You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

క్వినెస్ జెంగ్: ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో నెలసరి నొప్పి.. మ్యాచ్ ఓడిపోయిన చైనా క్రీడాకారిణి

‘‘ఇది అమ్మాయిల సమస్య. మొదటి రోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్పోర్ట్స్ ఆడేటప్పుడు మరింత నొప్పిగా ఉంటుంది’’అని జెంగ్ అన్నారు.

లైవ్ కవరేజీ

పద్మ మీనాక్షి

  1. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  2. ఏడేళ్లలో తొలిసారిగా సెమీస్ చేరిన రోహన్ బోపన్న

    భారత టెన్నిస్ క్రీడాకారుడు రోహన్ బోపన్న ఏడేళ్లలో తొలిసారిగా ఒక గ్రాండ్ స్లామ్ సెమీ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు.

    ఫ్రెంచ్ ఓపెన్‌లో నెదర్లాండ్స్ స్టార్ మైట్వీ మెడిల్‌కూప్‌తో కలిసి బోపన్న.. లియోడ్ గ్లాస్‌పూల్ (బ్రిటన్), హెన్రీ హెలియోవరా(ఫిన్లాండ్)లను ఓడించారు.

    పురుషుల డబుల్స్ సెమీ ఫైనల్స్‌లో అడుగుపెట్టేందుకు 4-6, 6-4, 7-3 తేడాతో లియోడ్, హెన్రీలను బోపన్న జోడీ ఓడించింది.

    2015 వింబుల్డన్‌ ఛాంపియన్‌షిప్‌లో బోపన్న జోడి సెమీఫైనల్స్‌కు వెళ్లింది. అయితే, జీన్ జూలియన్ రోజర్, హోరియాల చేతిలో ఓటమి చవిచూసింది.

    తర్వాత మ్యాచ్‌లో భాగంగా అరెవాలో, జీన్ జూలియన్‌లతో బోపన్న జోడి గురువారం తలపడనుంది.

    ఈ సిరీస్‌లో ఓపెనింగ్ మ్యాచ్‌లో బోపన్న జోడి ఓటమి చవిచూసింది. అయితే తర్వాత రెండు మ్యాచ్‌లు గెలిచింది.

  3. ఈ హెల్మెట్ మ్యాన్ రెడ్ సిగ్నల్ పడగానే డ్యాన్సులు ఎందుకు చేస్తున్నాడు?

  4. ఆరుగురు పిల్లల్ని నూతిలో తోసి తల్లి ఆత్మహత్యాయత్నం

    మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మహాడ్‌లో 30ఏళ్ల మహిళ తన ఆరుగురు పిల్లలను నూతిలో లోసి తను కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.

    నూతిలో దూకేసిన ఆమెను స్థానికులు కాపాడారు. అయితే, ఆమె ఆరుగురు పిల్లలూ మరణించారు.

    పోలీసులు ఆమెపై హత్య ఆరోపణలతో కేసు నమోదుచేశారు. ఆమె భర్తను కూడా ప్రశ్నించేందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    ‘‘మరణించిన పిల్లల్లో ఐదుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. అందరికంటే ఆ అబ్బాయి చిన్నవాడు. అతడి వయసు ఏడాదిన్నరేళ్లు. పెద్దమ్మాయి వయసు పదేళ్లు’’అని ఎస్పీ అశోక్ దుధే బీబీసీతో చెప్పారు.

    మహడ్‌లోని ఢాక్‌లాఠీ గ్రామంలో సోమవారం (మే 30న) సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

    33ఏళ్ల చిఖ్‌రూ సహానీ, అతని భార్య 30ఏళ్ల రుణా ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ నుంచి కూలి పని చేసేందుకు మహడ్‌కు వచ్చారు.

    ‘‘చిఖ్‌రూ, రుణాల మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త పనికి వెళ్లిన వెంటనే, వారు ఉంటున్న శెల్‌టోలీ గ్రామానికి 3 నుంచి 4 కి.మీ. దూరంలోని ఢాలకాటీ గ్రామానికి పిల్లలతోపాటు రుణా వెళ్లింది. అక్కడే ఆరుగురు పిల్లలను నూతిలో తోసేసి ఆమె కూడా నూతిలో దూకింది’’అని అశోక్ చెప్పారు.

    ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి పది గంటల సమయంనాటికి మొత్తం ఆరుగురు పిల్లల మృతదేహాలను బయటకు తీశారు.

  5. క్వినెస్ జెంగ్: ఫ్రెంచ్ ఓపెన్ మధ్యలో నెలసరి నొప్పి.. మ్యాచ్ ఓడిపోయిన చైనా క్రీడాకారిణి

    ఫ్రెంచ్ ఓపెన్‌లో పోలండ్ క్రీడాకారిణి ఇగా స్వైటెక్ చేతిలో చైనాకు చెందిన 19ఏళ్ల క్వినెస్ జెంగ్ ఓటమి పాలయ్యారు.

    వీరిద్దరి మధ్య ప్రీ క్వార్టర్స్ మ్యాచ్ పారిస్‌లోని రోలాండ్ గారోస్‌లో సోమవారం జరిగింది. అయితే, నెలసరి నొప్పి వల్ల తను ఈ మ్యాచ్‌లో ఓటమి చవిచూసినట్లు జెంగ్ వెల్లడించారు.

    ‘‘ఇది అమ్మాయిల సమస్య. మొదటి రోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది. స్పోర్ట్స్ ఆడేటప్పుడు మరింత నొప్పిగా ఉంటుంది’’అని జెంగ్ అన్నారు.

    ‘‘నేను ప్రకృతికి విరుద్ధంగా ముందుకు వెళ్లలేను. అబ్బాయినైతే బావుండేది. ఇలాంటి నొప్పి ఉండేది కాదు’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

  6. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా శరీరంలో 24 బుల్లెట్లు - నివేదిక

    పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా శరీరంలోకి 24 బుల్లెట్లు దూసుకెళ్లినట్లు వైద్య ఆరోగ్య అధికారులు బీబీసీ పంజాబీకి తెలిపారు.

    28 ఏళ్ల గాయకుడిని పంజాబ్ రాష్ట్రంలోని మాన్సా జిల్లాలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు.

    మంగళవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన అంతిమ సంస్కారాలకు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు.

    ఈ హత్యతో సంబంధం ఉందనే అనుమానంతో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

  7. ‘ఒక అమ్మాయి పరువు కోసం’ 200 ఏళ్లుగా నిర్మానుష్యంగా ఉంటున్న ఎడారి గ్రామం.. ఏం జరిగిందంటే..

  8. శౌర్య చక్ర అవార్డుల ప్రధానం

    భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శౌర్య చక్ర అవార్డులను ప్రధానం చేశారు. దిల్లీలో మంగళవారం డిఫెన్స్ ఇన్వెస్టిట్యూర్ 2022 కార్యక్రమం జరిగింది.

    దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు విడిచిపెట్టిన వారికి మరణానంతరం ఈ అవార్డులను వారి కుటుంబ సభ్యులకు అందచేశారు.

    అవార్డులను పొందిన వారిలో కోబ్రా సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ వికాస్ కుమార్, అజిత్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ కుల్ దీప్ కుమార్ ఉరవాన్, ఒడిశా పోలీసు కమాండోలు డేబాసిస్ సేథీ. సుధీర్ కుమార్ తూడు, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఉన్నారు.

    రాష్ట్రపతి పరమ్ విశిష్ట, విశిష్ట సేవా పతకాలను కూడా ప్రధానం చేశారు.

  9. Fake Currency notes: నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడం ఎలా.. ఈ పది విషయాలు గుర్తుపెట్టుకోండి

  10. గుబోన్‌లో పర్యటిస్తున్న భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

    భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విదేశీ పర్యటనల్లో భాగంగా మంగళవారం గుబోన్‌లో పర్యటించారు.

    గుబోన్‌తో సత్సంబంధాలకు భారత్ చాలా ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు. గుబోన్ అభివృద్ధి పథంలో భారత్ ఒక నమ్మశక్యమైన భాగస్వామిగా ఉందని మరోసారి గుర్తు చేసినట్లు ఉప రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది.

    పర్యటనలో భాగంగా ఆయన గుబోన్ దేశాధ్యక్షుడు అలీ బోంగో ఆండింబాతో కూడా సమావేశమయ్యారు.

  11. యుక్రెయిన్‌: సెవెరోదోనెత్స్క్‌లో కొనసాగుతున్న రష్యా దాడులు

    తూర్పు యుక్రెయిన్‌లో రష్యన్ దాడులు కొనసాగుతున్నాయి.

    సెవెరోదోనెత్స్క్‌లో షెల్లింగ్ కొనసాగుతుండటంతో పౌరులను తరలించడాన్ని ఆపినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

    ఈ నగరంలో సుమారు 15,000 మంది పౌరులు చిక్కుకుపోయి ఉండవచ్చని ప్రాంతీయ గవర్నర్ సెర్హియీ హైదీ చెప్పారు.

    నగరంలో జరిగిన విధ్వంసం చూస్తుంటే భయంకరంగా ఉందని నార్వీజియన్ రెఫ్యూజీ కౌన్సిల్ ఎయిడ్ ఏజెన్సీ సెక్రెటరీ జనరల్ జాన్ ఎగ్లాండ్ అన్నారు.

    ఈ నగరంలో చిక్కుకున్న ప్రజలు తాగు నీరు, తిండి, వసతి, ఔషధాలు, కరెంటు లాంటి సేవలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

    ఆగకుండా కొనసాగుతున్న పేలుళ్ల వల్ల పౌరులు బాంబు షెల్టర్లు, బేస్‌మెంట్లలో తలదాచుకుంటున్నారు.

  12. కెనడా: హ్యాండ్ గన్‌లను సొంతం చేసుకోవడం పై నిషేధం

    లియో సాండ్స్, బీబీసీ న్యూస్

    హ్యాండ్ గన్‌లను కొనడం అమ్మడం పై పూర్తి నిషేధాన్ని ప్రవేశపెట్టాలని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ప్రతిపాదించారు.

    ప్రైవేటు వ్యక్తులు తుపాకీలను సొంతం చేసుకోవడాన్ని నిషేధిస్తూ తమ ప్రభుత్వం చట్టం తేవాలని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

    అయితే, వీటి పై ఒక్కసారిగా నిషేధం విధించబోమని చెబుతూ, వాటిని కొత్తగా కొనుక్కోవడాన్ని చట్ట వ్యతిరేకం చేయనున్నట్లు చెప్పారు.

    అమెరికాలోని టెక్సస్ ప్రాథమిక పాఠశాలలో 21 మంది చిన్నారులను కాల్చి చంపిన ఘటన తర్వాత ట్రూడో ఈ ప్రతిపాదన చేశారు. సోమవారం ఈ బిల్లును కెనడా పార్లమెంటులో ప్రవేశపెట్టారు.

    ఈ బిల్లు ఆమోదం పొందితే, హ్యాండ్ గన్ లను కొనడం, అమ్మడం, బదిలీ చేయడం, విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం కూడా చట్ట వ్యతిరేకం చేస్తుంది.

  13. ‘మీ భర్తను చంపడం ఎలా’ నవలా రచయిత్రి తన భర్తను ఎందుకు హత్య చేశారు? కోర్టులో ఏం చెప్పారు?

  14. 2022లో దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం - ఐఎండి

    ఈ ఏడాదిలో భారత్‌లో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశముంది.

    ఈ ఏడాది సగటున 103% వర్షపాతం ఉండవచ్చని భారత్ వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహాపాత్ర విలేఖరుల సమావేశంలో చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

    దీని వల్ల వ్యవసాయ ఉత్పత్తి పెరిగి దేశ ఆర్ధిక అభివృద్ధికి దారి తీయవచ్చు. దీంతో, ద్రవ్యోల్బణాన్ని అరికట్టే అవకాశముంది.

    ఈ ఏడాది ఏప్రిల్ లో గత 8 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరిగి, కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచేందుకు దారి తీసింది. ఆదివారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించాయి.

  15. నేపాల్ విమాన ప్రమాదంలో మృతుల గాలింపు చర్యల ముగింపు

    నేపాల్ విమాన ప్రమాదంలో మరణించిన 22 మంది మృతదేహాలు లభించడంతో గాలింపు చర్యలు ముగిసాయి.

    వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే మృతదేహాలను పోఖరా మీదుగా ఖాట్మండుకు తీసుకుని వెళతారు.

    గాలింపు చర్యలు ముగిసినట్లు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు.

    తారా విమానం కూలిన ప్రదేశం నుంచి బ్లాక్ బాక్స్ ను వెలికి తీశారు.

  16. భూపాలపల్లి: స్వీపర్ కుమారుడు కాబోయే కలెక్టర్

  17. ఫుడ్ ట్రక్... ఆకలితో ఉన్నవారికి ఉచితంగా అన్నం పెడుతుంది

  18. నార్వే చెస్: ప్రపంచ చెస్ ఛాంపియన్ కార్ల్సన్‌ను ఓడించిన విశ్వనాథన్ ఆనంద్

    నార్వే చెస్ బ్లిట్జ్ ఈవెంట్‌లో ఐదవ రౌండులో ప్రపంచ చెస్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్‌ను ఇండియన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఓడించారు. దీంతో, ఆయన 5 పాయింట్లతో నాలుగవ స్థానంలో నిలిచారు.

    అమెరికన్ గ్రాండ్ మాస్టర్ వెస్లీ 6.5 పాయింట్లు సాధించారు. డచ్ గ్రాండ్ మాస్టర్ అనీష్ గిరి మూడవ స్థానంలో నిలిచారు.

  19. ముఖిహౌస్: పాకిస్తాన్ హైదరాబాద్‌లోని అందమైన ప్యాలెస్ చుట్టూ అల్లుకున్న ఒక కుటుంబం జ్ఞాపకాలు

  20. ఆధార్ నంబర్ ఇచ్చే ముందు కామన్ సెన్స్ ఉపయోగించమని ప్రభుత్వం ఎందుకు చెబుతోంది?