You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మీద శివమొగ్గ పోలీసులకు ఫిర్యాదు
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ తెహసీన్ పూనావాలా అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లైవ్ కవరేజీ
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మీద శివమొగ్గ పోలీసులకు ఫిర్యాదు
బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు అందింది.
ప్రజ్ఞా ఠాకూర్ శివమొగ్గలో జరిగిన హిందూ జాగరణ వేదిక దక్షిణ ప్రాంతీయ వార్షిక సదస్సులో ప్రసంగిస్తూ.. మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెహసీన్ పూనావాలా అనే వ్యక్తి శివమొగ్గ ఎస్‌పీ మిథున్ కుమార్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుకు సంబంధించి కేసు నమోదు చేయటానికి బుధవారం నాడు ఆధారాలతో తమ ముందు హాజరు కావాలని శివమొగ్గ పోలీసులు తెహసీన్ పూనావాలాకు నోటీసు పంపించారు.
బీజేపీ ఎంపీ తన ప్రసంగంలో ‘‘లవ్ జిహాద్ చేసే వాళ్లకు లవ్ జిహాద్ వంటి జవాబు ఇవ్వండి. మీ ఆడపిల్లలని సురక్షితంగా ఉంచండి. మీ ఆడపిల్లలకి సంస్కారం నేర్పండి. మీ ఇళ్లలో ఆయుధాలు ఉంచుకోండి. ఏమీ లేకపోతే కూరగాయలు కోసే కత్తికి కాస్త పదును పెట్టండి. స్పష్టంగా చెప్తున్నాను.. మన ఇళ్లలో కూడా కూరగాయలు కోసే చాకు పదునుగా ఉండాలి. ... పరిస్థితి ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. ప్రతి ఒక్కరికీ తమను రక్షించుకునే హక్కు ఉంది. ఎవరైనా మన ఇంట్లోకి ప్రవేశించి దాడి చేస్తే, దానికి బదులిచ్చే హక్కు మనకుంది’’ అని పేర్కొన్నారు.
ఈ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యింది. దీనిపై పూనావాలా ఇచ్చిన ఫిర్యాదులో.. మత ప్రాతిపదికన వేర్వేరు బృందాల మధ్య శత్రుత్వాన్ని రెచ్చగొడుతున్నారనే నేరంతో పాటు భారత శిక్షా స్మృతిలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు.
ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయటానికి ఫిర్యాదుదారు ఆధారాలతో పోలీసుల ముందు హాజరు కావాలని తాము సూచించినట్లు శివమొగ్గ పోలీసులు బీబీసీకి తెలిపారు.
అస్సాంలో చిరుతపులి దాడి.. 13 మందికి గాయాలు
సిక్కుల్లో కుల వ్యవస్థను గురు గోబింద్ సింగ్ ఎలా రద్దు చేశారు?
ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు.. మీరు డౌన్‌లోడ్ చేసుకున్నారా? లేదా?
రాహుల్ గాంధీ: గడ్డకట్టించే దిల్లీ వాతావరణంలో ఆయనకు ఎందుకు చలిగా లేదు? ‘టీ-షర్ట్’తో ఎలా తిరుగుతున్నారు?
ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీకి కారు ప్రమాదంలో గాయాలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ.. ఓ కారు ప్రమాదంలో గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం కర్ణాటకలోని మైసూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక కథనం ప్రకారం.. ప్రహ్లాద్ మోదీ తన కుడుకు, కోడలు, మనుమడితో కలిసి ఒక ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్నారు. బండిపురా వెళుతున్న వారి కారు మైసూరుకు 13 కిలోమీటర్ల దూరంలో రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది.
కారు డ్రైవర్ సహా ప్రహ్లాద్ మోదీ కుటుంబ సభ్యులందరినీ మైసూరులోని జేఎస్ ఆస్పత్రికి తరలించారు. ప్రహ్లాద్ మోదీ మనువడి తలకు స్వల్ప గాయాలయ్యాయి. అతడు బాగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
ప్రమాదం జరిగిన వాహనానికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టయిన వీడియోల్లో.. ఆ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది.
తైవాన్: ‘దేశంలోని పురుషులందరూ తప్పనిసరిగా ఏడాది పాటు సైన్యంలో పని చేయాలి’
ప్రస్తుతం తప్పనిసరిగా సైన్యంలో నాలుగు నెలలు పనిచేయాలనే నిబంధన తైవాన్‌లో అమలులో ఉంది. అయితే, చైనా నుంచి పెరుగుతున్న సైనిక ఒత్తిడి కారణంగా ప్రస్తుతం అమల్లో ఉన్న ‘తప్పనిసరి మిలిటరీ సర్వీస్’ కాలపరిమితి సరిపోదని ఆమె అన్నారు. దీన్ని 4 నెలల నుంచి ఏడాది కాలానికి పొడిగించారు.
వార్తా సంస్థ ఏఎఫ్‌పీ ప్రకారం ఉన్నత స్థాయి ప్రభుత్వ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో అధ్యక్షురాలు సాయ్ ఇంగ్-వెన్ మాట్లాడుతూ చైనా నుంచి తైవాన్‌కు బెదిరింపులు పెరుగుతున్నాయని అన్నారు.
‘‘యుద్ధాన్ని ఎవరూ కోరుకోరు. కానీ నా దేశ ప్రజలారా, శాంతి అనేది ఆకాశం నుంచి ఊడిపడదు. శరవేగంగా మారుతున్న పరిస్థితుల్లో నాలుగు నెలల మిలటరీ సర్వీసు సరిపోదు. అందుకే ఒక సంవత్సరం తప్పనిసరి సర్వీసును మళ్లీ ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నాం’’ అని ఆమె చెప్పారు.
ఈ కొత్త నిబంధన జనవరి 1, 2005 తర్వాత పుట్టిన పురుషులందరికీ వర్తిస్తుంది.
కౌన్ బనేగా కరోడ్‌పతిలో రూ. 50 లక్షలు గెలిచిన 8వ తరగతి అమ్మాయి
ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజినికి హై కోర్టు నోటీసులు
ఎన్టీఆర్ జిల్లా మొరకపూడిలో గ్రానైట్ తవ్వకాలకు ఎన్‌వోసీ జారీ చేసిన కేసులో ఆంధ్రప్రదేశ్ మంత్రి విడదల రజినీకి ఎపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదే వ్యవహారంలో కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి మామ ప్రతాప్‌రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసింది హై కోర్టు.
ఎన్టీఆర్ జిల్లా మొరకపూడిలో 91 ఎకరాల అసైన్డ్ భూమిలో తవ్వకాలకు అనుమతించడంలో మంత్రి రజిని హస్తం ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ విడదల రజినితో పాటు స్థానిక తహశీల్దార్‌కు నోటీసులు జారీ చేసింది.
తదుపరి విచారణను 3 వారాల పాటు వాయిదా వేసింది.
కర్నాటకలోని ఆ గ్రామాల కోసం సుప్రీం కోర్టులో పోరాడతామంటూ మహారాష్ట్ర అసెంబ్లీ తీర్మానం
మహారాష్ట్ర-కర్నాటక సరిహద్దు వివాదంలో మరొక మలుపు చోటు చేసుకుంది.
వివాదంగా ఉన్న 865 గ్రామాలను మహారాష్ట్రంలో కలపడానికి సుప్రీం కోర్టులో పోరాడతామని మహారాష్ట్ర అసెంబ్లీ నేడు తీర్మానం చేసింది.
కర్నాటక అనుసరిస్తున్న ‘మహారాష్ట్ర వ్యతిరేక’ విధానాలను అసెంబ్లీ ఖండించింది.
ఆ గ్రామాల్లోని ప్రజలను మహారాష్ట్ర ప్రజలుగా గుర్తిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే తెలిపారు.
కర్నాటకలోని బెలగాంలో గల ఎనిమిది వందలకు పైగా గ్రామాల చుట్టూ చాలా కాలంగా వివాదం నెలకొంది.
బెలగాంలోని ఆ గ్రామాల ప్రజలు మరాఠీ మాట్లాడతారు. ఒకప్పుడు బాంబే ప్రెసిడెన్సీలో అవి భాగంగా ఉన్నందున అవన్నీ తమ గ్రామాలే అని మహారాష్ట్ర వాదిస్తోంది.
కానీ తాము ఆ గ్రామాలను ఇవ్వమని కర్నాటక చెబుతోంది.
గుజరాత్: కూతురి వీడియోను ఆన్‌లైన్‌లో పెట్టారని నిలదీసినందుకు సైనికుడిని చంపేశారు
గుజరాత్: బీఎస్‌ఎఫ్ జవాన్‌ను కొట్టి చంపిన వ్యక్తులు
బీఎస్‌ఎఫ్ జవాన్‌ను కొట్టి చంపారనే ఆరోపణలతో ఏడుగురు వ్యక్తులను గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు.
తన టీనేజీ కూతురుకు సంబంధించి ‘అభ్యంతకర’ వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయడంతో మెలాజీ వఘేలా అనే బీఎస్‌ఎఫ్ జవాన్ ఆగ్రహానికి గురయ్యారు.
‘వీడియో అప్‌లోడ్ చేశాడంటూ ఒక టీనేజీ అబ్బాయి ఇంటికి వఘేలా వెళ్లారు. దాంతో అది కాస్త వివాదంగా మారింది.
ఆ టీనేజీ అబ్బాయి కుటుంబ సభ్యులుగా భావిస్తున్న వారు కర్రలతో, మెలాజీ వఘేలా కుటుంబం మీద దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వఘేలా మరణించగా ఆయన కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు’ అని పోలీసులు తెలిపారు.
