లైవ్‌పేజ్ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇక్కడితో ముగిస్తున్నాం.
తిరిగి రేపు ఉదయం తాజా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలతో కలుద్దాం.
అంతవరకూ సెలవు. ధన్యవాదాలు.
అదానీ – హిండెన్‌బర్గ్ అంశంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇక్కడితో ముగిస్తున్నాం.
తిరిగి రేపు ఉదయం తాజా స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలతో కలుద్దాం.
అంతవరకూ సెలవు. ధన్యవాదాలు.

ఫొటో సోర్స్, EPA
గత ఏడాది కాలంలో అమెరికా కనీసం పది సార్లు చైనా గగనతలంలోకి బెలూన్లను పంపిందని చైనా విదేశాంగ శాఖ అంటోంది.
ఫిబ్రవరి 4న అమెరికా గగనతలంలో ఎగురుతున్న బెలూన్‌ను నిఘా బెలూన్‌గా అనుమానించి కూల్చివేశారు. అది వాతావరణ రిపోర్ట్ అందించే బెలూన్ అని, పొరపాటున అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందని చైనా చెప్పింది.
అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత సన్నగిల్లాయి.
ఈ నెలలోనే అమెరికా మరో మూడు గుర్తు తెలియని పరికరాలను ఆకాశం నుంచి కూల్చివేసింది.
అయితే, అమెరికా తమ దేశ గగనతలాన్ని ఎన్నోసార్లు ఉల్లంఘించిందని చైనా ఆరోపిస్తోంది.
"అమెరికా చాలాసార్లు అక్రమంగా ఇతర దేశాల గగనతలంలోకి ప్రవేశించింది" అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ సోమవారం మీడియా సమావేశంలో అన్నారు.
"గత ఏడాదిలోనే పది కంటే ఎక్కువ అమెరికా బెలూన్లు చట్టవిరుద్ధంగా చైనా గగనతలంలో ఎగిరాయి. చైనా అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా అమెరికా వాటిని పంపించింది" అని వెబ్‌బిన్ అన్నారు.
"చైనాపై ఆరోపణలు గుప్పించే ముందు, అమెరికా ఆత్మపరిశీలన చేసుకోవాలని" ఆయన అన్నారు.
ఈమధ్య అమెరికా ఆకశంలో కనిపించిన బెలూన్‌పై తమ దేశం "బాధ్యతాయుతంగా, ప్రొఫెషనల్‌గా" స్పందించిందని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటివరకు 7 రౌండ్ల పాటు వేలం జరిగింది. భారత్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.
వరల్డ్ కప్ టోర్నీకి కెప్టెన్లుగా వ్యవహరించిన నలుగురు ప్లేయర్లు ఇప్పటివరకు వేలంలో ఎవరూ కొనుగోలు చేయకపోవడం విశేషం.
ఇప్పటివరకు జరిగిన వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన క్రికెటర్‌గా స్మృతి మంధాన నిలిచారు. అందరి కంటే ఎక్కువగా ఇప్పటివరకు ఆర్‌సీబీ ఎక్కువగా ఖర్చు చేసింది.
15 నిమిషాల బ్రేక్ తర్వాత మళ్లీ వేలం కొనసాగనుంది.
దిల్లీ ఫ్రాంచైజీ
జెమీమా రోడ్రిగ్స్ (భారత్, బ్యాటర్): రూ. 2.2 కోట్లు
షెఫాలీ వర్మ (భారత్, బ్యాటర్): రూ. 2.0 కోట్లు
మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా, బ్యాటర్): రూ. 1.1 కోట్లు
రాధా యాదవ్ (భారత్, ఆల్‌రౌండర్): రూ. 40 లక్షలు
గుజరాత్ జెయింట్స్
ఆష్లే గార్డ్‌నర్ (ఆస్ట్రేలియా, ఆల్‌రౌండర్): రూ. 3.2 కోట్లు
బేత్ మూనీ (ఆస్ట్రేలియా, వికెట్ కీపర్): రూ. 2.0 కోట్లు
అనాబెల్ సుదర్లాండ్ (ఆస్ట్రేలియా, ఆల్‌రౌండర్): రూ. 70 లక్షలు
డియోండ్ర డాటిన్ (వెస్టిండీస్, ఆల్‌రౌండర్): రూ. 60 లక్షలు
సోఫియా డంక్లే (ఇంగ్లండ్, బ్యాటర్): రూ. 60 లక్షలు
హర్లీన్ డియోల్ (భారత్, ఆల్‌రౌండర్): రూ. 40 లక్షలు
ముంబై ఇండియన్స్
నటాలియా స్కివర్ (ఇంగ్లండ్, ఆల్‌రౌండర్): రూ. 3.2 కోట్లు
పూజ వస్త్రకర్ (భారత్, ఆల్‌రౌండర్): రూ. 1.9 కోట్లు
హర్మన్ ప్రీత్ కౌర్ (భారత్, ఆల్‌రౌండర్): రూ. 1.8 కోట్లు
యస్తిక భాటియా (భారత్, వికెట్ కీపర్): రూ. 1.5 కోట్లు
అమెలియా కెర్ (న్యూజీలాండ్, ఆల్‌రౌండర్) రూ. 1.0 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
స్మృతి మంధాన (భారత్, బ్యాటర్): రూ. 3.4 కోట్లు
రిచా ఘోష్ (భారత్, వికెట్‌కీపర్): రూ. 1.9 కోట్లు
ఎలిస్సా పెర్రీ (ఆస్ట్రేలియా, ఆల్‌రౌండర్): రూ. 1.7 కోట్లు
రేణుక సింగ్ (భారత్, బౌలర్): రూ. 1.5 కోట్లు
సోఫీ డివైన్ (న్యూజీలాండ్, ఆల్‌రౌండర్): రూ. 50 లక్షలు
యూపీ వారియర్స్
దీప్తి శర్మ (భారత్, ఆల్‌రౌండర్) రూ. 2.6 కోట్లు
సోఫీ ఎకెల్‌స్టోన్ (ఇంగ్లండ్, ఆల్‌రౌండర్) రూ. 1.8 కోట్లు
తహ్లియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా, ఆల్‌రౌండర్) రూ. 1.4కోట్లు
షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా, బౌలర్) రూ. 1.0 కోట్లు
అలిస్సా హేలీ (ఆస్ట్రేలియా, వికెట్ కీపర్): రూ. 70 లక్షలు
అంజలి శర్వాణి (భారత్, బౌలర్): రూ. 55 లక్షలు
రాజేశ్వరీ గైక్వాడ్ (భారత్, బౌలర్): రూ. 40 లక్షలు

ఫొటో సోర్స్, Getty Images
అదానీ – హిండెన్‌బర్గ్ అంశంపై దర్యాప్తు కోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఉండే నిపుణుల పేర్లను కేంద్రం సూచించనుంది.
హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడిన తర్వాత అదానీ కంపెనీల్లో షేర్ల పతనానికి కారణాల మీద, ప్రస్తుత నియంత్రణ సంస్థల పాత్ర మీద దర్యాప్తు చేయటానికి కూడా కమిటీని ఏర్పాటు చేయటానికి కేంద్రం అంగీకరించింది.
అయితే.. ప్రభుత్వం సూచించిన నిపుణుల నుంచి మాత్రమే ఈ దర్యాప్తు కమిటీ సభ్యులను సుప్రీంకోర్టు ఎంపిక చేయాలని కేంద్రం స్పష్టంచేసింది.
సుప్రీంకోర్టులో ఈ అంశంపై జరిగిన విచారణకు సెబి తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ తుషార్ మెహతా.. హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం దాని ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యం సెబికి ఉందని చెప్పారు.
అదే సమయంలో.. మదుపుదారుల ప్రయోజనాలను కాపాడటం కోసం సుప్రీంకోర్టు ఒక కమిటీని వేయటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం బుధవారం నాటికి సమాధానం ఇవ్వాలని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం నిర్దేశించింది. శుక్రవారం తదుపరి విచారణ చేపడతామని చెప్పింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే.. అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక మీద సెబి, కేంద్ర హోంశాఖ దర్యాప్తు చేయాలని కోరుతూ మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఫొటో సోర్స్, ANI
భారత హిట్టింగ్ బ్యాటర్ షెఫాలీ వర్మను దిల్లీ క్యాపిటల్స్ జట్టు రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.
