లైవ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల పదవులకు నియామకాలు జరిపేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని రద్దు చేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది. ప్రధాని, ప్రతిపక్షనేత, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌లతో కూడిన కమిటీ ఈ నియామకాలు జరపాలని ఆదేశించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు కలుద్దాం.

ఫొటో సోర్స్, UGC
తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు(66) మరణించారు. విజయవాడలోని డాక్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. నెలరోజుల క్రితం గుండె పోటు రావడంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన కోమాలో ఉన్నారు.
గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆయన మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
అర్జునుడు మృతికి పలువురు సంతాప వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా శాసనమండలిలో ఆయన ప్రజా సమస్యలు వినిపించేందుకు కృషి చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు అన్నారు.
మచిలీపట్నానికి చెందిన అర్జునుడు తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. కృష్ణాజిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2017 నుంచి శాసనమండలి సభ్యుడుగా ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 163 పరుగులకు ఆలౌటైంది.
దీంతో ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగులు చేస్తే విజయాన్ని అందుకుంటుంది.
ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ 8 వికెట్లతో చెలరేగడంతో భారత బ్యాట్స్‌మెన్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు.
64 పరుగులు ఇచ్చిన లయన్ మొత్తం 8 వికెట్లతో భారత్ ఇన్నింగ్స్‌ను కూల్చాడు.
మొహమ్మద్ సిరాజ్ (0) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ (15) నాటౌట్‌గా నిలిచాడు.
రోహిత్ శర్మ (12), గిల్ (5), పుజారా (59), జడేజా (7), శ్రీకర్ భరత్ (3), అశ్విన్ (16), ఉమేశ్ యాదవ్ (0), సిరాజ్ (0)లను లయన్ అవుట్ చేశాడు.

ఫొటో సోర్స్, sushmitasen/instagram
రెండు రోజుల క్రితం తనకు హార్ట్ ఎటాక్ వచ్చినట్లు బాలీవుడ్ నటి సుస్మితా సేన్ గురువారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోను ఆమె పంచుకున్నారు.
‘‘నీ గుండెను ఎల్లప్పుడూ సంతోషంగా, ధైర్యంగా ఉండేలా చూడు. నీకు దాని అవసరం ఉన్నప్పుడు అది నీవైపు బలంగా నిలబడుతుంది అని మా నాన్న చెబుతుండేవారు.
రెండు రోజుల క్రితం హార్ట్ ఎటాక్ వచ్చింది. యాంజియోప్లాస్టీ చేశారు. స్టంట్‌ను అమర్చారు. ముఖ్యంగా నాది పెద్ద గుండె అని వైద్యులు మరోసారి ధ్రువీకరించారు’’ అని సరదాగా వ్యాఖ్యను ఆమె జోడించారు.
సరైన సమయంలో తనకు సహాయం అందించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పుడు అంతా సవ్యంగా ఉందని, తన శ్రేయోభిలాషులకు ఈ వార్తను తెలియజేయాలనే ఉద్దేశంతో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేస్తున్నట్లు ఆమె రాసుకొచ్చారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది

ఫొటో సోర్స్, EPA
వియత్నాం కొత్త అధ్యక్షుడిగా వో వాన్ థువాంగ్ (52) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
వియత్నాం అధ్యక్ష పదవి నుంచి జనవరిలో తప్పుకున్న గుయెన్ జువాన్ పుక్ స్థానంలో వో వాన్ థువాంగ్ వచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కష్టాల్లో పడింది.
రెండో ఇన్నింగ్స్‌లో 48.1 ఓవర్లకు 7 వికెట్లను కోల్పోయి 140 పరుగులు చేసింది.
ఇందులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 88 పరుగులను తీసేయగా, భారత్ కేవలం 52 పరుగుల ఆధిక్యంలో ఉంది.
క్రీజులో పుజారా (116 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు) ఒంటరిగా పోరాడుతున్నాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయన్ 5 వికెట్లు తీశాడు. స్టార్క్, మ్యాథ్యూ చెరో వికెట్ పడగొట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
48.1 ఓవర్ వద్ద అశ్విన్ (16) ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు.
అంతకుముందు శ్రీకర్ భరత్ (3), శ్రేయస్ అయ్యర్ (26), జడేజా (7), కోహ్లి (13) కూడా త్వరగానే పెవిలియన్ చేరారు.
ఎనిమిదో బ్యాట్స్‌మన్‌గా అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు.

ఫొటో సోర్స్, UGC
విజయనగరంలో మధుబాబు అనే వ్యక్తి తన భార్య సాయి సుప్రియను పదమూడేళ్లుగా ఇంట్లో నుంచి బయటకు రానివ్వలేదని విజయనగరం ఒకటో పట్టణ సీఐ వెంకటరావు తెలిపారు.
సాయి సుప్రియ తల్లి హేమలత ఫిర్యాదు మేరకు మధుబాబు ఇంటికి వెళ్లి సుప్రియను బలవంతంగా బయటకు తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు చెప్పారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం, ‘‘ విజయనగరం కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన మధుబాబు న్యాయవాది. ఈయనకు పుట్టపర్తి సత్యసాయి జిల్లాకు చెందిన జనార్దన్, హేమలత దంపతుల కుమార్తె సాయిసుప్రియతో 2008లో వివాహమైంది.
సుప్రియ 2009లో ప్రసవానికి పుట్టింటికి వెళ్లారు. కుమార్తె పుట్టాక అత్తారింటికి వచ్చేశారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో సంబంధాలు లేకుండా, ఫోన్లో మాట్లాడనీయకుండా ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు బాబులు పుట్టిన విషయాన్నీ తెలియనివ్వలేదు.

సాయి సుప్రియను చూసేందుకు తల్లిదండ్రులు వచ్చినా మధుబాబు అడ్డుకున్నారు. ఏళ్లు గడుస్తున్నా కుమార్తె ఎలా ఉందో తెలియక తండ్రి జనార్దన్ మంచం పట్టారు.
గత నెల 27న హేమలత ‘స్పందన’లో ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.
ఎస్పీ ఆదేశాలతో మధుబాబు ఇంటికి ఒకటో పట్టణ పోలీసులు వెళ్లి ఆరా తీశారు. తమ ఇంటికి రావడానికి ఆదేశాలేమైనా ఉన్నాయా అని ప్రశ్నించడంతో వెనక్కి వచ్చేసిన పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
న్యాయమూర్తి ఆదేశాలతో బుధవారం మధ్యాహ్నం సెర్చ్ వారెంట్‌తో సీఐ బి.వెంకటరావు, ఎస్సైలు, మహిళా పోలీసులు, వీఆర్వో, స్థానికులు ఆ ఇంటికి చేరారు.
తలుపు తీయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోవడంతో బలవంతంగా లోపలికి వెళ్లారు.
సుప్రియను తమ వెంట పంపించాలని కోరినా అంగీకరించకపోవడంతో బలవంతంగా ఆమెను తీసుకొచ్చి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
ప్రస్తుతానికి ఆమెను తల్లిదండ్రులకు అప్పగించాలని,రెండు కుటుంబాలను న్యాయ సేవాధికార సంస్థ(న్యాయస్థానం) ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి రమ్య తీర్పునిచ్చారని’’ ఒకటో పట్టణ సీఐ బి.వెంకటరావు తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ మూడో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులకు ఆలౌట్ అయింది.
దీంతో ఆస్ట్రేలియాకు 88 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైంది. భారత్ తరఫున విరాట్ కోహ్లి చేసిన 22 పరుగులే టాప్ స్కోర్.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖాజా (60; 4 ఫోర్లు) టాప్ స్కోరర్.
భారత్ బౌలర్లలో జడేజా 4 వికెట్లు పడగొట్టగా అశ్విన్, ఉమేశ్ యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ 32 పరుగులకు రెండు వికెట్లను కోల్పోయింది.
గిల్ (5), కెప్టెన్ రోహిత్ శర్మ (12)లను నాథన్ లయన్ అవుట్ చేశాడు.
క్రీజులో పుజారా (11 నాటౌట్) ఉన్నాడు.
భారత్ ఇంకా 55 పరుగులు వెనుకబడి ఉంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంలో విచారణ జరిపి రెండు నెలల్లోగా రిపోర్టును తమకు సమర్పించాలని సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
దీనిపై దర్యాప్తు చేయడానికి ఆరుగురితో కూడిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో ఓపీ భట్, జస్టిస్ జేపీ దేవధర్, కేవీ కామత్, నందన్ నీలేకనీ, సోమేశ్వర్ సుందరసాన్ సభ్యులుగా ఉంటారు. రిటైర్డ్ జస్టిస్ అభయ్ ఎమ్ సప్రే నేతృత్వం వహిస్తారు.
సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.
త్వరలోనే నిజానిజాలు తెలుస్తాయని, సత్యం గెలుస్తుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Reuters
చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్లను నియమించేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది.
ప్రస్తుత విధానంలో కేంద్ర ప్రభుత్వమే ఈ పదవులకు నియామకాలు జరుపుతోంది.
అయితే, ఈ పదవులకు నియామకాలు జరిపేందుకు అనుసరించాల్సిన నియమ నిబంధనలను ప్రధానమంత్రి, ప్రతిపక్షనేత, భారత ప్రధాన న్యాయమూర్తుల కమిటీ రూపొందించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.
దీనికి సంబంధించిన చట్టాన్ని అమల్లోకి తీసుకు వచ్చేంత వరకు ఈ త్రిసభ్య కమిటీయే నియామకాలు జరపాలని కోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ కేఎం జోషి నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం నాడు ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 కింద జరిపే ఈ నియామకంలో అధికారుల జోక్యం ఏమాత్రం లేకుండా ఉండాలని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
"ప్రధానమంత్రి, ప్రతిపక్షనేత/ అధికార కూటమి తరువాత అత్యధిక స్థానాలున్న ఏకైక పార్టీ నాయకుడు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కలిసి సీఈసీ, ఈసీలను ఎంపిక చేస్తారు. ఈ మేరకు పార్లమెంటు చట్టం చేసేంతవరకు ఈ పద్ధతి కొనసాగుతుంది" అని సుప్రీం కోర్టు తెలిపింది.