యుక్రెయిన్: కుప్పకూలిన హెలికాప్టర్, హోం మంత్రి సహా 18 మంది దుర్మరణం
యుక్రెయిన్ రాజధాని కీయెవ్ శివార్లలోని బ్రోవరీలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ హోం మంత్రి డెనిస్ మొనాస్టిర్‌స్కీ సహా 18 మంది మరణించారు.
లైవ్ కవరేజీ
లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
పీఎం కేఎంవై: రిటైర్ అయిన రైతుకు పెన్షన్ ఇచ్చే స్కీమ్
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారు... డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షునిపై ఆరోపణలు
మెదక్: తన పేరు మీద రూ.7 కోట్లకు బీమా... ‘తన లాంటి వ్యక్తిని చంపేసి, తానే చనిపోయినట్లు నాటకం’
కేసీఆర్: విశాఖ ఉక్కును మోదీ అమ్మితే... మేం మళ్లీ తీసుకొస్తాం
వినేశ్ పోగట్: ‘మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారు’
మహిళా రెజ్లర్లను కోచ్‌లు లైంగికంగా వేధిస్తున్నారని భారత రెజ్లర్ వినేశ్ పోగట్ అన్నారు.
‘కోచ్‌లు మహిళలను వేధిస్తున్నారు. ఫెడరేషన్‌కు నచ్చిన కొందరు కోచ్‌లు మహిళా కోచ్‌లతో కూడా తప్పుగా ప్రవర్తిస్తున్నారు.
అమ్మాయిలను లైంగికంగా వేధిస్తున్నారు. డబ్ల్యూఎఫ్ఐ ప్రెసిడెంట్ చాలా మంది అమ్మాయిలను లైంగికంగా వేధించారు’ అని వీనేశ్ పోగట్ అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఖమ్మం బీఆర్ఎస్ సభ.. 'ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పాలన సాగుతోంది' - పినరయి విజయన్

ఫొటో సోర్స్, ANI
ఖమ్మంలో జరుగుతున్న బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభలో కేరళ సీఎం పినరయి విజయన్ ప్రసగించారు. కేంద్రంలోని బీజేపీ పాలనపై విమర్శలు గుప్పించారు.
"ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ పాలన సాగుతోంది. చాలా అంశాల్లో రాష్ట్రాల అభిప్రాయాలను విస్మరిస్తున్నారు. దేశంలో రాజ్యాంగం సంక్షోభంలో ఉంది. అసెంబ్లీలను బలహీనపరుస్తున్నారు. కేంద్ర నిర్ణయాలు ఆర్ఎస్‌ఎస్ కనుసన్నల్లో జరుగుతున్నాయి. గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రాలపై బలవంతంగా హిందీ రుద్దే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ కార్పొరేట్లకు కొమ్ముకాస్తోంది. ఈ సభ దేశానికి దిక్సూచి లాంటిది. బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభమవ్వాలి. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభినందనీయం. కంటి వెలుగు లాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవు" అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
తరువాత ప్రసంగించిన సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా బీజేపీయేతర రాష్ట్రాలను దిల్లీలోని కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు. కేసుల పేరుతో ఇరుకున పెడుతోందన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"రైతులను ఆదుకుంటామని మాట తప్పారు. మోదీ ఇంకా 400 రోజులే మిగిలి ఉన్నాయని అంటున్నారు. అంటే వాళ్లు రోజులు లెక్కపెట్టుకుంటున్నారు. నిరుద్యోగుల ఉపాధిపై చేతులెత్తేశారు. మోదీ ప్రభుత్వం చాలామందిని దేశంలో ఉండనివ్వడం లేదు. ఉత్తరప్రదేశ్‌లో గంగా నది ప్రక్షాళన చేయలేదు. యూపీలో బీజేపీకి అడ్రస్ లేకుండా చేస్తాం" అన్నారు.
పాకిస్తాన్ ఆర్థికసంక్షోభం: ఈసారి చైనా, సౌదీ అరేబియా కూడా కాపాడలేవా
బ్రేకింగ్ న్యూస్, యుక్రెయిన్: కుప్పకూలిన హెలికాప్టర్, హోం మంత్రి సహా 18 మంది దుర్మరణం

యుక్రెయిన్ రాజధాని కీయెవ్ శివార్లలోని బ్రోవరీలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆ దేశ హోం మంత్రి డెనిస్ మొనాస్టిర్‌స్కీ సహా 18 మంది మరణించారు.
మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన స్థానిక సమయం 8:30 గంటలకు జరిగింది.
ప్రమాదంలో గాయపడిన 25 మందిని ఆసుపత్రిలో చేర్చారు. ఇందులో 10 మంది చిన్నారులు ఉన్నారు.
ప్రాథమిక నివేదికల ప్రకారం, హెలికాప్టర్ మొదట కిండర్ గార్టెన్ భవనాన్ని ఢీకొట్టి, అక్కడి నివాస భవనం సమీపంలో కూలిపోయింది.
మంత్రి డెనిస్(42)తో పాటు మరో ఎనిమిది మంది హెలికాప్టర్‌లో ప్రయాణించారు.
ప్రమాదం జరిగినప్పుడు చీకటి, పొగమంచు కమ్ముకొని ఉంది.
ఈ ప్రమాదంలో హోం శాఖ డిప్యూటీ మంత్రి, స్టేట్ సెక్రటరీ కూడా మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఆ హెలికాప్టర్ యుక్రెయిన్ స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్‌కు చెందినదని ఆ దేశ పోలీస్ చీఫ్ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.
భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్‌కు డోపింగ్ టెస్ట్‌లో పాజిటివ్

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, File Photo ఆసియా క్రీడల ఛాంపియన్ ద్యుతీ చంద్‌కు డోపింగ్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చింది. ఆమె నిషేధిత పదార్థాన్ని వినియోగించారని తేలింది.
'ఏడ్వర్స్ అనలిటికల్ ఫైండింగ్' పరీక్షలో పాజిటివ్ రావడంలో ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు.
ఆమె శాంపిల్ 'A' ను పరీక్షించినప్పుడు పాజిటివ్ వచ్చిందని, ద్యుతీ చంద్ కోరితే 'B' శాంపిల్ టెస్ట్ చేస్తారని ఏఎన్ఐ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత స్టార్ స్ప్రింటర్ 2018 ఆసియా క్రీడల్లో 100మీ, 200 మీ మహిళల పరుగులపోటీలో సిల్వర్ మెడల్స్ సాధించింది.
2013, 2017, 1029లలో ఆసియా క్రీడలలో కాంస్య పతకం సాధించింది.
'రెజ్లింగ్ ఫెడరేషన్ నియంతృత్వాన్ని సహించం'.. దిల్లీలో భారత రెజ్లర్ల ధర్నా..

ఫొటో సోర్స్, ANI
భారత రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్ తదితరులు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ)కు వ్యతిరేకంగా రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు.
"డబ్ల్యూఎఫ్ఐ ఏకపక్ష నిర్ణయాలు, నిబంధనలతో రెజ్లర్లను వేధిస్తోందని" ప్లేయర్లు చెబుతున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఒలింపిక్ ఛాంపియన్ సాక్షి మాలిక్ మాట్లాడుతూ, "మేం డబ్ల్యూఎఫ్ఐకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్నాం. సాయంత్రం 4.00 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడతాం. అన్ని విషయాలు వివరిస్తాం" అన్నారు.
"రెజ్లర్లు నియంతృత్వాన్ని సహించే పరిస్థితుల్లో లేరని" భజరంగ్ పునియా అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"ఆటగాడు ఆత్మగౌరవాన్ని కోరుకుంటారు. ఒలింపిక్స్ లాంటి పెద్ద టోర్నమెంటులకు పూర్తి అంకితభావంతో సిద్ధమవుతారు. కానీ ఫెడరేషన్ వారికి మద్దతు ఇవ్వకపోతే, మనోబలం కోల్పోతారు. ఇక మేం మేము తలవంచం. మా హక్కుల కోసం పోరాడతాం" అని వినేశ్ ఫోగట్ ట్వీట్ చేశారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను బహిష్కరించాలని రెజ్లర్లు డిమాణ్డ్ చేస్తున్నారు. విజ్ఞప్తి చేశారు.
క్రికెట్: ఉప్పల్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్

ఫొటో సోర్స్, ANI
నేడు ఉప్పల్ స్టేడియంలో భారత్,న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది.
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కాగా, తొలి మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరుగుతోంది.
శ్రీలంకపై టీ20, వన్డే సీరీస్‌లు గెలిచి విజయోత్సాహంతో ఉన్న భారత్ మంచి జోష్‌తో బరిలోకి దిగింది.
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత జట్టులో హార్దిక్, ఠాకూర్, కిషన్ స్థానంలో కేఎల్ రాహుల్, అయ్యర్, అక్షర్ పటేల్‌లు చోటు దక్కించుకున్నారు.
ఉప్పల్ స్టేడియం క్రికెట్ అభిమానులతో నిండిపోయింది.
భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
తెలంగాణ: బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ ఏం చెబుతారు?
తెలంగాణ: బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడిపై క్రిమినల్ కేసు
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 నుంచి రాఫెల్ నాదల్ ఔట్