మొదట దిల్లీ, ఆర్సీబీ ఆమె కోసం పోటీపడుతూ బిడ్డింగ్‌ను రూ. 1.2 కోట్లకు చేర్చాయి.
ఈ దశలో ముంబై ఇండియన్స్ రూ. 1.3 కోట్లతో బరిలోకి వచ్చింది.
అయితే చివరి వరకు పట్టుబట్టిన దిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు ఆమెను సొంతం చేసుకుంది.
ఇక్కడితో మార్క్యూ కేటగిరీతో పాటు, బ్యాటర్ల కేటగిరీ వేలం ముగిసింది.
ఇప్పటివరకు 11 మంది విదేశీ ప్లేయర్లు సహా మొత్తం 17 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
దిల్లీ ఫ్రాంచైజీ
జెమీమా రోడ్రిగ్స్ (భారత్, బ్యాటర్): రూ. 2.2 కోట్లు
షెఫాలీ వర్మ (భారత్, బ్యాటర్): రూ. 2.0 కోట్లు
మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా, బ్యాటర్): రూ. 1.1 కోట్లు
గుజరాత్ జెయింట్స్
ఆష్లే గార్డ్‌నర్ (ఆస్ట్రేలియా, ఆల్‌రౌండర్) రూ. 3.2 కోట్లు
బేత్ మూనీ (ఆస్ట్రేలియా, వికెట్ కీపర్) రూ. 2.0 కోట్లు
సోఫియా డంక్లే (ఇంగ్లండ్, బ్యాటర్) రూ. 60 లక్షలు
ముంబై ఇండియన్స్
నటాలియా స్కివర్ (ఇంగ్లండ్, ఆల్‌రౌండర్) రూ. 3.2 కోట్లు
హర్మన్ ప్రీత్ కౌర్ (భారత్, ఆల్‌రౌండర్) రూ. 1.8 కోట్లు
అమెలియా కెర్ (న్యూజీలాండ్, ఆల్‌రౌండర్) రూ. 1.0 కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
స్మృతి మంధాన (భారత్, బ్యాటర్) రూ. 3.4 కోట్లు
ఎలిస్సా పెర్రీ (ఆస్ట్రేలియా, ఆల్‌రౌండర్) రూ. 1.7 కోట్లు
రేణుక సింగ్ (భారత్, బౌలర్) రూ. 1.5 కోట్లు
సోఫీ డివైన్ (న్యూజీలాండ్, ఆల్‌రౌండర్) రూ. 50 లక్షలు
యూపీ వారియర్స్
దీప్తి శర్మ (భారత్, ఆల్‌రౌండర్) రూ. 2.6 కోట్లు
సోఫీ ఎకెల్‌స్టోన్ (ఇంగ్లండ్, ఆల్‌రౌండర్) రూ. 1.8 కోట్లు
తహ్లియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా, ఆల్‌రౌండర్) రూ. 1.4కోట్లు
షబ్నిమ్ ఇస్మాయిల్ (దక్షిణాఫ్రికా, బౌలర్) రూ. 1.0 కోట్లు

ఫొటో సోర్స్, Getty Images
భారత యువ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్‌ను వేలంలో దిల్లీ క్యాపిటల్స్ జట్టు దక్కించుకుంది.
రూ. 2.2 కోట్లకు ఆమెను కొనుగోలు చేసింది.
జెమీమా బేస్ ప్రైజ్ రూ. 50 లక్షలు కాగా, యూపీ వారియర్స్ మొదట ఆమె కోసం బిడ్డింగ్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత దిల్లీ క్యాపిటల్స్ బరిలో నిలిచింది. ఈ దశలో ముంబై ఇండియన్స్ ఒక్కసారిగా ఆమె ధరను రూ. 2 కోట్లకు పెంచింది. తర్వాత దిల్లీ క్యాపిటల్స్ రూ. 2.2 కోట్లకు ఆమెను సొంతం చేసుకుంది
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలంలో భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మంచి ధర పలికింది.
