నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం
రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.
అంతవరకు సెలవు.
కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన రిషి సునక్ మంగళవారం ఉదయం బ్రిటన్ రాజు చార్లెస్‌ను కలిశారు. దీంతో రిషి సునక్ బ్రిటన్‌కు అధికారికంగా ప్రధాని అయ్యారు.
రేపు ఉదయం తాజా వార్తలతో కలుద్దాం.
అంతవరకు సెలవు.

బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి రిషి సునక్.. దేశ ప్రజలను ఉద్దేశించి తొలి అధికారిక ప్రసంగం చేశారు. ప్రధాని అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఆయన మాట్లాడారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాజు మూడో చార్లెస్ ఆహ్వానించారని, ఆ ఆహ్వానాన్ని తాను అంగీకరించానని చెప్పారు.
తనకన్నా ముందు ప్రధానిగా పనిచేసిన లిజ్ ట్రస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
‘‘ఇప్పుడు మన దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కోవిడ్ అనంతర కల్లోలం ఇంకా కొనసాగుతూనే ఉంది’’ అని పేర్కొన్నారు.
తనకన్నా ముందలి ప్రధాని చేసిన పొరపాట్లను సరిచేయటానికి తాను పనిచేస్తానన్నారు. ‘‘కావాలనో, దురుద్దేశాలతోనో జరిగిన తప్పులు కావు. సదుద్దేశాలే. కానీ అవి పొరపాట్లే’’ అని వ్యాఖ్యానించారు.
మార్పు తీసుకురావటానికి లిజ్ ట్రస్ ఎంతో పనిచేశారని, కానీ కొన్ని పొరపాట్లు జరిగాయని అన్నారు.
ఆ పొరపాట్లను సరిచేయటానికి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా, ప్రధానమంత్రిగా తనను ఎన్నుకున్నారని చెప్పారు. ‘‘ఆ పని తక్షణమే మొదలవుతుంది’’ అన్నారు.

ఫొటో సోర్స్, PA Media
తాను ఆర్థికమంత్రిగా ఉన్నపుడు ప్రజలను, వ్యాపారాలను కాపాడటానికి పలు పథకాల ద్వారా తను చేయగలిగిందంతా చేశానని పేర్కొన్నారు.
‘‘ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సవాళ్ల విషయంలోనూ అదే సానుభూతితో పనిచేస్తాను. తర్వాతి తరం వారి మీద తీర్చలేని అప్పుల భారం లేకుండా చూస్తాను’’ అన్నారు.
‘‘నేను మన దేశాన్ని మాటలతో కాకుండా చేతలతో ఐక్యం చేస్తాను. మీకు సేవ చేయటానికి అనునిత్యం పని చేస్తాను’’ అని హామీ ఇచ్చారు.
బోరిస్ జాన్సన్ ప్రధానమంత్రిగా అద్భుత విజయాలు సాధించారని రిషి కీర్తించారు.
తన ప్రభుత్వం అన్ని స్థాయిల్లోనూ నిబద్ధత, నైపుణ్యత, పారదర్శకతతో పని చేస్తుందని చెప్పారు.
‘‘విశ్వాసాన్ని సంపాదించుకోవాలి. నేను మీ విశ్వాసాన్ని సంపాదించుకుంటాను’’ అన్నారు.
మరింత బలమైన జాతీయ ఆరోగ్య పథకం, ఉత్తమమైన స్కూళ్లు, సురక్షితమైన వీధులు, సరిహద్దుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, సైనిక బలగాల బలోపేతం చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
కోవిడ్ వల్ల, యుక్రెయిన్ యుద్ధం వల్ల తలెత్తిన పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నాయో తనకు పూర్తిగా తెలుసునని రిషి సునాక్ చెప్పారు.
దేశాన్ని భవిష్యత్తులోకి నడిపించటానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అవసరాలకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. తన పార్టీలో అత్యుత్తమానికి ప్రాతినిధ్యం వహించేలా ప్రభుత్వాన్ని నిర్మిస్తానన్నారు.
‘‘మనం ఉమ్మడిగా అద్భుతాలు సాధించగలం’’ అంటూ ప్రధానమంత్రిగా తన తొలి అధికారిక ప్రసంగాన్ని ముగించారు.

ఫొటో సోర్స్, PA Media
కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన రిషి సునక్ మంగళవారం ఉదయం బ్రిటన్ రాజు చార్లెస్ పిలుపు మేరకు.. ఆయనను కలిశారు. దీంతో రిషి సునక్ బ్రిటన్‌కు అధికారికంగా ప్రధానమంత్రి అయ్యారు.
కింగ్ చార్లెస్‌ను రిషి సునక్ బకింగ్‌హామ్ ప్యాలస్‌లో కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రిషిని రాజు ఆహ్వానించారు. ఈ భేటీ.. రిషికి లాంఛనంగా అధికారం అప్పగించటానికి సంకేతం.
కింగ్ చార్లెస్ కూడా ఇటీవలే ఆ పదవిని చేపట్టారు. దీంతో బ్రిటన్ రాజు, ప్రధానమంత్రి ఇద్దరూ తమ తమ పదవుల్లోకి కొత్తగా వచ్చినవారే.

ఫొటో సోర్స్, PA Media

ఫొటో సోర్స్, Getty Images
వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది.
సుమారు అరగంట నుంచి పని చేయడం లేదు.
యూజర్లు సందేశాలు పంపడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ చేయలేక పోతున్నారు.
గ్రూప్, పర్సనల్ చాట్స్‌కు అంతరాయం కలిగినట్లుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది.
సోషల్ మీడియా యాప్స్‌న మానిటర్ చేసే డౌన్ డిటెక్టర్ ప్రకారం వాట్సాప్ యూజర్లు చేస్తున్న రిపోర్ట్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి.
వాట్సాప్ వెబ్ సేవలు కూడా నిలిచిపోయాయి.

ఫొటో సోర్స్, Downdetector
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని పాత వీరాపురం దళితవాడలో మాల కులానికి చెందిన లీలావతి, 2022 ఫిబ్రవరిలో మాదిగ కులానికి చెందిన శ్రీహరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు అపరాధం కట్టాలని దళిత పెద్దలు డిమాండ్ చేశారు. వారిని లీలావతి ఎదిరించడంతో, ఆమెపై దాడి చేశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది

ఫొటో సోర్స్, AFP
తన అల్లుడు రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని కాబోతున్న సందర్భంగా ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అభినందనలు తెలిపారు.
రిషి సునాక్ తన దేశానికి, ప్రజలకు సాధ్యమైనంత మంచి చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పాకిస్తాన్ ప్రధాని వంటి వారు రిషి సునక్‌కు అభినందనలు తెలిపారు.
నారాయణ మూర్తి కూతరు అక్షతా మూర్తిని రిషి సునాక్ పెళ్లి చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Facebook/The White House
అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడెన్‌తోపాటు వైస్ ప్రెసిడెంట్ కమలా హారిశ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
దీపావళి సందర్భంగా జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు.
‘చీకటిని పారదోలే వెలుగుగా దీపావళిని గుర్తు ఉండిపోతుంది. అమెరికా ఏ ఒక్కరిదో కాదు. ఇది అందరిది. ఈ దీపాల పండుగను జరుపుకొనే వారికి దీపావళి శుభాకాంక్షలు’ అని ఆయన ట్వీట్ చేశారు.

ఫొటో సోర్స్, Facebook/The White House

ఫొటో సోర్స్, Facebook/The White House

ఫొటో సోర్స్, Facebook/The White House
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.