ఓ యువతి హత్య కేసులో ఇతడిని జైలుకు పంపారు.. ఏడేళ్ల తర్వాత ఆ యువతి ప్రత్యక్షమైంది

ఒక అమాయకుడిని ఏడేళ్ల పాటు అన్యాయంగా జైలులో పెట్టారంటూ బాధితుడి తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. రిషభ్ పంత్ తల్లితో మాట్లాడిన ప్రధాని మోదీ.. క్రికెటర్ ఆరోగ్యంపై ఆరా

    రిషభ్ పంత్, నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, ANI

    ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం నాడు క్రికెటర్ రిషభ్ పంత్ తల్లితో మాట్లాడారని, కారు ప్రమాదంలో గాయపడ్డ పంత్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనంలో తెలిపింది.

    దిల్లీ నుంచి రూర్కీ తిరిగి వెళుతున్న రిషభ్ పంత్ కారు హమ్మద్‌పూర్ ఝాల్ వద్ద డివైడర్‌ను ఢీకొనటంతో ఆయన గాయపడ్డారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆయనకు నుదుటి మీద రెండు గాయాలు, కుడి మోకాలిలో లిగమెంట్ గాయం, కుడి ముంజేతికి, కుడి మడమకు, బొటనవేలికి గాయాలయ్యాయని, ఆయన వీపు మీద కూడా స్వల్ప గాయాలయ్యాయని బోర్డ్ ఆఫ్ కంటరోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఒక ప్రకటనలో తెలిపింది.

    రిషభ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఇప్పుడు ఆయనను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి మార్చటం జరిగిందని మీడియాకు విడుదల చేసిన ఆ ప్రకటనలో వివరించింది. ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా గాయాల తీవ్రతను నిర్ధారించి, తదుపరి చికిత్సను నిర్ణయించటం జరుగుతుందని చెప్పింది.

  3. నరేంద్ర మోదీ: 'మా అమ్మ ఇళ్ళల్లో పని చేసి నన్ను ఇంత వాడ్ని చేసింది'

  4. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచిన కేంద్ర ప్రభుత్వం

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది.

    ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

    ప్రభుత్వ ప్రకటన ప్రకారం.. పొదుపు ఖాతాలు (సేవింగ్స్ అకౌంట్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు వడ్డీ రేట్లలో మార్పులేమీ లేవు.

    అయితే ఏడాది కాల పరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు ప్రస్తుతమున్న 5.5 శాతం వడ్డీకి బదులుగా 6.6 శాతం వడ్డీ లభిస్తుంది.

    రెండేళ్ల కాల పరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు ప్రస్తుతమున్న 5.7 శాతం వడ్డీకి బదులుగా 6.8 శాతం వడ్డీ లభిస్తుంది.

    అలాగే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ పథకం కింద 7.6 శాతం వడ్డీకి బదులుగా 8 శాతం వడ్డీ లభిస్తుంది.

  5. ఓ యువతి హత్య కేసులో ఇతడిని జైలుకు పంపారు.. ఏడేళ్ల తర్వాత ఆ యువతి ప్రత్యక్షమైంది, సుచిత్ర మొహంతి, బీబీసీ కోసం

    విష్ణు

    ఫొటో సోర్స్, Office of NHRC

    ఫొటో క్యాప్షన్, విష్ణు

    ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, హత్య చేశాడనే ఆరోపణలపై ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ బాలిక బతికే ఉందని ఏడేళ్ల తర్వాత తెలిసింది. దీంతో ఒక అమాయకుడిని ఏడేళ్ల పాటు అన్యాయంగా జైలులో పెట్టారంటూ బాధితుడి తల్లిదండ్రులు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు.

    ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఉదంతంపై దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘం రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. ఈ కేసు పూర్వాపరాలివీ...

    ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 2015 ఫిబ్రవరిలో 17 ఏళ్ల మైనర్ బాలిక గుడికి వెళ్లి తిరిగి రాలేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజుల తర్వాత ఒక బాలిక మృతదేహం కనిపించింది. అది అదృశ్యమైన తమ కూతురిదేనని బాలిక తల్లిదండ్రులు గుర్తుపట్టారు.

