లైవ్ పేజీ అప్‌డేట్స్‌కు సమాప్తం
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం. అంతవరకు సెలవు.
పార్లమెంటు మీది జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు. లోక్‌సభకు ప్రతినిధి అయిన స్పీకర్ ప్రభుత్వం కంటే తక్కువ కాదని అన్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం. అంతవరకు సెలవు.

ఫొటో సోర్స్, Twitter/NarendraModi
కొత్తగా నిర్మిస్తున్న భారత పార్లమెంటు భవనం మీద జాతీయ చిహ్నం మూడు సింహాల పిల్లరను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
కానీ ఇలా ప్రధాని ఆవిష్కరించడాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. పార్లమెంటు మీది జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించడం ద్వారా మోదీ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన విమర్శించారు.
‘పార్లమెంటు, ప్రభుత్వం, న్యాయవ్యవస్థలకు వేరువేరు అధికారాలను రాజ్యాంగం ఇచ్చింది. ప్రభుత్వాధినేతగా ఉన్న ప్రధాని పార్లమెంటు మీద ఉన్న ఉన్న జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించకూడదు. లోక్‌సభకు ప్రతినిధి అయిన స్పీకర్, ప్రభుత్వం కంటే తక్కువ కాదు. ప్రధాని రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారు.’ అని ఓవైసీ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ani
అన్నాడీఎంకే జనరల్ బాడీ మీటింగ్‌లో ఇ. పళనస్వామి వర్గం ఓ. పన్నీర్‌సెల్వంను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి బహిష్కరించింది.
సమావేశం జరుగుతున్న సమయంలో పళనిస్వామి మాట్లాడుతూ, “ప్రజాస్వామ్య పద్ధతుల్లో పని చేస్తున్న ఏకైక పార్టీ అన్నాడీఎఁకే. నా నిబద్ధతను గుర్తించిన జయలలిత నాకు హైవే, పీడబ్ల్యు.డి వంటి శాఖలకు మంత్రిగా తీసుకున్నారు. మంత్రిగా నేను ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాను”అని అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పార్టీ ఒకే వ్యక్తి నాయకత్వంలో ఉండాలని జనరల్ బాడీ సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారని ఆయన చెప్పారు. జనరల్ బాడీ సమావేశం చెన్నైలోని వనగరంలో జరిగింది.
అదే సమయంలో రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రులు ఓ. పన్నీర్‌సెల్వం, పళనిస్వామి మద్దతుదారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇరువర్గాలు రాళ్ళు రువ్వుకున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
పార్టీలో నాయకత్వ పోరు చాలా కాలంగా కొనసాగుతోంది. పన్నీర్ సెల్వం పార్టీకి కోఆర్డినేటర్‌గా ఉంటే, పళనిస్వామి జాయింట్ కోఆర్డినేటర్‌గా ఉన్నారు.
ఇద్దరు నాయకులు ఉండం వల్ల పార్టీ బలహీనపడుతోందని సభ్యులు అంటున్నారు. పళనిస్వామికి పార్టీలో ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉందని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
శివసేన నుంచి తిరుగుబాటు చిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసు మీద విచారణను ప్రస్తుతానికి నిలిపివేసింది. అయితే, ఈ విషయంలో ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని సుప్రీం కోర్టు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను ఆదేశించింది.
ఈ అంశంపై చాలా పిటిషన్లు దాఖలైనందున ఇందుకోసం ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ అన్నారు. అందుకు కొంత సమయం పడుతుందని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో రాజకీయ దుమారం చెలరేగుతున్న సందర్భంలో ఈ అంశం సుప్రీం కోర్టుకు వచ్చింది. ఇదే సమయంలో ముక్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడం, తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే బీజేపీ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిపోయాయి.

ఫొటో సోర్స్, REUTERS
రుణాలు ఎగవేత ఆరోపణలతో విదేశానికి వెళ్ళిపోయిన విజయ్ మాల్యాకు సుప్రీం కోర్టు నాలుగు నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో సుప్రీం కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది.
నేరానికి తగిన శిక్ష విధించాలని చెప్పిన సుప్రీం కోర్టు, 40 మిలియన్ అమెరికన్ డాలర్లను (దాదాపు రూ. 318 కోట్లు) వడ్డీతో సహా నాలుగు వారాల్లో డిపాజిట్ చేయాలని మాల్యాను అదేశించింది.
ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయలేని పక్షంలో ఆయన ఆస్తులను జప్తు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష తన రాజీనామాను ధ్రువీకరించారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. నిరసనకారులు అధ్యక్ష భవనంలోకి చొరబడిన తరువాత అక్కడి నుంచి పారిపోయిన అధ్యక్షుడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారన్నది ఇంకా వెల్లడి కాలేదు.
నిరసనకారులు ఇప్పటికీ అధ్యక్ష భవనాన్ని, ప్రధానమంత్రి నివాసాన్ని ఆక్రమించుకునే ఉన్నారు. దేశాధ్యక్షుడు, ప్రధాని తమ పదవులకు రాజీనామా చేసేంతవరకు అక్కడి నుంచి కదిలేది లేదని వారు అంటున్నారు.
శనివారం నాడు పార్లమెంటు స్పీకర్ ఒక ప్రకటన చేస్తూ, అధ్యక్షు జూలై 13న రాజీనామా చేస్తారని చెప్పారు. కానీ, నిరసనకారులు ఆ మాటలను నమ్మడం లేదు.
కాగా, శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘె సోమవారం నాడు ఒక ప్రకటన చేస్తూ, అధ్యక్షుడు రాజపక్ష తాను బుధవారం నాడు తన పదవికి రాజీనామా చేస్తానని అధికారిక సమాచారం ఇచ్చారని చెప్పారు. అయితే, ఇంతవరకూ రాజపక్ష నుంచి నేరుగా ఎలాంటి ప్రకటన రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీలంకలో రాజకీయ సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆ దేశానికి భారత్ తన సైనిక బలగాలను పంపిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రచారాన్ని భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని శ్రీలంకలోని భారత హైకమిషన్ ప్రకటించింది.
ఈ మేరకు భారత హైకమిషన్ ఒక ట్వీట్ చేస్తూ, “శ్ల్రీలంకకు భారత్ సైన్యాన్ని పంపిస్తోందని మీడియోలో, సోషల్ మీడియాలో వస్తున్న కల్పిత వార్తలను హైకమిషన్ పూర్తిగా ఖండిస్తోంది. శ్రీలంక విషయంలో భారత్ వైఖరికి, ఈ ప్రచారానికి ఎలాంటి సంబంధం లేదు”అని స్పష్టం చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
“శ్రీలంక ప్రజలు ప్రజాస్వామిక విధానాలు, విలువలతో తమ ఆశలు, ఆశయాలను నిజం చేసుకుని అభివృద్ధి మార్గంలో పయనించాలని, అందుకు మేం వారి వెంట ఉన్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇప్పటికే స్పష్టం చేశారు”అని కూడా హై కమిషన్ తన ట్వీట్‌లో పేర్కొంది.
శ్రీలంక ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశ రాజధాని కొలంబోలో శనివారం నాడు ప్రజా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు భారీ సంఖ్యలో దేశాధ్యక్షుడి అధికార నివాసంలోకి చొచ్చుకుపోయారు. ఫలితంగా అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆగ్రహంతో ఉన్న ఆందోళనకారులు ప్రధాని నివాసానికి కూడా నిప్పంటించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విశేషాలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వార్తలను మీకు ఎప్పటికప్పుడు అందించే బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.