లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజా చార్జిషీటులో ఆమ్ ఆద్మీ పార్టీపై ఆరోపణలు చేసింది. లిక్కర్ స్కామ్ సొమ్మును ఆ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి వాడిందని పేర్కొంది. అయితే, ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ అదంతా కట్టుకథ అని అన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
పెషావర్ మసీదులో సోమవారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ దుండగుడు పోలీసు యూనిఫామ్ వేసుకుని లోపలికి వచ్చినట్టు తెలిసింది.
ఈ దాడిలో కనీసం 100 మంది మరణించారు. వారిలో చాలా మంది పోలీసులే ఉన్నారు.
కట్టుదిట్టమైన భద్రత కలిగిన మసీదులోకి దుండగుడు ప్రధాన గేట్ల నుంచే ప్రవేశించాడు.
సీసీటీవీలో ఈ దుండగుడి చివరిసారి కదలికలను తాము చూసినట్టు పోలీసు చీఫ్ మోజమ్ జా అన్సారీ చెప్పారు.
ఈ దాడిని ఏ ఉగ్రవాద సంస్థ చేపట్టిందో తెలుసుకునేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
స్పాట్ నుంచి పలు సాక్షాధారాలను సేకరించినట్టు పోలీసు చీఫ్ చెప్పారు.
‘‘సెక్యూరిటీలో లోపముందనే దానికి నేను సమ్మతిస్తున్నా. మా ఉద్యోగులు అతన్ని కనుగొనలేకపోయారు. ఇది మా లోపమే’’ అని అన్సారీ చెప్పారు.
ఆ దుండగుడు మోటార్‌సైకిల్ పై మసీదు ప్రాంతంలోకి వచ్చినప్పుడు పోలీసు యూనిఫామ్‌లో ఉన్నాడు. హెల్మెట్ కూడా పెట్టుకుని ఉన్నాడు. కాంపౌండ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఒక కానిస్టేబుల్‌ని మసీదుకి దారి ఎటు అని అడిగినట్లు సీసీటీవీలో కనిపించిందని అన్సారీ చెప్పారు.
పెషావర్‌లోని అత్యధిక సెక్యూరిటీ కలిగిన పోలీసు లైన్‌లోని 50 కాలం నాటి మసీదులో ఈ దాడి జరిగింది.
ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసు నియామకం ఇక నుంచి సివిల్ సర్వీసెస్ పరీక్షల ద్వారానే చేపట్టనుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ).
ఈ మార్పుకు సంబంధించి భారతీయ రైల్వే మంగళవారం ఒక ప్రకటన జారీ చేసినట్లు న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.
అంతకుముందు, ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసు నియామకాన్ని 2023లో ప్రత్యేక పరీక్ష ద్వారా చేపట్టనున్నట్టు తెలిపింది. కానీ, ప్రస్తుతం తన నిర్ణయాన్ని భారతీయ రైల్వే మార్చుకుంది.
‘యూపీఎస్‌సీని, పర్సనల్, ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్‌ను సంప్రదించిన తర్వాత, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారానే ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీసు నియామకం చేపట్టాలని నిర్ణయించాం. ఈ పరీక్షను యూపీఎస్‌సీ నిర్వహిస్తుంది’ అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.
దిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి తీసుకున్న డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారం కోసం వాడిందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన తాజా చార్జిషీటులో పేర్కొంది. కేజ్రీవాల్ పేరును లిక్కర్ స్కామ్ చార్జిషీటులో ఈడీ ప్రస్తావించడం ఇదే మొదటిసారి.
అయితే, కేజ్రీవాల్ ఆ ఆరోపణలను తోసిపుచ్చారు. “ఈడీ ఇప్పటికి 5,000 చార్జిషీట్లు తయారు చేసి ఉంటుంది. వారిలో ఎందరికి శిక్ష పడింది? ఈడీని కేవలం ప్రభుత్వాలను పడగొట్టడానికి, ఎమ్మెల్యేలను కొనడానికి వాడుతున్నారు” అని కేజ్రీవాల్ అన్నారు. ఈడీ చార్జిషీట్ అంతా కట్టుకథ అని ఆయన అన్నారు.
అంతకుముందు, ఈడీ తన చార్జిషీటులో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును సమీర్ మహేంద్రు తదితరులతో పాటుగా ప్రస్తావించింది. దిల్లీలో లిక్కర్ వ్యాపారానికి వీలు కల్పించేందుకు ఆప్‌కు చెందిన విజయ్ నాయర్‌కు రూ. 100 కోట్ల ముడుపులు చెల్లించిన వారిలో ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్నారని ఈడీ చార్జిషీటు పేర్కొంది.
అయితే, అవన్నీ తప్పుడు ఆరోపణలని కవిత తోసిపుచ్చారు. ఇదంతా బీజేపీ ప్రతీకార చర్య అని ఆమె ఆరోపించారు.
కాగా, రౌస్ అవెన్యూ డిస్ట్రిక్ట్ కోర్టు ఈడీ సప్లిమెంటరీ చార్జిషీటులోని తీవ్రతను గుర్తించి విచారణకు తీసుకుంది. దీనిపై ఈ కోర్టు ఫిబ్రవరి 23న విచారణ జరుపుతుంది.
సప్లిమెంటరీ చార్జిషీటులో ఎమ్మెల్సీ కవితతో పాటు విజయన్ నాయర్, శరత్ రెడ్డి, బినయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరాల పేర్లు ఉన్నాయి.
ఈ చార్జిషీటును తాము సంపాదించగలిగామని చెప్పిన ఎన్‌డీటీవీ, అందులోని నిందితుల జాబితాలో కేజ్రీవాల్ పేరు లేదని ఒక వార్తా కథనంలో తెలిపింది.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఈ నెలలో జరగబోయే మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో సొంతంగానే 60 సీట్లలో పోటీ చేయనున్నట్టు ప్రకటించింది.
మరోవైపు నాగాలాండ్ ఎన్నికల్లో మొత్తం 60 సీట్లలో 20 సీట్లలో మాత్రమే పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది.
రెండు రాష్ట్రాలలో పార్టీ తరఫున పోటీ చేసే 80 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది.
న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో గురువారం జాతీయ కార్యదర్శి రితురాజ్ సిన్హా, జాతీయ అధికార ప్రతినిధి నలిన్ కోహ్లిలు వీరి జాబితాను విడుదల చేశారు.
ప్రజల సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకుని తొలిసారి మేఘాలయలో 60 సీట్లలో పోటీ చేయాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించిందని రితురాజ్ సిన్హా తెలిపారు.
‘మేఘాలయ సాధికారత’ అనే నినాదంతో తాము అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్నామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు రాష్ట్రంలో అమలు కావడం లేదని ఆయన విమర్శించారు.
అవినీతిరహిత రాష్ట్రాన్ని, వేగవంతమైన అభివృద్ధిని ప్రధాన మంత్రి అందిస్తారని ప్రజలకు నమ్మకం ఉందన్నారు.
నాగాలాండ్‌లో ఎన్‌డీపీపీతో కలిసి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. ఈ నేపథ్యంలో 20 సీట్లలో బీజేపీ అభ్యర్థులు, 40 సీట్లలో ఎన్‌డీపీపీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు.
కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్ సుమారు 28 నెలల తర్వాత జైలు నుంచి బయటికి వచ్చారు.
మనీలాడరింగ్ కేసుల్లో ఆయన బెయిల్‌పై విడుదలయ్యే నిర్ణయంపై లఖ్‌నవూ సెషన్స్ కోర్టు సంతకం చేసింది.
ఈ నెల ప్రారంభంలో మనీలాండరింగ్ కేసులో అలహాబాద్ హైకోర్టు ఆయనికి బెయిల్ మంజూరు చేసింది.
హథ్రాస్ గ్యాంగ్ రేప్ కేసును రిపోర్టు చేసేందుకు వెళ్తున్న సిద్ధిఖీ కప్పన్‌ను ఉత్తర ప్రదేశ్ పోలీసులు 2020 అక్టోబర్ 5న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆయనపై యూఏపీఏను(చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టాన్ని) కూడా విధించారు.
గత ఏడాది సెప్టెంబర్‌లో ఆయనపై జారీ అయిన అన్ని కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కానీ, మనీలాండరింగ్ కేసులో మాత్రం సిద్ధిఖీకి బెయిల్ రాలేదు. దీంతో సిద్ధిఖీ బెయిల్‌పై బయటికి రాలేకపోయారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌పై హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌లో వెల్లడించిన విషయాలపై చర్చ జరపాలని విపక్షాలు పార్లమెంటులో డిమాండ్ చేశాయి.
అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో జరిగాయంటున్న అవకతవకలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని కోరాయి.
గురువారం సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు భావసారూప్య పార్టీలన్నీ సమావేశమైన సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి.
అదానీ అంశంపై సభలో ప్రధాని మోదీ మాట్లాడాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు.
తమిళనాడులోని మదురైలో హిందూ మక్కల్ కట్చి కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు తెలిపారు.
జనవరి 31న ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తి మణికందన్(41)గా పోలీసులు వెల్లడించారు.
తన జువెలరీ షాప్‌ను మూసేసి ఇంటికి పోతున్న సమయంలో మణికందన్‌ను కత్తితో పొడిచి చంపారని పోలీసులు చెప్పారు.