You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

పీవీ సింధు: స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300లో ఫైనల్‌కు చేరిన భారత షట్లర్

సింగపూర్‌కు చెందిన యో జియా మిన్‌పై 24-22, 22-20తో సింధు విజయం సాధించింది.

లైవ్ కవరేజీ

  1. SRH vs RR: సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ ఓటమి

  2. కోవిడ్-19‌కి సంబంధించిన ఈ ఫేక్ న్యూస్ ప్రపంచాన్ని ఎలా భయపెట్టిందంటే

  3. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  4. భారీ డేటా చౌర్యం స్కామ్‌ను గుర్తించినట్లు ప్రకటించిన సైబరాబాద్ పోలీసులు

    సుమారు 66.9 కోట్లమందికి చెందిన వ్యక్తిగత డేటాను సేకరించిన అతి పెద్ద స్కామ్‌ను బట్టబయలు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.

    ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న వినయ్ భరద్వాజ్‌ అనేక వ్యక్తిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

    డేటాను దొంగిలించడం, తమ దగ్గర దాచడం, ఇతరులకు అమ్మడంలాంటి నేరాలకు ఈ స్కామ్‌లో భాగస్వాములైన వ్యక్తులు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

    24 రాష్ట్రాలు, 8 మెట్రో పాలిటన్ నగరాల నుంచి నిందితులు ఈ డేటాను సేకరించినట్లు తెలిపారు.

    బైజూస్, వేదాంతులాంటి విద్యాసంస్థలతోపాటు క్యాబ్ సర్వీసులు, జీఎస్టీ, ఆర్టీవో, అమెజాన్, నెట్ ఫ్లిక్స్,పేటీఎం, ఫోన్‌పేలాంటి అనేక సంస్థల నుంచి కూడా వీరు డేటాను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

    హరియాణాలోని ఫరిదాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఇన్‌స్పైర్ వెబ్స్ అనే సైట్ ద్వారా ఈ డేటాను నిందితులు తమ క్లయింట్లకు అమ్మినట్లు గుర్తించారు.

  5. పీవీ సింధు: స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300లో ఫైనల్ కు చేరుకున్న భారత షట్లర్

    భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 ఫైనల్స్‌కు చేరుకుంది.

    సింగపూర్‌కు చెందిన యో జియా మిన్‌పై 24-22, 22-20తో సింధు విజయం సాధించింది.

    ఫైనల్‌లో మరో సెమీ ఫైనల్‌ విజేతతో ఆమె తలపడనుంది.

    రెండో ఫైనల్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్‌, ఇండోనేషియాకు చెందిన గ్రెగోరియా మారిస్కా టుంజంగ్‌లు తలపడనున్నారు.

  6. ఘోస్ట్ సిటీ: అందమైన పెద్ద పెద్ద భవనాల్లో వృద్ధులు మాత్రమే ఉంటున్నారు, ఎందుకంటే?

  7. సీసీటీవీ: నిఘా కారణంగా భారతీయులు గోప్యతా హక్కును కోల్పోతున్నారా?

  8. జైలు నుంచి విడుదలైన సిద్దూ

    పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ జైలు నుంచి విడుదల అయ్యారు.

    పాటియాలా జైలు నుంచి ఆయన బయటకు వచ్చినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    2022 మే నుంచి సిద్దూ పాటియాల జైలులో ఉన్నారు.

    రోడ్ రేజ్(రోడ్డు మీద గొడవ పడటం) కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ఏడాది శిక్ష విధించడంతో పది నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు.

    1988లో పాటియాలాలో కారు పార్కింగ్ విషయంలో ఓ వ్యక్తితో గొడవపడి సిద్దూ కొట్టడంతో ఆయన మరణించారు.

    ఈ కేసులో 2022లో సిద్దూకు జైలు శిక్ష పడింది.

  9. ఆరోగ్య హక్కు చట్టం: అందరికీ ఉచిత వైద్యాన్ని అందించే ఈ చట్టాన్ని ప్రైవేట్ వైద్యులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

  10. అర్శమొలలు: మలద్వారం నుంచి రక్తం ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?