    హాథ్రస్ జిల్లా ధంతౌలి గ్రామ నివాసి అయిన విష్ణు అనే వ్యక్తి అపహరించుకుపోయి, హత్య చేశాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు అతడిని ఐపీసీ 302, 201 సెక్షన్ల కింద అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

    అయితే.. విష్ణు హత్య చేసినట్లుగా చెప్తున్న బాలిక హాథ్రస్ జిల్లాలోనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవిస్తున్నట్లు, వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు డిసెంబర్ మొదటి వారంలో విష్ణు తల్లిదండ్రులకు తెలిసిందని ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, సుప్రీంకోర్టు న్యాయవాది రాధాకాంత త్రిపాఠి బీబీసీకి చెప్పారు.

    విష్ణు తల్లిదండ్రులు పోలీసులకు విషయం తెలియజేయటంతో పోలీసులు ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించారు. నాడు హత్యకు గురైనట్లు భావించిన బాలిక నిజానికి తన ప్రియుడితో వెళ్లిపోయి పెళ్లిచేసుకున్నట్లు గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

    అయితే, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఒక అమాయకుడు ఏడేళ్ల పాటు జైలులో మగ్గిపోవాల్సి వచ్చిందని ఆరోపిస్తూ న్యాయవాది రాధాకాంత త్రిపాఠి మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

    ‘‘అతడి ఏడేళ్ల కాలాన్ని ఎవరు తిరిగి ఇవ్వగలరు? ఎవరూ ఇవ్వలేరు. కాబట్టి అతడు అనుభవించిన కష్టాలకు తగినంత పరిహారం చెల్లించాలి’’ అని త్రిపాఠి బీబీసీతో మాట్లాడుతూ పేర్కొన్నారు.

    త్రిపాఠి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన మానవ హక్కుల కమిషన్ ఈ మొత్తం ఉదంతంపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని యూపీ డీజీపీకి నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  6. అమెరికా మహిళల క్రికెట్ జట్టులో సగం మంది తెలుగు అమ్మాయిలే...

  7. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  8. వాటికన్: కాథలిక్ చర్చి మాజీ పోప్ బెనెడిక్ట్ ఆరోగ్యం విషమం

    పోప్ ఫ్రాన్సిస్

    ఫొటో సోర్స్, VATICAN POOL

    ఫొటో క్యాప్షన్, ఆగస్టులో పోప్ ఫ్రాన్సిస్, బెనెడిక్ట్‌లు కలిశారు. బెనెడిక్ట్‌కు చెందిన తాజా ఫొటో ఇదేనని నమ్ముతారు

    మాజీ పోప్ బెనెడిక్ట్ XVI చాలా అనారోగ్యంతో ఉన్నారని, ఆయన కోసం ప్రార్థన చేయాలని వాటికన్‌లోని యాత్రికులను పోప్ ఫ్రాన్సిస్ కోరారు.

    వయస్సును కారణంగా చూపిస్తూ 2013లో కాథలిక్ చర్చి పోప్ బాధ్యతల నుంచి బెనెడిక్ట్ (95) తప్పుకున్నారు. గత 600 ఏళ్లలో ఇలా చేసిన మొదటి వ్యక్తి బెనెడిక్ట్.

    పోప్ ఈ ఏడాది చివరి సందేశాన్ని వెలువరిస్తూ "పోప్ ఎమెరిటస్ బెనెడిక్ట్ కోసం ప్రత్యేక ప్రార్థన చేయండి" అని ప్రజలను కోరారు.

    బెనెడిక్ట్ ఎక్కువగా మాట్లాడకపోయినా మనం మాట్లాడేది వింటున్నారని పోప్ ఫ్రాన్సిస్ స్పష్టంచేశారు.

    కొన్ని గంటల వ్యవధిలోనే మాజీ పోప్ ఆరోగ్యం దిగజారిందని వాటికన్ తెలిపింది.

    గతంలో కాథలిక్ చర్చి లీడర్ మరణిస్తే కఠినమైన ప్రోటోకాల్‌లను పాటించారు.

    అయితే మాజీ-పోప్ బెనెడిక్ట్ ఆరోగ్యం క్షీణించినందున అదే ప్రోటోకాల్‌లు ‘ఎమెరిటస్’ అని పిలువబడే రిటైర్డ్ పోప్‌కు వర్తిస్తాయా అనేదానిపై స్పష్టత లేదు.

    పదేళ్ల నుంచి వాటికన్‌లోనే ఇద్దరు పోప్‌లు నివసిస్తున్నారు.

