You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బ్యాంకుల్లో టీటీడీ నగదు డిపాజిట్లు రూ.15938 కోట్లు, బంగారం డిపాజిట్లు 10258 కేజీలు
తిరుమల తిరుపతి దేవస్థానం నగదు, బంగారాన్ని ఏఏ బ్యాంకుల్లో ఎంత మేరకు డిపాజిట్ చేశామో వెల్లడిస్తూ టీటీడీ బోర్డు శ్వేత పత్రం విడుదల చేసింది.
లైవ్ కవరేజీ
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌ను గెలిపించిన 5 అంశాలేంటి... మిగతా పార్టీలు సాధించిందేంటి?
ధన్యవాదాలు
ఈ పేజీలో లైవ్ అప్డేట్లు ముగిశాయి.
సరస్సులో కూలిన విమానం, 19 మంది మృతి
టాంజేనియాలో లేక్ విక్టోరియాలో విమానం కూలిపోవడంతో 19 మంది మరణించారు.
సరస్సు పక్కనే ఉన్న బుకోబా నగరంలో విమానం ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది.
ప్రమాద సమయానికి విమానంలో ఇద్దరు పైలట్లు సహా 45 మంది ఉన్నారు.
అందులో 26 మందిని రక్షించారు.
సరస్సులో కూలిన కొద్దిసేపటికే విమానంలో నీటిలో మునిగిపోయిందని స్థానికులు చెప్పారు.
విశాఖపట్నం దగ్గర్లో ‘బాహుబలి’ జలపాతం
140 ఏళ్ల కిందట అదృశ్యమైన బ్రిటిష్ నౌక.. ఇంగ్లిష్ చానల్ సముద్రంలో దొరికింది
ఉత్తరాఖండ్: జోషీమఠ్‌లో ఇళ్లు పగిలిపోతున్నాయి ఎందుకు? - గ్రౌండ్ రిపోర్ట్
మునుగోడులో టీఆర్ఎస్ విజయం, బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఓటమి, డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్
జింబాబ్వేతో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఆ షాట్లు ఎలా కొట్టగలిగాడు?
బ్యాంకుల్లో టీటీడీ నగదు డిపాజిట్లు రూ.15938 కోట్లు, బంగారం డిపాజిట్లు 10258 కేజీలు
తిరుమల తిరుపతి దేవస్థానం నగదు, బంగారాన్ని ఏఏ బ్యాంకుల్లో ఎంత మేరకు డిపాజిట్ చేశామో వెల్లడిస్తూ టీటీడీ బోర్డు శ్వేత పత్రం విడుదల చేసింది.
2022 సెప్టెంబర్ 30 తేదీ నాటికి 24 బ్యాంకులు, ఫైనాన్స్ కార్పొరేషన్లు, బాండ్లలో రూ.15398.68 కోట్లు డిపాజిట్ అయ్యాయి.
అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5358.11 కోట్లు ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌లో 2122.85 కోట్లు ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, యాక్సిస్ బ్యాంకుల్లో కూడా వెయ్యి కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి.
బంగారం డిపాజిట్ల విషయానికి వస్తే.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 9819.38 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 438.99 కేజీలు బంగారం డిపాజిట్ అయ్యింది.
బ్రిటన్ ప్రజలు కొత్త బట్టల కంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొనేందుకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకు?
నలుగురు విద్యార్థులు కలిసి మరో విద్యార్థిని కర్రలు, పైపులతో కొట్టిన వీడియో వైరల్... అసలేం జరిగింది?
టీ20 వరల్డ్ కప్: సెమీ పైనల్స్‌కు చేరిన భారత్, పాకిస్తాన్... బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో పాక్ విజయం
అలియా భట్, రణ్‌బీర్ దంపతులకు కుమార్తె జననం
బాలీవుడ్ నటులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్ దంపతులకు కూతురు జన్మించింది.
నవంబరు 6వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ముంబైలోని సర్ హెచ్.ఎన్. రిలయన్స్ హాస్పిటల్‌లో అలియా భట్ ఆడశిశువుకు జన్మనిచ్చినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ తెలిపింది.
అలియా, రణ్‌బీర్ దంపతులు కానీ వారి కుటుంబాలు కానీ ఈ విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.
ఆస్పత్రి వద్ద అలియా, రణ్‌బీర్‌లతో పాటు వారి తల్లులు సోని రాజ్‌దాన్, నీతు కపూర్‌లు కనిపించారు.
బ్రహ్మాస్త్ర సినిమా హీరోహీరోయిన్లయిన అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌లు ఈ ఏడాది ఏప్రిల్ 14వ తేదీన ముంబైలోని రణ్‌బీర్ నివాసంలో పెళ్లి చేసుకున్నారు.
పెళ్లయిన రెండు నెలలకే తన గర్భం గురించి ఈ జంట తమ అభిమానులకు ప్రకటించింది.
పుట్టగొడుగులతో డిప్రెషన్ తగ్గిపోతుందా... తాజా పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
రాహుల్ గాంధీపై బెంగళూరులో కేసు నమోదు.. భారత్ జోడో యాత్రలో అనుమతి లేకుండా కేజీఎఫ్-2 సంగీతం వాడారని ఫిర్యాదు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సినిమాలోని సంగీతాన్ని ఉపయోగించారంటూ ఆయన మీద బెంగళూరులో కేసు నమోదైంది.
రాహుల్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు జైరాం రమేష్, సుప్రియా ష్రినేత్‌ల మీద కూడా ఫిర్యాదులు నమోదయ్యాయి.
పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. కన్నడ సినిమా కేజీఎఫ్-2 లోని సంగీతాన్ని అనుమతి లేకుండా ఉపయోగించారని ఆరోపిస్తూ ఎంఆర్‌టీ మ్యూజిక్ మేనేజర్ ఎం.నవీన్‌కుమార్ కాపీరైట్ చట్టం కింద బెంగళూరులోని యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అలాగే.. జైరాం రమేష్ తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేసిన రెండు వీడియోల్లో.. కేజీఎఫ్-2 సినిమాలోని రెండు పాటలను అనుమతి లేకుండా ఉపయోగించారని కూడా ఆ ఫిర్యాదులో ఆరోపించారు. ఆ పాటల సంగీతం హక్కులు ఎంఆర్‌టీ మ్యూజిక్ సంస్థకు చెందుతాయి.
బ్రేకింగ్ న్యూస్, శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకెను రేప్ కేసులో అరెస్ట్ చేసిన ఆస్ట్రేలియా పోలీసులు
శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకెను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీఐ వార్తా సంస్థ వివరాల ప్రకారం ఆయనను సిడ్నీ పోలీసులు రేప్ కేసులో అరెస్ట్ చేశారు. దాంతో, శ్రీలంక జట్టు ధనుష్క లేకుండానే స్వదేశానికి వెళ్ళిపోతోంది.
అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ధనుష్క గుణతిలకె శనివారం నాడు అరెస్ట్ అయ్యారని క్రికెట్ విశ్లేషకులు రెక్స్ క్లెమెంటైన్ సోషల్ మీడియాలో రాశారు.
మూడు వారాల కిందట గుణతిలకె గాయపడ్డారని, ఆయన స్థానంలో ఆశెల్ బండారా జట్టులోకి వచ్చారని ఆయన వివరించారు. అయితే, శ్రీలంక జట్టు ఆయనను వెనక్కి పంపించలేదు.
ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన అభియోగంపై శ్రీలంక క్రికెటర్ ఆరెస్ట్ చేసినట్లు సిడ్నీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో వ్యక్తి పేరు లేదు. కానీ, సదరు వ్యక్తి నాలుగు రేప్ కేసులలో అరెస్టయ్యారని తెలిపారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, ఆరోపణలు చేసిన మహిళ గత కొన్ని రోజులుగా ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లో నిందితుడితో మాట్లాడుతున్నారు. ఆ తరువాత ఇద్దరూ కలుసుకున్నారు. ఈ ఘటన నవంబర్ 2న జరిగిందని ఆ మహిళ చెప్పారు.
ఈ కేసులో సిడ్నీ, ససెక్స్ స్ట్రీట్‌లోని హోటల్లో ఉన్న 31 ఏళ్ళ వ్యక్తిని అరెస్ట్ చేశామని సిడ్నీ పోలీసులు తెలిపారు.
ట్విటర్: ‘బ్లూ టిక్ వెరిఫికేషన్ కొనుక్కోవచ్చు.. మొదట ఐదు దేశాల్లో అమలు’, జేమ్స్ ఫిట్జ్‌జెరాల్డ్, బీబీసీ న్యూస్
ట్విటర్ యూజర్లు తమ ప్రొఫైల్‌కు బ్లూ టిక్ వెరిఫికేషన్ కావాలంటే నెలకు 7.99 డాలర్లు ఫీజు చెల్లించి కొనుక్కోవచ్చునంటూ ఆ సంస్థ ప్రకటించింది.
ఈ విషయాన్ని యాపిల్ డివైజ్‌లకు అప్‌డేట్ రూపంలో పంపించింది.
ఈ మార్పులు తొలుత బ్రిటన్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్‌లకు మాత్రమే వర్తిస్తాయని పేర్కొంది.
మొదట ప్రారంభించిన కొన్ని దేశాల్లో పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఈ మార్పులను ప్రపంచమంతటా విస్తరిస్తారని ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ ట్వీట్లు సూచిస్తున్నాయి.
ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత చేపట్టిన మార్పుల్లో భాగంగా వెరిఫికేషన్ ఫీజు ప్రణాళికను రూపొందించారు.
అయితే.. ఈ విధానం వల్ల నకిలీ అకౌంట్లు వెల్లువెత్తుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకుముందు ఉన్నతస్థాయి లేదా ప్రభావవంతమైన వ్యక్తులు, సంస్థలకు మాత్రమే బ్లూటిక్ అందుబాటులో ఉండేది. వారి గుర్తింపును నిరూపించుకున్న తర్వాత ట్విటర్ కేటాయించే ఈ బ్లూటిక్‌కు చాలా డిమాండ్ ఉంది.
ఈ విధానం మారటం ప్రభుత్వ ప్రముఖులు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, బ్రాండ్లను ఆందోళనకు గురవుతున్నారు. నెల వారీ ఫీజు చెల్లించటం ద్వారా తమ లాగా ఇంకెవరైనా ప్రొఫైల్ పెట్టి మోసాలకు పాల్పడే అవకాశముందనేది వారి ఆందోళన.
ట్విటర్ వెరిఫికేషన్ విధానంలో మార్పులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రచురించలేదు. అయితే.. బ్రిటన్‌లో ట్విటర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌కు పాత ధర 4.99 పౌండ్లుగానే కొనసాగుతోందని చెప్తున్నారు.
గుడ్ మార్నింగ్!
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.