You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

జ్ఞానవాపి మసీదు: శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయించాలనే పిటిషన్‌ను తిరస్కరించిన వారణాసి కోర్టు

జ్ఞానవాపి మసీదులో ఉందని చెబుతున్న శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయించాలని వేసిన పిటిషన్‌ను వారణాసి కోర్టు తిరస్కరించింది.

లైవ్ కవరేజీ

  1. హిజాబ్‌ తమ హక్కు అని కర్ణాటకలో అంటుంటే, ఇరాన్‌లో వ్యతిరేకిస్తున్నారెందుకు? - వీక్లీ షో విత్ జీఎస్

  2. ధన్యవాదాలు!

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.

  3. దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల పై వివరణ కోరిన జాతీయ మానవ హక్కుల కమిషన్

    భారతదేశంలోని కొన్ని దేవాలయాల్లో కొనసాగుతున్న దేవదాసీ వ్యవస్థను రూపుమాపేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను తెలపాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరంగా చెప్పాలని కోరింది.

    మీడియాలో వచ్చిన వార్తా కథనాన్ని పరిశీలనలోకి తీసుకుని జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్సులకు, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర కార్యదర్శులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.

    నివేదికను ఆరు వారాలలోగా సమర్పించాలని కోరారు.

    "దేవదాసీ విధానాన్ని రూపుమాపేందుకు చాలా చట్టాలను రూపొందించినప్పటికీ ఈ వ్యవస్థ కొనసాగుతోంది. ఈ విధానాన్ని సుప్రీం కోర్టు కూడా విమర్శించింది" అని నోటీసు పేర్కొంది.

    దేవదాసీ వ్యవస్థ మహిళలను లైంగిక వేధింపులకు గురి చేసి వేశ్యా వృత్తిలోకి నెట్టేస్తోందని అంటూమహిళలు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కును హరిస్తోందని అంది.

    దేవదాసీ వ్యవస్థలో పేద, షెడ్యూల్డ్ కులాలు, జాతులకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు మీడియా నివేదికలో తెలిపారు.

  4. బ్రిటన్ ఆర్ధిక మంత్రిని పదవి నుంచి తొలగింపు

    బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ఆర్ధిక మంత్రి క్వాసీ క్వార్‌టెంగ్‌ను పదవి నుంచి తొలగించారు. ఆ పదవిని మాజీ ఆరోగ్య, విదేశీ కార్యదర్శి జెరేమి హంట్‌కు ఇచ్చారు.

    కార్పొరేట్ దిగ్గజాలకు పన్ను రాయితీలు ఇస్తానని క్వార్‌టెంగ్ ప్రకటించిన మూడు వారాలకే ఆయనను పదవి నుంచి తొలగించారు.ఆయన చేసిన ప్రకటన బ్రిటన్‌లో ఆర్ధిక సంక్షోభానికి దారి తీసింది.

    ట్రజ్ ఆర్ధిక దార్శనికతకు పూర్తి మద్దతిస్తానని క్వార్‌టెంగ్ తన లేఖలో పేర్కొన్నారు.

    ప్రధాని దేశ ఆర్ధిక ప్రణాళికలను పునరాలోచించుకోవాలని పార్టీ నుంచి ఒత్తిడి వస్తోందని టోరీ పార్లమెంట్ సభ్యులొకరు బీబీసీకి చెప్పారు.

  5. #UnstoppableWithNBKS2: '1995లో మనం తీసుకున్న బిగ్ డెసిషన్ తప్పా?' - బాలకృష్ణ, చంద్రబాబు టాక్ షోపై సోషల్ రియాక్షన్స్

  6. చంద్రుడు ఆడా, మగా?

  7. బాలీవుడ్‌‌ ఎందుకు దక్షిణాది సినిమాల వెంట పడుతోంది?

  8. ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి

  9. షీ జిన్‌పింగ్: చైనా అధ్యక్షుడిగా మూడోసారి పగ్గాలు చేపట్టబోతున్న ఈ నిరంకుశ నేత కథేంటి?

  10. జ్ఞానవాపి మసీదు:శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయించాలనే పిటిషన్‌ను తిరస్కరించిన వారణాసి కోర్టు

    జ్ఞానవాపి మసీదులో ఉందని చెబుతున్న శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయించాలని వేసిన పిటిషన్‌ను వారణాసి కోర్టు తిరస్కరించింది. మసీదులో ఉన్న శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయించాలంటూ నలుగురు మహిళలు బెనారస్ జిల్లా జడ్జి కోర్టులో పిటిషన్ నమోదు చేశారు.

    శాస్త్రీయ పరిశీలన ద్వారా మసీదు లోపల ఉందని చెబుతున్న శివలింగం పొడవు, వెడల్పు, లోతు తెలుసుకోవాలని వారు కోరారు. ఈ పరిశీలన చేసిన తర్వాతే ఇది లింగమా లేదా ఫౌంటెన్ అనే విషయం తెలుస్తుందని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.

    మరో వైపు, ముస్లిం పక్షాలు ఈ డిమాండ్‌ను వ్యతిరేకించాయి. కార్బన్‌ను పీల్చే వస్తువులకు మాత్రమే కార్బన్ డేటింగ్ చేస్తారనిఅంజుమాన్ ఇంతెజామియా మసీదు కమిటీ తరుపున వాదించిన ఆఖ్లాక్ అహ్మద్ పేర్కొన్నారు.

    "మనిషి మరణించినప్పుడు ఎముకలను పరిశీలించవచ్చు. జంతువులు, చెట్లకు కూడా కార్బన్ డేటింగ్ చేయవచ్చు.రాళ్లు, చెక్కలకు కార్బన్ డేటింగ్ చేయలేము. అవి కార్బన్‌ను గ్రహించలేవు" అని ఆయన అన్నారు.

    ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది.

    ఈ ఏడాది మేలో జ్ఞానవాపి మసీదును సర్వే చేసిన తర్వాత హిందూ వర్గాలు మసీదు మధ్యలో ఉన్న వాజూఖానాలో శివలింగం ఉందని వాదించాయి. ఈ సర్వే తర్వాత కింది కోర్టు ఆ ప్రాంతాన్ని సీల్ చేయాలని ఆదేశించింది.

  11. ఇరాన్ నిరసనలు: ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న జెన్ Z అమ్మాయిలు

  12. ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించిన రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర'

    'భారత్ జోడో' పాదయాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ నేడు కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి అడుగుపెట్టారు.

    ఉదయం 7.30 నిమిషాలకు ప్రారంభమైన యాత్ర అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గంలోని డీ హీరేహాల్ మాదన హళ్లి మీదుగా మారెమ్మ దేవాలయం వద్దకు చేరుకుంది. అక్కడ యాత్రకు విరామం ఇచ్చారు.

    అనంతరం, డీహిరేహాల్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం అయ్యారు. ఈ రోజు సాయంత్రం 4.00 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమై, ఓబుళాపురం గ్రామం మీదుగా సాగి సాయంత్రం 7.00 గంటలకు చెక్ పోస్ట్ వద్ద కర్ణాటకలోని బళ్లారి జిల్లాలోకి ప్రవేశిస్తారు.

    రాహుల్ గాంధీకి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆంధ్ర నాయకులతోపాటు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాహుల్ వెంట నడిచారు.

    ఈ నెల 17వ తేదిన రాహుల్ గాంధీ మళ్లీ కర్ణాటక నుంచి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోనికి చేరుకుంటారు. కర్నూలు జిల్లా రూట్ షెడ్యూల వివరాలను కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.

    17 తేదీన కర్ణాటక నుంచి కర్నూలు జిల్లా సరిహద్దు క్షేత్రగుడి వద్దకు ప్రవేశిస్తారు. రాత్రికి అక్కడే రాహుల్ గాంధీ బస.

    18న హాలహర్వి మండలం క్షేత్రగుడి నుంచి ఉదయం 6.00 గంటలకు భారత్ జోడో యాత్ర ప్రారంభం అవుతుంది. అదే రోజు ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో విరామం. 19న మనేకుర్తి గ్రామం నుంచి ఆదోని మండలం ఛాగిలోకి ప్రవేశిస్తారు.

  13. ప్రొఫెసర్ సాయిబాబాకు జీవిత ఖైదు శిక్షను కొట్టివేసిన బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్

  14. జూమ్ యాప్ వాడకం ప్రమాదమని కేంద్రం హెచ్చరిక

    వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫారం జూమ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీవ్ర ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు అందులోకి ప్రవేశించి హానికరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పేర్కొంది.

    ప్రభుత్వ సంస్థ 'ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్' (CERT-In) గురువారం ఒక సూచన జారీ చేస్తూ, జూమ్ ఉత్పత్తులలో ఉన్న లోపాల గురించి హెచ్చరించింది. జూమ్ రెండు వెర్షన్లలోనూ (సాఫ్ట్‌వేర్) ఈ లోపాలు కనిపించాయని తెలిపింది.

    జూమ్‌లోని లోపాలు చాలా తీవ్రమైనవని CERT-In వివరించింది. వీటి వలన సైబర్ నేరగాళ్లు వ్యక్తిగత భద్రతా పరిమితులను తప్పించుకుని సిస్టంలోకి ప్రవేశించవచ్చు. సిస్టంలో ఉన్న కోడ్‌లను ఉపయోగించడం లేదా సేవలను తిరస్కరించడం లాంటి పనులు చేయగలరు.

    నేరస్థులు జూమ్ క్లయింట్‌లో నడుస్తున్న జూమ్ యాప్‌లకు కనెక్ట్ చేయవచ్చు లేదా నియంత్రించవచ్చు. దీని ద్వారా జూమ్ మీటింగ్‌లో పాల్గొనేవారికి ఆడియో, వీడియో యాక్సెస్‌ను బ్లాక్ చేయవచ్చు లేదా అంతరాయం కలిగించవచ్చు.

    ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సవరణ) చట్టం, 2008లో CERT-Inకు అధికారాలు ఇచ్చారు.

    కంప్యూటర్ భద్రతకు సంబంధించిన ఘటనలపై దృష్టి సారించడం, లోపాలను గుర్తించడం, ఐటీ భద్రతను బలోపేతం చేయడం దీని పని. బగ్‌లు, హ్యాకింగ్, ఫిషింగ్ దాడుల గురించి ఇది సమాచారం అందిస్తుంది.

  15. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్!

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలు, విశేషాల కోసం ఈ పేజీని ఫాలో అవుతూ ఉండండి.

  16. ఏపీజే అబ్దుల్‌ కలాం: ఈ మిసైల్ మ్యాన్‌ను ప్రజల రాష్ట్రపతి అని ఎందుకంటారు?