    బెనెడిక్ట్ వాటికన్ గార్డెన్స్‌లో మేటర్ ఎక్లేసియా ఆశ్రమంలో ఉంటున్నారు. వారసుడితో కలిసి ఆయన అప్పుడప్పుడు కనిపించారు.

  9. 2022లో మరిచిపోలేని 5 అత్యంత దారుణ హత్యలు ఇవే...

  10. ఆంగ్ సాన్ సూకీకి మరో ఏడేళ్ల జైలు శిక్ష, ఫ్రాన్సెస్ మావో, బీబీసీ న్యూస్

    మయ‌న్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ

    ఫొటో సోర్స్, REUTERS

    మయ‌న్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి సైనిక కోర్టు మ‌రో ఏడేళ్ల జైలుశిక్షను విధించింది. దీంతో ఆమెకు వివిధ కేసుల్లో ప‌డిన జైలుశిక్ష మొత్తం 33 ఏళ్ల‌కు చేరుకున్న‌ది.

    2021 ఫిబ్ర‌వ‌రిలో సైన్యం తిరుగుబాటు చేసి ప్ర‌భుత్వాన్ని హస్తగతం చేసుకుంది. అప్ప‌టి నుంచి ఆంగ్ సాన్ సూకీ హౌజ్ అరెస్టులో ఉన్నారు. అప్పటి నుంచి ఆమె మొత్తం 19 అభియోగాల‌పై 18 నెల‌ల పాటు విచార‌ణ‌ను ఎదుర్కొన్నారు.

    సూకీని విడుదల చేయాలని గత వారంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కోరింది.

    సూకీపై ఉన్న చివ‌రి అయిదు కేసుల్లో శుక్ర‌వారం విచార‌ణ జ‌రిగింది. ఆమె అవినీతికి పాల్ప‌డిన‌ట్లు నిర్ధారించిన కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. హెలికాప్ట‌ర్‌ను ఓ మంత్రికి రెంట్ ఇచ్చిన విష‌యంలో ఆమె నియ‌మావ‌ళిని ఉల్లంఘించిన‌ట్లు తెలిసింది.

    గ‌తంలో 14 కేసుల్లో ఆమెను విచారించారు. కోవిడ్ నియ‌మావ‌ళిని ఉల్లంఘించ‌డంతో పాటు వాకీ టాకీల‌ను దిగుమ‌తి చేయ‌డం, అధికారిక ర‌హ‌స్య చ‌ట్టాన్ని ఉల్లంఘించిన అంశంలోనూ ఆమెను విచారించారు.

  11. పీలే భారత్‌లో ఆడిన ఫుట్‌బాల్ మ్యాచ్ ఎందుకు వివాదంగా మారింది?

  12. సీజేఐ చంద్రచూడ్: ‘‘కేసుల సత్వర పరిష్కారానికి టెక్నాలజీని ఉపయోగించాలి’’, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్

    కేసుల విచారణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. మంగళగిరి మండలం కాజలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ జ్యుడీషియల్ అకాడమీని ఆయన ప్రారంభించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు.

    ఏపీ హైకోర్టు మొదటి వార్షిక నివేదికను విడుదల చేశారు. హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్టు కూడా ప్రారంభించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం పెరిగిందన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకునేలా డిజిటలైజేషన్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టామని తెలిపారు. సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. కేసుల సత్వర పరిష్కారానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని సీజేఐ చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు.

    హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సహా హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు.

  13. 2022లో ప్రపంచంలో ఏం జరిగింది?

  14. అప్పట్లో కపిల్ దేవ్‌కు బైక్ యాక్సిడెంట్, ఇప్పుడు రిషబ్ పంత్‌కు కారు ప్రమాదం - కీలక ఆటగాళ్లు సొంతంగా డ్రైవ్ చేయొద్దని సీనియర్లు ఎందుకు చెప్తున్నారు

  15. మోదీ ప్రధాని అవుతారని హీరాబెన్ 2002లోనే చెప్పారా?

  16. సీఎం జగన్‌కు మరో లేఖ రాసిన ముద్రగడ

    ముద్రగడ పద్మనాభం

    ఎవరి ప్రమేయం లేకుండా దళితులు వారి పదవులకు వారే ఓటు వేసుకునే విధానంలో ఆలోచన చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ ద్వారా సూచించారు.

