గుజరాత్‌లో మద్యపాన నిషేధం ఉంటే కల్తీసారా ఎలా అమ్ముతున్నారు: కేజ్రీవాల్

గుజరాత్‌లో మద్యపాన నిషేధం ఉంటే బహరంగంగా కల్తీ సారా అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి? వీటి ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. చరిత్ర: ‘అంకెల్లో చెప్పలేనంత సంపద కలిగిన’ 10 మంది కుబేరులు

  2. 5జీ సేవల ప్రారంభం: ఇక 4జీ మనుగడ ఎలా ఉండనుంది

  3. భీకర యుద్ధం మధ్యే పొలాల్లో వ్యవసాయం చేసి, పంటలు పండిస్తున్న యుక్రెయిన్ రైతులు

  4. కార్గిల్ యుద్ధం: వీరోచితంగా పోరాడిన పాక్ సైనికుడు.. భారత సైనికాధికారి సిఫార్సుపై అత్యున్నత శౌర్య పురస్కారం ఇచ్చిన పాకిస్తాన్

  5. ఎగిరిపోయిన పెంపుడు చిలుక.. పట్టిచ్చినందుకు రూ. 85,000 బహుమతి ఇచ్చిన కుటుంబం..

  6. ఆగస్ట్ 1 నుంచి టాలీవుడ్‌లో సినిమా షూటింగులు బంద్

    సినిమా షూటింగ్

    ఫొటో సోర్స్, Getty Images

    కరోనా తరువాత చిత్ర పరిశ్రమ ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న నిర్మాణ వ్యయాల నేపథ్యంలో నిర్మాతలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని.. ఈ నేపథ్యంలో ‘తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్’ సభ్యులుగా ఉన్న నిర్మాతలంతా ఆగస్ట్ 1 నుంచి షూటింగులు ఆపేయాలని నిర్ణయించారని ‘తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్’ తెలిపింది.

    తమ సమస్యలకు పరిష్కారం కోసం చర్చలు జరుపుతున్నందున చిత్రీకరణలు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

    అన్నపూర్ణ స్టుడియోస్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

    tollywood

    ఫొటో సోర్స్, ATFPG

  7. ఆస్ట్రేలియా చెఫ్‌ల పోటీలో మెరిసిన భారతీయ వంటకాలు.. బిరియానీ గెలిపించిందా?

  8. ‘కల్తీ సారా అమ్మకాలతో గుజరాత్‌లో ఎవరు లబ్ధి పొందుతున్నారు?’: అరవింద్ కేజ్రీవాల్

    అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, Getty Images

    గుజరాత్‌లో మద్యపాన నిషేధం ఉంటే బహరంగంగా కల్తీ సారా అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి? వీటి ద్వారా ఎవరు లబ్ధి పొందుతున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు.

    ‘‘గుజరాత్‌లో ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. ప్రభుత్వం దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా?’’ అని ఆయన అన్నారు.

    ‘‘కల్తీ సారా తాగి 25 మందికి పైగా చనిపోవడం చాలా బాధాకరం. చాలామంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారంతా వేగంగా కోలుకోవాలి’’ అని రాజ్‌కోట్‌లో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

  9. గుజరాత్: 31కి పెరిగిన కల్తీ సారా మృతుల సంఖ్య

    గుజరాత్

    ఫొటో సోర్స్, Sachin Pithva

    గుజరాత్‌లోని బోటాద్ జిల్లాలో కల్తీ సారా తాగడంతో మృతి చెందిన వారి సంఖ్య 31కి పెరిగినట్లు గుజరాత్ పోలీసులు తెలిపారు.

    నాటు సారా తాగి అనారోగ్యం పాలైన 40కి పైగా వ్యక్తులను భావ్‌నగర్, బోటాద్, అహ్మదాబాద్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేర్చారు.

    పారిశ్రామిక అవసరాలకు వినియోగించే మిథైల్ ఆల్కహాల్ అనే రసాయనాన్ని నీటిలో కలిపి తయారు చేసిన ఈ సారాను తాగడం వల్లే వీరంతా అనారోగ్యం పాలయ్యారని గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా చెప్పారు.

    ఓ కంపెనీ నుంచి ఈ మిథైల్ ఆల్కహాల్‌ను దొంగిలించి దానితో కల్తీ సారాను తయారు చేసినట్ల తెలిపారు.

    నిందితుల్లో ఇప్పటివరకు అయిదుగురిని అరెస్ట్ చేశామని చెప్పారు.

  10. నాటుసారా ఎలా తయారు చేస్తారు, అది తాగితే మనుషులు చనిపోతారా?

  11. సోనియా గాంధీని ఈడీ విచారించడానికి నిరసనగా రోడ్డుపై బైటాయించిన రాహుల్ గాంధీ

    రాహుల్ గాంధీ

    ఫొటో సోర్స్, Twitter/@INCindia

    నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారించడంపై కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు చేసింది.

    రాహుల్ గాంధీ విజయ్ చౌక్ వద్ద రోడ్డుపై బైటాయించారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్‌ వైపుగా కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీని నిర్వహించాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    నిరసనల్లో పాల్గొన్న చాలామంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీ వెళ్లకుండా నిరోధించేందుకు కాంగ్రెస్ ఎంపీలను విజయ్‌చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

    ‘‘పోలీసుల నియమాలకు లోబడే మేం నిరసనలు చేస్తున్నాం. ప్రతిపక్షాల గొంతును పూర్తిగా నొక్కేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిషా చేసిన కుట్ర ఇది. దేనికీ మేం భయపడం. మా పోరాటం కొనసాగిస్తాం’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ‘‘పార్లమెంట్‌లో అగ్నిపథ్ పథకం, ద్రవ్యోల్బణం పెరుగుదల, నిరుద్యోగం, కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగంపై చర్చ నిర్వహించాలని మేం డిమాండ్ చేశాం. కానీ, ప్రభుత్వం దీన్ని తిరస్కరించింది. దీనిపై రాజ్‌ఘాట్ వద్ద నిరసన వ్యక్తం చేస్తామని వారికి చెప్పాం. కానీ, మాకు అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రపతికి మెమొరండం సమర్పించడానికి కూడా మమ్మల్ని అనుమతించలేదు’’ అని దీపేందర్ హుడా చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

    దిల్లోని ఈడీ కార్యాలయానికి ప్రియాంక గాంధీతో కలిసి సోనియా గాంధీ వచ్చారు. రాహుల్ గాంధీ కూడా అక్కడికి చేరుకున్నారు.

    జూలై 21న తొలి రౌండ్ విచారణ జరిగింది. రెండో రౌండ్ విచారణ కోసం మంగళవారం ఈడీ ఎదుట సోనియా హాజరయ్యారు.

  12. పాకిస్తాన్‌: కరాచీలో ఉత్సాహంగా తమిళ హిందువుల మారియమ్మాన్ వేడుకలు

  13. శ్రీలంకలో రోజురోజుకూ తీవ్రమవుతున్న సంక్షోభం... తిండి కోసం అష్టకష్టాలు పడుతున్న ప్రజలు

  14. బ్రేకింగ్ న్యూస్, కామన్వెల్త్ గేమ్స్‌కు నీరజ్ చోప్రా దూరం

    నీరజ్ చోప్రా

    ఫొటో సోర్స్, Getty Images

    ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో అదరగొట్టిన భారత జావెలిన్ త్రో స్టార్ క్రీడాకారుడు నీరజ్ చోప్రా, కామన్వెల్త్ క్రీడలకు దూరం కానున్నాడు.

    దీని గురించి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కార్యదర్శి రాజీవ్ మెహతా, వార్తా సంస్థ ఏఎన్‌ఐకి సమాచారం ఇచ్చారు.

    ‘‘ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ గాయపడ్డారు. కామన్వెల్త్ గేమ్స్‌కు తగినంత ఫిట్‌నెస్ లేనందున ఈ క్రీడల్లో పాల్గొనబోవట్లేదని నీరజ్ మాకు సమాచారం ఇచ్చారు’’ అని ఆయన వెల్లడించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సాధించిన రజత పతకంతో కామన్వెల్త్ గేమ్స్‌లోనూ అతను పతకం సాధిస్తాడని అందరూ అనుకున్నారు.

    టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో నీరజ్ స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  15. మార్గరెట్ అల్వా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఏమన్నారంటే...

    విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా

    ఫొటో సోర్స్, Getty Images

    బీజేపీ నేతలతో మాట్లాడిన తర్వాతే తన ఫోన్‌లో సమస్య వచ్చిందంటూ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా, చిన్నపిల్లల తరహాలో ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు.

    ‘‘ఎవరైనా ఆమె ఫోన్‌ను ఎందుకు ట్యాప్ చేస్తారు? ఉప రాష్ట్రపతి ఎన్నిక ఫలితంపై మేం నమ్మకంగా ఉన్నాం. ఇవన్నీ చిన్న పిల్లల ఆరోపణలు. ఒక సీనియర్ వ్యక్తి అయిన ఆమె ఇలాంటి ఆరోపణలు చేయకూడదు’’ అని ఆయన అన్నట్లు వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    అంతకుముందు ఆమె బీజేపీ నేతలతో మాట్లాడిన తర్వాతే తన ఫోన్ కాల్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయని పేర్కొంటూ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. పాకిస్తాన్ గూఢచారుల వాట్సాప్ గ్రూప్‌లో భారత ఆర్మీ ఇంటెలిజెన్స్ అధికారులు... ఈ కేసుపై సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

  17. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు రెండోసారి కరోనా

    నితీశ్

    ఫొటో సోర్స్, Getty Images

    బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు రెండోసారి కరోనా సోకింది. ఈ ఏడాది జనవరిలో తొలుత కరోనా బారిన పడిన ఆయనకు తాజాగా మరోసారి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిందని బిహార్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) తెలిపింది. గత రెండు, మూడు రోజులుగా ఆయన అనారోగ్యంగా ఉన్నట్లు చెప్పింది.

    వైద్యుల సలహా మేరకు ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారని, ప్రజలంతా కోవిడ్ నిబంధనలను పాటించాలని ఆయన చెప్పినట్లు సీఎంఓ ట్వీట్ చేసింది.

    నితీశ్ కొన్ని రోజులుగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. హెపటైటిస్ డే: వ్యాక్సీన్లను ఎందుకు తప్పనిసరి చేశారు?

  19. గుజరాత్: నాటు సారా తాగి 24 మంది మృతి

    గుజరాత్: నాటు సారా తాగి 24 మంది మృతి

    ఫొటో సోర్స్, Sachin Pithwa

    గుజరాత్‌లోని బోటాద్ జిల్లాలో నాటు సారా తాగడంతో 40 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో మంగళవారం ఉదయం వరకు 24 మంది చనిపోయారని బీబీసీ ప్రతినిధి సచిన్ పిథ్వా చెప్పారు.

    నాటు సారా తాగి అనారోగ్యం పాలైన 40కి పైగా వ్యక్తులను భావ్‌నగర్, బోటాద్, అహ్మదాబాద్‌లోని ఆసుపత్రుల్లో చికిత్స కోసం చేర్చారు.

    సారా తయారు చేసి విక్రయిస్తోన్న వారిలో ఇప్పటివరకు అయిదుగురిని అరెస్ట్ చేసినట్లు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా తెలిపారు.

    గుజరాత్: నాటు సారా తాగి 24 మంది మృతి

    ఫొటో సోర్స్, Sachin Pithwa

    విచారణలో సహాయపడేందుకు గుజరాత్ ఏటీఎస్ మంగళవారం ఉదయం బోటాద్‌కు చేరుకుంది. ఈ కేసును దర్యాప్తు చేసే ప్రత్యేక బృందానికి డీఎస్పీ ర్యాంకు అధికారి నేతృత్వం వహిస్తారని భావ్‌నగర్ రేంజ్ ఐజీ అశోక్ కుమార్ చెప్పారు.

    అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్, గుజరాత్ ఏటీఎస్ ఈ కేసులో విచారణను ప్రారంభించింది.

    వ్యవస్థ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆ గ్రామ సర్పంచ్ జిగర్ డుంగారాణి ఆరోపించారు.

    ‘‘మూడు, నాలుగు నెలల క్రితమే నేను ఎస్పీ, పీఎస్‌ఐలకు రాతపూర్వకంగా దీనిపై ఫిర్యాదు చేశాను. కానీ పరిష్కారం లభించలేదు’’ అని ఆయన చెప్పారు.