జార్ఖండ్: విశ్వాస పరీక్ష నెగ్గిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్

నేడు జరిగిన విశ్వాస పరీక్షలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గెలిచారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  2. ఘోస్ట్‌ఫ్లైట్స్ అంటే ఏమిటి? వీటిని ఎందుకు ఆపట్లేదు?

  3. ఫైబర్‌తో తయారైన వంట గ్యాస్ సిలిండర్లు... ఇవి ఎంత సురక్షితం?

  4. తెలంగాణలో వాటర్ స్పౌట్: సింగూరు ప్రాజెక్టు నీళ్లు సుడులు తిరుగుతూ ఆకాశంలోకి ఎందుకు వెళ్లాయి?

  5. ‘హిందువులు, సిక్కులను మిషనరీలు క్రైస్తవులుగా మారుస్తున్నాయ్’ అంటూ పంజాబ్‌లో వివాదం

  6. బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ ఎన్నిక.. ఆమె గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..

  7. జార్ఖండ్: విశ్వాస పరీక్ష నెగ్గిన హేమంత్ సోరెన్

    జార్ఖండ్ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్

    ఫొటో సోర్స్, Facebook/Hemant Soren

    నేడు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నెగ్గారు.

    కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలలోని ప్రభుత్వాలను కూల్చేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొనడం మీదనే బీజేపీ దృష్టి పెడుతోందంటూ విమర్శించారు.

    జార్ఖండ్ ముక్తీ మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), సీపీఐ(ఎంఎల్) పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు విశ్వాస పరీక్షకు అనుకూలంగా ఓటు వేశారు.

    విశ్వాస పరీక్షను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ అసెంబ్లీ నుంచి వాకవుట్ చేసింది.

    సోరెన్ గతంలో ముఖ్యమంత్రిగా, గనుల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పదవిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

    ఆయన గతంలో రాంచీలో గనుల లీజును సొంతంగా తనకే కేటాయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఉల్లంఘించడం కిందకు వస్తుంది.

    గత నెలలో ఎన్నికల కమిషన్ ఆయనను పదవి నుంచి తొలగించేందుకు రాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్‌కు లేఖను పంపినట్లు వార్తలొచ్చాయి.

    అప్పటి నుంచి హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారనే ఆరోపణలు వస్తున్నాయి.

    ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేస్తే, ఆయన తిరిగి ముఖ్య మంత్రి పదవిని చేపట్టేందుకు ఆరు నెలలలోగా ఎన్నికల్లో శాసన సభ్యునిగాగెలవాల్సి ఉంటుంది.

    81 మంది సభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీల జేఎంఎంకు (30) ,కాంగ్రెస్‌ (18), రాష్ట్రీయ జనతా దళ్ (1) శాసన సభ్యులు ఉన్నారు. జార్ఖండ్ శాసన సభలో ప్రతిపక్షమైన బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేలున్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. అమెరికాలో నీటి సంక్షోభం: ‘ఇక్కడ కుళాయి నీళ్లు తాగలేం, వాటితో స్నానం చేయలేం, పళ్లు కూడా తోముకోలేం’

  9. ఈ ఆటో డ్రైవర్ రోగులకు ఉచితంగా సేవలు అందిస్తారు

  10. లండన్‌లో చోరీ అయిన రెండున్నర కోట్ల రూపాయల కారు కరాచీలో దొరికింది... అక్కడికి ఎలా చేరింది?

  11. రిషి సునక్ vs లిజ్ ట్రస్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవికి ఎన్నిక ఎలా జరిగింది?

  12. నేడే ఝార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై విశ్వాస తీర్మానం

    హేమంత్ సోరెన్

    ఫొటో సోర్స్, ANI

    ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పై అసెంబ్లీలో సోమవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ఈ విశ్వాస తీర్మానానికి ప్రత్యేకంగా విధాన సభను ఒక రోజుకు హాజరుపరిచారు.

    హేమంత్ సోరెన్ విశ్వాస తీర్మానానికి ముందు ఆదివారం ఎంఎల్‌ఏలతో సమావేశమయ్యారు.

    ఆయన గతంలో ముఖ్యమంత్రిగా, గనుల మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పదవిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.

    ఆయన గతంలో రాంచీలో గనుల లీజును సొంతంగా కేటాయించుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ఉల్లంఘించడం కిందకు వస్తుంది.

    గత నెలలో ఎన్నికల కమీషన్ ఆయనను పదవి నుంచి తొలగించేందుకు రాష్ట్ర గవర్నర్ రమేష్ బైస్‌కు లేఖను పంపినట్లు వార్తలొచ్చాయి.

    అప్పటి నుంచి హేమంత్ సోరెన్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారనే ఆరోపణలు వస్తున్నాయి.

    ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేస్తే, ఆయన తిరిగి ముఖ్య మంత్రి పదవిని చేపట్టేందుకు ఆరు నెలలలోగా ఎన్నికల్లో శాసన సభ్యునిగాగెలవాల్సి ఉంటుంది.

    81 మంది సభ్యులున్న ఝార్ఖండ్ అసెంబ్లీల జేఎంఎంకు (30) ,కాంగ్రెస్‌ (18), రాష్ట్రీయ జనతా దళ్ (1) శాసన సభ్యులు ఉన్నారు. ఝార్ఖండ్ శాసన సభలో బీజేపీకి 26 మంది ఎంఎల్‌ఏ లు ఉన్నారు.

  13. లఖ్‌‌నవూ‌లోని పెద్ద హోటల్‌లో అగ్ని ప్రమాదం

    లెవానా హోటల్‌లో అగ్ని ప్రమాదం

    ఫొటో సోర్స్, ANI

    ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లఖ్‌‌నవూ‌లోని లెవానా హోటల్‌లో ఏర్పడిన అగ్ని ప్రమాదంలో పలువురు చిక్కుకున్నారు. మంటల ద్వారా వచ్చే పొగ వల్ల చాలా మంది స్పృహ కోల్పోయారు.

    ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద హోటళ్లలో ఒకటైన ఈ హోటల్ లఖ్‌‌నవూ‌లోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలో ఉంది.

    మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అగ్నిమాపక దళాలు పని చేస్తున్నాయి. కిటికీల దగ్గరకు నిచ్చెనలు అమర్చి హోటల్పై అంతస్తుల్లో ఉండిపోయిన వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.

    హోటల్‌లో ఎంత మంది చిక్కుకున్నారనే విషయం పై స్పష్టమైన సమాచారం లేదు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  14. నేడే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన ప్రారంభం

    షేక్ హసీనా

    ఫొటో సోర్స్, ANI

    బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా భారత పర్యటన సోమవారం ప్రారంభం కానుంది. హసీనా సెప్టెంబరు 5-8 వరకు భారత్‌లో పర్యటిస్తారు.

    ఈ పర్యటనలో భాగంలో భారత్, బంగ్లాదేశ్‌ రక్షణ, వాణిజ్యం, నదీ జలాల పంపకంలో సహకారాన్ని పెంపొందించుకునే దిశగా ప్రకటనలు చేసే అవకాశముంది.

    సోమవారం 12 గంటలకు ఆమె దిల్లీ చేరుతారని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి.

    పర్యటన మొదటి రోజున మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్ సందర్శిస్తారు.

    హసీనా మంగళవారం భారత ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య కుషాయిరా నదీ జలాల పంపకంతో పాటు మరిన్ని ముఖ్యమైన ఒప్పందాలు చేసుకునే అవకాశముంది.

    గురువారం రాజస్థాన్‌లోని అజ్మేర్‌లోఉన్న సూఫీ సెయింట్ మొయినుద్దీన్ చిష్తీని సందర్శించనున్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి బృందంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్, వాణిజ్య మంత్రి టిపు మున్షీ, రైల్వే శాఖ మంత్రి మొహమ్మద్ నూరుల్ ఇస్లాం సూజన్, ప్రధాన మంత్రి ఆర్ధిక వ్యవహారాల సలహాదారు మాసియార్ ఏఎం రహ్మాన్ కూడా ఉంటారు.

    ఆమె పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌ను కూడా కలుస్తారు.

    ఆమె 2019లో భారత్ విచ్చేశారు.

  15. హలో! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం ఈ లైవ్ పేజీని ఫాలో అవ్వండి.