భారత్ X బంగ్లాదేశ్: 227 పరుగుల తేడాతో టీం ఇండియా గెలుపు

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్... ఇషాన్ కిషన్ 210, విరాట్ కోహ్లీ 113 పరుగులు చేయడంతో భారీ స్కోరు(409) చేయగలిగింది. ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టును ముందు నుంచే భారత బౌలర్లు దెబ్బ తీస్తూ వచ్చారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అపేడేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  2. ‘రష్యా నన్ను నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించమంది’

    యాన్ రచిన్‌స్కీ

    తనకు ప్రకటించిన నోబెల్ శాంతి బహుమతిని తిరస్కరించమని రష్యా అధికారులు కోరినట్లు యాన్ రచిన్‌స్కీ తెలిపారు.

    రష్యాలో మానవహక్కుల కోసం పోరాడుతున్న యాన్‌కు ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. యుక్రెయిన్‌ మీద రష్యా దాడిని ఆయన తీవ్రంగా విమర్శించారు.

  3. ఏనుగుపై వచ్చిన పెళ్లికూతురు

  4. హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా?

  5. డి.సురేశ్ బాబు: ఆర్ఆర్ఆర్‌ను తమిళనాడులో రిలీజ్ చేసినప్పుడు... అక్కడి హీరోలు నొచ్చుకున్నారు

    దగ్గుబాటి సురేష్ బాబు

    ఫొటో సోర్స్, FACEBOK/SURESH BABU

    తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ సినిమాల వివాదం మీద నిర్మాత డి.సురేశ్ బాబు స్పందించారు.

    దిల్ రాజు తమిళ్‌లో ‘వరీసు’ అనే సినిమాను నిర్మించారు. విజయ్‌ కథానాయకునిగా నటించిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు.

    ఈ సినిమాను తెలుగులో ‘వారసుడు’గా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. ఎక్కువ థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడం మీద కొందరు అభ్యంతరాలు చెబుతున్నారు.

    డబ్బింగ్ సినిమాలకు థియేటర్లు అన్నీ ఇస్తే తెలుగు సినిమాల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం చాలా కాలంగా నడుస్తోంది.

    నటుడు వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘నారప్ప’ సినిమాను థియేటర్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన డి.సురేశ్ బాబు, డబ్బింగ్ సినిమాల వివాదం మీద స్పందించారు.

    ‘మన పుష్ప, బాహుబలి సినిమాలను ఇతర భాషల్లో రిలీజ్ చేశారు కదా. డబ్బింగ్ సినిమాల సమస్య నిరంతరం ఉండేదే. ఇప్పుడు సినిమాకు సరిహద్దులు లేవు. కేజీఎఫ్, కాంతారా సినిమాలకు ఊహించని రీతిలో స్పందన వచ్చింది.

    ఇలాంటప్పుడు చిన్నచిన్న అడ్డంకులు వస్తాయి.

    జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాను తమిళనాడులోని అన్ని థియేటర్లలో విడుదల చేశారు. అప్పుడు తమిళ హీరోలు కూడా నొచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ అనేది ఏంటో కూడా అంతవరకు తమిళ వాళ్లకు తెలియదు. మరి ఆరోజు మనం మాట్లాడ లేదు కదా?

    అవతార్ సినిమా హీరో ఎవరో మనకు తెలియకపోయినా ఊర్లోని అన్ని థియేటర్లు దానికి ఇచ్చేశాం. ఇది ఇలాగే జరుగుతుంది. దాన్ని మనం అంగీకరించాల్సిందే.

    హీరో ఫ్యాన్స్‌కు, సినిమా ప్రొడ్యూసర్‌కు కొంచెం బాధ ఉంటుంది. నా సినిమాకు మరిన్ని థియేటర్లు వస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇలాంటి సమస్యలకు ఒక కచ్చితమైన పరిష్కారం రావడం కష్టం.

    ఇక్కడ డిస్ట్రిబ్యూటరే ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఆయన(దిల్ రాజు)కు థియేటర్లు ఉన్నాయి కాబట్టి ఎక్కువ తెరల మీద సినిమాను విడుదల చేస్తున్నారు.

    ఇతర భాషల్లో తెలుగు సినిమాను ఎవరూ చిన్న చూపు చూడటం లేదు. ఇతర రాష్ట్రాల్లో బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్ సినిమాలు బాగానే ఆడాయి. ఒకప్పుడు చులకనగా చూసిన కన్నడ సినిమాలను నేడు మనం తెచ్చుకుంటున్నాం.

    చివరకు కంటెంటే ముఖ్యం. ఒకప్పుడు శివ, అరుంధతి సినిమాలు కూడా తమిళనాడులో బాగా ఆడాయి.

    థియేటర్లు దొరకడం లేదనేది పెద్ద సమస్య కాదు. ఇది మెల్లగా సర్దుకుంటుంది’ అని ఆయన అన్నారు.

  6. మన్నెగూడ కిడ్నాప్: సినిమా తరహాలో యువతి అపహరణ, ఏమిటీ కేసు?

  7. ‘రేసు గుర్రం మద్దాలి శివారెడ్డి’ మీద సోషల్ మీడియాలో విమర్శలెందుకు

  8. హోప్ ఐలాండ్: ఏపీలోని ఏకైక సముద్ర దీవిని చూశారా? అక్కడ 118 కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి

  9. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్‌విందర్ సింగ్... రేపు ప్రమాణస్వీకారం

    సుఖ్‌విందర్ సింగ్ సుక్కు

    ఫొటో సోర్స్, ANI

    హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుఖ్‌విందర్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

    రేపు ఆయన ప్రమాణస్వీకారం చేస్తారు.

    ఎమ్మెల్యేలు సుఖ్‌విందర్ సింగ్‌ను తమ నేతగా ఎన్నుకున్నట్లు కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్ల తెలిపారు.

    ముకేశ్ అగ్నిహోత్రి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు.

  10. బ్రేకింగ్ న్యూస్, బంగ్లాదేశ్ మీద భారత్ భారీ తేడాతో గెలుపు

    భారత క్రికెటర్లు

    ఫొటో సోర్స్, Getty Images

    బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 227 పరుగుల తేడాతో గెలిచింది.

    410 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 182 పరుగులకే ఆలవుట్ అయింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 409 పరుగులు చేసింది.

    ఇషాన్ కిషన్ 210, విరాట్ కోహ్లీ 113 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది.

    ఆ తరువాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టును ముందు నుంచే భారత బౌలర్లు దెబ్బ తీస్తూ వచ్చారు. దాంతో 182 పరుగులకే ఆ జట్టు అన్ని వికెట్లు కోల్పోయింది.

    శార్దుల్ ఠాకుర్ 3, అక్షర్ పటేల్ 2, ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్ల చొప్పున తీశారు.

  11. ఇషాన్ కిషన్: ‘అతనొక భయం తెలియని ఆటగాడు’... విరాట్ కోహ్లీ ఈ మాట ఎందుకన్నాడు

  12. గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్

    BhupendraPatel

    ఫొటో సోర్స్, @Bhupendrapbjp

    గుజరాత్ సీఎం కుర్చీలో భూపేంద్ర పటేల్ వరుసగా రెండోసారి కూర్చోనున్నారు.

    ఈ మేరకు అహ్మదాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

    కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అర్జున్ ముండా, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యెడియూరప్పలు పరిశీలకులుగా వెళ్లగా ఎమ్మెల్యేలంతా వారి సమక్షంలో భూపేంద్ర పటేల్‌నే సీఎంగా ఎన్నుకున్నారు.

    పటేల్ మొన్నటి ఎన్నికల్లో ఘట్లోడియా నియోజకవర్గం నుంచి 1.92 లక్షల భారీ మెజారిటీతో గెలిచారు.

    2017లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2021 సెప్టెంబరులో సీఎం పదవి చేపట్టారు.

    అనంతరం తాజా ఎన్నికల్లో ఆయన రెండోసారి గెలిచి.. ఇప్పుడు మరోసారి సీఎం పదవి చేపడుతున్నారు.

  13. బంగ్లాదేశ్ లక్ష్యం 410 పరుగులు

    virat kohli

    ఫొటో సోర్స్, Getty Images

    టీమ్‌ఇండియా వన్డేల్లో మరోసారి 400కిపైగా స్కోరు సాధించింది. బంగ్లాదేశ్‌లో చిట్టగాంగ్‌లో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.

    ఓపెనర్ ఇషాన్ కిషన్ 210 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 113 పరుగులు చేశాడు.

    వీరిద్దరూ అవుటైన తరువాత వాషింగ్టన్ సుందర్ 37, అక్షర్ పటేల్ 20 పరుగులు చేసి జట్టు స్కోరు 400 దాటేలా సహకరించారు.

    బంగ్లాదేశ్‌పై భారత్‌కు వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు. మరోవైపు భారత్ 400 పరుగులు దాటి స్కోర్ చేయడం ఇది ఆరోసారి.

  14. రేబిస్‌ని రాబందులు ఎలా అడ్డుకుంటాయంటే

  15. బ్రేకింగ్ న్యూస్, భారత్ X బంగ్లాదేశ్: విరాట్ కోహ్లీ సెంచరీ

    బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు.

    86 బంతుల్లో 104 పరుగులు తీశాడు. ఇందులో 1 సిక్స్, 11 ఫోర్లు ఉన్నాయి.

    వన్డేలలో విరాట్ కోహ్లీకి ఇది 44వ సెంచరీ. మొత్తం మీద 72 సెంచరీలు పూర్తి చేశాడు.

  16. బ్రేకింగ్ న్యూస్, బంగ్లాదేశ్ మీద ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ

    బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు.

    126 బంతుల్లోనే 200 పరుగులు తీశాడు. 10 సిక్సులు 24 ఫోర్లు కొట్టాడు.

    ఇప్పటి వరకు భారత్ తరపున సచిన్ తెందూల్కర్, విరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ వన్డేలలో డబుల్ సెంచరీలు చేశారు.

    131 బంతుల్లో 210 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో లిట్టన్ దాస్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

  17. బంగ్లాదేశ్‌పై ఇషాన్ కిషన్ సెంచరీ

    క్రికెట్

    ఫొటో సోర్స్, ANI

    బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఇషాన్ కిషన్ ఆతిథ్య జట్టుపై సెంచరీ సాధించాడు.

    నేడు ప్రారంభమైన మూడో వన్డేలో, బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

    ఇషాన్ కిషన్, శిఖర్ ధావన్ కలిసి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే, బంగ్లాదేశ్ బౌలర్ మెహిదీ హసన్ మిరాజ్ అయిదో ఓఫర్‌లో మొదటి బంతికి శిఖర్ ధావన్‌ను ఎల్‌బిడబ్ల్యుగా అవుట్ చేశాడు.

    ఆ తరువాత విరాట్ కోహ్లి క్రీజులోకి వచ్చాడు.

    అప్పటికి ఇషాన్ కిషన్ 11 పరుగులు చేశాడు. భారత్ స్కోరు 15 పరుగుల వద్ద ఉంది. అక్కడి నుంచి ఇషాన్ కిషన్ చాలా జాగ్రత్తగా ఆడాడు.

    13వ ఓవర్‌లో రెండో బంతికి అర్ధసెంచరీ పూర్తి చేసి, 24వ ఓవర్‌లో తొలి బంతికి ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు.

    ఈ మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్ ఇప్పటికే కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు అయిదు పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి 2-0 ఆధిక్యంలో నిలిచింది.

  18. తక్కువ ఖర్చులో బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు, కొత్త టెక్నాలజీని రూపొందించిన స్టార్టప్

  19. హైదరాబాద్‌లో యువతి కిడ్నాప్, అనుచరులతో వచ్చి యువకుడి బీభత్సం

  20. విజయవాడలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు

    BRS

    ఫొటో సోర్స్, ANI

    విజయవాడలో గులాబీరంగులో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు కనిపించాయని ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

    వాటిపై కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు ఉన్నాయి. ఈ కింది వాక్యాలు కనిపిస్తున్నాయి.

    "దేశ రాజకీయాలలో నూతన శకం.. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం కక్ష రాజకీయాలకు స్వస్తి.. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయానికి కొత్త భరోసా"

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది