కుప్పం పర్యటన: రోడ్డు మీద కూర్చొని చంద్రబాబు నాయుడు నిరసన
ఆయన ప్రచారవాహనాన్ని పోలీసులు ఇవ్వలేదంటూ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు గుడుపల్లిలో రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేశారు.
లైవ్ కవరేజీ
చైనాతో సవాళ్లు: సరిహద్దుల్లో భారత్ ఎలా బలపడుతోంది?
కామారెడ్డి కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు యత్నించిన బండి సంజయ్ అరెస్ట్

ఫొటో సోర్స్, bbc
కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న రైతు రాములు కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత బీజేపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
పార్టీ కార్యకర్తలు, కొంత మంది రైతులు ఆయన వెంట ఉన్నారు.
కలెక్టర్‌ను కలిసేందుకు బండి సంజయ్ కలెక్టరేట్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు,పోలీసులకు మద్య తోపులాట జరిగింది.
కొంత మంది కార్యకర్తలు ప్రధాన గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా బండి సంజయ్‌తో పాటు పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు.
కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ అంశంలో రైతులకు న్యాయం జరిగేలా వరకు బీజేపి పోరాటం కొనసాగుతుందని బండి సంజయ్ అన్నారు.
మాస్టర్ ప్లాన్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
జెరూసలేం: అల్-అక్సా... మందిరం ఒక్కటే... ముస్లింలు, యూదులకు పవిత్ర స్థలం ఎలా అయింది
మాఫియా డాన్ 'ది మౌస్'ను ఎలా అరెస్ట్ చేశారు... ఆ ప్రయత్నంలో 29 మంది ఎందుకు బలయ్యారు?
మనిషి మృతదేహాన్ని ఎరువుగా ఎలా మారుస్తారు... కూరగాయలు ఎలా పండిస్తారు
చంద్రబాబు నాయుడు రోడ్డు మీద కూర్చొని నిరసన

ఫొటో సోర్స్, Telugu Desam Party (TDP) /Facebook
చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన మూడో రోజు సాగుతోంది.
ఆయన ప్రచారవాహనాన్ని పోలీసులు ఇవ్వలేదంటూ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) అధినేత చంద్రబాబు నాయుడు గుడుపల్లిలో రోడ్డు మీద కూర్చొని నిరసన తెలియజేశారు.
ఆ తరువాత అక్కడే ఒక వాహనం పెట్టుకుని దాని మీదకు ఎక్కి ప్రసంగించారు.
‘వైసీపీ షోలకు పర్మిషన్ ఇచ్చి నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారనీ’ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

లష్కరే తోయిబాతో సంబంధాలున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్'ను తీవ్రవాద సంస్థగా ప్రకటన

ఫొటో సోర్స్, zabelin
ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం భారత హోం మంత్రిత్వ శాఖ గురువారం 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' సంస్థను తీవ్రవాద సంస్థగా ప్రకటించింది.ఈ సంస్థను ఉగ్ర సంస్థ లష్కరే తోయిబాకు మారుపేరుగా పిలుస్తున్నారు.
మంత్రిత్వ శాఖ చేసిన ప్రకటన ప్రకారం,తీవ్రవాద కార్యకలాపాల కోసంఆన్‌లైన్ మార్గాల ద్వారా ఈ సంస్థ యువకులను రిక్రూట్ చేస్తోంది.
అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి జమ్మూకశ్మీర్‌కు ఉగ్ర వాదుల చొరబాటు, ఆయుధాల సరఫరా, డ్రగ్స్ స్మగ్లింగ్ వంటి వాటిలో కూడా పాల్గొంటుంది.
'ది రెసిస్టెన్స్ ఫోర్స్' సంస్థ 2019లో ఏర్పడిందని, ఇది నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన సంస్థ అని వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
26/11 ముంబై దాడులతో సహా పలు ఉగ్ర దాడుల్లో లష్కరే తోయిబా ప్రమేయం ఉన్నట్లు తేలింది.
అర్షదీప్ వేసిన 5 నోబాల్స్‌పై భారత మాజీ క్రికెటర్ ఏమన్నారంటే

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంకతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో భారత్ ఓటమికి అర్ష్‌దీప్ వేసిన 5 నోబాల్స్‌ను కూడా కారణంగా చూపిస్తున్నారు.
భారత మాజీ క్రికెటర్ సాబా కరీమ్, న్యూస్ చానెల్ ‘ఇండియా న్యూస్’తో మాట్లాడుతూ, మ్యాచ్‌లో భారత బౌలింగ్ తీరుపై, క్రమశిక్షణా లేమిపై ప్రశ్నించారు.
‘‘భారత బౌలింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. చివరి మూడు ఓవర్లలో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. చివరి ఓవర్‌లో శివం మావి 20 పరుగులు ఇచ్చాడు. దీనిపై చర్చ జరగాలి. కానీ అతిపెద్ద పొరపాటు ఏంటంటే నోబాల్స్ ఎక్కువగా వేయడం.
టి20 క్రికెట్‌లో బౌలర్లు నోబాల్ వేయడానికి మించిన పెద్ద తప్పు మరొకటి ఉండదు. భారత్ ఈ తప్పే చేసింది. నోబాల్ వేస్తే ఫ్రీహిట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఫ్రీహిట్‌ల కారణంగా భారత్ అదనంగా 20-25 పరుగులు సమర్పించుకుంది. బౌలింగ్‌లో క్రమశిక్షణ లేమి కనిపించింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Santosh Kumar/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, భారత మాజీ క్రికెటర్ సాబా కరీం పుణె వేదికగా గురువారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 16 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఓడిపోయింది.
మొదట శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసింది.
కెప్టెన్ దసున్ షనక (56; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), కుశాల్ మెండిస్ (52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీలు చేశారు.
భారత బౌలర్లలో ఉమ్రాన్ మలిక్ 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం 21 పరుగులకే టాపార్డర్‌ను కోల్పోయిన భారత్ ఛేదనలో పోరాడింది.
సూర్యకుమార్ యాదవ్ (36 బంతుల్లో 51; 3 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు చివర్లో అక్షర్ పటేల్ (31 బంతుల్లో 65; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ధాటిగా ఆడినప్పటికీ భారత్ గెలుపును అందుకోలేకపోయింది.
దీంతో సిరీస్ 1-1తో సమంగా నిలిచింది.
విశాఖ గీతం మెడికల్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

విశాఖలోని గీతం మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
ప్రస్తుతం కాలేజీ ప్రహారీ గోడల వెంట జేసీబీలను ఏర్పాటు చేశారు.
గీతం కాలేజీ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో కాలేజీ మైదానాన్ని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు.
దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని గీతం యాజమాన్యం చెబుతోంది.
సుమారు 35 ఎకరాలు మేర ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయంటూ గతంలో అర్‌డీవో ఆధ్వర్యంలో గీతం కాలేజీలో నిర్మాణాలను తొలగింపు తొలిగించారు.
దీనిపై గీతం యాజమాన్యం, కోర్టును ఆశ్రయించింది.
ఇప్పుడు అదే ఆక్రమిత స్థలంలో ఫెన్సింగ్ వేసేందుకు అధికారులు సిద్ధమైనట్లు సమాచారం
గుడ్ మార్నింగ్
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.
