లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాల తాజా సమాచారంతో రేపు ఉదయం కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మంటలు వేగంగా ఫ్యాక్టరీ అంతా విస్తరించాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సుమారు 30 మంది ఉన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అంశాల తాజా సమాచారంతో రేపు ఉదయం కలుద్దాం.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.
270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 248 పరుగులకు ఆలౌట్ అయింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ(30), శుభ్‌మన్ గిల్(37) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు.
ఆ తరువాత విరాట్ కోహ్లీ(54), కేఎల్ రాహుల్(32) కాసేపు పోరాడారు. వారు అవుటైన తరువాత హార్దిక్ పాండ్య(40) తప్ప ఎవరూ నిలబడలేక పోయారు.
49.1 ఓవర్లకు భారత్ 10 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడం జంపా 4 వికెట్లు తీశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది.
మిచెల్ మార్ష్ 47 పరులుగు చేయగా అలెక్స్ కేరీ 38, ట్రావిస్ హెడ్ 33 పరుగులు చేశారు.
భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ చేరో 3 వికెట్లు తీశారు.
మూడు వన్డేల సిరీస్‌లో రెండు మ్యాచులు గెలిచిన ఆస్ట్రేలియా సరీస్‌ను కైవసం చేసుకుంది.
బ్రిటన్‌లోని సిక్కు కమ్యూనిటీ ప్రజలు లండన్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున గుమికూడారు.
ఫెడరేషన్ ఆఫ్ సిక్ ఆర్గనైజేషన్స్, అనేక సిక్కు యువత బృందాలు ఈ నిరసనలలో పాల్గొన్నాయి.
పంజాబ్‌లో అమృత్ పాల్ సింగ్ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టిన నేపథ్యంలో ఈ నిరసనలు చెలరేగాయి.
అక్కడ గుమికూడిన వారిలో కొందరు ఖలిస్తాన్ జెండాలు పట్టుకుని ఉన్నారు. కొద్ది రోజుల కిందట భారత హై కమిషన్ కార్యాలయం వద్ద భారత్ జెండాను తొలగించడం వివాదాస్పదమైంది.
భారత అధికారులతో బ్రిటన్ ప్రభుత్వం తమ ఇబ్బందులను చర్చించాలని వారు కోరారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందని సోషల్ వర్కర్ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ పద్మశ్రీ అవార్డు స్వీకరించారు.
సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా 37 లక్షల మంది కళ్లకు ఆరోగ్యసేవలు అందించారు. 3 లక్షలకు పైగా కంటి శస్త్రచికిత్సలు చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మపురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు.
ప్రముఖ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ బాలకృష్ణ దోషికి మరణాంతరం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించారు.
తెలంగాణ నుంచి పద్మభూషణ్‌కు ఎంపికైన ఆధ్మాత్మికవేత్త కమలేశ్ డీ పటేల్ అవార్డును అందుకున్నారు.
హైదరాబాద్‌కు సమీపంలో ప్రపంచంలోనే పెద్దది అని చెబుతున్న మెడిటేషన్ సెంటర్ కన్హ శాంతి వనంను ఆయన స్థాపించారు.
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా పద్మభూషణ్ అందుకున్నారు.
తమిళనాడులోని కాంచీపురంలో టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీలో పేలుడు సంభవించడంతో తొమ్మిది మంది చనిపోయారు.
కురువిమలైలో ఆ ఫ్యాక్టరీ ఉంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో గోడౌన్ బయట ఆరబెట్టిన ముడిసరుకుకు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది.
మంటలు వేగంగా ఫ్యాక్టరీ అంతా విస్తరించాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సుమారు 30 మంది ఉన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు పెద్దపెద్ద పేలుళ్ల శబ్దాలు వినిపించడంతోపాటు భూమి చిన్నగా కంపించినట్లు స్థానికులు తెలిపారు.
సుమారు 100 మంది పోలీసులతోపాటు ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ కార్యాలయం వద్ద బారీకేడ్లను ప్రభుత్వం తొలగించింది.
బ్రిటన్‌లోని భారత హై కమిషనర్ కార్యాలయం వద్ద ఖలీస్తాన్ మద్దతుదార్లు మూడు రంగుల జెండాను తొలగించిన నేపథ్యంలో దిల్లీలోని బ్రిటిష్ హై కమిషనర్ కార్యాలయం వద్ద కొందరు నిరసనలు చేపట్టారు.
దీంతో అక్కడ పోలీసులు భద్రత కోసం బారీకేడ్లు ఏర్పాటు చేశారు. కానీ బుధవారం బ్రిటిష్ హై కమిషనర్ కార్యాలయంతోపాటు బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్ ఇంటి వద్ద కూడా బారీకేడ్లను తొలగించారు.
అయితే భద్రతాపరమైన విషయాల మీద తాము మాట్లాడమని బ్రిటిషన్ హై కమిషన్ కార్యాలయం అధికారులు తెలిపినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.
పంజాబ్‌లో అమృత్ పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి సోషల్ మీడియాలో వస్తున్న అసత్యపు వార్తలను ఖండిస్తూ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
భారత్‌లో ప్రయాణానికి సంబంధించి బ్రిటన్ సహా అన్ని దేశాల ప్రయాణికులకు పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని స్పష్టంచేశారు.
దొరైస్వామి మాట్లాడుతూ- "యూకేలోని నా స్నేహితులందరికీ, ముఖ్యంగా పంజాబ్‌లో బంధువులు ఉన్న వారికి భరోసా ఇవ్వాలనుకుంటున్నా. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదు'' అని తెలిపారు.
వారిస్ పంజాబ్ దే సంఘటన చీఫ్ అమృత్ పాల్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు పంజాబ్ పోలీసులు గత శనివారం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. నాలుగు రోజులు గడిచినా అమృత్ పాల్ సింగ్ ఆచూకీ దొరకలేదు.