బాంబే హై కోర్టులో చందా కొచ్చర్‌కు దొరకని ఊరట
వీడియోకాన్ గ్రూప్ లోను కేసులో అరెస్టు అయిన ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌ల పిటిషన్‌ను విచారించేందుకు బాంబే హైకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించింది.
తమ అరెస్టును చాలెంజ్ చేస్తూ కొచ్చర్ దంపతులు పిటిషన్ వేశారు.
ఇప్పుడే దాని మీద విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని, బెయిల్ కోసం రెగ్యులర్ కోర్టును ఆశ్రయించాలని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
కేసు నమోదైన నాలుగేళ్ల తరువాత ఇప్పుడు అరెస్టు చేయడం సెక్షన్ 41-ఎ ప్రకారం న్యాయవిరుద్ధమని కొచ్చర్ దంపతుల న్యాయవాది వాదించారు.
చందా కొచ్చర్ సీఈఓ, ఎండీగా ఉన్నప్పుడు ఐసీఐసీ బ్యాంక్, వీడియోకాన్ గ్రూప్‌కు రూ.3,000 కోట్లు లోను ఇచ్చింది. అయితే ఇందులో అవకతవలకలు జరిగాయనేది ఆరోపణ.
ఒడిశా: హోటల్‌లో చనిపోయిన ఇద్దరు రష్యన్లు... ఒకరు ఆ దేశ ఎంపీ
రష్యాకు చెందిన ఎంపీ పావెల్ ఆంటెవ్(65), ఒడిశాలోని ఒక హోటల్‌లో చనిపోయారు.
ముగ్గురు స్నేహితులతో కలిసి భారతకు వచ్చిన ఆయన, రాయగడలో ఈ నెల 21 నుంచి ఉంటున్నారు.
శనివారం పావెల్ చనిపోయి పడి కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అంతకు రెండు రోజుల ముందు అదే హోటల్‌లో ఉంటున్న ఆయన స్నేహితుడు వ్లాదిమిర్ బిదెనొవ్ చనిపోయారు.
స్నేహితుని మరణంతో కుంగుబాటుకు లోనై పావెల్ ఆంటెవ్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మిగతా ఇద్దరు రష్యా పౌరులను విచారణ కోసం ఇక్కడే కొంత కాలం ఉండమన్నట్లు వెల్లడించారు.
యుక్రెయిన్ మీద రష్యా యుద్ధానికి దిగడాన్ని ఇటీవల విమర్శించారు పావెల్ ఆంటెవ్. ఆ తరువాత ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.
భారత్ బయోటెక్ ముక్కులో వేసుకునే కరోనా వ్యాక్సిన్ ధర రూ.800
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తాను రూపొందించిన నాజల్ కరోనా వ్యాక్సిన్ ‘ఇన్కోవాక్(iNcoVacc) డోసు ధరను రూ.800గా నిర్ణయించింది.
ప్రభుత్వానికి ఒక్కో డోసును రూ.325కు అందించనుంది.
ముక్కులో వేసుకునే ఈ కరోనా వ్యాక్సిన్ ప్రపంచంలోనే మొదటిదని భారత్ బయోటెక్ చెబుతోంది.
18ఏళ్లు దాటిన వారికి ఇన్కోవాక్‌ను బూస్టర్ డోసును ఇవ్వొచ్చని, జనవరి చివరి నుంచి కోవిన్ వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ ఇవ్వొచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపినట్లు ఎన్‌డీటీవీ రిపోర్ట్ చేసింది.
పక్కనే భారీ సోలార్ ప్లాంట్.. కానీ ఈ ఊరిలో చిమ్మ చీకట్లు
గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లా వావ్ తాలూకాలో ఉన్న రాఘనేస్డా గ్రామంలోని ఇళ్లకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం లేదు. ఈ ఊరి జనాభా 1700.
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన గుజరాత్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ గ్రామంలోనే 700 మెగావాట్ల భారీ సోలార్ పవర్ ప్లాంటును ఏర్పాటు చేసింది.
కానీ కరెంటు లేక ఈ ఊరి ప్రజలు చిమ్మచీకట్లలో బతకాల్సి వస్తోంది.
‘సెక్స్ డాల్స్’ దిగుమతి మీద నిషేధం ఎత్తేసిన దక్షిణ కొరియా
‘సెక్స్ డాల్స్’ దిగుమతల మీద ఉన్న నిషేధాన్ని దక్షిణ కొరియా ప్రభుత్వం ఎత్తివేసింది.
అడల్ట్ సైజు బొమ్మలను మాత్రమే దిగుమతి చేసుకునేందుకు అనుమతిస్తూ కస్టమ్స్ విభాగం ఆదేశాలు జారీ చేసింది.
సీరియల్ నటి తునీషా శర్మ ఆత్మహత్యను ‘లవ్ జిహాద్’ అని ఎందుకు అంటున్నారు?