కామన్వెల్త్ గేమ్స్: తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కు స్వర్ణ పతకం

ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ఆధ్వర్యంలో ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌‌‌లో ఆమె స్వర్ణం సాధించారు.

లైవ్ కవరేజీ

పద్మ మీనాక్షి

  1. ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య మళ్లీ భీకర ఘర్షణ.. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో చిన్నారులు సహా 31 మంది మృతి

  2. ధన్యావాదాలు!

    ఈనాటి బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ఇక్కడితో ముగిస్తున్నాం.

    ధన్యవాదాలు.

  3. మార్లిన్ మన్రో మరణం వెనుక దాగిన మిస్టరీ ఏమిటి, నాటి అమెరికా అధ్యక్షుడైన కెన్నడీ సోదరుల పేరు ఎందుకు వినిపిస్తుంది?

  4. కామన్వెల్త్ గేమ్స్: మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లోకి సింధు

    పీవీ సింధు

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, పీవీ సింధు

    కామన్వెల్త్‌ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో పీవీ సింధుకు పతకం ఖాయమైంది.

    ఇవాళ జరిగిన సెమీ ఫైనల్‌లో సింధు 21-19, 21-17తో సింగపూర్‌కు చెందిన జియా మిన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు.

    గత కామన్వెల్త్ గేమ్స్‌లో సైనా నెహ్వాల్‌తో తలపడిన సింధు ఫైనల్‌కు కూడా చేరుకున్నారు. ఫైనల్ మ్యాచ్ సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు జరగనుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. కామన్వెల్త్ గేమ్స్: తెలంగాణకు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ కు బంగారు పతకం

    స్వర్ణపతకం సాధించిన జరీనా నిఖత్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, స్వర్ణపతకం సాధించిన జరీనా నిఖత్

    48-50కేజీల ఫ్లైవెయిట్ విభాగంలో భారత్ చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణపతకం గెలుచుకున్నారు. ఆమె తన ప్రత్యర్ధి నార్తర్న్ ఐర్లాండ్‌కు చెందిన మెక్‌నావుల్‌ను ఓడించారు.

    తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్, గతంలో కూడా పలు పతకాలు సాధించారు. ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ఆధ్వర్యంలో ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌‌‌లో ఆమె స్వర్ణం సాధించారు.

    సీనియర్ విభాగంలో ఆమె వరల్డ్ చాంపియన్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డ్ సృష్టించారు.

    తాజాగా కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించారు నిఖత్ జరీన్.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  6. బ్రేకింగ్ న్యూస్, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణపతకాలు సాధించిన భారత బాక్సర్లు నీతూ గంఘాస్, అమిత్ పంఘాల్

    నీతూ గాంఘాస్

    ఫొటో సోర్స్, @KirenRijiju

    బ్రిటన్‌లోని బర్మింఘామ్‌లో జరుగుతున్న 2022 కామన్వెల్త్ క్రీడల్లో.. ఆదివారం సాయంత్రం భారత బాక్సర్లు రెండు స్వర్ణపతకాలు సాధించారు.

    భారత బాక్సర్ నీతూ గంఘాస్.. మహిళల మినిమమ్ వెయిట్ విభాగంలో స్వర్ణపతకం గెలిచింది.

    పురుషుల 48-51 కేజీల విభాగంలో అమిత్ పంఘాల్ గోల్డ్ మెడల్ సంపాదించాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    కామన్వెల్త్ క్రీడల్లో అరంగేట్రంలోనే నీతూ గోల్డ్ మెడల్ సాధించటం విశేషం. దీనికిముందు ఆమె రెండుసార్లు వరల్డ్ యూత్ మెడల్స్ గెలిచినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చెప్పింది.

    అమిత్ పంఘాల్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బాక్సర్ రియారన్ మాక్‌డోనాల్డ్‌ను 5-0 పాయింట్లతో ఓడించి స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  7. కామన్వెల్త్ గేమ్స్: భారత మహిళల హాకీ జట్టుకు కాంస్య పతకం

    భారత మహిళల హాకీ  జట్టుకు కాంస్య పతకం

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, భారత మహిళల హాకీ జట్టుకు కాంస్య పతకం

    కామన్వెల్త్ గేమ్స్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను 2-1 తేడాతో విజయం సాధించడం ద్వారా భారత మహిళల హాకీ జట్టు కాంస్య పతకం సాధించింది.

    భారత జట్టు కెప్టెన్, గోల్ కీపర్ అయిన సవిత పునియా షూటౌట్‌లో నాలుగింటిలో మూడు గోల్స్ ను అడ్డుకుని, జట్టు విజయానికి దోహద పడ్డారు.

    అంతకు ముందు ఇరుజట్లు 1-1 స్కోరుతో సమానంగా నిలవడంతో షూటౌట్ నిర్వహించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. పెళ్లి కాని మహిళలకు అబార్షన్‌కు 24వారాల గడువు - పరిశీలిస్తామని చెప్పిన సుప్రీం కోర్టు

    సుప్రీం కోర్టు

    ఫొటో సోర్స్, Reuters

    వైద్యుల పర్యవేక్షణలో గర్భస్రావం చేయించుకునేందుకు వివాహితులు, అవివాహితుల మధ్య ఎటువంటి వివక్ష ఉండకూడదని సుప్రీం కోర్టు చెప్పింది. పెళ్లి కాని మహిళలు గర్భం దాల్చిన 20 వారాల తర్వాత గర్భస్రావం చేయించుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడం ఆమె వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలిగించడమేనని పేర్కొంది.

    మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ చట్టంలో ఉన్న నిబంధనలను సమీక్షిస్తామని జస్టిస్ డి.వై చంద్రచూడ్, జే.బి పర్దీవాలాలతో కూడిన బెంచ్ చెప్పింది.

    పెళ్లి కాని మహిళలు కూడా 24 వారాల లోపు వైద్యుల పర్యవేక్షణలో అబార్షన్ చేయించుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పింది.

    "వైద్య రంగంలో చోటు చేసుకున్న పురోగతి దృష్ట్యా ఈ చట్టాన్ని కూడా ప్రగతిశీల ధోరణితో చూడాల్సిన అవసరముంది" అని సుప్రీం కోర్టు చెప్పింది.

    పెళ్లి అయినమహిళలు చట్ట ప్రకారం 24 వారాల లోపు అబార్షన్ చేయించుకునే వీలుంది.

    అత్యాచార బాధితులు, వైకల్యం ఉన్నవారు, మైనర్లు, అవివాహిత మహిళలు అబార్షన్ 20 వారాల లోపు చేయించుకోవాలి.

    సుప్రీం కోర్టు కేసు విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.

  9. కామన్వెల్త్గేమ్స్ 2022: కాంస్యం గెలుచుకున్నందుకు క్షమాపణలు అడిగిన పూజా గెహ్లాట్ - ప్రధాని ఏమన్నారు?

    కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 50 కేజీల కుస్తీ విభాగంలో పూజా గెహ్లాట్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఆమె శనివారం జరిగిన మ్యాచ్‍‌లో స్కాటిష్ క్రీడాకారిణిని ఓడించారు.

    కానీ, ఆమె కాంస్య పతకాన్ని సాధించినందుకు క్షమాపణలు కోరారు. సెమీ ఫైనల్స్‌లో ఓటమి పాలవ్వడం పట్ల ఆమె చాలా నిరుత్సాహానికి గురయ్యారు.

    "నేను సెమీ ఫైనల్స్‌లో ఓడిపోవడం చాలా విచారకరంగా ఉంది. నేను దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నాను. ఇక్కడ భారత జాతీయ గీతాన్ని ప్లే చేస్తారని భావించాను. కానీ, నేను ఓడిపోయాను. నేను చేసిన తప్పుల పై దృష్టి పెట్టి పని చేస్తాను" అని ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఆమె భావోద్వేగాలకు లోనైనట్లు కనిపించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    అయితే, ప్రధాని మోదీ ఆమె చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ "సాధించిన ఘనతే ముఖ్యమని క్షమాపణలు చెప్పవద్దు" అని సూచించారు. "నీ జీవిత ప్రయాణం మాకు స్ఫూర్తినిస్తుంది. నీ విజయం మమ్మల్ని సంతోషపరుస్తుంది. నువ్వు చేయాల్సిన గొప్ప పనులు చాలా ఉన్నాయి. ఇలానే రాణిస్తూ ఉండాలి" అని అన్నారు.

    పూజా గెహ్లాట్ తొలి రెండు మ్యాచ్‌లను గెలిచారు కానీ, సెమీ ఫైనల్స్‌లో కెనడా క్రీడాకారిణి మాడిసన్ బియాంకా పార్క్స్ చేతిలో ఓటమి పాలయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    కామన్వెల్త్ గేమ్స్ 9వ రోజుకు భారత్ 9 స్వర్ణ, 3 రజత, 7 కాంస్య పతకాలు గెలుచుకుంది.

    మహిళల 53 కేజీల ఫ్రీ స్టైల్ విభాగంలో వినేష్ ఫోగట్ స్వర్ణ పతకాన్ని సాధించారు.

    రవి దహియా, నవీన్ కూడా రెజ్లింగ్‌లో స్వర్ణ పతకాలు సాధించారు.

    పేరా టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో కూడా భారత్ స్వర్ణ పతకాన్ని సాధించింది.

    మెడల్ ట్యాలీలో శనివారం నాటికి భారత్ 5వ స్థానంలో ఉంది.

  10. ఇజ్రాయెల్ - గాజా: భీకర పోరు, పెరుగుతున్న మృతుల సంఖ్య

    ఇజ్రాయెల్ - గాజా: కొనసాగుతున్న పోరు

    ఫొటో సోర్స్, Getty Images

    యోలాండ నెల్, ఎల్సా మైష్మాన్

    గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది.

    ఇజ్రాయెల్.. పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపుకు చెందిన మరొక మిలిటెంట్‌ను హతమార్చింది. మృతుడు పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ గ్రూపులో రెండవ ముఖ్య నేత. మరో వైపు గాజాపై వైమానిక దాడుల్లో మృతుల సంఖ్య పెరుగుతోంది.

    ఇప్పటి వరకు 32 మంది పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఆరుగురు చిన్నారులు, పీఐజె గ్రూపు సభ్యులు కూడా ఉన్నారు.

    ఇజ్రాయెల్‌లో శుక్రవారం నుంచి ఇప్పటి వరకు పాలస్తీనా సుమారు 400 రాకెట్లు, మోర్టార్లను పేల్చినట్లు ఇజ్రాయెల్ అధికారి చెప్పారు.

    పీఐజె నుంచి పొంచి ఉన్న ముప్పు వల్లే ఈ దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

    బ్రేకింగ్ డాన్ అనే పేరుతో చేస్తున్న ఈ ఆపరేషన్ ఒక వారం రోజుల పాటు కొనసాగవచ్చని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరిస్తోంది.

  11. అజాద్ శాటిలైట్ తయారీలో 750 మంది విద్యార్థినులు

    ఇస్రో శ్రీహరి కోట నుంచి చిన్న ఉపగ్రహ వాహక నౌక (ఎస్‌ఎస్‌ఎల్‌వి) డి1 రాకెట్ ప్రయోగించింది.

    దీంతో పాటు విద్యార్థులు తయారు చేసిన ఆజాదీశాట్ ను కూడా సతీష్ థవన్ కేంద్రం నుంచి నింగిలోకి పంపినట్లు ఇస్రో ప్రకటించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆజాదీశాట్ తయారీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల నుంచి 750 మంది విద్యార్థినులు సహకరించడమే ఈ శాటిలైట్ ప్రత్యేకత.

    "ఎస్‌ఎస్‌ఎల్‌వి మూడు దశలు అనుకున్న విధంగానే పూర్తయ్యాయి. టెర్మినల్ దశలో కొంత డేటా నష్టం జరిగింది. ఈ మిషన్ తుది ఫలితాన్ని నిర్ధారించడానికి సమాచారాన్ని విశ్లేషిస్తున్నాం. కక్ష్యలోకి ఉపగ్రహాలు ప్రవేశించాయో లేదో పరిశీలిస్తున్నాం. ప్రయోగ పురోగతి పై వీలైనంత త్వరలో సమాచారాన్ని ఇస్తాం" అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.

  12. బీజేపీలో చేరిన మాజీ ఏఐసిసి జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

    Dasoju Sravan

    ఫొటో సోర్స్, Dasoju Sravan

    ఏఐసీసీ మాజీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరారు.

    బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు తదితరుల సమక్షంలో దిల్లీలో ఆయన బీజేపీలో చేరారు.

    శ్రవణ్ వెంట ఆయన మద్దతుదారులు పెద్దసంఖ్యలో బీజేపీలో చేరారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో పోరాటాలతో 1500 మంది తెలంగాణ బిడ్డల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం దురదృష్టవశాత్తు దుర్మార్గుల పాలైందని.. కేవలం ఎనిమిదేళ్లలో 4 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చిన పాలన ప్రస్తుతం తెలంగాణలో సాగుతోందని అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    నీళ్ళు, నిధులు, నియామకాలు, ఆత్మ గౌరవం నినాదంతో తెలంగాణ ఉద్యమం మొదలైయింది కానీ నేడు ఉద్యమ లక్ష్యాలని తూట్లు పొడుస్తూ కేసీఆర్ అరాచర పాలన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

    పదేళ్ళుగా అవినీతి పాలన చేసిన కేసీఆర్ పనైపోయిందని.. తెలంగాణ అధికార మార్పిడి జరిగి, కేసీఆర్ గద్దె దిగాల్సిన చారిత్రాత్మ అవసరం ఉందని అన్న శ్రవణ్... కేసీఆర్ ని గద్దె దించుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో పని చేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని తేవాలని పిలుపునిచ్చారు.

    గతంలో తాను ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్‌గా పని చేశానని.. ఏబీవీపీ కార్యకర్తగా ఆర్ట్స్ కాలేజీ జనరల్ సెక్రటరిగా పనిచేశానని గుర్తుచేసుకున్న ఆయన ఇప్పుడు మళ్లీ బీజేపీలోకి రావడంతో సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందన్నారు.

  13. బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించిన తమిళసై సౌందరరాజన్

    తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు. ఆమె విద్యార్థులతో కలిసి హాస్టల్ మెస్‌లో అల్పాహారం తీసుకున్నారు.

    ఈ పర్యటనలో భాగంగా ఆమె హాస్టల్‌లో వసతులను పర్యవేక్షించారు. ఆ తర్వాత అధికారులతో సమావేశమయ్యారు.

    ఇటీవల ఇక్కడ హాస్టల్‌లో విద్య, భోజన, ఇతర వసతుల్లో నాణ్యత పడిపోయిందనివిద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    దేశంలో ఉన్నత విద్యా సంస్థల పనితీరు సూచించే 'నాక్' (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) రేటింగ్స్ లో 'సి' గ్రేడ్ కు బాసర ట్రిపుల్ ఐటీ పరిమితం కావడం ప్రమాణాలు పడిపోవడానికి ఉదాహరణగా విద్యార్థులు చెబుతున్నారు.

    ఈ మధ్య వరంగల్ జిల్లా సంగెం మండలం ఎల్గూరు రంగంపేట పీయూసీ-2 కు (ప్రీ యూనివర్సిటీ కోర్స్) చెందిన ఈ క్యాంపస్ విద్యార్థి శాబోతు సంజయ్ కిరణ్(17) మరణానికి నాణ్యత లేని బాసర ట్రిపుల్ ఐటీ మెస్ భోజనమే సంజయ్ చనిపోవడానికి ప్రధాన కారణమని అతని తల్లిదండ్రులు ఆరోపించారు.

    బాసర పర్యటన తర్వాత గవర్నర్ నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీని సందర్శిస్తారు.

    తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించారు