పాకిస్తాన్‌పై ఒకే రోజు నలుగురు సెంచరీలు

టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజే ఏకంగా 506 పరుగులు చేసింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    ఇక్కడితో నేటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రేపు ఉదయం తాజా వార్తలతో మళ్లీ కలుద్దాం.

  2. PAK vs ENG: పాకిస్తాన్ మీద టెస్ట్ మ్యాచ్ తొలి రోజే 4 సెంచరీలు చేసిన ఇంగ్లండ్.. 506 పరుగులతో సరికొత్త ప్రపంచ రికార్డు

    ఇంగ్లండ్ జట్టు

    ఫొటో సోర్స్, Getty Images

    టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పాకిస్తాన్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజే ఏకంగా 506 పరుగులు చేసింది.

    పాక్, ఇంగ్లండ్ జట్ల మధ్య రావల్పిండిలో గురువారం మొదలైన ఈ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు నలుగురు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ సెంచరీలు చేయటం మరో విశేషం.

    తొలి రోజు ఆట ముగిసే సరికి ఆస్ట్రేలియా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌లో ఇంకా 15 ఓవర్లు మిగిలి ఉండగానే వాతావరణం బాగోలేనందును ఆటను నిలిపివేశారు.

    ఇంగ్లండ్ జట్టు

    ఫొటో సోర్స్, Getty Images

    ఇంతకుముందు ఒకే రోజు అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా పేరు మీద ఉంది. ఆస్ట్రేలియా జట్టు 1910లో దక్షిణాఫ్రికా మీద టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు 6 వికెట్ల నష్టానికి 494 పరుగులు చేసింది.

    ఆ రికార్డును ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు బద్దలు కొట్టింది. ఇన్నింగ్స్ 75వ ఓవర్‌లోనే ఆస్ట్రేలియా రికార్డును ఇంగ్లండ్ జట్టు అధిగమించింది.

    అంతకుముందు ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్లు జాక్ క్రాలీ (122), బెన్ డకెట్‌ (107)లు చెరో సెంచరీతో తొలి వికెట్‌కు 233 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

    వారిద్దరూ ఔటయ్యాక వికెట్ కీపర్ ఒలీ పోప్ (108) కూడా సెంచరీతో చెలరేగాడు. అనంతరం జో రూట్ 23 పరుగులు చేసి అవుటవగా.. హ్యారీ బ్రూక్ (101) శతకం పూర్తి చేసి నాటౌట్‌గా ఉన్నాడు. బెన్ స్టోక్స్ 34 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

  3. అక్కడ మహిళల జీవితం ఇంకా మగవాళ్ల చేతుల్లోనే

  4. గుజరాత్‌లో సాయంత్రం 5 వరకు 56.88 శాతం పోలింగ్

    గుజరాత్‌లో ఓట్లేసిన ట్రాన్స్‌జెండర్లు

    గుజరాత్‌లో తొలి దశ పోలింగ్ ముగిసింది.

    సాయంత్రం 5 గంటల వరకు ఈ రోజు 56.88 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.

    మొదటి విడతలో భాగంగా ఈరోజు గుజరాత్‌లోని 89 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.

    మిగతా 93 స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహిస్తారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. పాకిస్తాన్ బౌలర్ హారిస్ రవూఫ్: కోహ్లీ కాకుండా హార్దిక్, దినేశ్ కార్తీక్ కొడితే బాధపడేవాడిని

  6. అమ్మాయి చనువుగా మాట్లాడిందని లైవ్‌లో ముద్దు పెట్టేస్తారా? ముంబయిలో దక్షిణ కొరియా లైవ్‌స్ట్రీమర్‌ను వేధించిన యువకుల అరెస్ట్

  7. రోడ్డు ప్రమాదంలో నలుగురు విశాఖ వాసులు మృతి

    రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న కారు

    ఫొటో సోర్స్, UGC

    ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు విశాఖపట్నం వాసులు మరణించారు.

    ఖుర్దా జాతీయ రహదారి మీద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టడంతో మారియా ఖాన్(24), రాఖీ(45), కబీర్‌లతోపాటు మరొక వ్యక్తి చనిపోయారు.

    వీరు భువనేశ్వర్‌లో పెళ్లికి వెళ్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.

