ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
తాజా వార్తలతో రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘పవన్ దిగినప్పటి నుంచి హోటల్‌కు వెళ్లేంతవరకు పోలీసులు ఆయనను హింసించారు. వెళ్తుంటే లైట్లు ఆఫ్ చేశారు. కావాలని ఒక పోలీసు ఆయనను కదలనివ్వకుండా చేశారు. ఇది ఒక ఉన్మాద చర్య. ఒక భయంకరమైన వాతావరణం సృష్టించారు. ఆయన రాష్ట్ర పౌరుడు కాదా? ఆయన విశాఖ వెళ్లకూడదా?’’
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
తాజా వార్తలతో రేపు ఉదయం మళ్లీ కలుసుకుందాం.
ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో4వ తరగతి చదువుతున్న పిల్లల నుంచి 10వ తరగతి వరకూ అందరూ స్మార్ట్ ఫోన్ తీసుకుని వెళ్లాలంటూ ప్రాథమిక విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వాటిలో బైజూస్ కంటెంట్ అప్‌లోడ్ చేస్తారు. ఇకపై ఆ కంటెంట్ ఆధారంగా బోధన ఉంటుంది.
8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రం ప్రభుత్వమే ట్యాబ్ అందిస్తుంది. ఉచితంగా అందించే ఆ ట్యాబ్‌లో బైజూస్ సిలబస్ ఆధారంగా పాఠాలుంటాయి. వాటిని టీచర్లు పిల్లలకు బోధిస్తారు. 2023-24 విద్యా సంవవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల్లో రెగ్యులర్ పాఠాలతో పాటుగా బైజూస్ కంటెంట్ కూడా ముద్రించబోతున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.
విశాఖలో పవన్ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధ కలిగించిందని టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తూ పవన్ ఇక్కడే ఉన్నారని తెలిసి ఆయనకు సంఘీభావం తెలపడం కోసం ఇక్కడికి వచ్చాను అని ఆయన చెప్పారు.
‘‘ప్రజాస్వామ్యంలో పోలీసులు చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యమంత్రి , ప్రతిపక్షాల నేతలు మీటింగ్‌లు పెట్టినప్పుడు అవి జరిగేలా చూడటం. కానీ, పవన్ విశాఖ కార్యక్రమం పట్ల పోలీసుల తీరు బాలేదు.
పవన్ దిగినప్పటి నుంచి హోటల్‌కు వెళ్లేంతవరకు పోలీసులు ఆయనను హింసించారు. వెళ్తుంటే లైట్లు ఆఫ్ చేశారు. కావాలని ఒక పోలీసు ఆయనను కదలనివ్వకుండా చేశారు. ఇది ఒక ఉన్మాద చర్య. ఒక భయంకరమైన వాతావరణం సృష్టించారు. ఆయన రాష్ట్ర పౌరుడు కాదా? ఆయన విశాఖ వెళ్లకూడదా?
ఏదో నోటీసు ఇచ్చి విశాఖ నుంచి పంపించారు. లా అండ్ ఆర్డర్‌ను మీరు ఉల్లంఘిస్తూ మాపై కేసులు పెడతారా? ఇదేం ప్రజాస్వామ్యం.
రాష్ట్రంలో మూడున్నరేళ్లుగా ప్రజాస్వామ్యం లేదు. రాజకీయ పార్టీలకు మనుగడ లేకుండా చేస్తున్నారు. రాజకీయ పార్టీలు లేకపోతే ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారు.
మనుషుల్ని నిర్వీర్యం చేయడం కోసం వ్యక్తిగత దాడుల్ని చేస్తున్నారు. ఎవరైనా తిరిగి మాట్లాడితే కేసులు పెట్టి జైళ్లో పెడుతున్నారు.
మీడియాకు, ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయింది. వీళ్ల హింస తట్టుకోలేక చాలామంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పవన్‌ను కలిసి సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చా.
నా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో చాలా రాజకీయ పార్టీలను చూశా. కానీ, వైసీసీ అంత నీచమైన పార్టీని చూడలేదు. మమ్మల్ని మానసిక క్షోభ పెడితే, శారీరకంగా బాధ పెడితే ఈ ముఖ్యమంత్రి ఆనందిస్తున్నారు.
అవసరమైతే మేం మళ్లీ కలుస్తాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే మా కర్తవ్యం.
వపన్‌కు విజ్ఞప్తి చేస్తున్నా అందరం కలుద్దాం. కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ఈరోజు పవన్ పట్ల జరిగిన దానికి మీరు ఇంట్లో ఉంటే, రేపు మీకు ఏదైనా జరిగితే అడిగేవారు ఎవరూ ఉండరు’’ అని చంద్రబాబు అన్నారు.
అందరూ నాకు మద్దతుగా ఉన్నారు: పవన్ కల్యాణ్
ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న ఈ సందర్భంలో, జన సైనికులను అన్యాయంగా జైల్లో పెట్టి ఇబ్బందులు పెడుతున్న ఈ సమయంలో అన్ని రాజకీయ పార్టీలు తనకు ఫోన్ చేసి మద్దతుగా నిలుస్తున్నాయని పవన్ కల్యాణ్ చెప్పారు.
తెలంగాణ నుంచి జగ్గారెడ్డి , తీన్మార్ మల్లన్న, సీపీఐ రామకృష్ణ తనకు మద్దతు ప్రకటించారని తెలిపారు.
‘‘మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాకు సంఘీభావం తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.
ప్రజాస్వామ్యం బతకాలంటే పార్టీలు ఉండాలి. పార్టీలు నడిపే వ్యక్తుల్ని నలిపేస్తాం అంటే ఎలా?
నా సొంత మిత్ర పక్షమైన బీజేపీపై కూడా అన్యాయంగా కేసులు పెట్టారు. ఢిల్లీకి వెళ్లి బీజీపీ నేతలకు తిరుపతి లడ్డూ ఇచ్చి, ఇక్కడి బీజేపీ నేతల్ని అరెస్ట్ చేస్తారు. మాకే ఇలా జరుగుతుంటే సగటు మనిషి పరిస్థితి ఏంటి?
అవసరమైతే మేం పదిసార్లు మాట్లాడుకుంటాం. ఇది ఎన్నికలకు సంబంధించి అంశం కాదు, ప్రజాస్వామ్యం బతికించేందుకు మేం చర్చలు జరిపాం’’ అని పవన్ కల్యాణ్ మాట్లాడారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై జస్టిస్ ఆర్ముగసామి కమిటీ సమర్పించిన నివేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ముందుంచింది.
వీకే శశికళ, జయలలిత వైద్యుడు కేఎస్ శివకుమార్, అప్పటి హెల్త్ సెక్రటరీ జె.రాధాకృష్ణన్, ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మాజీ మంత్రి విజయభాస్కర్‌ల తప్పిదం ఉన్నట్లు ఆర్ముగసామి నివేదిక పేర్కొందని ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది. వారిపై విచారణకు కమిటీ ఆదేశించిందని పేర్కొంది.
జయలలిత 2016 డిసెంబర్ 5న మరణించినట్లు ఆసుపత్రి ప్రకటించినప్పటికీ తమకు లభించిన ఆధారాల ప్రకారం ఆమె ముందు రోజే అంటే.. డిసెంబర్ 4న మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.50 గంటల మధ్య మరణించారని కమిటీ తన నివేదికలో వెల్లడించింది.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌కు యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కూలిపోయింది.
ఈ ఘటనలో ఆరుగురు మరణించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
ప్రమాద స్థలానికి అధికారులు చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.
ప్రమాద సమయంలో హెలికాప్టర్లో పైలట్ సహా ఆరుగురు ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రతికూల వాతావరణం కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.
గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్ వెళ్తుండగా కేదార్‌నాథ్‌కు 2 కిలోమీటర్ల దూరంలో గరుడచట్టి వద్ద ఈ ప్రమాదం జరిగినట్లుగా అధికారులు తెలిపారు.
బాలీవుడ్ నటి నోరా ఫతేహీ నృత్య ప్రదర్శనకు బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నోరా ఫతేహీ డ్యాన్స్ షో జరగాల్సి ఉంది.
అక్కడి ఉమెన్ లీడర్షిప్ కార్పొరేషన్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో నోరా డ్యాన్స్ షో ఏర్పాటు చేశారు, అనంతరం ఆమె అవార్డులను కూడా ప్రదానం చేయాల్సి ఉంది.
అయితే, ఆ దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేదు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దేశ సెంట్రల్ బ్యాంక్ విదేశీ మారక ద్రవ్య నిల్వల వినియోగంపై ఆంక్షలు విధించడంతో ఈ కార్యక్రమానికి అనుమతులు నిరాకరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
అక్టోబర్ 12 నాటికి బంగ్లాదేశ్‌లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 36.33 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. ఇది ఆ దేశం నాలుగు నెలల్లో చేసుకునే దిగుమతులకు చెల్లించడానికి మాత్రమే సరిపోతుంది. ఈ నేపథ్యొంలోనే సెంట్రల్ బ్యాంక్ అక్కడ ఆంక్షలు విధించింది.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మంగళవారం ఉదయం నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలలో సోదాలు చేస్తోంది.
పంజాబ్, హరియాణా, రాజస్థాన్, దిల్లీలలోని వివిధ ప్రాంతాలలో మిలిటెంట్ గ్రూపులతో సంబంధాలున్నవారు, గ్యాంగ్‌స్టర్ల ఇళ్లు, అడ్డాలపై దాడులు చేసింది.
ఆయా రాష్ట్రాల పోలీసు విభాగాలతో కలిసి ఎన్ఐఏ ఈ సోదాలు చేపట్టింది.
గత నెల 12న కూడా ఈ రాష్ట్రాలలోని 50 చోట్ల ఎన్ఐఏ సోదాలు చేపట్టింది.
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం కర్నూలు జిల్లాలోని హాలహర్వి మండలంలో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఆ ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు, పార్టీ జెండాలు పెద్దసంఖ్యలో కనిపించాయి.
రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ చిత్రాలతో పాటు భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ నేతల చిత్రాలు పెట్టారు.కూడళ్లు కాంగ్రెస్ జెండాలతో నిండిపోయాయి.
నాలుగైదు రోజులుగా పీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆలూరులో ఉంటూ స్థానిక నాయకులు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ, తాలుకా ఇన్‌ఛార్జి బాషాతో భారత్ జోడో యాత్ర కోసం ఏర్పాట్లు చేశారు.
మరోవైపు పాదయాత్రపై రెవెన్యూ అధికారులు, పోలీసులు సమీక్ష నిర్వహించారు.హాలహర్వికి వందలాది మంది పోలీసులు చేరుకున్నారు. ఏఆర్ సహాయ ఎస్పీ నాగబాబుతో పాటు ఇతర అధికారులు పోలీసులకు సలహాలు, సూచనలు జారీ చేశారు.
మంగళవారం రాత్రికి ఆదోని మండలం చాగి గ్రామ సమీపంలోని పొలాల్లో రాహుల్ గాంధీ బస చేస్తుండడంతో ప్రత్యేక గుడారాలు, డైనింగ్ హాల్ వంటివి ఏర్పాటు చేశారు.
ఫ్లడ్‌లైట్లు అమర్చారు. పాదయాత్రగా వచ్చే ప్రతినిధులు అందరూ ఇక్కడే భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు.
బుధవారం ఉదయం చాగి గ్రామం నుంచి ఆదోని పట్టణం మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.
పట్టణంలోని పాతబస్టాండు కూడలి వద్ద ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని.. ఆ తర్వాత ఆదోని ఆర్ట్స్ కళాశాలలో సాయంత్రం వరకు బస చేస్తారని పార్టీ నాయకులు తెలిపారు. ఆ తర్వాత ఆదోని మండలం అరేకల్లు గ్రామం వరకు పాదయాత్ర కొనసాగించి అక్కడే ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో రాహుల్‌గాంధీ బస చేస్తారు.
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ అప్డేట్ల కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.