    ముద్రగడ శుక్రవారం సీఎంకు లేఖ రాశారు. ఈ లేఖలో దళితులు సమస్యలకు సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించారు.

    నాలుగు రోజుల వ్యవధిలో సీఎం జగన్‌కు ముద్రగడ పద్మనాభం రెండు లేఖలు రాశారు.

    ఈ నెల 26న కాపు రిజర్వేషన్ల అమలు, ఈడబ్ల్యూఎస్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

  17. హీరాబెన్ మోదీ అంత్యక్రియలు పూర్తి

    మోదీ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, అంత్యక్రియల కోసం తల్లిని తరలిస్తున్న వాహనంలో విషణ్ణ వదనంతో మోదీ

    భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు గాంధీనగర్‌లో జరిగాయి.

    వృద్ధాప్యం కారణంగా శుక్రవారం ఉదయం హీరాబెన్ మోదీ మరణించారు.

    దీంతో ప్రధాని మోదీ గాంధీనగర్ చేరుకున్నారు. అక్కడి నివాసంలో తన తల్లికి నివాళులు అర్పించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అంతిమ యాత్రలో తల్లి పాడెను మోదీ తన భుజాలపై మోశారు. అనంతరం అంత్యక్రియల కోసం ఆమె భౌతిక కాయాన్ని స్మశాన వాటికకు తరలించారు.

    ఈ సమయంలో తల్లి మృతదేహం ఉన్న వాహనంలోనే మోదీ ప్రయాణించారు.

    తర్వాత అంత్యక్రియల్లో భాగంగా దహన సంస్కారాలు నిర్వహించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  18. బ్రేకింగ్ న్యూస్, క్రికెటర్ రిషబ్ పంత్‌కు కారు ప్రమాదం, తీవ్ర గాయాలు

    ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ కారు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ప్రమాదానికి గురైన రిషబ్ పంత్ కారు

    భారత క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారని వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సరిహద్దులో దిల్లీ-డెహ్రాడూన్ రహదారిపై రిషబ్ పంత్ కారు డివైడర్‌ను ఢీకొన్నట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.

    ఈ ఘటనలో మంటలు చెలరేగడంతో కారు కాలిపోయింది.

    శుక్రవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌కు గాయాలు అయినట్లు పీటీఐ తెలిపింది.

    రిషబ్ పంత్

    ఫొటో సోర్స్, ANI

    ఈ ప్రమాదం గురించి స్థానిక పోలీసు అధికారి స్వప్న్ ప్రకాశ్ మాట్లాడారు.

    ‘‘రిషబ్ పంత్ కారు హరిద్వార్ జిల్లాలోని మంగలైర్, నర్సన్ మధ్య ప్రమాదానికి గురైంది.

    తొలుత రూర్కీలోని సివిల్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత రిషబ్ పంత్‌ను డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు.

    మంగళూరు పీఎస్ ఏరియాలోని 58వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది’’ అని కిశోర్ ఘటనా వివరాలను వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. ఇజ్రాయెల్ ప్రధానిగా మళ్లీ బెంజమిన్ నెతన్యాహు

    ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్

    ఫొటో సోర్స్, Twitter/israelipm

    ఇజ్రాయెల్‌కు మరోసారి ప్రధానమంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహును రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అభినందించారు.

    నెతన్యాహు గత రెండేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నారు.

    తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఇజ్రాయెల్‌కు ఆరుసార్లు ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

    బెంజమిన్ సాధించిన ఈ ఘనత పట్ల అభినందనలు తెలుపుతూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సందేశం పంపారు.

    ‘‘మీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం రష్యా, ఇజ్రాయెల్ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి మధ్యప్రాచ్యంలో శాంతి భద్రతలను, ఇరుదేశాల ప్రజల ప్రయోజనాలను కొనసాగించే లక్ష్యంతో పనిచేస్తుందని నేను నమ్ముతున్నా’’ అని పుతిన్ అన్నారు.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై ఇజ్రాయెల్ తటస్థ వైఖరిని అవలంబించింది.

    యుక్రెయిన్ ప్రధాని వొలొదిమీర్ జెలియన్‌స్కీ కూడా నెతన్యాహుకు అభినందనలు తెలిపారు.

  20. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.