లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లాహోర్‌లోని అతని ఇంట్లోంచి విలువైన వస్తువులను, విదేశీ కరెన్సీని దొంగలు ఎత్తుకెళ్లారని హఫీజ్ చిన్నాన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
మహిళా దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఔరత్ మార్చ్‌లో పాల్గొన్న మహిళల పట్ల కొందరు పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ముగ్గురు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినవారందరిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై పాకిస్థాన్ హోంమంత్రి రాణా సనావుల్లా ఖాన్ ఇస్లామాబాద్ ఐజీని నివేదిక కోరారు.
మార్చ్‌లో పాల్గొన్న మహిళలకు హోంమంత్రి క్షమాపణలు కూడా చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్‌లోని వివిధ నగరాల్లో మహిళలు ర్యాలీలు నిర్వహించారు.
ఈ మార్చ్ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ల బృందం ప్రదర్శన నిర్వహిస్తుండగా పోలీసులు లాఠీచార్జి చేశారు. తొక్కిసలాట జరగడంతో కొంత మంది గాయపడినట్లు ర్యాలీ నిర్వాహకులు తెలిపారు.
ఈజిప్టులో ఆర్కియాలజిస్టుల తవ్వకాల్లో ఒక పురాతన ఆలయ శిథిలాలు, అందులోని స్పింక్స్ తరహా విగ్రహం బయటపడ్డాయి.
ఈజిప్టులో చాలావరకూ చెదిరిపోకుండా ఉన్న అతి ప్రాచీన ప్రదేశాల్లో ఒకటైన హాథోర్ టెంపుల్ సమీపంలో ఈ కళాకృతులు వెలుగు చూశాయి.
లైమ్‌స్టోన్‌తో చేసిన స్ఫింక్స్ విగ్రహం ‘నవ్వుతున్నట్లుగా ఉంది.. చెక్కిళ్ల మీద రెండు చిన్న గుంటలు కూడా ఉన్నాయి’’. ఈ విగ్రహం రోమ్ చక్రవర్తి క్లాడియస్ ప్రతిరూపం కావచ్చునని భావిస్తున్నారు.
క్లాడియస్ చక్రవర్తి క్రీస్తు శకం 41 నుంచి 54 సంవత్సరాల మధ్య రోమ్ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. రోమ్ సామ్రాజ్యన్ని ఉత్తర ఆఫ్రికా వరకూ విస్తరించాడు.
ప్రఖ్యాత గిజా పిరమిడ్ల దగ్గర ఉండే 66 అడుగుల స్ఫింక్స్ విగ్రహంతో పోలిస్తే ఇది చాలా చిన్నగా ఉంది.
ఈజిప్టు రాజధాని కైరోకు 450 కిలోమీటర్ల దూరంలో.. క్వెనా ప్రావిన్స్‌లోని డెండేరా ఆలయంలో రెండంతస్తుల సమాధి లోపల ఈ కళాకృతులు కనిపించాయి.
ఇక్కడి రాతి పైకప్పు మీద ఉన్న గుర్తులను అధ్యయనం చేయటం ద్వారా ఈ విగ్రహం గుర్తింపు గురించి మరింత సమాచారం లభించవచ్చునని ఆర్కియాలజిస్టులు భావిస్తున్నారు.
పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ హఫీజ్ ఇంట్లో చోరీ జరిగింది. లాహోర్‌లోని అతని ఇంట్లోంచి విలువైన వస్తువులను, విదేశీ కరెన్సీని దొంగలు ఎత్తుకెళ్లారని హఫీజ్ చిన్నాన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దొంగలు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించారని, ఆ సమయంలో హఫీజ్ కుటుంబ సభ్యులందరూ ఇస్లామాబాద్‌లో ఉన్నారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
సీసీటీవీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
తెలంగాణలో మహిళల మీద నేరాలు పెరుగుతున్నాయంటూ హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద నిరసనకు దిగిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.
రాష్ట్రంలో ప్రతి ఏటా 20వేల అత్యాచారాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం చెప్పిన భరోసా కనిపించడం లేదని ఆమె ఆరోపించారు.
త్రిపుర ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం జరిగిన ఈ వేడుకకు ప్రధాని నరేద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు.
అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు, బిప్లవ్ దేబ్ స్థానంలో డాక్టర్ మాణిక్ సాహా రాష్ట్ర ముఖ్యమంత్రిగా (2022లో) నియమితులయ్యారు.
కిందటి నెల జరిగిన ఎన్నికల్లో బర్దోవాలి స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.
మాణిక్ సాహా 2016లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు. ముఖ్యమంత్రి కాకముందు గత ఏడాది మార్చి నెలలో రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఇటీవల ఎన్నికల్లో బీజేపీ 32 సీట్లు గెలుచుకుంది. బీజేపీ తరువాత 13 సీట్లతో తిప్ర మోత పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.
దిల్లీ లిక్కర్ ‘స్కాం’లో తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ ఆమెను విచారించింది.
కవితకు స్నేహితునిగా భావించే అరుణ్ రామచంద్ర పిళ్లైను మంగళవారం ఈడీ అరెస్టు చేసింది.
ఇప్పటికే ఈ కేసులో అనేక అరెస్టులు జరిగాయి. దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను కూడా అరెస్టు చేశారు.
దిల్లీ మద్యం పాలసీలో తమకు మేలు చేకూరేలా ఆ రాష్ట్ర అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ.
ఈడీ నోటీసుల మీద కవిత స్పందించారు.
విచారణకు పూర్తిగా సహకరిస్తానని, అయితే మార్చి 10న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం దీక్ష చేపడుతున్నందున 9వ తేదీ విచారణకు హాజరు కావడం మీద న్యాయసలహా తీసుకుంటున్నట్లు తెలిపారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.