ధన్యవాదాలు
ఈ పేజీలో లైవ్ అప్‌డేట్లు ముగిశాయి.
మృతుల సంఖ్య పెరగవచ్చని, భూకంపం తరువాత కూడా ప్రకంపనల ప్రభావం ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు. కూలిన భవనాల మధ్య చిక్కుకున్న ప్రజలను తరలించడానికి సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
ఈ పేజీలో లైవ్ అప్‌డేట్లు ముగిశాయి.
ఇండోనేషియాలోని జావా ద్వీపం కేంద్రంగా ఏర్పడిన భూకంపం బాధితుల సంఖ్య పెరుగుతోంది.
కనీసం 162 మంది మరణించారని, వందలాది మంది గాయాలపాలయ్యారని ప్రాంతీయ గవర్నర్ రిద్వాన్ కమిల్ తెలిపారు.
వందలాది మంది క్షతగాత్రులకు ఆసుపత్రుల లోపల, బయట కూడా చికిత్స చేస్తున్నారు.
కూలిపోయిన భవనాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడే సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఇండోనేషియాలోని జావా ద్వీపంలో సంభవించిన భూకంపం వల్ల మరణించినవారి సంఖ్య 56కు చేరిందని అధికారులు ప్రకటించారు.
పశ్చిమ జావాలోని సియాంజుర్ పట్టణాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన ఈ భూకంపం వల్ల 700 మందికి పైగా గాయాలపాలయ్యారు.

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, UGC/RAJESH AMBALIYA
గుజరాత్‌లోని మోర్బీ వంతెన కూలిన ఘటన "పెను విషాదమని" సుప్రీంకోర్టు పేర్కొంది.
మోర్బీ బ్రిడ్జి కూలిన కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
కాగా, విచారణపై శ్రద్ధ వహించాలని, దానికి తగినంత సమయం కేటాయించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
"ఇది పెను విషాదం. దర్యాప్తు సహా ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వారం వారం పరిశీలించాలి. వంతెన పునరుద్ధరణ, మరమ్మత్తులు జరిగిన విధానం, నిర్వాహకుల యోగ్యతా పత్రాలు, తప్పిదానికి పాల్పడినవారి జవాబుదారీతనం, మృతుల, గాయపడినవారి కుటుంబాలకు నష్టపరిహారం, ఈ ఘటనపై స్వతంత్ర దర్యాప్తు అవసరం మొదలైన అంశాలపై దృష్టి సారించాలి" అని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తన ఆదేశంలో పేర్కొంది.
మోర్బీ ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులు దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
ఈ పిటిషనర్ల తరపున వాదించిన న్యాయవాది విశాల్ తివారీ, ఈ అంశంపై జ్యుడిషియల్ కమిటీ దర్యాప్తు చేయాలని, దీని పర్యవేక్షణ రిటైర్డ్ జడ్జి చేతిలో ఉండాలని డిమాండ్ చేశారు.
అక్టోబర్ 30న గుజరాత్‌లోని మోర్బీలో వేలాడే వంతెన కూలిన ఘటనలో 132 మంది చనిపోయారు. ఈ వంతెన మరమ్మత్తులు, నిర్వహణ కాంట్రాక్టును ఒరెవా గ్రూపుకు ఇచ్చారు.
హెల్త్ సర్టిఫికెట్ పొందకుండానే ఈ వంతెనను సందర్శనకు తెరిచారన్న విషయం, ప్రమాదం తరువాత వెలుగులోకి వచ్చింది.

ఫొటో సోర్స్, RAMCHARAN/FACEBOOK
గోవాలో జరుగుతున్న 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI) 2022లో చిరంజీవికి 'ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' పురస్కారం లభించింది.
ఆదివారం ప్రారంభమైన ఈ వేడుకలో విజయేంద్ర ప్రసాద్, అజయ్ దేవగన్, పరేష్ రావల్, సునీల్ శెట్టిలను కూడా సత్కరించారు.
ఈ సందర్భంగా, చిరంజీవి విలక్షణమైన నటుడని, మంచి వ్యక్తిత్వం కలవారని ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
ఇండోనేషియాలోని జావా ఐలండ్‌లో సోమవారం భూకంపం సంభవించింది.
రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది.
ఈ ఘటనలో కనీసం 40 మంది ప్రాణాలు కోల్పోయారని, సుమారు 300 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
యూఎస్ జియోలాజికల్ సర్వే డేటా ప్రకారం, 5.6 తీవ్రతతో భూకంపం పశ్చిమ జావాలోని సియాంజూర్ పట్టణంలో 10కిమీ లోతులో తాకింది.
అక్కడి నుంచి 100 కిమీ దూరంలో ఉన్న రాజధాని జకార్తాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఎత్తైన భవనాలలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించారు.
మృతుల సంఖ్య పెరగవచ్చని, భూకంపం తరువాత కూడా ప్రకంపనల ప్రభావం ఉండవచ్చని అధికారులు హెచ్చరించారు.
గాయపడినవారు సియాంజూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కూలిన భవనాల మధ్య నుంచి ప్రజలను తరలించడానికి సహాయక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ఫొటో సోర్స్, Twitter/bharatjodo
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా సోమవారం గుజరాత్‌లోని సూరత్, రాజ్‌కోట్ జిల్లాలలో పర్యటించనున్నారు.
కాగా, డిసెంబర్ 5న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. గత రెండున్నర దశాబ్దాలుగా గుజరాత్‌లో బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ప్రధాన ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉంది.
రాహుల్ భారత్ జోడో యాత్ర ఇప్పటివరకు ఆరు రాష్ట్రాలు, 31 జిల్లాల గుండా సాగింది.

ఫొటో సోర్స్, ANI
భారత ఎన్నికల కమిషనర్‌గా మాజీ ప్రభుత్వ అధికారి అరుణ్ గోయెల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
అరుణ్ గోయల్ పంజాబ్ కేడర్‌కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. గత శుక్రవారమే ఆయన భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పదవి నుంచి వీఆర్‌ఎస్ తీసుకున్నారు.
శనివారం, చట్టం, న్యాయ మంత్రిత్వ శాఖ ఆయన్ను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తున్నట్టు నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఈ ఏడాది మేలో ఎలక్షన్ కమిషనర్‌గా సుశీల్ చంద్ర పదవీ విరమణ చేసిన తరువాత, రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే ఆ బాధ్యతలను నిర్వహిస్తూ వచ్చారు.
సోమవారం అరుణ్ గోయల్ కొత్త బాధ్యతలను స్వీకరించారు.
ఒడిశాలోని కోరై స్టేషన్ వద్ద ఒక గూడ్స్ బండి పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రెండు రైలు మార్గాలు మూసుకుపోయాయి. రైల్వే స్టేషన్ భవనం కూడా దెబ్బతింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, గాయపడిన వారికి తగిన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

ఫొటో సోర్స్, Getty Images
శనివారం రాత్రి అమెరికాలోని కొలరాడోలో ఓ గే క్లబ్‌లో ఒక వ్యక్తి కాల్పులు జరపడంతో కనీసం అయిదుగురు చనిపోయారు. 25 మంది గాయపడ్డారు.
క్లబ్‌లో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపిన వ్యక్తిని ఆపడానికి ప్రయత్నించారు. వారికి పోలీస్ చెఫ్ అడ్రియన్ వాస్‌క్వెజ్ కృత్జతలు తెలిపారు.
"అనుమానితుడు 'క్లబ్ క్యూ'లోకి ప్రవేశించగానే కాల్పులు మొదలుపెట్టినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వెంటనే, ఇద్దరు వ్యక్తులు ధైర్యసాహసాలతో అనుమానితుడిని ఆపేందుకు ప్రయత్నించారు. మరింత ప్రాణనష్టం జరగకుండా నిరోధించగలిగారు. వారికి మా కృతజ్ఞతలు" అని అడ్రియన్ వాస్‌క్వెజ్ అన్నారు.
ఆ సమయంలో క్లబ్‌లో డాన్స్ పార్టీ జరుగుతోంది.ఆదివారం ట్రాన్స్‌జెండర్ డే ఆఫ్ రిమెంబరెన్స్ సందర్భంగా మరో ప్రోగ్రాం కూడా చేయవలసి ఉంది.
"ముందు కాల్పుల శబ్దం వినగానే మ్యూజిక్‌లో భాగం అనుకున్నా. కానీ, నేలపై మృతదేహాలు, పగిలిన గాజు ముక్కలు చూసి షాక్ అయ్యాను. వెంటనే డ్రెస్సింగ్ రూంలోకి పరిగెత్తి తలదాచుకున్నా" అని 34 ఏళ్ల జషువా తుర్మన్ చెప్పారు.
"అతడు లోపలికి రాకుండా అడ్డుకోలేకపోయారు. ఇలా ఎందుకు జరగాలి? ఎందుకు మేం ప్రాణాలు కోల్పోవాలి?" అంటూ జాషువా ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, ANI
గత ఆదివారం వెలుగులోకి వచ్చిన శ్రద్ధ హత్య కేసుకు సంబంధించి దిల్లీ పోలీసులకు దక్షిణ దిల్లీ ప్రాంతంలో తల భాగాలు, ఎముకలు లభించాయి.
దర్యాప్తులో భాగంగా దక్షిన దిల్లీలో మైదాన్‌గడీ ప్రాంతంలోని సరస్సును దిల్లీ పోలీసులు ఖాళీ చేయించారు. అయితే, ఇప్పటి వరకు ఈ కేసులో ప్రధాన ఆధారాలు లభించినట్టు పోలీసులు సమాచారం ఇవ్వలేదు. ఈ కేసులో దర్యాప్తు రాను రాను కష్టమవుతున్నట్టు తెలుస్తోంది.
దిల్లీ పోలీసు బృందం గతంలో అఫ్తాబ్, శ్రద్ధ నివసించిన ప్లాట్‌కు అఫ్తాబ్‌ను తీసుకెళ్లారు.
అఫ్తాబ్‌ను నార్కో పరీక్షకు తీసుకెళ్లే ముందు దిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు సమావేశమయ్యారు.
నార్కో పరీక్ష సమయంలో అఫ్తాబ్ నుంచి కొంత సమాచారాన్ని పొందవచ్చని, ఇది కేసును ఛేదించడంలో సహాయపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు.
కాగా, ఈ కేసును ఛేదించడం పరిశోధన అధికారులకు కష్టంగా మారుతుందని దిల్లీ మాజీ పోలీసు కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ అన్నారు.
"ఇది చాలా కష్టమైన కేసుగా పరిణమిస్తోంది. అతడి (అఫ్తాబ్) నేరాన్ని నిరూపించడానికి న్యాయ వ్యవస్థలోని అన్ని విభాగాల సహాయం అవసరమయ్యేలా ఉంది. పోలీసులు తమ వంతు ప్రయత్నం చేస్తారు. అయితే, ఈ కేసులో కోర్టు విషయాన్ని అర్థం చేసుకుని తీర్పు ఇవ్వల్సి ఉంటుంది" అని ఆయన అన్నారు.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల అప్‌డేట్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.