    మృతుల్లో మారియా ఖాన్‌, బీచ్ రోడ్ ప్రాంతానికి చెందినవారు కాగా రాఖీది విశాలాక్షి నగర్. కబీర్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

  8. గుజరాత్ ఎన్నికలు: ఒంటి గంట వరకు 34.48శాతం పోలింగ్

    గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశ పోలింగ్ జరుగుతోంది.

    మధ్యాహ్నం ఒంటి గంట వరకు 34.48శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

    తొలి దశలో మొత్తం 89 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.

    క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా జామ్‌నగర్ నార్త్ నుంచి బరిలో ఉన్నారు.

  9. శిఖర్ ధవన్:‘రిషభ్ పంత్ మ్యాచ్ విన్నర్... విఫలమైనా కొన్ని అవకాశాలు ఇవ్వాలి’

    క్రికెటర్ శిఖర్ ధవన్

    ఫొటో సోర్స్, Getty Images

    న్యూజీలాండ్ వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచుల్లో సంజు శాంసన్‌ను ఆడించకపోవడం మీద కెప్టెన్ శిఖర్ ధవన్ వివరణ ఇచ్చాడు.

    ‘సంజు శాంసన్ మంచి ప్లేయర్. బాగా ఆడుతున్నాడు. అవకాశం ఇచ్చిన ప్రతిసారీ బాగానే ఆడాడు. అయినా కొన్ని సార్లు వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నీ కంటే ముందు ఉన్న ప్లేయర్ బాగా ఆడుతున్నాడు.

    అతడు(రిషబ్ పంత్) మ్యాచ్‌ను గెలిపించే సత్తా గల వాడు అనే విషయం మాకు తెలుసు. కాబట్టి ఫాం లేక పోయినా అతనికి కొన్ని అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే కొన్ని రోజులు అవకాశం ఇచ్చాం.

    ఇంగ్లండ్‌లో ఆడినప్పుడు రిషబ్ సెంచరీ కొట్టాడు. ఇలా సెంచరీ చేసే వాళ్లనే ఎప్పుడూ ఆడిస్తారు. ఒక పెద్ద ప్లేయర్‌కు ఎంత వరకు సపోర్ట్ ఇవ్వాలి అనే విషయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం’ అని శిఖర్ ధవన్ అన్నాడు.

    న్యూజీలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఓడిపోయింది. 1-0 తేడాతో న్యూజీలాండ్ గెలిచింది. సంజు శాంసన్‌కు బదులు ఫామ్‌లో లేని రిషభ్ పంత్‌ను ఆడించడం మీద విమర్శలు వచ్చాయి.

  10. దిల్లీ లిక్కర్ కేసులో తనపై వస్తున్న ఆరోపణల మీద కల్వకుంట్ల కవిత ఎలా స్పందించారు?

  11. బ్రేకింగ్ న్యూస్, వైఎస్ షర్మిల: పాదయాత్రను ఆపేందుకే అరెస్ట్

    వైఎస్ షర్మిల

    ఫొటో సోర్స్, YS Sharmila Reddy/Facebook

    సర్వేలో వైఎస్‌ఆర్‌టీపీకి ఆదరణ ఉందని తెలిసి టీఆర్‌ఎస్ భయపడుతోందని ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు.

    ప్రతి రోజూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే పాదయాత్రను ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు.

    తనను అరెస్ట్ చేస్తే తప్ప పాదయాత్ర ఆగదని కేసీఆర్ భావించారని, అందుకే అరెస్టు చేశారని షర్మిల అన్నారు.

    హైదరాబాద్‌లో మంగళవారం షర్మిల కూర్చొని ఉన్న కారును తెలంగాణ పోలీసులు లాక్కెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తరువాత గవర్నర్ తమిళసైను కలిసి నరసంపేటలో జరిగిన దాడి ఆ తరువాత పరిణామాలను షర్మిల వివరించారు.

    తనను రిమాండ్‌కు పంపేందుకు మాత్రమే పోలీసుల మీద దాడి చేశాననే ఆరోపణలు మోపారని ఆమె అన్నారు.

    ‘నేను పాదయాత్ర చేసి మరొక పార్టీకి మైలేజీ ఎందుకిస్తాను?’ అని షర్మిల ప్రశ్నించారు.

