లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
‘నా సొంత తండ్రే నన్ను లైంగికంగా వేధించేవారు. రక్తంవచ్చేలా కొట్టేవారు. ఆయన ఇంటికి రాగానే భయంతో మంచం కింద దాక్కునేదాన్ని’ అని స్వాతి చెప్పారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.

ఫొటో సోర్స్, Getty Images
మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఏ1గా చెరుకూరి రామోజీరావు, ఏ2గా ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజ, ఏ3గా సంబంధిత బ్రాంచి మేనేజర్లను పేర్కొన్నారు.
చిట్ ఫండ్ నిధులతో పాటుగా, మ్యూచువల్ ఫండ్స్ ని దుర్వినియోగం చేశారన్న అభియోగంపై ఈ కేసులు నమోదయ్యాయి.
వాటిని స్పెక్యులేటివ్ మార్కెట్ కి మళ్లించారనే ఆరోపణలను సీఐడీ చేసింది.
ఆడిటింగ్ లోనూ అక్రమాలు జరిగినట్టు అభియోగాలు నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 120(బి), 409,420, 477(ఏ), రెడ్ విత్ 34 వంటి వాటితో పాటుగా ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు 1982 చిట్ ఫండ్ చట్టం కింద ఈ కేసులు నమోదయ్యాయి.
అసిస్టెంట్ రిజిస్ట్రార్ల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐడీ తెలిపింది.
విజయవాడ, కాకినాడ, ఏలూరు, విశాఖ, పల్నాడు, అనంతపురం, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఫిర్యాదులు అందినట్టు తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
తన చిన్నతనంలో తండ్రి తనను లైంగికంగా వేధించారని దిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఆరోపించారు.
దిల్లీ మహిళా కమిషన్ అంతర్జాతీయ అవార్డుల ప్రదానోత్సవం తరువాత ఆమె మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేశారు.
‘నా సొంత తండ్రే నన్ను లైంగికంగా వేధించేవారు. రక్తంవచ్చేలా కొట్టేవారు. ఆయన ఇంటికి రాగానే భయంతో మంచం కింద దాక్కునేదాన్ని’ అని స్వాతి చెప్పారు.
‘మహిళలను బాలికలను దోచుకునే మగవాళ్లకు గుణపాఠం ఎలా చెప్పాలా అని ఆలోచించేదాన్ని. నా తండ్రి నన్ను కొట్టడం ఇప్పటికీ నాకు గుర్తుంది. నా తల పట్టుకుని గోడకేసి కొట్టేవారు. నా తల నుంచి రక్తం కారేది. భరించలేని వేదనను అనుభవించినవారికే ఇతరుల బాధ తెలుస్తుంది’ అన్నరామె.
కాగా జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, నటి ఖుష్బూ కూడా ఇటీవల ఇలాంటి ఆరోపణలే చేశారు. తనకు 8 ఏళ్ల వయసున్నప్పుడు తన తండ్రి తనను లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించారు.

ఫొటో సోర్స్, www.cpahq.org
ప్రధాని మోదీ ఇమేజ్‌ను, పాపులారిటీని దెబ్బతీసేలా డాక్యుమెంటరీలు ప్రసారం చేసి బీబీసీపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ గుజరాత్ అసెంబ్లీలో తీర్మానం చేశారు.
గుజరాత్ అసెంబ్లీలో శుక్రవారం బీజేపీ ఎమ్మెల్యే విపుల్ పటేల్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన.. ‘‘గుజరాత్ అల్లర్లకు సంబంధించి బీబీసీ తన ‘ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీలో తప్పుగా చూపించింది. అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఇమేజ్‌ను చెడగొట్టే ప్రయత్నం చేసింది’’ అన్నారు.

ఫొటో సోర్స్, UGC
తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య మరో వివాదం రాజుకుంది.
బీజేపీ అధ్యక్షులు సంజయ్, ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలు దీనికి కారణమయ్యాయి.
‘‘విలేకర్లు అడిగారు. కవితక్కను అరెస్టు చేస్తరట.. కేసీఆర్ కుటుంబంలో ఒక వికెట్ క్లీన్ బౌల్డ్. అవినీతిపరులను విడిచిపెడతారా ఏంది? కవితను అరెస్టు చేస్తే తెలంగాణ సమాజం తలవంచదట. ఇప్పుడు వంచుతున్నారు తల’’ అని వ్యాఖ్యానించారు బండి సంజయ్. ఈ వ్యాఖ్యలలో భాగంగా ఆయన మరికొన్ని మాటలూ అన్నారు.
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్న మాటలు వివాదానికి దారితీశాయి.
మరో కార్యక్రమంలో కూడా కవిత గురించి మాట్లాడారు. ‘‘ఇవాళ మహిళలు తలదించుకునే పరిస్థితి. కేసీఆర్ కూతురట, ఇలా చేసిందట అని దేశమంతా చర్చించుకుంటున్నారు. తెలంగాణ మహిళల కోసం దందా చేస్తున్నా అని చెబుతున్నారు. మరి ఆమె డబ్బు తెచ్చి తెలంగాణ మహిళల కష్టాలు తీర్చాలి’’ అన్నారు సంజయ్.
సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ వ్యాప్తంగా, దిల్లీలో నిరసనలు చేపట్టింది.
పలువురు పార్టీ ముఖ్య నాయకులు రోడ్లపైకి వచ్చి సంజయ్ దిష్టిబొమ్మ తగలబెట్టారు.
బీజేపీకి వ్యతిరేక నినాదాలు చేశారు. బండి సంజయ్ దిష్టి బొమ్మను చెప్పులతో కొడుతూ మహిళలు నిరసన తెలిపారు.
దీనిపై కొందరు మహిళలు తెలంగాణ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మరికొందరు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధం అయ్యారు. దీనిపై తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా కేసు తీసుకుంది. సంజయ్ వ్యాఖ్యలపై విచారణ చేయాలని పోలీసు శాఖను ఆదేశించింది.
సంజయ్‌ను వివరణ ఇవ్వాల్సిందిగా మహిళా కమిషన్ ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.
దిల్లీలోని ఈడీ కార్యాలయంలో కల్వకుంట్ల కవిత విచారణ కొనసాగుతోంది. దిల్లీ లిక్కర్ ‘స్కాం’ కేసులో ఆమెను విచారిస్తున్నారు.
సుమారు 10.30 గంటల ప్రాంతంలో కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ కేసులో ఇప్పటికే కవిత సన్నిహితుడు అరుణ్ పిళ్లై, ఆమె మాజీ సీఏలతోపాటు దిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా కూడా అరెస్టయ్యారు.

ఫొటో సోర్స్, UGC
దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో విచారణ కోసం కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
లీ కియాంగ్ చైనా ప్రధానిగా ఎన్నికయ్యారు.
2022లో జరిగిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాల్లో ఆయనను కాబోయే ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు. ఇప్పుడు చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ దాన్ని అధికారికంగా ఆమోదించింది.
నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్‌లోని 2,900 మంది దాదాపుగా 63ఏళ్ల లీ కియాంగ్‌కు మద్దతుగా ఓటు వేశారు.
ఓటింగ్ జరిగేటప్పుడు మీడియాను లోపలకు అనుమతించలేదు.
షీ జిన్‌పింగ్ మూడోసారి చైనా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఫొటో సోర్స్, Kalvakuntla Kavitha/Facebook
దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నేడు ఈడీ విచారించనుంది. 10 గంటలకు విచారణ మొదలు కానుంది.
ఈ కేసులో ఇప్పటికే కవిత సన్నిహితుడు అరుణ్ పిళ్లై, మాజీ సీఏలను అరెస్టు చేశారు.
దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా సీబీఐ, ఈడీ అరెస్టు చేశాయి.
కవిత ఈడీ విచారణ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు దిల్లీలోని కేసీఆర్ నివాసం వద్దకు చేరుకున్నారు.
తెలంగాణ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కూడా దిల్లీకి వచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.