You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అమూల్ పాల ధరలు దేశవ్యాప్తంగా పెంపు... గుజరాత్‌లో తప్ప

ఫుల్ క్రీం, గేదె పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్న అమూల్ ప్రకటించింది. అంటే ఎంఆర్‌పీ మీద 4శాతం పెంచినట్లుగా తెలిపింది. పాల ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్లే ధరలు పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.

లైవ్ కవరేజీ

  1. స్టాలిన్: ‘హిందీని రుద్దితే దేశ ప్రజల మధ్య సోదరభావం దెబ్బ తింటుంది’

  2. ఆంధ్రప్రదేశ్: గ్రామ పంచాయతీల్లోని నిధులు ఎలా మాయం అవుతున్నాయి, సర్పంచులు ఎందుకు రోడ్డెక్కారు

  3. హిజాబ్ నిరసనలు: ఇరాన్‌ మహిళల్లో అసలు ఈ ఆగ్రహం ఎప్పటిది?

  4. కాంతార మూవీ రివ్యూ: ఒక హీరోకి ఈ కథ చెప్పి ఒప్పించడం కష్టం

  5. పాకిస్తాన్ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటని బైడెన్ ఎందుకు అన్నారు?

  6. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం.

    మళ్లీ రేపు ఉదయం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో మళ్లీ కలుద్దాం.

  7. విశాఖపట్నంలో మంత్రుల కాన్వాయ్ మీద దాడి... అసలేం జరిగింది?

  8. రామప్ప పట్టు చీరలు... వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా?

  9. అమూల్ పాల ధరలు పెంపు... ఒక్క గుజరాత్‌లో తప్ప

    పాల ఉత్పత్తి సంస్థ అమూల్ దేశవ్యాప్తంగా పాల ధరలను పెంచింది. కానీ త్వరలోనే ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌కు మాత్రం మినహాయింపు ఇచ్చింది.

    ఫుల్ క్రీం, గేదె పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్న అమూల్ ప్రకటించింది. అంటే ఎంఆర్‌పీ మీద 4శాతం పెంచినట్లుగా తెలిపింది.

    పాల ఉత్పత్తి ఖర్చులు పెరగడం వల్లే ధరలు పెంచినట్లు వెల్లడించింది.

    ఇక మదర్ డెయిరీ కూడా దిల్లీలో గేదె, ఆవు(ఫుల్ క్రీం) పాల ధరలను లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది.

  10. రోహిత్ శర్మ ఫ్యాన్‌ను హత్య చేసిన విరాట్ కోహ్లీ వీరాభిమాని... అసలేం జరిగింది?

  11. మహిళల ఆసియా కప్‌ను 7వ సారి గెలిచిన టీమ్ ఇండియా... ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ, విరాట్ కోహ్లీ

  12. విశాఖ గర్జన: ‘మంత్రుల కాన్వాయ్ మీద జనసేన కార్యకర్తల దాడి’, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

    ‘విశాఖ గర్జన’ ముగించుకుని తిరిగి ఎయిర్‌పోర్టుకు వెళుతున్న ఏపీ మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు.

    విశాఖ పర్యటన కోసం పవన్ కల్యాణ్ వైజాగ్ ఎయిర్‌పోర్టకు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు భారీగా జనసేన కార్యకర్తలు, నాయకులు, పవన్ అభిమానులు వచ్చారు.

    అదే సమయంలో ‘విశాఖ గర్జన’ ముగించుకొని మంత్రులు రోజా, జోగి రమేశ్‌తోపాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అప్పుడే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు.

    లోపలికి వెళ్తున్న సమయంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు తమ కార్లపై దాడి చేశారని మంత్రి జోగి రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా దిలీప్ అనే సహాయకుడికి గాయాలు అయ్యాయని ఆయన వెల్లడించారు.

    తమపై దాడి చేశారంటూ ఎయిర్‌పోర్ట్ పోలీసులకు వైవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు.

    ఒకవైపు విశాఖ గర్జన మరోవైపు పవన్ కల్యాణ్ రాకతో ఇవాళ ఉదయం నుంచి విశాఖలో వాతావరణం హడావిడిగా ఉంది.

  13. ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా: 'మెదడే ఎక్కువ ప్రమాదకరం, ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన అవసరం లేదు' అన్న సుప్రీం కోర్టు, బాంబే హైకోర్టు తీర్పు రద్దు

  14. తుర్కియె గనుల్లో పేలుడు, 40 మందికి పైగా మృతి

    తుర్కియె ఉత్తర ప్రాంతంలో ఉన్న బొగ్గు గనుల్లో సంభవించిన భారీ పేలుడులో 40 మందికి పైగా చనిపోయినట్లు భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ హోం మంత్రి సులేమాన్ సోయిలు తెలిపారు.

    ఈ గనుల నుంచి 58 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని, ఇంకా పది మందికి పైగా లోపలే ఉన్నారని సులేమాన్ చెప్పారు.

    శుక్రవారం పేలుడు సంభవించినప్పుడు గని లోపల దాదాపు 110 మంది ఉన్నారు. వారిలో సగం మంది 300 మీటర్ల లోతున పని చేస్తున్నారు.

    నల్ల సముద్రం తీరంలోని ఈ అంసారా మైన్ నుంచి బయటపడ్డ వారు పూర్తిగా మసి కొట్టుకుపోయి కనిపించారు. పేలుడు వార్త తెలిసిన వెంటనే గనిలో పని చేస్తున్న వారి బంధువులు, మిత్రులు అక్కడికి చేరుకున్నారు.

    బొగ్గు గనుల్లో పేలుడుకు ఉపయోగించే మిథేన్ మిశ్రమం మూలంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని తుర్కియె అంధన మంత్రి తెలిపారు.

    తుర్కియె అధ్యక్షుడు రెసెప్ ఎర్దొగాన్ ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు వస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

    ప్రమాదం సంభవించిన గని ప్రభుత్వ రంగ సంస్థ అయిన టర్కిష్ హార్డ్ కోల్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందినది. తుర్కియె పశ్ఛిమ ప్రాంతంలోని సోమాలో 2014లో జరిగిన మైనింగ్ పేలుడులో 301 మంది చనిపోయారు.

  15. కాంతార మూవీ రివ్యూ: సినిమా అంతా ఒక లెవెల్లో ఉంటే చివరి పది నిమిషాలది మరో లెవెల్

  16. ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ గెలుపు... 7వ సారి కప్ కైవసం

    మహిళల టీ20 ఆసియాకప్ ఫైనల్ పోరులో శ్రీలంక మీద 8 వికెట్ల తేడాతో టీం ఇండియా గెలిచింది. దీంతో 7వ సారి కప్‌ను కైవసం చేసుకుంది.

    శ్రీలంక విధించిన 66 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి సాధించింది భారత్. 8.3 ఓవర్లలో 71 పరుగులు చేసింది. స్మృతి మంధన 25 బంతుల్లో 51 పరుగులు తీసి విజయంలో కీలక పాత్ర పోషించింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 65 పరుగులు మాత్రమే చేసింది.

    ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

    రేణుక సింగ్ 3, రాజేశ్వరి గైక్వాడ్ 2, స్నేహా రాణా 2 వికెట్లు తీశారు.

    రికార్డు స్థాయిలో 7వ సారి

    భారత్ రికార్డు స్థాయిలో 7సార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది.

    2004లో తొలిసారి మహిళల ఆసియా కప్‌ను ప్రారంభించారు. అప్పుడు అది వన్డే ఫార్మెట్‌లో ఉండేది. ఆ తరువాత దాన్ని టీ20 ఫార్మెట్‌లోకి మార్చారు.

    2022 ఆసియా కప్ టోర్నమెంట్ 8వది. 2018లో తప్ప మిగతా టోర్నీలన్నీ భారత్ గెలిచింది.

  17. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ నిర్మించారు, స్థానికుల జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి

  18. ప్రొ.సాయిబాబాకు జీవిత ఖైదు రద్దు నిర్ణయంపై సుప్రీం కోర్టు స్టే

    దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, మరో ఐదుగురి యావజ్జీవ శిక్షను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

    జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన స్పెషల్ బెంచ్ ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా దీనిని సునిశితంగా పరిశిలిస్తామని ధర్మాసనం పేర్కొంది.

    మరోవైపు తనను హౌస్ అరెస్టులో ఉంచాలన్న సాయిబాబా విజ్ఞప్తిని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.

    మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో సాయిబాబా 2017 నుంచి యావజ్జీవ కారాగార శిక్షను అనుభవిస్తున్నారు.

    శుక్రవారం(అక్టోబర్ 14)నాడు బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ సాయిబాబాతోపాటు మరో ఐదుగురి శిక్షను రద్దు చేస్తూ తీర్పు ప్రకటించింది.

    అయితే, ఈ ఆదేశాలను మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేయగా, న్యాయస్థానం ఈ నిర్ణయంపై స్టే విధించింది.

    కోర్టులో ఏం జరిగింది?

    శనివారం సెలవు దినం అయినప్పటికీ, ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది.

    తనను జైలు నుంచి బయటకు రావడానికి అనుమతించాలని, గృహనిర్బంధంలో ఉంచవచ్చని, అవసరమైతే కోర్టు తనపై కొన్ని ఆంక్షలను విధించవచ్చన్న సాయిబాబా పిటిషన్ ను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది.

    బెయిల్ కోసం సాయిబాబా దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది.

    మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సాయిబాబా తరఫున సీనియర్ లాయర్ బసంత్ ల వాదనలు విన్న తర్వాత సుప్రీం కోర్టు తన ఆదేశాలను వెలువరించింది.

    సాయిబాబాకు 55 సంవత్సరాలని, 90శాతం వైకల్యంతో వీల్‌చైర్ లోనే ఉంటారని, మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లు ఆయన రాజ్యంపై యుద్ధం చేసే చర్యల్లో పాల్గొనలేదని సాయిబాబా తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు విన్నవించారు.

    అనేక చట్ట విరుద్ధ కార్యకలాపాలకు సాయిబాబాయే మాస్టర్ మైండ్ అని ప్రభుత్వం వాదిస్తోదని, కానీ, అది నిజం కాదని బసంత్ అన్నారు.

  19. కేరళలో నరబలి: నిందితుడి ఇంటి వెనుక 61 శరీర భాగాలు- బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

    కేరళలో నరబలికి సంబంధించి విస్మయానికి గురిచేసే మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక తమిళ మహిళ సహా ఇద్దరు మహిళలను కొందరు నిందితులు అపహరించి నరబలి ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

    ఈ ఘటన కేరళలోని ఎళంథూర్‌లో చోటుచేసుకుంది. అయితే, నిందితుల్లో ఒకరైన షఫీ ఇలాంటి హత్యలు చాలా చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.

    నిందితుల్లో ఒకరైన భగావల్ సింగ్ ఇంటికి సమీపంలో నివసించే ఓ మహిళ బీబీసీతో మాట్లాడారు. ఆమె తమిళనాడులోని దిండిగల్‌కు చెందినవారు. మంత్రగాడిగా చెప్పుకునే షఫీ వలలో తను కూడా పడబోయానని, కానీ, తృటిలో తప్పించుకున్నానని ఆమె తెలిపారు. ఆమె తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు.

  20. తెలుగు నేల మీద ఉన్న ఈ దీవులను చూస్తే విదేశీ యాత్రకు వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది

    పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, మధ్యలో సరస్సు, మధ్యలో వేలాడే వంతెనలు.. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే లక్నవరం వెళ్లాల్సిందే.

    వరంగల్ జిల్లాలో ఉండే ఈ లక్నవరం సరస్సులో హై సస్పెన్షన్ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణ. నీటిపై తేలుతున్నట్లు కనిపించే ఈ వంతెనపై నడుస్తూ చుట్టూ ఉన్న కొండలను, దీవులను చూస్తుంటే హాయిగా అనిపిస్తుంది. బోటింగ్ చాలా హుషారుగా ఉంటుంది.