  11. ‘కళాక్షేత్ర’లో లైంగిక వేధింపుల ఆరోపణలు, బాధిత విద్యార్ధినుల ఫిర్యాదులో ఏముంది?

  12. దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ

    దిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో పూర్తిస్థాయిలో ఎమర్జెన్సీని విధించినట్లు ఎయిర్‌పోర్ట్ అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    దుబయ్‌కి చెందిన ఫెడ్‌ఎక్స్ విమానం, దిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ అయ్యాక ప్రమాదానికి గురవ్వడంతో అత్యవసర పరిస్థితిని విధించారు.

    ఫెడ్‌ఎక్స్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికి పక్షి ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు.

  13. అమెరికా చరిత్రలో క్రిమినల్ నేరవిచారణను ఎదుర్కొంటున్న మొట్టమొదటి మాజీ అధ్యక్షుడు

  14. ఏటీఎం జాక్‌పాటింగ్: సినిమాలో పాత్ర అంటూ ప్రజలను పంపించి రూ. 115 కోట్లు డ్రా చేయించారు, అయిదేళ్ల కిందట పుణె బ్యాంకును ఎలా కొల్లగొట్టారంటే..

  15. సిద్ధూ: జైలు నుంచి విడుదలవుతున్న కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్

    పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఈ రోజు జైలు నుంచి విడుదల కానుండడంతో పాటియాలా జైలు వద్దకు ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

    2022 మే నుంచి సిద్ధూ పాటియాలా జైలులో ఉన్నారు. రోడ్ రేజ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు ఏడాది శిక్ష విధించడంతో పది నెలలుగా ఆయన జైలులోనే ఉన్నారు.

    1988లో పాటియాలాలో కారు పార్కింగ్ విషయంలో ఓ వ్యక్తితో గొడవపడి సిద్ధూ కొట్టగా ఆయన మరణించారు. ఈ కేసులో 2022లో సిద్ధూకు జైలు శిక్ష పడింది.

    ఆయన మే నెలలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ సత్ప్రవర్తన కారణంగా శిక్ష తగ్గించడంతో శనివారం విడుదలవుతున్నారు.

  16. ‘అందరిలా నాకు కన్నీళ్లు రావు.. ఏడవలేను కూడా’.. ఏమిటీ సమస్య

  17. పాకిస్తాన్: కరాచిలో ఆహార పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట, 12 మంది మృతి, పలువురికి గాయాలు

    పాకిస్తాన్‌లోని కరాచిలో రంజాన్ మాసం సందర్భంగా చేపట్టిన ఆహార పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.

    మహిళలు, చిన్నారులతో సహా 12 మంది ఈ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

    కొంత మంది వ్యక్తులు తెలియకుండా ఎలక్ట్రిక్ వైర్ తొక్కడంతో ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది.

    ఒకరిని ఒకరు తోసుకోవడంతో చాలా మంది ప్రజలు పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయారని పోలీసులు తెలిపారు.

    చనిపోయిన వారిలో 40 నుంచి 50 ఏళ్ల మధ్యనున్న మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

    ఈ సంఘటనపై కరాచి పోలీసు కమిషనర్ మహమ్మద్ ఇక్బాల్ మీనన్ పూర్తి నివేదిక ఇవ్వాలని సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా ఆదేశించారు.

    కొన్ని రోజుల క్రితం కూడా పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉచిత రేషన్ కేంద్రంలో ఫ్రీగా గోధుమ పిండిని పొందేందుకు ప్రయత్నించి 11 మంది ప్రాణాలు కోల్పోయారు.

  18. చాట్‌జీపీటీని నిషేధించిన ఇటలీ

    అధునాతన చాట్‌బోట్ ఛాట్‌జీపీటీ(ChatGPT)ని ఇటలీ నిషేధించింది.

    చాట్‌జీపీటీని నిషేధించిన తొలి పాశ్చాత్య దేశంగా ఇటలీ నిలిచింది.

    అమెరికా స్టార్టప్ ఓపెన్ఏఐ రూపొందించిన ఈ మోడల్‌లో గోప్యత సమస్యలున్నాయని ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ చెప్పింది.

