You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

బాఫ్టా అవార్డ్స్: ఆర్ఆర్ఆర్‌కు దక్కని నామినేషన్

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ ఈ అవార్డ్స్‌కు నామినేట్ కాలేదు. కానీ శౌనక్ సేన్ దర్శకత్వం వహించిన ‘ఆల్ ది బ్రీత్స్’, బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో చోటు దక్కించుకుంది.

లైవ్ కవరేజీ

  1. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల అభియోగాల నమోదు, హర్షం వ్యక్తం చేసిన మహిళా రెజ్లర్లు

  2. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  3. రిజ్వానా: బురఖా వేసుకుని స్విగ్గీ బ్యాగుతో నడిచి వెళుతున్న ఈమె కథ తెలుసా?

  4. కేరళ: పులులను చంపేయాలన్న మంత్రి వ్యాఖ్యలపై వివాదం

  5. ఇండియన్ ఆర్మీ కోసం ‘ఏహెచ్-64 అపాచీ’ హెలికాప్లర్ల తయారీకి హైదరాబాద్ చేరిన కీలక భాగాలు

    ‘టాటా బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్’ హైదరాబాద్‌లోని తన అధునాత తయారీ కేంద్రానికి ఆరు విమాన బాడీలు(ఫ్యూజ్‌లాజ్‌) పంపించింది.

    భారత సైన్యం ఆర్డర్ చేసిన ‘ఏహెచ్-64 అపాచీ’ రకం హెలికాప్లర్ల తయారీలో వీటిని వినియోగిస్తారు.

    ఈ ఫ్యూజ్‌లాజ్‌లకు ఇంజిన్లు, రెక్కలు అన్నీ అమర్చాక అది పూర్తిస్థాయిలో హెలికాప్టర్‌గా తయారవుతుంది.

  6. హత్యలు చేసి సమాధులు కట్టే ‘రూత్‌లెస్ గాడ్ ఫాదర్’

  7. బాఫ్టా: ఆర్ఆర్ఆర్‌కు దక్కని నామినేషన్

    బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్(బాఫ్టా)-2023 నామినేషన్లు వచ్చాయి.

    రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ ఈ అవార్డ్స్‌కు నామినేట్ కాలేదు. ‘నాన్ ఇంగ్లిష్’ విభాగంలో అది పోటీ పడింది.

    కానీ శౌనక్ సేన్ దర్శకత్వం వహించిన ‘ఆల్ ది బ్రీత్స్’, బెస్ట్ డాక్యుమెంటరీ విభాగంలో చోటు దక్కించుకుంది.

    ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్ అయింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డును సైతం గెలుచుకుంది.

  8. సికింద్రాబాద్ అగ్నిప్రమాదం: గాయపడిన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది... ఐసీయూలో ఒకరు

  9. శుభ్‌మన్ గిల్: సెంచరీ కొట్టాక అతను అభివాదం చేశాడు... డబుల్ సెంచరీ అయ్యాక మైదానం అతనికి అభివాదం చేసింది

  10. సికింద్రాబాద్: స్పోర్ట్స్ షోరూంలో అగ్నిప్రమాదం

    సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం జరిగింది.

    డెక్కన్ నైట్ వేరు స్పోర్ట్స్ షోరూమ్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆరు అంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి.

    ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఈ భవనంలో షోరూమ్‌తో పాటు ఇతర షాపులు, గోదాములు ఉన్నాయి. దగ్గరలో ఉండే ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నాయి.

    మంటల్లో చిక్కుకున్న ఆరుగురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఇంకో ఇద్దరు మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఇరుకైన సందులు కావడంతో నల్లటి పొగ మొత్తం చుట్టుపక్కల వ్యాపించింది.

    షో రూమ్‌కి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని వారు కూడా ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చేశారు ఒక దశలో ఆ వీధిలో పొగ ఏమీ కనపడని పరిస్థితి ఏర్పడింది.

  11. ప్రభుత్వ పథకాల్లో ఇలాంటి స్కాములు కూడా చేస్తారా?

  12. మైక్రోసాఫ్ట్‌లో 10,000 వేల ఉద్యోగాల కోత... ఈ ప్రభావం ఇతర టాప్ టెక్ కంపెనీల మీద ఉంటుందా?

  13. లైంగిక ఆరోపణలపై రెజ్లర్ వినేశ్‌కు మద్దతుగా నిలిచిన మహావీర్ ఫొగాట్

    రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్, తన మేనకోడలు వినేశ్ ఫొగాట్ చేసిన ఆరోపణలను మహావీర్ ఫొగాట్ సమర్థించారు.