మార్క్యూ ప్లేయర్ల జాబితాలో రూ. 50 లక్షల బేస్‌ప్రైజ్‌తో వచ్చిన దీప్తి శర్మను రూ. 2.6 కోట్లకు యూపీ వారియర్స్ దక్కించుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
భారత బౌలర్ రేణుక సింగ్ కోసం ఆర్‌సీబీ, దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.
చివరకు రూ. 1.5 కోట్లకు రేణుక సింగ్‌ను ఆర్‌సీబీ జట్టు దక్కించుకుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ANI
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం ప్రారంభమైంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఫ్రాంచైజీ భారత వైస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ స్మృతి మంధానను సొంతం చేసుకుంది.
రూ. 3.4 కోట్లకు ఆమెను కొనుగోలు చేసింది.
తొలుత ముంబై ఇండియన్స్ రూ. 50 లక్షలకు ఆమె కోసం బిడ్డింగ్‌ను మొదలుపెట్టింది.
వెంటనే రాయల్ చాలెంజర్స్ ఆమె కోసం పోటీపడింది.
రెండు ఫ్రాంచైజీలు ఆమె కోసం తలపడ్డాయి. చివరకు ఆర్సీబీ ఆమెను సొంతం చేసుకుంది.
స్మృతి మంధాన పేరుతోనే వేలం ప్రక్రియ మొదలైంది.
ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ పేరు వేలంలోకి వచ్చింది. ఆమెను ముంబై ఇండియన్స్ జట్టు రూ. 1.8 కోట్లకు కొనుగోలు చేసింది.
అంతకుముందు డబ్ల్యూపీఎల్ లోగోను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆవిష్కరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, STR
ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ క్షేమంగా ఉన్నారని ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు పెజా నెడుమారన్ అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
‘‘తమిళ జాతీయ నేత ప్రభాకరన్‌కు సంబంధించిన ఒక నిజాన్ని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఆయన క్షేమంగా ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇక్కడితో ఆయన గురించి వ్యాప్తి చెందిన ఊహాగానాలు ముగుస్తాయని అనుకుంటున్నా.
తమిళ జాతి విముక్తి కోసం ఆయన త్వరలోనే ఒక ప్రణాళికను ప్రకటించనున్నారు. తమిళ ప్రజలందరూ ఆయనకు మద్దతుగా ఉండాలి’’ అని ఆయన వ్యాఖ్యానించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎల్‌టీటీఈ నాయకుడు వేలుపిళ్లై ప్రభాకరన్ ప్రాణాలతో లేరని శ్రీలంక ఆర్మీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ రవి హెరాత్ చెప్పారు.
ప్రభాకరన్ చనిపోయారని నిరూపించడానికి తమ వద్ద రుజువులు ఉన్నాయని ఆయన తెలిపారు.
2009 మే 18న జరిగిన పోరాటంలో ప్రభాకరన్ చనిపోయారని ఆయన వెల్లడించారు.
ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ క్షేమంగా ఉన్నారని ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు పెజా నెడుమారన్ సోమవారం ఉదయం వార్తా సంస్థ ఏఎన్‌ఐతో అన్నారు.
దీని గురించి శ్రీలంక ఆర్మీ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ రవి స్పష్టతను ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరగాల్సిన మూడో టెస్టు మ్యాచ్ వేదిక మారింది.
తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉంది.
అయితే, తాజాగా ఈ వేదికను ఇండోర్‌కు మార్చినట్లు బీసీసీఐ ప్రకటించింది.
తీవ్రమైన చలితో పాటు అవుట్‌ఫీల్డ్‌లో తగినంత గడ్డి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
మార్చి 1 నుంచి 5 వరకు మూడో టెస్టు జరుగనుంది.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్ల మధ్య 4 టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి.
తొలి టెస్టులో భారత్ గెలుపొందింది.