    తక్షణమే చాట్‌జీపీటీని బ్యాన్ చేసి, ఓపెన్ఏఐపై విచారణ జరపాలని ఆదేశించింది.

    నవంబర్ 2022లో చాట్‌జీపీటీ లాంచ్ అయింది. అప్పటి నుంచి లక్షలాది మంది దీన్ని వాడుతున్నారు.

    ఏ ప్రశ్న అడిగిన సమాధానమిచ్చే సామర్థ్యాన్ని చాట్‌జీపీటీ కలిగి ఉందని చెప్తున్నారు. చాట్‌జీపీటీ ప్రాజెక్ట్‌పై మైక్రోసాఫ్ట్ బిలియన్ డాలర్లను వెచ్చింది.

    గత నెలలో తన సెర్చింజిన్ బింగ్‌కి కూడా చాట్‌జీపీటీని మైక్రోసాఫ్ట్ యాడ్ చేసింది.

    వర్డ్, ఎక్సెల్, పవర్‌పాయింట్, అవుట్‌లుక్ వంటి తన ఆఫీసు యాప్స్‌కి కూడా దీన్ని యాడ్ చేయనున్నట్లు తెలిపింది.

    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(ఏఐ)తో నడిచే దీనిపై పలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భారీ ఎత్తున ఉద్యోగాలు పోయే ప్రమాదముందని ఆందోళనలున్నాయి. అలాగే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తుందని కూడా విమర్శలు వస్తున్నాయి.

    ప్రస్తుతం ఇటాలియన్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ కేవలం ఈ ఓపెన్ఏఐ చాట్‌బోట్‌ను బ్లాక్ చేయడమే కాకుండా.. ఇది జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్‌కి కట్టుబడి ఉందో లేదో విచారణ జరపాలని పేర్కొంది.

    మార్చి 20న ఈ యాప్ ద్వారా యూజర్ సభాషణ, పేమెంట్ సమాచారం లాంటి పలు డేటాల ఉల్లంఘన జరిగిందని ఇటాలియన్ అథారిటీ చెప్పింది.

    కాగా, ఛాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ సైతం తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చాట్‌బోట్ బర్డ్‌ను లాంచ్ చేసింది. అయితే, ఇది కేవలం 18 ఏళ్లు పైబడిన వారికే అందుబాటులో ఉంది.

  19. డోనాల్డ్ ట్రంప్ - స్టార్మీ డేనియల్స్: అమెరికా మాజీ అధ్యక్షుడిపై కేసులో ఏడు ప్రశ్నలు, సమాధానాలు

  20. ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టిన ‘గుజరాత్ టైటాన్స్’

    ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ తొలి మ్యాచ్ గెలిచింది.

    ఐదు వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.

    శుభమన్ గిల్ అర్ధ సెంచరీ చేయడం గుజరాత్ టైటాన్స్‌కి కలిసొచ్చింది.

    మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌కి 179 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

    లక్ష్యాన్ని చేధించే క్రమంలో, గుజరాత్ టీమ్ ఓపెనర్లుగా శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహాలు బరిలోకి దిగారు. అయితే, నాలుగో ఓవర్‌లో 16 బంతుల్లో 25 పరుగులకి సాహా వెనుతిరగాల్సి వచ్చింది.

    అప్పటికి గుజరాత్ టైటాన్స్ స్కోరు 37 పరుగులే.

    ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు శుభమన్ గిల్‌కి సహకరించడంతో టీమ్ విజయం దిశగా పరుగులు పెట్టింది.

    అంతకుముందు చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు 178 పరుగులు చేసింది. ఆ జట్టులో రుతురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లో 9 సిక్సర్లు, 4 ఫోర్లతో 92 పరుగులు చేశాడు.

    కాగా, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన ఈ తొలి మ్యాచ్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగింది.

    గుజరాత్ టైటాన్స్ టీమ్‌కి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్‌కి మహేంద్ర సింగ్ ధోని సారథ్యం వహిస్తున్నారు.