తెలంగాణ: ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు బెయిల్.. జైలు నుంచి విడుదల

రాజాసింగ్ ను విడుదల చేయాలని, పీడీయాక్ట్ కేసును సవాల్ చేస్తూ ఆయన సతీమణి ఉషాబాయి హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం కొన్ని షరతులతో రాజాసింగ్ విడుదలకు ఆదేశాలు ఇచ్చింది.

లైవ్ కవరేజీ

  1. ఊళ్లోకి వచ్చిన చిరుత ఓ కుక్క వెంట పడి, బైక్‌పై పంజా విసిరి, నానా బీభత్సం సృష్టించింది

  2. కులాల మధ్య పోరే ఇప్పటంలో వివాదానికి కారణమా?

  3. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  4. రాజాసింగ్‌ విడుదల

    raja singh

    ఫొటో సోర్స్, RAJASINGH/FB

    గోషామహల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్‌‌కు తెలంగాణ హైకోర్ట్ షరతులతో కూడిన విడుదల ఆదేశాలు మంజూరు చేసింది.

    ఆయనపై నమోదైన పీడీ యాక్ట్‌ను ఎత్తివేసింది.

    స్టాండింగ్ కమేడియన్ మునావర్ ఫారూకీ హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా రాజాసింగ్ విడుదల చేసిన ఓ వీడియో మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని ఆయనపై హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ పెట్టారు.

    ఆ తర్వాత రాజాసింగ్ బీజేపి నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు.

    ఆగస్ట్ 25 నుంచి రాజాసింగ్ జైలులో ఉన్నారు.

    రాజాసింగ్ ను విడుదల చేయాలని, పీడీ యాక్ట్ కేసు ఎత్తివేయాలని కోరుతూ ఆయన భార్య ఉషాబాయి హైకోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేశారు.

    దీనిపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. వాదనలు విన్న న్యాయస్థానం కొన్ని షరతులతో రాజాసింగ్ విడుదలకు ఆదేశాలు ఇచ్చింది.

    రాజాసింగ్ విడుదలయ్యే సందర్భంలో న్యాయవాది సహా అతని కుటుంబ సభ్యులు నలుగురికి మించి జైలు వద్దకు రావొద్దని, విడుదల సందర్భంగా ఎలాంటి ర్యాలీలు , సభలు ఏర్పాటు చేయొద్దని, మీడియాతో మాట్లాడవద్దని, భవిష్యత్తులో ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు, కామెంట్లను సోషల్ మీడియాలో పెట్టకూడదని హైకోర్ట్ షరతులు విధించింది.

  5. భారత్‌కు తనను అప్పగించొద్దన్న నీరవ్ మోదీ పిటిషన్ కొట్టివేసిన లండన్ కోర్ట్

    nirav modi

    ఫొటో సోర్స్, Getty Images

    బ్రిటన్‌కు పారిపోయిన భారత వ్యాపారి నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అక్కడి ఓ కోర్టు కొట్టివేసింది.

    పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను సుమారు రూ. 11 వేల కోట్ల మేర మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు నీరవ్ మోదీ.

    ఈ కేసులో విచారణ నుంచి తప్పించకునేందుకు ఆయన బ్రిటన్ పారిపోయారు.

    కాగా నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించాలంటూ వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్ట్ డిస్ట్రిక్ట్ జడ్జి ఫిబ్రవరిలో తీర్పునిచ్చారు.

    ఈ తీర్పును సవాల్ చేస్తూ లండన్‌లోని హై కోర్టులో నీరవ్ మోదీ పిటిషన్ దాఖలు చేశారు.

    ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ న్యాయమూర్తి బుధవారం తీర్పునిచ్చారు.

    ఈ పరిణామాలపై నీరవ్ న్యాయవాదుల నుంచి ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదు. అయితే, నీరవ్ యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయించడానికి అవకాశం ఉంది.

  6. ట్రోలింగ్‌పై రష్మిక మందన్న: ‘నన్ను అందరూ ఇష్టపడరని తెలుసు... ప్రతి ఒక్కరూ ప్రేమించాలని అనుకోను...’

  7. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్: ‘బోనులోని పులులు బయటకు వచ్చాయి’

  8. బ్రేకింగ్ న్యూస్, టీ20 వరల్డ్‌కప్: న్యూజీలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్

    పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ ఆజం

    ఫొటో సోర్స్, Getty Images

    టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజీలాండ్ మీద గెలిచిన పాకిస్తాన్... ఫైనల్‌కు వెళ్లింది.

    న్యూజీలాండ్ విధించిన 153 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో చేధించింది పాకిస్తాన్.

    పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం 53 పరుగులు చేయగా మహ్మద్ రిజ్వాన్ 57 పరుగులు చేశాడు.

    ఈ టీ20 వరల్డ్‌కప్‌లో బాబర్ ఆజంకు ఇదే తొలి అర్ధసెంచరీ.

    తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది.

    డేరీ మిషెల్ 53 పరుగులు చేయగా కేన్ విలియమ్స్ 46 పరుగులు చేశాడు.

    గురువారం భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో పాకిస్తాన్ తలపడుతుంది.

  9. ఆకాశంలో ఆర్మీ జవాన్ ప్రాణాలు కాపాడిన కేరళ నర్స్

  10. బ్రేకింగ్ న్యూస్, బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాజా సింగ్‌కు బెయిల్

    బీజేపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్‌కు బెయిల్ లభించింది.

    కొద్ది నెలల కిందట మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారు.

    మహ్మద్ ప్రవక్త మీద ఆయన చేసి వ్యాఖ్యలతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ తెలిపింది.

    కొంతకాలంగా ఆయన జైలులో ఉన్నారు.

    కొన్ని షరతులతో ప్రస్తుతం ఆయనకు బెయిల్ లభించింది.

  11. కేరళ: చాన్సెలర్ పదవి నుంచి గవర్నర్‌ను తొలగిస్తూ మంత్రి మండలి తీర్మానం

    కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్

    ఫొటో సోర్స్, Facebook/Pinarayi Vijayan

    కేరళ గవర్నర్‌ను యూనివర్సిటీ చాన్సెలర్ పదవి నుంచి తొలగిస్తూ ఆ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది.

    ఈమేరకు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిందిగా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు సిఫారసు చేసింది మంత్రిమండలి.

    కొంత కాలంగా కేరళ గవర్నర్‌కు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తుతూ వస్తున్నాయి.

    ఇటీవల కొన్ని యూనివర్సిటీల వైస్ చాన్సెలర్లను రాజీనామా చేయాల్సిందిగా గవర్నర్ ఆదేశించడం వివాదాస్పదమైంది.

    కేంద్ర, రాష్ట్రాల సంబంధాలపై 2007లో ఏర్పాటు చేసిన ఎం.ఎం.పూంచీ కమిషన్ యూనివర్సిటీ చాన్సెలర్ పదవి నుంచి గవర్నర్‌ను తప్పించాలని సిఫారసు చేసింది.

    ఆ సిఫారసు ప్రకారం చాన్సెలర్ పదవి నుంచి గవర్నర్‌ను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేరళ ప్రభుత్వం తెలిపింది.

  12. ‘‘ఇండియా 2022లో న్యాయం ఇలా ఉంటుంది’’ – చావ్లా రేప్ కేసులో మరణశిక్ష పడిన నిందితుల విడుదలపై దేశంలో దిగ్భ్రాంతి, ఆగ్రహం

  13. చైనా: ‘యుద్ధానికి సిద్ధమవ్వండి’... సైన్యానికి షీ జిన్‌పింగ్ ఆదేశం

    చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్

    ‘యుద్ధానికి సిద్ధంగా’ ఉండాలంటూ తన సైన్యాన్ని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఆదేశించినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    చైనా జాతీయ భద్రతకు ప్రమాదం పెరుగుతోందని అన్న షీ జిన్‌పింగ్, ‘శక్తి సామర్థ్యాలు పెంచుకోవడంతోపాటు యుద్ధానికి సిద్ధంగా ఉండండి. యుద్ధం చేయండి’ అంటూ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి పిలుపునిచ్చారు.

    69 ఏళ్ల షీ జిన్‌పింగ్ ఇటీవలే మూడోసారి చైనా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

    యుద్ధానికి సిద్ధమయ్యేందుకు చైనా సైన్యం మొత్తం పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తుందని ఆయన అన్నట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా షిన్హువా తెలిపింది.

    తైవాన్‌తో ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో షీ జిన్‌పింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. అమెరికా ఎన్నికలు: డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ మధ్య హోరాహోరి పోటీ

    అమెరికా మధ్యంతర ఎన్నికలు

    ఫొటో సోర్స్, bbc

    అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.

    హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్ల హవా కొనసాగుతోంది. ప్రస్తుతం 198 సీట్లు వారు గెలుచుకున్నారు.

    డెమోక్రాట్లు 173 సీట్లలో గెలిచారు.

    హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో మెజారిటీ రావాలంటే 218 సీట్లు గెలవాలి.

    ఇక సెనేట్ విషయంలో పోటీ హోరాహొరిగా ఉంది.

    డెమోక్రాట్లు 48 సీట్లు గెలవగా రిపబ్లికన్లు 47 స్థానాలు కైవసం చేసుకున్నారు.

    సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లను కలిపి అమెరికా కాంగ్రెస్ అంటారు.

  15. అంబులెన్స్ దారి కోసం ఆగిన ప్రధాని మోదీ కాన్వాయ్

    హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా అక్కడ ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు.

    ర్యాలీ కోసం హమీర్‌పుర్‌కు వెళ్తున్న సందర్భంలో ఒక అంబులెన్స్ కోసం ఆయన కాన్వాయ్ ఆగినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది.

    అంబులెన్స్ వెళ్లే దాకా ఎదురు చూసిన మోదీ కాన్వాయ్ ఆ తరువాత బయలుదేరింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. 175 ఏళ్ళ నాటి ఆస్పత్రి భవనం కింద బయటపడిన సొరంగం

  17. బెంగళూరు ఎయిర్‌పోర్ట్: రూ.5 వేల కోట్లతో టెర్మినల్-2... 11న ప్రారంభించనున్న మోదీ

    కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-2

    ఫొటో సోర్స్, ANI

    బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కొత్తగా నిర్మించిన టెర్మినల్-2‌ను ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11న ప్రారంభించనున్నారు.

    సుమారు రూ.5 వేల కోట్లతో ఈ టెర్మినల్‌ను నిర్మించారు.

    ప్రయాణికులకు గార్డెన్‌లో నడుస్తున్నామనే భావన కలిగేలా ఈ టెర్నినల్‌ను డిజైన్ చేశారు.

    కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-2

    ఫొటో సోర్స్, ANI

    టెర్మినల్-2 అందుబాటులోకి వస్తే మరింత ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించొచ్చు. ఏడాదికి 6 కోట్ల వరకు ప్రయాణికులను ఎయిర్‌పోర్ట్ హ్యాండిల్ చేయగలదని భావిస్తున్నారు.

    కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-2

    ఫొటో సోర్స్, ANI

    ఈ ఎయిర్‌పోర్టులో 100శాతం పునరుత్పాదక వనరుల నుంచి వచ్చిన విద్యుత్‌నే వాడుతున్నారు. టెర్మినల్-2ను కూడా ఇదే విధానంలో డెవలప్ చేశారు.

    కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్-2

    ఫొటో సోర్స్, ANI

  18. ‘తాంత్రిక వైద్యం’ కోసం రాచరికపు హోదా వదలుకున్న యువరాణి

    నార్వే యువరాణి మార్తా లూయిజ్

    ఫొటో సోర్స్, Getty Images

    నార్వే యువరాణి మార్తా లూయిజ్ తన రాచరికపు బాధ్యతలను, హోదాలను వదిలేసుకున్నారు.

    తన ప్రియుడు డురెక్ వెరెట్‌తో కలిసి ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీద దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు మార్తా లూయిజ్.

    తనను తాను ఒక దైవాంశ సంభూతునిగా డురెక్ చెప్పుకుంటూ ఉంటారు. చనిపోయి తిరిగొచ్చిన ‘షామాన్’గా చెబుతుంటారు.

    9/11 దాడులను కూడా ముందుగా ఊహించినట్లు డురెక్ అంటూ ఉంటారు. తనను ఐన్‌స్టీన్, థామస్ ఎడిసన్ వంటి వారితో పోల్చుకుంటూ ఉంటారు.

    ఆధునిక వైద్య పద్ధతులు కాకుండా తాంత్రిక, సంప్రదాయ పద్ధతుల్లో వ్యాధులను నయం చేయాలని చూడటమే ఆల్టర్నేటివ్ మెడిసిన్‌గా వీరు చూస్తున్నారు.

    కొన్ని దశాబ్దాలుగా నార్వే యువరాణి మార్తా ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీద ఆసక్తి పెంచుకుంటూ వస్తున్నారు.

    ‘దైవదూతలతో మాట్లాడేందుకు’ ఒక పాఠశాలను ప్రారంభిస్తానని గతంలో ఆమె చెప్పడం ద్వారా విమర్శలకు గురయ్యారు.

  19. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణ స్వీకారం

    జస్టిస్ డీవై చంద్రచూడ్

    ఫొటో సోర్స్, ANI

    భారత సుప్రీం కోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి బాధ్యతలు చేపట్టారు.

    ఈమేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

    2016 మేలో ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తి అయ్యారు. గతంలో అలహాబాద్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు.

  20. రాజమండ్రిలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు... విశాఖపట్నం వెళ్లే కొన్ని రైళ్లు రద్దు

    రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, రాజమండ్రి వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

    తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.

    దీంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని రైళ్లను పూర్తిగా మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేశారు.

    రద్దు

    12718: విజయవాడ-విశాఖపట్నం

    12717: విశాఖపట్నం-విజయవాడ

    17239: గుంటూరు-విశాఖపట్నం

    17240: విశాఖపట్నం-గుంటూరు

    22701: విశాఖపట్నం-విజయవాడ

    22702: విజయవాడ-విశాఖపట్నం

    07628: విజయవాడ-గుంటూరు

    07864: గుంటూరు-విజయవాడ

    17257: కాకినాడ పోర్ట్-విజయవాడ

    పాక్షికంగా రద్దు

    17258: కాకినాడ పోర్ట్-విజయవాడ

    కాకినాడ టౌన్-విజయవాడ మధ్య రద్దు చేశారు.

    07768: విజయవాడ-రాజమండ్రి

    తాడేపల్లిగూడెం-రాజమండ్రి మధ్య రద్దు చేశారు.

    ఆలస్యం

    12805: విజయవాడ-లింగంపల్లి

    రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది.

    రైల్వే షెడ్యూలు

    ఫొటో సోర్స్, SCR