జైశంకర్: ఆయుధాలు ఎవరి దగ్గర కొనాలనేది పూర్తిగా మా ఇష్టం... మా ప్రయోజనాలే ముఖ్యం

బాల నటిగా కెరియర్ ప్రారంభించిన ఆశా పరేఖ్ హిందీలో అనేక సినిమాలలో నటించారు

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  2. ‘ఆయుధాలు కొనడమనేది పూర్తిగా మా ఇష్టం’

    ఆయుధాలు కొనడమనేది పూర్తిగా భారత ప్రయోజనాల మీద ఆధారపడి ఉంటుందని విదేశాంగ శాఖ మంత్ర ఎస్.జైశంకర్ అన్నారు.

    ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ అయ్యారు.

    ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన అమెరికా, భారత్ బంధాల బలోపేతానికి కలిసి పని చేస్తామని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదంలో ఎదుర్కోవడంలో అమెరికా నుంచి భారత్‌కు మంచి మద్దతు లభించందని అందుకు ధన్యవాదాలు తెలిపారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. నటి ఆశాపరేఖ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు

    నటి ఆశాపరేఖ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
  4. Mushroom Farming: ‘తక్కువ పెట్టుబడితో ఇంట్లోనే చేసుకునే బిజినెస్ ఇది, ఆదాయానికి ఢోకా లేదు’

  5. మేడిన్ ఇండియా ఐఫోన్లు: చైనా నుంచి భారత్‌కు మారిన కొత్త ఐఫోన్ల తయారీ.. యాపిల్ ప్రకటన

  6. గుజరాత్: ఆవులను ప్రభుత్వ కార్యాలయాల్లోకి తోలుతున్నారు.. వాటి మూత్రం, పేడను ఆఫీసుల్లో వేస్తున్నారు.. ఎందుకు?

  7. షింజో అబే అంత్యక్రియలకు హాజరైన మోదీ.. అధికారికంగా అంత్యక్రియలను జపాన్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

  8. మెక్సికోలో యూదు తెగ నుంచి చిన్నారులు, టీనేజర్లను రక్షించిన పోలీసులు

    ఈ తెగ పిల్లలు కొందరు చియాపాస్‌లోని వలస శిబిరంలో నిరసన తెలుపుతున్న దృశ్యాలు కనిపించాయి

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ఈ తెగ పిల్లలు కొందరు చియాపాస్‌లోని వలస శిబిరంలో నిరసన తెలుపుతున్న దృశ్యాలు కనిపించాయి

    మెక్సికో లోని అడవిలో ఓ యూదు తెగ ఆవరణ నుంచి పలువురు చిన్నారులు, టీనేజర్లను పోలీసులు తమ స్వాధీనం చేసుకున్నట్లు బీబీసీకి తెలిసింది.

    లెవ్ టాహోర్ అనే యూదు బృందం.. మైనర్లను అక్రమ రవాణా చేస్తోందన్న అనుమానంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    లెవ్ టాహోర్ (హిబ్రూ భాష పదానికి స్వచ్ఛమైన హృదయం అని అర్థం) బృందం విపరీత ధోరణులు, ఆచారాలను పాటిస్తుందనే పేరుంది. సభ్యులపై కఠిన నియమాలను విధిస్తుంది.

    బాల్య వివాహాలను ప్రోత్సహిస్తుంది. మూడేళ్ల బాలికలు సహా యువతులందరూ తమ శరీరాలను పూర్తిగా వస్త్రాలతో కప్పుకోవాలని నిబంధన పెడుతుంది. ఈ నియమాలను స్వల్పంగా ఉల్లంఘించినా కూడా కఠినమైన శిక్షలను అమలు చేస్తుంది.

    అందువల్ల ఈ బృందానికి ‘యూదు తాలిబాన్’ అనే పేరు కూడా వచ్చింది. అఫ్గానిస్తాన్‌ను పాలిస్తున్న సున్నీ ముస్లిం తీవ్రవాద సంస్థ తాలిబాన్ కూడా మహిళలపై ఇదే విధమైన వస్త్రధారణ నియమాలను విధిస్తుంది.

    మెక్సికోలోని తపాచులా నగరానికి ఉత్తరంగా 11 మైళ్ల దూరంలో అడవిలో ఉన్న లెవ్ టాహోర్ ఆవరణలోకి పోలీసులు శుక్రవారం ఉదయం ప్రవేశించారు.

    అక్కడ ఉన్న బాలబాలికలను పోలీసులు తీసుకెళ్లకుండా నివారించటానికి ఈ బృందం సభ్యులు ఆ చిన్నారులకు హాని చేసే ప్రమాదం ఉన్నందున, బాలిబాలికలను మిగతా బృంద సభ్యుల నుంచి వేగంగా వేరు చేశారని ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న అభిజ్ఞవర్గాలు తెలిపాయి.

    ఈ బాలిబాలికలను వారి బంధువులు ఉన్న ఇజ్రాయెల్‌కు విమానాల ద్వారా తరలిస్తున్నారు.

    ఈ తెగ మీద ఇజ్రాయెల్ బృందం, మెక్సికో పోలీసులు కొన్ని నెలలుగా నిఘా పెట్టారు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, ఈ తెగ మీద ఇజ్రాయెల్ బృందం, మెక్సికో పోలీసులు కొన్ని నెలలుగా నిఘా పెట్టారు

    ఇజ్రాయెల్‌కు చెందిన మాజీ మెసాద్ ఏజెంట్లు సహా నలుగురు సభ్యులతో కూడి స్వచ్ఛంద సేవకుల బృందంతో కలిసి మెక్సికో పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

    లెవ్ టాహోర్ బృందంలో ఉన్న కొందరి బంధువు ఒకరు మొసాద్ మాజీ ఏజెంట్ల సాయం కోరటంతో రెండేళ్ల కిందట ఈ ఆపరేషన్ ప్రణాళిక ప్రారంభమైంది.

    ఈ బృందం నుంచి 2018లో పారిపోయిన ఓ తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు న్యూయార్క్ చేరుకోగా.. ఆ పిల్లలను ఈ బృందం మళ్లీ అపహరించుకుని పోయింది. మూడు వారాల తర్వాత ఆ పిల్లలను మెక్సికోలో స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచీ గ్వాటెమల లోని లెవ్ టాహార్ నాయకత్వం మీద నిఘా పెట్టారు.

    ఈ తెగ సభ్యులు తొమ్మిది మంది ఆ కిడ్నాప్ కేసులో అభియోగాలు నమోదు చేశారు. నలుగురికి జైలుశిక్ష విధించారు. ఒకరు దోషిగా నిర్ధారితుడై శిక్ష పూర్తిచేసుకుని విడుదలయ్యారు. మిగతా ముగ్గురి మీద విచారణ జరుగుతోంది.

    లెవ్ టాహోర్‌ను 1988లో ఇజ్రాయెల్‌లో రబ్బీ ష్లోమో హెల్బ్రాన్స్ స్థాపించారు. ఆ తర్వాత ఆయన అమెరికాకు మకాం మార్చారు. 1994లో కిడ్నాప్ కేసులో దోషిగా నిర్ధారితుడైన ష్లోమో రెండేళ్ల జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత 2017లో మెక్సికోలో నీటిలో మునిగి చనిపోయారు.

    లెవ్ టాహోర్‌లో ప్రస్తుతం దాదాపు 350 మంది సభ్యులున్నారు. ఇజ్రాయెల్, అమెరికా, మాసిడోనియా, మొరాకో, మెక్సికో, గ్వాటెమలలో విస్తరించి ఉందీ సంస్థ. గ్వాటెమలలో ఇంకా 70 నుంచి 80 మంది సభ్యులు ఉన్నారు.

    తన సొంత నియమాలను నిర్దేశించుకుని పాటించే ఈ సంస్థ ప్రమాదకరమైన తెగ అని ఇజ్రాయెల్ కోర్టు ప్రకటించింది.

    అయితే తాము స్థానిక చట్టాలను ఉల్లంఘించలేదని, తమ విశ్వాసాల కారణంగా తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఈ తెగ నాయకులు ఆరోపిస్తున్నారు.

  9. మన జీవితం వేరొకరి గేమ్‌లో భాగమా, ఆ గేమ్‌ను మనం ఎప్పటికీ ఆపలేమా?

  10. జపాన్: షింజో అబే అంత్యక్రియలకు హాజరైన ప్రధాని మోదీ

    షింజోఅబే అంత్యక్రియల్లో పాల్గొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

    ఫొటో సోర్స్, @MEAIndia

    ఇటీవల హత్యకు గురైన జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజోఅబే అంత్యక్రియల్లో పాల్గొనటానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టోక్యో చేరుకున్నారు.

    షింజో అబేకు నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ ఫొటోను విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్విటర్‌లో షేర్ చేశారు.

    అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్, ఆస్ట్రేలియా మాజీ ప్రధానమంత్రులు టోనీ అబాట్, జాన్ హోవార్డ్, మాల్కమ్ టర్న్‌బుల్, ఆస్ట్రేలియా ప్రస్తుత ప్రధాని ఆంథొని అల్బనీస్ సహా వివిధ దేశాల నేతలు కూడా షింజో అబే అంత్యక్రియలకు హాజరయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. ‘నాన్న వదిలేశాడు. మా అమ్మ లివర్ ఫెయిల్ కావడంతో నాది డొనేట్ చేశాను. కానీ, మా అమ్మ.. ’

  12. రష్యాలో దారుణం: స్కూలులో దుండగుడి కాల్పులు 11 మంది చిన్నారులు సహా 17 మంది మృతి

    రష్యా స్కూలులో కాల్పులు

    ఫొటో సోర్స్, Reuters

    రష్యాలోని ఒక స్కూలులో ఓ దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపిన దారుణంలో 11 మంది చిన్నారులు సహా 17 మంది చనిపోయారు. మరో 24 మంది గాయపడ్డారని రష్యా అధికారులు చెప్పారు.

    ఇజెవెస్క్ నగరంలోని స్కూలులో ఈ దారుణం చోటు చేసుకుంది. కాల్పులు జరిపిన దుండగుడు స్కూలు మాజీ విద్యార్థి అని, ఘటనా స్థలంలోనే అతడు కూడా తుపాకీతో కాల్చుకుని చనిపోయాడని తెలిపారు.

    కాల్పులు జరిగిన స్కూలులో విద్యార్థులు భయభ్రాంతులై ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న వీడియో దృశ్యాలు ఆన్‌లైన్‌లో పోస్టయ్యాయి.

    కొన్ని వీడియోల్లో తరగతి గదిలో నేల మీద రక్తం, కిటికీకి బులెట్ వల్ల ఏర్పడిన రంధ్రం, బల్లల కింద దాక్కుని ఉన్న పిల్లలు కనిపిస్తున్నారు.

    ఈ దారుణంలో 11 మంది చిన్నారులు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఇద్దరు టీచర్లు సహా 17 మంది చనిపోయినట్లు రష్యా దర్యాప్తు సంస్థ చెప్పింది. గాయపడిన 24 మందిలో ఇద్దరు మినహా మిగతా అందరూ చిన్నారులే.

    రష్యా స్కూలులో కాల్పులు
  13. సీనియర్ నటి ఆశా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

    ఆశా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, ఆశా పరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్

    ప్రముఖ నటి ఆశాపరేఖ్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

    ఈ విషయాన్ని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్ చేశారు.

    నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా కూడా ఆమె కళారంగానికి సేవలందించారు.

    1942లో గుజరాత్ లో జన్మించిన ఆశా పరేఖ్ హిందీ సినిమాలలో తనదైన ముద్ర వేశారు.

    పదేళ్ల వయసు నుంచే బాల నటిగా కెరీర్ ప్రారంభించిన ఆశా, 1960,70 ల నాటికి కెరియర్‌లో అత్యుతన్న దశను చూశారు.

    1992లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  14. సుప్రీంకోర్టు విచారణలు లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభం

    సుప్రీంకోర్టు

    ఫొటో సోర్స్, webcast.gov.in/scindia/

    ఫొటో క్యాప్షన్, సుప్రీంకోర్టు

    సుప్రీంకోర్టులో విచారణలు ఇవాళ్టి నుంచి లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. రాజ్యాంగ ధర్మాసనంలో జరగనున్న విచారణకు సంబంధించిన ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి.

    ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కోసం వెబ్‌సైట్, యూట్యూబ్‌‌లను సుప్రీంకోర్టు ఉపయోగిస్తుంది.

    ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, మహారాష్ట్రలో శివసేన వివాదం సహా అనేక ఇతర అంశాలు రాజ్యాంగ ధర్మాసనంలో మంగళవారం నాడు విచారణకు వస్తున్నాయి.

    రాజ్యాంగ ధర్మాసనం విచారణలకు సంబంధించి మూడు కోర్టుల నుంచి ప్రత్యేక వెబ్‌కాస్ట్ ఉంటుంది.

    దీని బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC)కి అప్పగించారు. ఆన్‌లైన్ విచారణను చూడటానికి https://webcast.gov.in/scindia/ ని సందర్శించవచ్చు.

    NICకి చెందిన YouTube చానెల్‌లలో కూడా ఈ విచారణలను చూడవచ్చు.

    కరోనా సమయం నుండి ఆన్‌లైన్ ప్రయత్నాలు

    కరోనా మహమ్మారి తర్వాత సుప్రీంకోర్టు పిటిషన్ల కోసం ఇ-ఫైలింగ్‌ను ప్రారంభించింది. ఈ-ఫైలింగ్‌ను రోజులో 24 గంటల్లో ఎప్పుడైనా చేయవచ్చు.

    అలాగే సుప్రీంకోర్టుకు చెల్లించాల్సిన ఫీజులను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు.

  15. తెలంగాణ సహా పలు ప్రాంతాల్లో పోలీసు, ఏటీఎస్ సోదాలు.. పీఎఫ్ఐ అనుమానితుల అరెస్టులు

    అస్సాం పోలీసులు

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, అస్సాంలో సోదాలు చేస్తున్న పోలీసులు

    దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర పోలీసు విభాగాలు, వాటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌లు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) మీద సోదాలు నిర్వహిస్తున్నాయి.

    ఏఎన్‌ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, దిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ఈ క్రమంలో పలుచోట్ల పెద్ద ఎత్తున అనుమానితులను అరెస్ట్ చేస్తున్నారు.

    దిల్లీలోని నిజాముద్దీన్, షాహీన్ బాగ్ సహా రాజధానిలోని పలు ప్రాంతాల నుంచి 30 మందిని అరెస్ట్ చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఔరంగాబాద్‌లో 13 మందిని, మాలెగావ్‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ కొనసాగుతోందని మహారాష్ట్ర ఏటీఎస్ చెప్పింది.

    ఉత్తరప్రదేశ్‌లో 12 మందికి పైగా పీఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. అస్సాంలోనూ పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు.

  16. డిమార్ఫోస్: ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టిన నాసా స్పేస్‌క్రాఫ్ట్

    డిమోర్ఫోస్ ఆస్టరాయిడ్

    ఫొటో సోర్స్, NASA/JHU-JPL

    ఫొటో క్యాప్షన్, డిమోర్ఫోస్ గ్రహశకలం

    అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఏర్పాటు చేసిన ‘డార్ట్’ (డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్) స్పేస్ ప్రోబ్.. ఒక ఆస్టరాయిడ్‌ను నేరుగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆ స్పేస్ ప్రోబ్ ధ్వంసమైంది.

    భూగ్రహానికి ముప్పు కలిగించగల గ్రహశకలాలలను క్షేమంగా దారితప్పించవచ్చా అనేదానిని పరీక్షించటం కోసం నాసా ఉద్దేశపూర్వకంగానే ఈ స్పేస్ ప్రోబ్‌తో ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టించింది.

    డిమార్ఫోస్ అని పిలుస్తున్న ఈ ఆస్టరాయిడ్ 160 మీటర్ల నిడివి ఉంది. డార్ట్ స్పేస్ ప్రోబ్ దీనిని ఢీకొట్టే క్షణం వరకూ తన దగ్గరున్న కెమెరాతో సెకనుకు ఒక ఫొటో చొప్పున పంపించింది.

    ఆస్టరాయిడ్‌ను ఢీకొట్టి డార్ట్ ధ్వంసం కావటంతో ఫొటోల ప్రవాహం ఆగిపోయింది.

    నాసా డార్ట్ పంపిన చివరి చిత్రాల్లో ఒకటి

    ఫొటో సోర్స్, NASA/JHU-APL

    ఫొటో క్యాప్షన్, నాసా డార్ట్ పంపిన చివరి చిత్రాల్లో ఒకటి

    జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ అప్లైడ్ ఫిజిక్స్ లాబొరేటరీ నుండి ఈ స్పేస్ ప్రోబ్‌ను నియంత్రిస్తున్న పరిశోధకులు.. డార్ట్ తన టార్గెట్‌ను ఢీకొట్టి అంతర్థానమవటంతో హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు.

    డిమోర్ఫోస్ మధ్య బిందువుకు కేవలం 17 మీటర్లు పక్కకు డార్ట్ ఢీకొట్టినట్లు ప్రాధమిక లెక్కలు సూచించాయి.

    నాసా సారథ్యంలో నిర్వహించిన ఈ ప్రయోగం ఫలించిందా లేదా అనేది తెలుసుకోవటానికి కొన్ని వారాలు పడుతుంది. అయితే గణనీయమైన విజయం సాధించివుంటామని ప్లానెటరీ సైన్స్ విభాగం డైరెక్టర్ డాక్టర్ లోరి గ్లేజ్ విశ్వాసం వ్యక్తంచేస్తున్నారు.

    డార్ట్, డిమోర్ఫోస్ ఆస్టరాయిడ్, డిడిమోస్ ఆస్టరాయిడ్ పరిమాణాలు
    ఫొటో క్యాప్షన్, డార్ట్, డిమోర్ఫోస్ ఆస్టరాయిడ్, డిడిమోస్ ఆస్టరాయిడ్ పరిమాణాలు

    ‘‘మానవాళి చరిత్రలో సరికొత్త శకానికి మనం నాంది పలుకుతున్నాం. ప్రమాదకరమైన ఆస్టరాయిడ్ భూమిని ఢీకొట్టకుండా నివారించగలిగే సామర్థ్యం మనం సంతరించుకునే శకమిది’’ అని ఆమె విలేకరులతో చెప్పారు.

    డిమార్ఫోస్ ఆస్టరాయిడ్ కక్ష్యలో మార్పులను అధ్యయనం చేయటం ద్వారా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం విజయాన్ని నిర్ధారిస్తారు.

    డిమోర్ఫోస్ పరిమాణంలోని ఒక గ్రహశకలం భూమిని ఢీకొడితే 100 మీటర్ల లోతు, ఒక కిలోమీటరు వ్యాసం గల భారీ కందకం ఏర్పడగలదు. ఇది కలిగించే విధ్వంసం చాలా తీవ్రంగా ఉంటుంది.

  17. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మోర్నింగ్!

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూస్తూ ఉండండి.

  18. ‘ఈ శతాబ్దంలోనే అతిపెద్ద నిఘా కుట్ర’: భారత్ సహా అనేక దేశాల రహస్యాలు చేజిక్కించుకున్న అమెరికా