమిటంటే..
ఇంతకుముందు ఏం జరిగిందంటే..
మాజీ మంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయంపై ఇప్పటికే అవినాష్ రెడ్డిని పలుమార్లు సీబీఐ విచారించింది.
మరోసారి మే (ఈ నెల) 16వ తేదీనే విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
ఆ రోజు అవినాష్ రెడ్డి హాజరు కాలేదు. తర్వాత 19వ తేదీన హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. విచారణకు బయల్దేరిన తర్వాత.. తన తల్లి శ్రీలక్ష్మికి గుండెనొప్పి రావడంతో అవినాష్ రెడ్డి పులివెందులకు వెళ్లారు. తల్లిని కర్నూలులో విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు.
ఈ నేపథ్యంలో మే 22 హాజరు కావాలని సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
తనను అరెస్టు చేయాలన్న ప్రయత్నాల్లో సీబీఐ ఉందన్న ప్రచారంతో అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
బెయిల్ విషయంపై హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనిపై ఈ నెల 25న హైకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు.
దీనిపై వాదనలు విన్న హైకోర్టు తీర్పును బుధవారం తీర్పును ప్రకటించింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
హరిద్వార్ నుంచి వెనక్కి తిరిగివస్తూ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ బుధవారం ఉదయం ట్విటర్‌లో ఒక కవితను పోస్ట్ చేశారు.
‘‘మేం చనిపోయాం, ఎందుకంటే మేం తిరుగుబాటుదారులం..’’ అని అర్థమొచ్చే కవితను వినేశ్ ఫోగాట్ పోస్టు చేశారు. దీన్ని ప్రముఖ హిందీ కవి ముక్తిబోధ్ రాశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ దిల్లీ వేదికగా వినేశ్ ఫోగాట్ సహా ప్రముఖ రెజ్లర్లు నిరసన చేపడుతున్న సంగతి తెలిసిందే. వీరు తమ పతకాలను గంగలో కలిపేస్తామని చెబుతూ హరిద్వార్‌కు వెళ్లారు.
వీరిని రైతు సంఘం నాయకుడు నరేశ్ టికైత్ కలిశారు. ఆయనతోపాటు చాలా మంది ఈ పతకాలను గంగలో కలపొద్దని రెజ్లర్లను అభ్యర్థించారు.
దీంతో పతకాలు గంగలో కలపడాన్ని ఐదు రోజులు వాయిదా వేస్తున్నట్లు రెజ్లర్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.