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, రాఫెల్ నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 టెన్నిస్ టోర్నమెంటులో బుధవారం జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో రాఫెల్ నాదల్ ఓడిపోయాడు.
అమెరికా ప్లేయర్ మెకెంజీ మెక్‌డొనాల్డ్ మూడు సెట్లలో నాదల్‌ను ఓడించాడు.
నాదల్ 23వ గ్లాండ్‌స్లాం సింగిల్స్ టైటిల్ చేజారిపోయింది.
మ్యాచ్ సమయంలో నాదల్ గాయాల బారినపడ్డాడు. ఆట మధ్యలో వైద్యబృందాన్ని కూడా సంప్రదించాడు.
మొదటి రౌండ్‌లో అతి కష్టం మీద జాక్ డ్రేపర్‌తో గెలిచి రెండవ రౌండ్‌కు చేరుకున్నాడు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గ్రేటా థన్‌బర్గ్ అరెస్ట్.. జర్మనీలో నిరసన ప్రదర్శన చేపట్టినందుకు నిర్బంధించిన పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ జర్మనీలో ఒక నిరసన ప్రదర్శన సందర్భంగా పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌ను పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు.
జర్మనీలో జనావాసాలు లేని గ్రామం లూట్జెరాత్‌ను ధ్వంసం చేసి, బొగ్గు గని విస్తరణకు అనుకూలంగా మార్చాలన్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ థన్‌బర్గ్ సహా ఇతర పర్యావరణ కార్యకర్తలు నిరసనలు తెలిపారు.
థన్‌బెర్గ్‌ను అరెస్టు చేయలేదని మొదట పోలీసులు చెప్పారు. ఆ తరువాత, ఆమె గుర్తింపు కార్డును పరిశీలించి, విడిచిపెట్టామని చెప్పారు.
కార్యకర్తల బృందం గ్రాజ్‌వాయిలర్ 2 గని వైపు 'వేగంగా ముందుకు సాగడం'తో థన్‌బెర్గ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న వారిపై ఎలాంటి కేసు పెట్టబోమని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి, గ్రేటా థన్‌బెర్గ్‌ను ముగ్గురు పోలీసులు తీసుకువెళుతుంటే ఆమె నవ్వుతూ ఉన్న వీడియో బయటకు వచ్చింది.

ఫొటో సోర్స్, Reuters
ఇక్కడ బొగ్గును కాలిస్తే, గ్రీన్‌హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి జర్మనీ చేస్తున్న ప్రయత్నాలు కుంటుపడతాయని కార్యకర్తలు చెబుతున్నారు.
2030 నాటికి నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియాలో బొగ్గు గనులను దశలవారీగా నిలిపివేయాలని, 2038 నాటికి దేశవ్యాప్తంగా బొగ్గు వినియోగాన్ని నిలిపివేయాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది.
బొగ్గుకు అత్యంత మురికి రూపం లిగ్నైట్. లూట్జెరాత్ చుట్టుపక్కల ప్రాంతంలో ప్రతి సంవత్సరం 25 మిలియన్ టన్నులు లిగ్నైట్ ఉత్పత్తి అవుతుంది.
ఆ ఊరు నిర్జనంగా మారిన తరువాత, దాని యాజమాన్యం హక్కులు ఆర్ఈడబ్ల్యూ సంస్థకు వెళ్లాయి. ఈ చలి కాలంలో అక్కడ దొరికే బొగ్గు చాలా అవసరమని కంపెనీ చెబుతోంది.
రష్యా నుంచి గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో జర్మనీలో ఇంధన డిమాండ్‌కు తగ్గట్టుగా బొగ్గు గనిని విస్తరించాల్సిన అవసరం ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
వారాంతంలో నిరసనకారులు అందరినీ ఆ గ్రామం నుంచి తొలగించినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం గ్రేటా థన్‌బర్గ్ సహా ఇతర కార్యకర్తలను పోలీసులు తీసుకెళుతున్న దృశ్యాల వీడియోలు బయటికొచ్చాయి.
జల్లికట్టు, కోడి పందేలు తరహాలో కుక్కల కొట్లాటలు... జంతువులతో ఇలా ఎన్ని రకాల పోటీలు జరుగుతున్నాయో మీకు తెలుసా?
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభ నేడే.. ఖమ్మంలో ముహూర్తం

ఫొటో సోర్స్, @BRS party
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు స్థాపించిన జాతీయ పార్టీ 'భారత రాష్ట్ర సమితి' (BRS) ఆవిర్భావ సభ నేడు ఖమ్మంలో జరగనుంది.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, దిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
వీరితో పాటు పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు తరలివస్తున్నారు.

ఫొటో సోర్స్, @BRS party
విజయన్, కేజ్రీవాల్, అఖిలేశ్ యావద్ తదితరులు ఇప్పటికే ఖమ్మం చేరుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది.
ఆవిర్భావ సభలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాలు, వ్యూహాలను వెల్లడించవచ్చు.
ఈ సందర్భంగా, రైతులకు పెద్దపీట వేస్తూ, అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని ఇస్తున్నారు.
ఈ సభ కోసం ఖమ్మంలో భారీ ఏర్పాట్లు చేశారు.

ఆవిర్భావ సభ సందర్భంగా రైతులకు పెద్దపీట వేస్తూ, అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అనే నినాదాన్ని ఇస్తున్నారు.
తొలుత కేసీఆర్ హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్లి, అక్కడి నుంచి ఖమ్మం చేరుకోనున్నారు.
ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవం కూడా నేడే.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్డేట్ల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి
