You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

రాహుల్ గాంధీ: ‘‘నేనెప్పుడూ దేశాన్ని అవమానించలేదు’’

'నేనెప్పుడూ నా దేశాన్ని అవమానించలేదు. అలా నేనెప్పుడూ చేయను. 70 ఏళ్లలో ఏమీ జరుగలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం, దేశంలోని ప్రతీ భారతీయుడ్ని అవమానించినట్లు కాదా?’

లైవ్ కవరేజీ

  1. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.

  2. వరుసగా రెండో ఏడాది ‘బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు గెలుచుకున్న మీరాబాయి చాను

  3. మహారాష్ట్ర: చెరకు కూలీలు, చందాలు వేసుకుని స్కూల్ కట్టుకున్నారు...

  4. వృద్ధ జంట ప్రేమ కథ.. 75 ఏళ్ల బాబూరావు, 70 ఏళ్ల అనసూయ

  5. తెలంగాణ: కోతుల మూకుమ్మడి దాడి కారణంగా వృద్ధురాలు మృతి, అసలేం జరిగింది?

  6. తెలంగాణ: కోతుల మూకుమ్మడి దాడి కారణంగా వృద్ధురాలు మృతి, అసలేం జరిగింది?

  7. అదానీ కంపెనీలలో భారీగా డబ్బులు గుమ్మరిస్తున్న జీక్యూజీ చైర్మన్ రాజీవ్ జైన్ ఎవరు... అమెరికాలో ఆయన కంపెనీ ఏం చేస్తోంది?

  8. ఆ గిరిజన రైతులు ఒకప్పుడు రాజుల్లా బతికారు... ఇప్పుడు పస్తులుంటున్నారు

  9. ఆదిలాబాద్‌ రంజన్‌లు... పేదవాడి రెఫ్రిజిరేటర్లు

  10. రాహుల్ గాంధీ: ‘‘నేనెప్పుడూ దేశాన్ని అవమానించలేదు’’

    కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగిస్తూ రాహుల్ గాంధీ మాట్లాడిన విషయాలపై బీజేపీ మండిపడింది.

    లండన్‌లోని ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యక్రమంలోతాజాగా పాల్గొన్న రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు.

    ‘ఇండియా టుడే’ వార్తా సంస్థ అడిగిన ఓ ప్రశ్నకు రాహుల్ గాంధీ స్పందిస్తూ, ‘ప్రధానిపైనా, ప్రభుత్వంపైనా ఏదైనా ప్రశ్న లేవనెత్తితే వారిపై దాడి జరుగుతుంది’’ అని అన్నారు.

    ‘‘ప్రధాని నరేంద్ర మోదీ చివరి విదేశీ పర్యటనలో ఏమి మాట్లాడారో నాకు గుర్తుంది. ‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లయినా భారత్‌లో ఏమీ జరుగలేదు. దేశంలో అవినీతి జరుగుతోంది’ అని ఆయన విదేశాల్లో వ్యాఖ్యానించారు.

    నేనెప్పుడూ నా దేశాన్ని అవమానించలేదు. అలా నేనెప్పుడూ చేయను. 70 ఏళ్లలో ఏమీ జరుగలేదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం, దేశంలోని ప్రతీ భారతీయున్ని అవమానించినట్లు కాదా?’’ అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

    రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి భారతదేశ పరువు తీస్తున్నారని బీజేపీ విమర్శిస్తోంది.

    కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మాట్లాడుతూ, ‘‘ప్రధాని మోదీ, దేశాన్ని నాశనం చేస్తున్నారు. నా ఫోన్‌లో పెగాసస్ ఉంది. ప్రజల ఫోన్ డేటా రికార్డ్ అవుతోంది. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, మీడియా ప్రమాదంలో ఉంది’’ అని అన్నారు.

    ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది.

  11. ఇజ్రాయెల్‌ వీధుల్లో వేలాది మంది నిరసన ప్రదర్శనలు

    ఇజ్రాయెల్‌లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వీధుల్లో వేలాది మంది ప్రజలు నిరసనలు చేస్తూ కనిపిస్తున్నారు.

    న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు జరుగుతున్నాయి.

    గత తొమ్మిది వారాలుగా నిరసనలు కొనసాగుతున్నాయి.

    జెండాలు, బ్యానర్లు, డ్రమ్ములతో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వారు నినాదాలు చేస్తున్నారు.

    ఈ ప్రదర్శనలు శాంతియుతంగానే జరుగుతున్నాయి. అయితే, టెల్ అవీవ్‌లోని కొన్ని చోట్లనిరసనకారులు, పోలీసు బారికేడ్లను కూడా తొలగించడం కనిపించింది.

    నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు, వాటర్‌ కెనాన్లను ప్రయోగించారు. జెరూసలెంలో కూడా ఘర్షణలు జరిగినట్లు వార్తలు వచ్చాయి.

    న్యాయ వ్యవస్థలో తీసుకురానున్న కొత్త సంస్కరణల ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎన్నుకునే హక్కు మంత్రులకు ఉంటుంది. ఇది జరిగితే కోర్టుల అధికారాలు తగ్గుతాయి.