    ‘భారతదేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ కుటుంబం ఎవరిదైనా ఉన్నది అంటే అది కేసీఆర్ కుటుంబమే. వారి మీద విచారణ జరపాలి’ అని ఆమె అన్నారు.

  12. సీబీఐ విచారణకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్

    గంగుల కమలాకర్

    ఫొటో సోర్స్, Gangula Kamalakar/Facebook

    తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సీబీఐ విచారణకు హాజరయ్యారు.

    ఈమేరకు దిల్లీలోని సీబీఐ ప్రధానకార్యాలయానికి వారు చేరుకున్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    కొద్ది రోజుల కిందట తెలంగాణ భవన్‌లో దొరికిన నకిలీ సీబీఐ అధికారి కేసులో వీరి పాత్ర ఉందనే ఆరోపణల మీద విచారిస్తున్నట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. గుజరాత్‌లో కొనసాగుతున్న పోలింగ్

    గుజరాత్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 11గంటల నాటికి 18.95శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

    సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.

  14. రైళ్లలో టిల్టింగ్ టెక్నాలజీ అంటే ఏంటి, దీనితో ప్రయోజనాలేంటి?

  15. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ‘కొనుగోలు’ కేసులో నిందితులకు బెయిల్

    ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోని నిందితులు

    ఫొటో సోర్స్, UGC

    టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ‘కొనుగోలు’ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లకు తెలంగాణ హై కోర్టు బెయిల్ ఇచ్చింది.

    రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్‌లకు బెయిల్ ఇచ్చిన హై కోర్టు... ప్రతి సోమవారం సిట్ విచారణకు హాజరకు కావాలని ఆదేశించింది.

    రూ.3 లక్షలు వ్యక్తిగత పూచీకత్తుతోపాటు పాస్‌పోర్టులను పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని వెల్లడించింది.

  16. అమెరికా చేతిలో తమ దేశం ఓడినందుకు ఇరాన్‌లో సంబరాలు... ‘కాల్పుల్లో ఒకరు మృతి’

    మెహ్రాన్ సమక్

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, మెహ్రాన్ సమక్

    ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో అమెరికా చేతిలో ఇరాన్ ఓడిపోవడంతో హిజాబ్ నిరసనకారులు బహిరంగంగానే సంబరాలు చేసుకున్నారు.

    వారి మీద కాల్పులు జరపడంతో ఒకరు మరణించినట్లు వార్తలు వచ్చాయి.

    మెహ్రాన్ సమక్ అనే వ్యక్తి తల మీద బుల్లెట్ తగిలినట్లు నిరసనకారులు తెలిపారు. ఆయా నగరాల్లో ఇరాన్ ఓటమికి నిరసనకారులు ఆనందంతో చిందులు వేస్తున్న వీడియోలు కనిపించాయి.

    ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారు ఇరాన్ ఫుట్‌బాల్ టీమ్‌కు మద్దతు తెలపడం లేదు.

  17. వరల్డ్ ఎయిడ్స్ డే: భారత్‌లో తొలి కేసును గుర్తించిన నిర్మల గురించి మీకు తెలుసా?

  18. దిల్లీ లిక్కర్ కేసు: ‘అరెస్ట్ చేస్తారా... చేయండి...అంతకంటే ఏం చేస్తారు’... కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు

  19. అఫ్తాబ్ పూనావాలకు నేడు నార్కో పరీక్ష

    శ్రద్ధ మర్డర్ కేసులో నిందితుడు అఫ్తాబ్ పూనావాలకు నేడు రోహిణిలోని అంబేడ్కర్ ఆసుపత్రిలో నార్కో పరీక్షలు నిర్వహించనున్నారు.

    ఇందుకోసం తీహార్ జైలు నుంచి అఫ్తాబ్‌ను రోహిణికి తరలించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. నేటి నుంచి భారత్ జీ20 అధ్యక్షత ప్రారంభం

    భారత్ జీ20 అధ్యక్షత నేటి నుంచి అధికారికంగా ప్రారంభమవుతోంది.

    ‘ప్రపంచమంతా ఒక్కటే అనే భావనను పెంచేందుకు భారత్ కృషి చేస్తుంది’ అని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గతంలో జీ20 కూటమికి అధ్యక్షత వహించిన దేశాలు ఎంతో నిర్మాణాత్మకమైన కృషిని చేశాయని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది