ధన్యవాదాలు
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.
ఈ వేడుకలను త్రివిధ దళాల అధిపతి హాదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసాంతం తిలకించారు. అనంతరం ఏపీకి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఆ తరువాత ఆమె తిరుపతికి బయలుదేరారు.
ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

ఫొటో సోర్స్, ANI
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆదివారం జరిగిన తొలి వన్డే క్రికెట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 1 వికెట్ తేడాతో భారత జట్టు మీద సంచలన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0 తో ఆధిక్యంలో నిలిచింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 41.2 ఓవర్లలో 186 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు 187 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టింది.
కానీ.. 40 ఓవర్లలో 139 పరుగుల స్కోరులు చేసి 9 వికెట్లు కోల్పోయి బంగ్లాదేశ్ జట్టు కుప్పకూలే దశలో ఉంది. అయితే మెహిది హసన్ మీర్జా, ముస్తాఫిజుర్ రహమాన్‌లు 10వ వికెట్‌కు 51 పరుగుల అతి పెద్ద భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గెలిపించారు.
భారత జట్టు మీద బంగ్లాదేశ్ 7 సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ గెలిచింది. ఇంతకుముందు చివరిసారిగా 2015లో భారత్ మీద ఓడీఐలో బంగ్లా గెలిచింది.

ఫొటో సోర్స్, ANI
షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 186 పరుగులకు ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ కె.ఎల్.రాహుల్ అత్యధికంగా 73 పరుగులు చేశాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ 27 పరుగులు, శ్రేయేష్ అయ్యర్ 24 పరుగులు చేశారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 7 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 9 పరుగులకు ఔటయ్యాడు.
భారత బ్యాట్స్‌మన్‌లో సగం మందిని బంగ్లా బౌలర్ షకీబ్ అల్ హసన్ ఔట్ చేశాడు.
బంగ్లా జట్టు 187 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగగా.. రాహుల్ చాహర్ తొలి బంతికే నజ్మల్ హసన్ సాంటోను పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత బంగ్లా బ్యాట్స్‌మన్ జాగ్రత్తగా ఆడారు. కానీ 128 పరుగుల చేసే సరికి జట్టులో సగం మంది బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత 8 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు పడిపోయాయి.
కానీ చివరి వికెట్‌ను పడగొట్టటానికి భారత బౌలర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. మెహిది హసన్ మీర్జా (38), ముస్తాఫిజుర్ రహమాన్ (10) అజేయంగా 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి బంగ్లాదేశ్‌కు సంచలనం విజయం సాధించారు.

విశాఖలో నేవీ డే 2022 వేడుకలు ఘనంగా ముగిశాయి. భారత రాస్ట్రపతి ద్రౌపది ముర్ము నేవీ డే వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నేవీ డే సందర్భంగా తీరంలో మోహరించిన భారీ యుద్ధ నౌకలు. రెప్పపాటులో దూసుకుపోయే యుద్ధ విమానాలు, సముద్రంలో భారీ పేలుళ్లు వేడుకలు తిలకించడానికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురి చేశాయి.
నింగి, నేల, నీటిపై భారత త్రివిధ దళాలు ఎలా పోరాటం చేస్తాయనే విషయాలను ఈ సందర్భంగా డెమో చేసి చూపించారు. త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలతో ఆర్కే బీచ్ ప్రాంగణం యుద్ధ రంగాన్ని తలపించింది. యుద్ధ విన్యాసాలు ముగిసిన తర్వాత యుద్ధ నౌకలను విద్యుద్దీపాలతో వెలిగించి...ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. వేలాది మంది ప్రజలు హాజరైన ఈ వేడుకలను ఏటా 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ పై భారత సాధించిన విజయానికి గుర్తుగా చేసుకుంటారు. ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి అమర్నాథ్ హాజరయ్యారు. నేవీ సిబ్బంది తమ కుటుంబాలతో ఈ వేడుకలు చూసేందుకు వచ్చారు.




గంటన్నర సాటు సాగిన ఈ వేడుకలను త్రివిధ దళాల అధిపతి హాదాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసాంతం తిలకించారు. అనంతరం ఏపీకి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అందులో కర్నూలులో డీఆర్టీవో నేషన్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ప్రాజెక్ట్, కర్నూలు టౌన్ లోని ఐటీసీ జంక్షన్ నుంచి ఆరులైన్ల స్లిప్ రోడ్స్,నిమ్మలూరులో అడ్వాన్స్డ్ విజన్ ప్రొడెక్ట్ ఫ్యాక్టరీ ఉన్నాయి.
అలాగే ముదిగబ్బ నుంచి పుట్టపర్తి వరకు రహదారి విస్తరణ పనులకు శంఖుస్థాపన చేసిన రాష్ట్రపతి, రాజమండ్రిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ సైన్స్ సెంటర్‌ను ప్రారంభించారు.
నేవీ డే ఉత్సవాలు ముగిసిన తర్వాత ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు శంకర్ మహాదేవన్ ప్రేక్షకులు, అతిథులను అలరిస్తూ రెండు పాటలు పాడారు.
విశాఖ నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుపతికి పయనమయ్యారు. రేపు ఉదయం తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం పద్మావతి కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులతో సమావేశమవుతారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని దిల్లీకి బయలుదేరుతారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఆదివారం సాయంత్రం జరుగుతున్న భారత నౌకాదళ దినోత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు.
అంతకుముందు గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ విశ్వభూషణ్ హరించదన్, ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిలు స్వాగతం పలికారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆ తర్వాత రాష్ట్రపతి గౌరవార్థం రాజ్‌భవన్‌లో విందు ఇచ్చారు. ఆ విందుకు ముఖ్యమంత్రి జగన్ దంపతులు హాజరయ్యారు.
మధ్యాహ్నం 4:30 గంటలకు విశాఖపట్నంలో నేవీడే ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా విశాఖ సాగర తీరంలో నౌకాదళం యుద్ధ విన్యాసానాలు నిర్వహించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2

ఫొటో సోర్స్, ANI
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది.
బంగ్లా బౌలర్ షకీబ్ అల్ హసన్ కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్ చేస్తూ భారత జట్టు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం ఇవ్వలేదు.
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 27 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 7 పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ 9 పరుగులకు ఔటయ్యాడు. శ్రేయేష్ అయ్యర్ 24 పరుగులు చేశాడు.
వికెట్ కీపర్ కె.ఎల్.రాహుల్ అత్యధికంగా 73 పరుగులు చేశాడు.
ఒక సమయంలో 4 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసిన భారత జట్టు.. తర్వాత 34 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది.
బంగ్లాదేశ్ 187 పరుగుల గెలుపు లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించింది. ఇన్నింగ్స్ 24 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది.

ఈ ఏడాది నేవీ డే ఉత్సవాలను విశాఖలో నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ మధ్యాహ్నం 3.45 నిమిషాలకు విశాఖ వస్తున్నారు.
త్రివిధ దళాల అధిపతిగా నేవీ డే ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు పలు ప్రాజెక్టులను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించనున్నారు.
కర్నూలులో డీఆర్డీవో నిర్మించిన నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ప్రాజెక్ట్, నిమ్మలూరులో నిర్మించిన అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రొడక్స్ ఫ్యాక్టరీ, కేంద్ర రోడ్డు రవాణా, ముదిగుబ్బ నుంచి పుట్టపర్తి వరకు రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
కర్నూలు టౌన్‌లోని ఐటీసీ జంక్షన్‌లో ఆరు లైన్ల స్లిప్ రోడ్స్, డోన్ శివారులోని కంబాలపాడు జంక్షన్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో నిర్మించిన సర్వీస్ రోడ్లు, రాజమండ్రిలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, సైన్స్ సెంటర్‌ను రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
నేవీ డే ఉత్సవాలు ముగిసిన తరువాత, రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి తిరుమల వెళ్లనున్నారు.

ఫొటో సోర్స్, Eastern Naval command
నేవీ డే ఉత్సవాల్లో భాగంగా 1971 యుద్ధం సహా పలు కార్యకలాపాల్లో ప్రాణాలు కోల్పోయిన వీరులకు తూర్పు నౌకాదళ కమాండ్ నివాళులు అర్పించింది.
విశాఖపట్నంలోని 'విక్టరీ ఎట్ సీ' వార్ మెమోరియల్ వద్ద వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్‌గుప్తా AVSM, YSM, VSM FOC-in-C ENC పూల మాలలు ఉంచారు.

ఫొటో సోర్స్, Eastern Naval command
ప్రధాని నరేంద్ర మోదీ నేవీ డే సందర్భంగా నేవీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. భారత నౌకాదళం మన దేశానికి రక్షణ కవచంగా నిలిచిందని, సవాళ్లు ఎదురైనప్పుడు మానవతా దృక్పథంతో వ్యవహరించి తన ప్రత్యేకతను చాటుకుందని అన్నారు.

ఫొటో సోర్స్, AP I &PR
కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రపతికి పౌర సన్మానం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రెజిల్‌కు చెందిన లెజెండ్ ఫుట్‌బాల్ ప్లేయర్ పీలే రెండు రోజుల క్రితం ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చేరారు.
సావో పాలోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పీలే తన ఆరోగ్యం మెరుగుపడుతోందని చెబుతూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
"నేను దృఢంగా, ఆశావహంగా ఉన్నాను. వరల్డ్ కప్ చూస్తున్నాను. బ్రెజిల్ వరల్డ్ కప్‌లో ఆడడం చూస్తూంటే శక్తి వస్తోంది" అని పీలే తెలిపారు.
పీలే ఆస్పత్రిలో చేరాక, ఆయన కీమోథెరపీ చికిత్సకు స్పందించట్లేదని, తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని బ్రెజిల్‌లో కథనాలు వచ్చాయి.
"నా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు ప్రశాంతంగా, సానుకూలంగా ఉండాలని కోరుతునాను. నేను దృఢంగా ఉన్నాను. చికిత్స జరుగుతోంది. నాకు చికిత్స అందిస్తున్న వైద్య బృందానికి కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమాభిమానాలే నాకు అండదండలు. వరల్డ్ కప్‌లో బ్రెజిల్ ఆటను చూస్తున్నా. అందరికీ ధన్యవాదాలు" అని పీలే తన ప్రకటనలో తెలిపారు.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.