    బ్రిజ్ భూషణ్ అనేకమంది అమ్మాయిలను లైంగికంగా వేధించారంటూ వినేశ్ పొగాట్ బుధవారం ఆరోపించారు.

    ఈ విషయం గురించి ఆంగ్ల పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన మహావీర్ ఫొగాట్, ‘‘ఆయన ఎప్పుడూ అమ్మాయిల క్యాంపులను లక్నోలో తన ఇంటికి సమీపంలో ఏర్పాటు చేస్తారు.

    గతంలో కూడా చాలామంది అమ్మాయిలు ఆయనపై ఇలాంటి ఫిర్యాదుల చేశారు. కానీ ఏమీ జరగలేదు. ఇప్పుడు ఈ పిల్లలు చాలా ధైర్యం చేసి ఈ విషయాన్ని బయటకు తెచ్చారు’’ అని ఆయన జంతర్‌మంతర్ వద్ద నిరసనకు కూర్చున్న భారత రెజ్లర్లను ఉద్దేశించి అన్నారు.

    భారత్ తరఫున ప్రతిష్టాత్మక టోర్నీల్లో పతకాలు సాధించిన గీత ఫొగాట్, బబిత ఫొగాట్‌ల తండ్రి మహావీర్ ఫొగాట్.

    ఆయన జీవితం ఆధారంగానే బాలీవుడ్‌లో ‘దంగల్’ అనే సినిమాను తీశారు. వినేశ్ ఫొగాట్‌కు ఆయన మామ.

    బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఆరోపణలు చేస్తూ బుధవారం పలువురు భారత ప్రముఖ రెజ్లర్లు, దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.

    బజ్‌రంగ్ పూనియా, సాక్షి మలిక్, సంగీత ఫొగాట్, వినేశ్ ఫొగాట్, సత్యవ్రత్ మలిక్, సరితా మోర్ సహా మొత్తం 30 మంది రెజ్లర్లు బుధవారం నిరసన వ్యక్తం చేశారు.

  14. రఘురామ్ రాజన్: ‘‘రాహుల్ గాంధీ పప్పు కాదు, తెలివైనవారు’’

    రాహుల్ గాంధీ ఒక తెలివైన వ్యక్తి, పప్పు కాదు అని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.

    ప్రజల్లో రాహుల్ గాంధీకి ఉన్న ఇమేజ్ గురించి ప్రశ్నించగా ఆయన పైవిధంగా బదులిచ్చారు.

    దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా ఒక న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ రాహుల్ గాంధీకి పప్పు అనే ఇమేజ్ రావడం దురదృష్టకరం అని అన్నారు.

    ‘‘పప్పు అనే ముద్ర వేయడం దురదృష్టకరం. దశాబ్దాలుగా నేను ఆయనతో ఎన్నో విషయాలు చర్చించాను. ఆయన పప్పు ఏమాత్రం కాదు. అతనో తెలివైన, జిజ్ఞాస ఉన్న వ్యక్తి’’ అని ఇండియా టుడే చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

    రాజస్థాన్‌లో గత నెలలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో రఘురామ్ రాజన్ పాల్గొన్నారు. ఈ యాత్ర సిద్ధాంతాలపై తనకు నమ్మకం ఉందని, అందుకే యాత్రలో భాగమయ్యానని ఆయన అన్నారు.

  15. న్యూజీలాండ్ ప్రధాని జెసిండా ఆర్డన్: ‘‘వచ్చే నెలలో రాజీనామా చేస్తా’’

    న్యూజిలాండ్ ప్రధాని పదవి నుంచివచ్చే నెలలో తప్పుకుంటానని జసిండా ఆర్డెన్ ప్రకటించారు.

    సవాలుగా నిలిచే ఈపదవిలో ఆరేళ్లపాటు కొనసాగిన తనకు వచ్చే నాలుగేళ్లలో చేయడానికి పెద్దగా ఏమీ మిగల్లేదని అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అన్నారు.

    లేబర్ పార్టీ నాయకురాలిగా తనకు ఫిబ్రవరి 7వ తేదీ చివరి రోజు అవుతందని జెసిండా చెప్పారు. ఆరోజు ఆమె రాజీనామా చేయనున్నారు. తదుపరి నేతను ఎన్నుకోవడం కోసం ఓటింగ్ జరుగనుంది.

    న్యూజీలాండ్‌లో ఈ ఏడాది అక్టోబర్ 14న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.

    తన భవిష్యత్ కార్యాచరణ గురించి కొన్ని రోజుల తర్వాత ఆలోచిస్తానని ఆర్డెన్ చెప్పారు.

    2017లో 37 సంవత్సరాల వయస్సులో జెసిడా ప్రధాని అయ్యారు. ప్రధాని పదవి అధిష్టించిన అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డుల్లో నిలిచారు.