పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్ ఆరోగ్యం విషమం

ముషరఫ్ చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దీంతో ట్విటర్ వేదికగా ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  2. నేటి ముఖ్యాంశాలు

    వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ఆత్మ విమర్శ చేసుకోవాలని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

    మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా దేశ వ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో ముస్లింలు నిరసనలు చేపట్టారు.

    పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్పర్వేజ్ ముషరఫ్ ఆరోగ్యం విషమంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

    పోయిన ఏడాది జనవరి 6న అమెరికా చట్టసభలు ఉండే క్యాపిటల్ హిల్ మీద జరిగిన దాడుల మీద ప్రతినిధుల సభ విచారణ ప్రారంభించింది. దాడులు జరిగిన తరువాత ఈ కేసులో తొలిసారి పబ్లిక్ హియరింగ్ మొదలైంది.

    క్యాపిటల్ హిల్ దాడుల మీద విచారణ ప్రారంభమైన నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందించారు. విచారణ కమిటీలో ‘రాజకీయ దొంగలు’ ఉన్నారంటూ విమర్శించారు. నాడు ప్రజలు భారీ సంఖ్యలో క్యాపిటల్ హిల్‌కు ఎందుకు వచ్చారో అర్థం చేసుకునేందుకు వారు ఒక్క నిమిషం కూడా వెచ్చించడం లేదని ఆరోపించారు.

  3. క్షమాబిందు: తనను తాను పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి సెక్స్ గురించి ఏమన్నారంటే...

  4. జనగణమన: ఒక ఎన్‌కౌంటర్ కథ - ఎడిటర్స్ కామెంట్

  5. Diet and Health: ప్రోటీన్ సప్లిమెంట్లు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా?

  6. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్ ఆరోగ్యం విషమం

    పర్వేజ్ ముషరఫ్

    ఫొటో సోర్స్, P_Musharraf

    పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్పర్వేజ్ ముషరఫ్ ఆరోగ్యం విషమంగా ఉందని ఆయన కుటుంబ సభ్యులు శుక్రవారం వెల్లడించారు.

    ముషరఫ్ చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. దీంతో ట్విటర్ వేదికగా ఆయన కుటుంబ సభ్యులు స్పందించారు.

    ‘‘ఆయన వెంటిలేటర్‌పై లేరు. అయితే, గత మూడు వారాల నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన కోలుకోవడం లేదు. కొన్ని అవయవాలు స్పందించడం లేదు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని దేవున్ని ప్రార్థించండి’’అని ఆయన కుటుంబం వెల్లడించింది.

    ప్రస్తుతం ముషరఫ్ పాకిస్తాన్‌లో లేరు. వైద్య చికిత్సల నిమిత్తం 2016లో ఆయన దుబాయి వెళ్లారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  7. మిథాలీ రాజ్: భారత మహిళా క్రికెట్‌ రూపురేఖలు మార్చేసిన క్రీడాకారిణి

  8. జహంగీర్‌పురి: ముస్లింలు ఇళ్లు వదిలి ఎందుకు వెళ్లిపోతున్నారు, వారి భయం దేనికి?

  9. అంటే... సుందరానికీ! సినిమా రివ్యూ: నాని, నజ్రియాల ప్రేమాయణం ఎలా ఉంది?

  10. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు: నూపుర్ శర్మను అరెస్టు చేయాలంటూ హైదరాబాద్‌లో నిరసనలు

    దిల్లీలోని జామా మసీదు వద్ద నిరసన

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, దిల్లీలోని జామా మసీదు వద్ద నిరసన

    మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా దేశ వ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో శుక్రవారం ముస్లింలు నిరసనలు చేపట్టారు.

    దిల్లీలోని జామా మసీదు వెలుపల ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని ముస్లింలు నిరసన తెలియజేశారు. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మ, నవీన్ జిందాల్‌లను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.

    అయితే, నిరసనలు చేపట్టేందుకు మసీదు కమిటీ ఎలాంటి పిలుపూ ఇవ్వలేదని జామా మసీదు షాహి ఇమామ్ చెప్పారు.

    ఉత్తర్ ప్రదేశ్‌లోని దేవ్‌బందీలోనూ నిరసనలు జరిగాయి. సహరాన్‌పుర్‌లోనూ నిరసన ప్రదర్శన చేపట్టారు.

    కోల్‌కతా, హైదరాబాద్, లఖ్‌నవూలోనూ నిరసనలు జరిగినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. గుత్తికోయలు ఎవరు, వారిని ఏపీ-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి ఎందుకు తరిమేస్తున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  12. చంద్రబాబు: ‘వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సీబీఐ విశ్వసనీయత దెబ్బతింటోంది’

    తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

    ఫొటో సోర్స్, Facebook/Telugu Desam Party (TDP)

    వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ఆత్మ విమర్శ చేసుకోవాలని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

    వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి అయిన కల్లూరి గంగాధర్ రెడ్డి ఇటీవల చనిపోయిన విషయం తెలిసిందే.

    ‘వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి నేడు ముగ్గురు చనిపోయారు. శ్రీనివాసుల రెడ్డి, గంగిరెడ్డి ఎలా చనిపోయారు? ఇప్పుడు గంగాధర్ రెడ్డి ఎలా చనిపోయారు?’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

    ‘నాడు పరిటాల రవి హత్య కేసును సీబీఐకి అప్పగించారు. ఆ తరువాత వరుసగా సాక్ష్యులందరూ చనిపోయారు. దీని మీద సీబీఐ ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఇది మీ విశ్వసనీయతకే పెను సవాలు.’ అని చంద్రబాబు విమర్శించారు.

    గంగాధర్ రెడ్డి ఎలా చనిపోయారని? సీబీఐకి సమర్థత లేకపోతే దేశాన్ని ఎవరు కాపాడతారంటూ చంద్రబాబు ప్రశ్నించారు.

  13. భూ పరిరక్షణ ఉద్యమం, వివాదాస్పద అంశాలపై జగ్గీ వాసుదేవ్‌తో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ..

  14. షోయబ్ అఖ్తర్: ‘మొహమ్మద్ ప్రవక్తే మాకు అన్నీ... మేం బతికేది చనిపోయేది ఆయన కోసమే...’

    పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్

    ఫొటో సోర్స్, Facebook/Shoaib Akhtar

    మొహ్మద్ ప్రవక్తపై ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల మీద పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ స్పందించారు.

    ‘మొహ్మద్ ప్రవక్త గౌరవమర్యాదలు మాకు ఎంతో ముఖ్యం. మేం బతికినా చనిపోయినా ఏం చేసినా అంతా ఆయన కోసమే. మొహ్మద్ ప్రవక్తను అవమానించే వ్యాఖ్యలను ఖండిస్తున్నా. ఆ వ్యాఖ్యలు చేసిన వారిని సస్పెండ్ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా భారత్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.’ అని ట్విటర్ ద్వారా ఆయన ప్రకటన విడుదల చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. నేడు 16 రాజ్యసభ స్థానాలకు ఎన్నిక... బరిలో నిర్మల సీతారామన్

    కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్

    ఫొటో సోర్స్, Facebook/Nirmala Sitharaman

    నేడు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో 16 స్థానాలకు ఎంపీలను ఎన్నుకోనున్నారు. పోలింగ్ 9 గంటలకు ప్రారంభమైన సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది.

    రాజ్యసభలో మొత్తం 57 స్థానాలను భర్తీ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు సంబంధించి 41 స్థానాల్లో పోటీ లేకుండానే ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికయ్యారు.

    మిగిలిన 16 స్థానాలకు మహారాష్ట్ర, రాజస్థాన్, హరియాణ, కర్నాటకలలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి.

    కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ కర్నాటక నుంచి బరిలో ఉండగా మరొక కేంద్ర మంత్రి పీయూశ్ గోయెల్ మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తున్నారు.

  16. డోనల్డ్ ట్రంప్: ‘విచారణ కమిటీలో రాజకీయ దొంగలు’

    అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

    ఫొటో సోర్స్, Getty Images

    క్యాపిటల్ హిల్ దాడుల మీద విచారణ ప్రారంభమైన నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందించారు.

    విచారణ కమిటీలో ‘రాజకీయ దొంగలు’ ఉన్నారంటూ విమర్శించారు. నాడు ప్రజలు భారీ సంఖ్యలో క్యాపిటల్ హిల్‌కు ఎందుకు వచ్చారో అర్థం చేసుకునేందుకు వారు ఒక్క నిమిషం కూడా వెచ్చించడం లేదని ఆరోపించారు.

    2021 జనవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీకి భారీ సంఖ్యలో ప్రజలు రావడం దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టమని ట్రంప్ అన్నారు.

    2020 అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ఇప్పటికీ ట్రంప్ ఆరోపిస్తున్నారు. ‘ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం వల్ల అమెరికా నరకంలో పడిపోయింది. చూడండి ఇప్పుడు మన దేశం ఎలా ఉందో?’ అని ఆయన చెప్పుకొచ్చారు.

  17. అమెరికా: ‘ట్రంప్ దేశం మీద తిరుగుబాటకు ప్రయత్నించారు’

    అమెరికాలోని క్యాపిటల్ హిల్స్ మీద దాడి

    ఫొటో సోర్స్, Getty Images

    పోయిన ఏడాది జనవరి 6న అమెరికా చట్టసభలు ఉండే క్యాపిటల్ హిల్ మీద జరిగిన దాడుల మీద ప్రతినిధుల సభ విచారణ ప్రారంభించింది. దాడులు జరిగిన తరువాత ఈ కేసులో తొలిసారి పబ్లిక్ హియరింగ్ మొదలైంది.

    క్యాపిటల్ హిల్ దాడులు ‘అమెరికా మీద జరిగిన తిరుగుబాటు’గా విచారణ కమిటీ చైర్మన్ బెన్నీ థామస్ అభివర్ణించారు. మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తిరుగుబాటుకు ప్రయత్నించారనేలా పరోక్షంగా ఆయన వ్యాఖ్యానించారు.

    విచారణ కమిటీ ముందు హాజరైన కొందరు రిపబ్లికన్లు సైతం ట్రంప్‌ను తప్పు పట్టారు. క్యాపిటల్ హిల్ మీద జరిగిన దాడులను ఆయన సమర్థించడాన్ని వారు విమర్శించారు.

    2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ తొలి నుంచి డోనల్డ్ ట్రంప్ ఆరోపిస్తూ వస్తున్నారు. ఆ ఎన్నికల్లో జో బైడెన్ గెలిచినా, దాన్ని గుర్తించేందుకు ట్రంప్ నిరాకరించారు.

    జో బైడెన్ అధ్యక్షుడు కాకుండా అడ్డుకోవాలంటూ నాటి వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌కు సూచించారు.

    ఈ నేపథ్యంలో ట్రంప్ మద్దతుదార్లు వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్‌ను 2021 జనవరి 6న చుట్టుముట్టారు. భవనాల్లోకి చొచ్చుకుని పోవడంతోపాటు అద్దాలు ధ్వంసం చేశారు. నాడు జరిగిన ఘర్షణల్లో సుమారు అయిదుగురు చనిపోయారు.

  18. హలో ఆల్! గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీ చూస్తూ ఉండండి.