You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

విజయవంతమైన రవీంద్ర జడేజా మోకాలి ఆపరేషన్

రవీంద్ర జడేజా మోకాలికి చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  2. సిమ్లా: ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొట్టుకున్న ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ కార్యకర్తలు

    సిమ్లాలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఎస్‌ఎఫ్ఐ, ఏబీవీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు.

    ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ రిపోర్ట్ చేసింది. ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకొని మళ్లీ విడుదల చేసినట్లు సిమ్లా జిల్లా ఎస్పీ తెలిపారు.

  3. బ్రేకింగ్ న్యూస్, శ్రీలంక విజయలక్ష్యం 174 పరుగులు.. భారత్ 173/8

    శ్రీలంకతో జరుగుతున్న ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది.

    చివరి ఓవర్‌లో రవిచంద్రన్ అశ్విన్ (7 బంతుల్లో 15 పరుగులు) సిక్స్ కొట్టడంతో జట్టు స్కోరు 170 పరుగులు దాటింది.

    భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ అత్యధికంగా 72 పరుగులు సాధించగా, సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు, హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్ చెరో 17 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ 6 పరుగులు, దీపక్ హుడా 3 పరుగులు, అర్షదీప్ ఒక పరుగు చేయగా.. విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్ డకౌట్ అయ్యారు.

    చివరి 5 ఓవర్లలో భారత జట్టు 4 వికెట్లు కోల్పోయింది. హార్థిక్ పాండ్యా, రిషభ్ పంత్‌లు భారీ షాట్‌లు కొట్టినప్పటికీ బౌండరీని దాటించలేక క్యాచ్ ఔట్ అయ్యారు.

    17.3 ఓవర్లకు హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో ఒక సిక్స్‌తో 17 పరుగులు) ఔటయ్యాడు.

    18.1 ఓవర్లకు దీపక్ హుడా (నాలుగు బంతుల్లో మూడు పరుగులు) ఔటయ్యాడు.

    మరో రెండు బంతులకే రిషభ్ పంత్ (13 బంతుల్లో మూడు ఫోర్లతో 17 పరుగులు) ఔటయ్యాడు.

    19.3 ఓవర్లకు భువనేశ్వర్ కుమార్ డకౌట్ అయ్యాడు.

  4. విజయవంతమైన రవీంద్ర జడేజా మోకాలి ఆపరేషన్

    రవీంద్ర జడేజా మోకాలికి చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.

    ‘సర్జరీ విజయవంతమైంది. బీసీసీఐ, నా టీమ్‌మేట్స్, సపోర్టింగ్ స్టాఫ్, డాక్టర్లు, పిజియోథెరపిస్టులు, అభిమానులు అందరికీ ధన్యవాదాలు’ అని రవీంద్ర జడేజా పోస్ట్ చేశారు.

    మోకాలి గాయం వల్ల ఆసియా కప్ నుంచి రవీంద్ర జడేజా వైదొలగిన విషయం తెలిసిందే.

  5. 15 ఓవర్లకు భారత్ 127/4

    15 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది.

    హార్దిక్ పాండ్యా 4 పరుగులతోను, రిషభ్ పంత్ 8 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

    12.2 ఓవర్ల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ (41 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్‌లతో 72 పరుగులు) ఔటయ్యాడు.

    14.2 ఓవర్ల వద్ద సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్స్‌తో 34 పరుగులు) ఔటయ్యాడు.

  6. ‘రాజ్‌పథ్’ పేరును ‘కర్తవ్యపథ్’గా మారుస్తారా... అసలు దాని చరిత్ర ఏంటి

  7. రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్.. 10 ఓవర్లలో భారత్ 79/2

    మూడు ఓవర్లకే 2 వికెట్లు కోల్పోయిన దశలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

    32 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్‌ల సహాయంతో అర్థ సెంచరీ పూర్తి చేశారు.

    10 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు రెండు వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది.

    రోహిత్ శర్మ 53 పరుగులతోను, సూర్యకుమార్ యాదవ్ 17 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.

  8. తెలంగాణలో వాటర్ స్పౌట్: నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎందుకు వెళ్లాయి?

  9. Asia Cup INDvsSL: కోహ్లీ డకౌట్.. 3 ఓవర్లలో భారత్ 15/2

    ఆసియా కప్ సూపర్ 4లో భారత క్రికెట్ జట్ట రెండవ మ్యాచ్ ఆడుతోంది. శ్రీలంకతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే ఫైనల్ చేరుకోగలుగుతుంది. ఓడిపోతే టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి ఉంటుంది.

    కీలక మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు.

    అంతకు ముందు ఓపెనర్ కేఎల్ రాహుల్ ఏడు బంతుల్లో ఆరు పరుగులు చేసి ఔటయ్యాడు.

    మూడు ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 15 పరుగులు చేసింది.

  10. ధోనీ తప్ప ఎవరూ తనకు నేరుగా మెసేజ్ చేయలేదన్న విరాట్ కోహ్లీ.. ఎద్దేవా చేసిన సునీల్ గావస్కర్

  11. ‘మనుషులను బలి తీసుకునే ఫ్యాక్టరీలు’.. వీటి లోపల పరిస్థితులు ఇలా ఉన్నాయి..

  12. నీటి తొట్టెల్లో నత్త గుల్లలతో ముత్యాలు పండిస్తున్న రైతులు..

  13. మోదీతో భేటీ అయిన షేక్ హసీనా... రెండు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు

    భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

    దిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో నరేంద్ర మోదీ, షేక్ హసీనాల నేతృత్వంలోని రెండు దేశాల ప్రతినిధులు చర్చల్లో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఏడు అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

    రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని నరేంద్ర మోదీ, షేక్ హసీనా అన్నారు.

  14. సీపీఐ(ఎం) నాయకుడు సీతారాం ఏచూరిని కలిసిన బిహార్ సీఎమ్ నితీశ్

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం దిల్లీలో సీపీఐ (ఎం) నాయకుడు సీతారాం ఏచూరిని కలిశారు.

    సమావేశం ముగిసిన తర్వాత నాయకులిద్దరూ మీడియాతో మాట్లాడారు.

    దేశంలో లెఫ్ట్, ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ ఒకే తాటి పైకి వస్తే అది చాలా పెద్ద అంశం అవుతుందని ఈ సమావేశంలో చర్చించినట్లు నితీశ్ విలేఖరులకు చెప్పారు.

    "నేను ప్రధాని పదవికి పోటీ పడటం లేదు. నాకు ప్రధాని పదవి పట్ల కోరిక లేదు" అని నితీశ్ స్పష్టం చేశారు.

    "నితీశ్ కుమార్ సీపీఐ (ఎం) కార్యాలయానికి రావడం దేశ రాజకీయాలకు సానుకూల సందేశాన్నిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకు సమైక్యం కావాలి" అని సీతారాం ఏచూరి అన్నారు.

  15. కాబుల్ ఆత్మాహుతి దాడిలో ఆరుగురి మరణం, పలువురికి గాయాలు

    అఫ్గానిస్తాన్ రాజధానిలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు రష్యా రాయబార కార్యాలయ సిబ్బంది కూడా ఉన్నట్లు తాలిబాన్ పోలీసు కార్యాలయ అధికారులు తెలిపారు.

    ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. ఇస్లామిక్ గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.

    ఆగస్టు 2021లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీ మిషన్ పై జరిగిన తొలి దాడి ఇదే.

    ఈ దాడిలో కనీసం 10 మంది గాయపడినట్లు తాలిబాన్ అధికారి చెప్పారు.

    ఈ దాడిలో ఒక రాయబారి, రాయబార కార్యాలయం సెక్యూరిటీ గార్డ్ గాయపడినట్లు రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్‌ఐఏ పేర్కొంది.

    అయితే, ఈ దాడిలో మరణించిన వారి సంఖ్య మరింత ఎక్కువ ఉన్నట్లు ఇతర మీడియా సంస్థలు చెబుతున్నారు.

    రాయబార కార్యాలయంతో పాటు కాన్సులర్ కార్యాలయం ముందు వేచి ఉన్న అఫ్గాన్ పౌరులు కూడా ఈ దాడిలో మరణించారని పోలీసులు చెప్పారు.

  16. బెంగళూరులో భారీ వర్షాలు..ట్రాక్టర్ల పై ఆఫీసులకు వెళ్లిన ఐటీ ఉద్యోగులు

    బెంగళూరులో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో, చాలా మంది ఐటీ ఉద్యోగులు ఆఫీసులకుట్రాక్టర్ల పై వెళ్లాల్సి వచ్చింది.

    హెచ్ ఏఎల్ ఎయిర్ పోర్ట్ కు దగ్గరగా ఉన్న యెమలూర్ పూర్తిగా నీట మునిగింది.

    ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఐటీ ఉద్యోగులు ఆఫిసులకు వెళ్లేందుకు ట్రాక్టర్ల సహాయం తీసుకోవలసి వచ్చింది.

    "ఆఫీసుకు సెలవు తీసుకోలేం. మా పని పై ప్రభావం పడింది. ఈ ట్రాక్టర్లు ఆఫీసుల దగ్గర దించేందుకు మనిషికి రూ.50 వసూలు చేశాయి" అని ఒక ఐటీ ఉద్యోగి ఏఎన్ఐ వార్తా సంస్థకు చెప్పారు.

    బెంగళూరులో కురిసిన వర్షాల వల్ల ఐటీ సంస్థలకు రూ. 225 కోట్ల నష్టం వాటిల్లడం గురించి చర్చిస్తామని బెంగళూరు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు.

  17. ప్రధాన మంత్రి మోదీతో సమావేశం కానున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

    బంగ్లాదేశ్ ప్రధానిషేక్ హసీనాకు ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్ దగ్గర స్వాగతం పలికారు. ఆమె రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతితో కూడా ఈ రోజు సమావేశం అవుతారు.

    భారత్‌కు రావడం తనకెప్పుడూ సంతోషంగా ఉంటుందని అన్నారు. ఆమె హిందీ, బెంగాలీ భాషల్లో మాట్లాడారు.

    బంగ్లాదేశ్ విమోచనకు భారత్ చేసిన సహాయాన్ని బంగ్లాదేశ్ ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటుందని అంటూ భారత్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇరు దేశాల మధ్య శాంతియుత సంబంధాలు ఉన్నాయని ఆమె అన్నారు.

    "ప్రజల సంక్షేమం,పేదరిక నిర్మూలన, ఆర్థికాభివృద్ధి ఇరు దేశాల చర్చల్లో ప్రధాన లక్ష్యాలు. ఈ అంశాల పై దృష్టి పెడితే ఒక్క భారత్, బంగ్లాదేశ్ ప్రజలు మాత్రమే కాకుండా దక్షిణ ఆసియాలో ప్రజలంతా మెరుగైన జీవితం గడపగలరు" అని ఆమె అన్నారు.

    హసీనా భారత్ పర్యటన సెప్టెంబరు 5-8 వరకు కొనసాగుతుంది.

    ఆమె సోమవారం భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ తో ద్వైపాక్షిక అంశాలను చర్చించారు. ఆమె దిల్లీలో నిజాముద్దీన్ దర్గాను కూడా సందర్శించారు.

    మంగళవారం రాజ్ ఘాట్ సందర్శించి మహాత్మా గాంధీ సమాధి దగ్గర నివాళులు సమర్పించారు.

  18. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఈడి సోదాలు

    దిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం గురించి ఈడీ దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ నగరంలో కూడా పలు చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.

    దేశవ్యాప్తంగా మొత్తం 30 చోట్ల సోదాలు నిర్వహిస్తోంది. అందులో హైదరాబాద్‌లో కూడా ఐదు ప్రాంతాలు ఉన్నట్టు తెలిసింది.

    సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ సాగుతోంది. అరుణ్ రామచంద్రన్ పిళ్లై కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం సోదాలు జరుగుతున్నాయి.

    హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్రన్ పిళ్లైకి రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ అనే సంస్థ ఉంది.

    2022లో ప్రారంభం అయిన ఈ సంస్థలో ఆయనతో పాటూ బోయినపల్లి అభిషేక్ అనే వ్యక్తి వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. సికింద్రాబాద్ లో ఈ సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది.

    ఈ ఇద్దరికీ హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి.

  19. హలో! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి.