You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

బ్రిటన్ ప్రధాని రేసులోకి మళ్లీ రిషి సునక్

దేశం ఎదుర్కొనే సమస్యల నుంచి గట్టించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన తన పార్టీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.

లైవ్ కవరేజీ

  1. నేటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం

    తాజా వార్తలతో రేపు ఉదయం కలుద్దాం.

    అంతవరకు సెలవు.

  2. INDvsPAK: ‘కోహ్లీ మెదడులో ఓ కంప్యూటర్ ఉంటుంది, అది చేజింగ్‌ను ప్లాన్ చేస్తుంది’ -అభిప్రాయం

  3. బ్రిటన్ ప్రధాని రేసులోకి మళ్లీ రిషి సునక్

    ప్రధానమంత్రి పదవికి తాను పోటీలో ఉన్నానని బ్రిటన్ మాజీ ఆర్ధిక శాఖా మంత్రి, భారత సంతతికి చెందిన రిషి సునక్ వెల్లడించారు.

    ‘‘యూకే చాలా గొప్ప దేశం, ప్రస్తుతం ఆర్ధిక సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది’’ అని ఆయన అన్నారు.

    కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధానమంత్రి పదవికి తాను పోటీలోకి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు.

    తనకు పార్టీలో చాలామంది మద్దతుందని చెప్పకొచ్చారు సునక్.

    దేశం ఎదుర్కొనే సమస్యల నుంచి గట్టించేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన తన పార్టీ ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.

  4. #T20WorldCup: 'కోహ్లీ మా హీరో' అని మెల్‌బోర్న్‌లో భారత అభిమానులు అంటే, మరి పాకిస్తానీలు ఏమన్నారు...

  5. తెలంగాణలో భారత్ జోడో యాత్ర, రాహుల్ గాంధీని కలిసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

  6. INDvsPAK: విరాట్ స్వరూపంతో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

  7. IND VS PAK : మెల్‌బోర్న్ టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం

    మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన భారత్-పాకిస్తాన్ టీ ట్వంటీ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది.

    చివరి ఓవర్లో 16 పరగులు చేయాల్సి ఉన్న భారత జట్టు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆ స్కోరును సాధించి విజయాన్ని సొంతం చేసుకుంది.

    చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు సాధించాల్సి ఉండగా, అదే సమయంలో దినేశ్ కార్తీక్ అవుట్ కావడంతో మరోసారి ఉత్కంఠ పెరిగింది.

    తర్వాత రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి రాగా, తదుపరి బంతి వైడ్ కావడంతో ఒక బంతికి, ఒక పరుగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    తదుపరి బంతి ఏమవుతుందోనన్న టెన్షన్ ప్రేక్షకుల్లో మొదలైంది. ఆ తర్వాతి బంతిని అశ్విన్ సింగిల్ తీయంతో భారత జట్టు విజయ తీరాలకు చేరుకుంది.

    160 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలో తడబడింది.10 పరుగుల వద్ద రెండు వికెట్లు, 30 పరుగులు వద్ద నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఆ తర్వాత విరాట్ కోహ్లీ(82 ), హార్దిక్ పాండ్యా(40 ) ల మెరుపు బ్యాటింగ్ తో నిలదొక్కుకుంది.

    చెరి నాలుగు పరుగులు చేసి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు అవుట్ కాగా, అక్షర్ పటేల్ 2 పరుగులు వద్ద రనౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన వికెట్ కీపర్ దీనేశ్ కార్తీక్ 1 పరుగు చేసి అవుటయ్యాడు.

  8. మొబైల్ ఫోన్‌లో హాని కలిగించే కంటెంట్ నుంచి మీ పిల్లలను దూరంగా ఉంచడం ఎలా?

  9. చల్లని నీటిలో స్నానం చేస్తే మైండ్, బాడీ ఫ్రెష్ అయిపోతాయా... సైన్స్ ఏం చెబుతోంది?

  10. జైలులో జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడిపేందుకు వేయికి పైగా ఖైదీల దరఖాస్తులు

  11. ఈమె మగాళ్లకు వంట నేర్పుతారు

  12. విజయవాడలో బాణసంచా పేలి ఇద్దరు మృతి

  13. IND vs PAK: టాస్ గెలిచి... బౌలింగ్ ఎంచుకున్న భారత్

    టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య తొలి మ్యాచ్ జరుగుతోంది.

    మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్, బౌలింగ్ ఎంచుకుంది.

    భారత్ టీం: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్

    పాకిస్తాన్ టీం: బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), షాన్ మసూద్, షాదాబ్ ఖాన్, హైదర్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, అసీఫ్ అలీ, షహీన్ అఫ్రిది, హరీస్ రవుఫ్

  14. షీ జిన్‌పింగ్: ప్రపంచానికి చైనా కావాలి

    ప్రపంచంలోని ఇతర దేశాల సహకారం చైనాకు కావాలని ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అన్నారు.

    మూడోసారి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

    ‘మిగతా ప్రపంచం లేకుండా చైనా ఒంటరిగా అభివృద్ధి సాధించలేదు. అలాగే ప్రపంచానికి కూడా చైనా కావాలి. 40 ఏళ్లపాటు విరామం లేకుండా చేసిన పని వల్ల, తీసుకొచ్చిన సంస్కరణల వల్ల ఆర్థికాభివృద్ధి, దీర్ఘకాలిక సామాజిక స్థిరత్వం అనే రెండు అద్భుతాలను మనం సాధించగలిగాం’ అని ఆయన అన్నారు.

  15. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్‌గా షీ జిన్‌పింగ్!

    ఊహించినట్లుగానే చైనా సైనిక అధినేతగా షీ జిన్‌పింగ్ ఎన్నిక కానున్నారు.

    సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్‌గా షీ జిన్‌పింగ్‌ను ప్రకటించనున్నారు. అంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఆయన కమాండర్‌గా వ్యవహరిస్తారు.

    చైనా కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఎన్నికైన షీ జిన్‌పింగ్... ఇప్పటికే దేశ అధ్యక్షునిగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపుగా ఖాయమై పోయింది.

  16. సీపీసీ కొత్త పొలిట్‌బ్యూరోలో మహిళలకు లభించని స్థానం

    చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో తుది జాబితాను విడుదల చేసింది. 25 మందితో కూడిన ఈ జాబితాలో ఒక్క మహిళకు కూడా స్థానం లభించలేదు.

    స్టేట్ కౌన్సిల్ వైస్ ప్రీమియర్ అయిన సన్ చున్లాన్ ఇప్పటి వరకు పొలిట్‌బ్యూరో ఏకైక మహిళగా ఉన్నారు. ఆమెకు 72 ఏళ్లు రావడంతో ఆ పదవి నుంచి రిటైర్ అయ్యారు.

    ఆమె స్థానంలో మరొక మహిళకు అవకాశం కల్పిస్తారని భావించారు. కానీ అలా జరగలేదు.

  17. విజయవాడ: బాణసంచా దుకాణంలో పేలుళ్లు... ఇద్దరు మృతి

    విజయవాడలోని జింఖానా మైదానంలో గల ఒక దుకాణంలో బాణసంచా పేలడంతో ఇద్దరు మృతి చెందారు.

    దుకాణాలకు వచ్చిన బాణసంచాను దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో 15, 16, 17వ నంబర్‌ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి.

    నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

    పేలుడు ధ్వనులతో స్థానికులుభయంతోఇళ్ల నుంచి‌బయటకుపరుగులుతీశారు.

    మరొకవైపు శనివారం రాత్రి తిరుపతి వడమాల పేటలో మంటలు అంటుకోవడంతో బాణసంచా దుకాణాలకు మంటలు అంటుకున్నాయి.

  18. చైనా అధ్యక్షునిగా మూడోసారి షీ జిన్‌పింగ్

    షీ జిన్‌పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడు అయ్యారు.

    ఈమేరకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆయనను జనరల్ సెక్రటరీగా ఎన్నుకుంది.

    మావో తరువాత మూడోసారి చైనా అధ్యక్షునిగా బాధ్యతలు చేపడుతున్న వ్యక్తిగా రికార్డ్ సృష్టించారు షీ జిన్‌పింగ్.

    అలాగే కొత్త స్టాండింగ్ కమిటీని కూడా పార్టీ ప్రకటించింది. లీ కియాంగ్, షావో లేజీ, వంగ్ హునింగ్, కై నీ ఈ కమిటీలో ఉండనున్నారు.

    లీ కియాంగ్‌ను కొత్త ప్రధానిగా ప్రకటించారు.

  19. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.