అమెరికాలో పార్టీ చేసుకుంటున్న వారిపైకి కాల్పులు జరిపిన వ్యక్తిని కాల్చిచంపిన మహిళ
అమెరికా వెస్ట్ వర్జీనియాలోని చార్లెస్టన్‌లో ఓ పార్టీకి వచ్చిన వారిపై కాల్పులు జరిపిన వ్యక్తిని ఓ మహిళ కాల్చి చంపారు.
లైవ్ కవరేజీ
చిట్టత్తూరు హరికృష్ణ and శారద మియాపురం
జానీ డెప్–అంబర్ హెర్డ్: పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ నటుడికి, ఆయన మాజీ భార్యకు మధ్య కేసులో 5 విస్తుపోయే వాదనలు
భారత్-నేపాల్ మధ్య ఒక నది ఎలా చిచ్చు పెడుతోంది
ధన్యవాదాలు
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.
రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.
నేటి ముఖ్యాంశాలు
- అమెరికా వెస్ట్ వర్జీనియాలోని చార్లెస్టన్‌లో ఓ పార్టీకి వచ్చిన వారిపై కాల్పులు జరిపిన వ్యక్తిని ఓ మహిళ కాల్చి చంపారు.
- ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక భాగంలో తుప్పలు, పొదలను క్లీన్ చేస్తుండగా...అక్కడ వందల సంఖ్యలో ఖాళీ కండోమ్ ప్యాకెట్లు, కండోమ్‌లు, మద్యం సీసాలు, చెట్లపై పడక తరహాలు ఏర్పాట్లు బయటపడ్డాయి.
- జ్ఞాన్‌వాపి మసీదు లోపల నిర్వహించిన సర్వే వీడియో ఫుటేజీ, ఫొటోలను పబ్లిక్ డొమైన్‌లో పంచుకోవడానికి అనుమతించవద్దని వారణాసి కోర్టును శనివారం ముస్లిం కమిటీ కోరింది. ఈ కేసుతో సంబంధం లేనివారికి ఈ అంశానికి సంబంధించిన ఫుటేజీ, చిత్రాలు ఇవ్వరాదని కోర్టును అభ్యర్థించింది.
- భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,685 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది.
- ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల ఒక ఇంటి గోడ కూలిపోవడంతో నలుగురు మృతిచెందారని ఏఎన్ఐ తెలిపింది.
దూరంగా ఉంటే ప్రేమ పెరుగుతుందా? బంధం బలపడాలంటే కొంతకాలం ఒకరికొకరు దూరంగా ఉండాలా?
డ్రగ్స్, బాంబులను పోలీస్ డాగ్స్ ఎలా గుర్తిస్తాయి? వాటికి ఎలాంటి శిక్షణ ఇస్తారో చూడండి..
ఆసియా దేశాలు ఆహార ఎగుమతులను ఎందుకు నిలిపేస్తున్నాయి? దీనిని ఫుడ్ నేషనలిజం అంటారా?
అస్సాం వరద ప్రాంతాల్లో బురదలో నడిచి వెళ్తున్న ఈ తెలుగు ఐఏఎస్ అధికారిణి ఎవరో తెలుసా
ఇంజనీరింగ్ కాలేజీ వెనుక పొదల్లో చెట్లపైనే మంచం.. గుట్టలుగా ఖాళీ కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాలు, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ వెనుక భాగంలో తుప్పలు, పొదలను క్లీన్ చేస్తుండగా...అక్కడ వందల సంఖ్యలో ఖాళీ కండోమ్ ప్యాకెట్లు, కండోమ్‌లు, మద్యం సీసాలు, చెట్లపై పడక తరహాలు ఏర్పాట్లు బయటపడ్డాయి.

ఫొటో క్యాప్షన్, గుబురు పొదల్లో చెట్లపై ఏర్పాటు చేసిన మంచం 
ఫొటో క్యాప్షన్, ఖాళీ కండోమ్ ప్యాకెట్లు వారం రోజులుగా వర్సిటీలో తుప్పలతో నిండిన ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంజనీరింగ్ కళాశాల బాయ్స్ హాస్టల్ పరిసరాల్లో తుప్పలను తొలగిస్తుండగా ఈ కండోమ్స్, మద్యం సీసాలు బయటపడ్డాయి. ఆ ప్రాంతంలో వెదురు మొక్కలు గుబురుగా పెరగడంతో దీనిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారు. ఏపుగా పెరిగిన చెట్లపై మంచం మాదిరి తయారుచేసి, వాటిపై పరుపులు వేశారు. పైకి వెళ్లడానికి నిచ్చెనలు ఏర్పాటు చేశారు. వాటిని అద్దెకు ఇస్తూ, కండోమ్‌లు సరఫరా చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారని యూనివర్శిటీ సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ డ్రగ్స్ తీసుకునే సిరంజలు కూడా ఉన్నాయని వారు తెలిపారు.

ఏయూ ఇంజనీరింగ్ క్యాంపస్ వెనుక భాగంలో హిజ్రాలు ఎక్కువగా ఉంటారని, వారే ఆ ప్రాంతాన్ని అసాంఘీక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారని యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. చెట్లు, తుప్పలు తొలగించడంతో 72 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చిందని, దీని విలువ 3 వేల కోట్ల పైనే ఉంటుందని వెల్లడించారు.
కాగా, ఈ కేసుపై దర్యాప్తు జరుగుతోందని 3టౌన్ పోలీసులు తెలిపారు.
Monsoon: తుపానులు, వరదలు లాంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఇకపై సాధారణం అయిపోతాయా?
‘ముస్లింలను ముస్లింలే చంపుతున్నారు, ఇది ఎలాంటి జిహాద్’- అమ్రీనా భట్ తండ్రి
‘జ్ఞాన్‌వాపి సర్వే ఫుటేజీ పబ్లిక్ డొమైన్‌లోకి రాకూడదు’- వారణాసి కోర్టును కోరిన ముస్లిం కమిటీ

జ్ఞాన్‌వాపి మసీదు లోపల నిర్వహించిన సర్వే వీడియో ఫుటేజీ, ఫొటోలను పబ్లిక్ డొమైన్‌లో పంచుకోవడానికి అనుమతించవద్దని వారణాసి కోర్టును శనివారం ముస్లిం కమిటీ కోరింది.
ఈ కేసుతో సంబంధం లేనివారికి ఈ అంశానికి సంబంధించిన ఫుటేజీ, చిత్రాలు ఇవ్వరాదని కోర్టును అభ్యర్థించింది.
ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి మసీదు లోపల నిర్వహించిన సర్వేకు సంబంధించిన ఎలాంటి ఫుటేజీ పబ్లిక్ డొమైన్‌లోకి రాకూడదని కమిటీ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
ఈ కేసుకు సంబంధించిన ఫుటేజీలు, చిత్రాలను పొందడానికి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో ఎక్కువ మంది జర్నలిస్టులు ఉన్నారని తెలిపారు.
వారణాసి కోర్టు ఆదేశాల మేరకు జ్ఞాన్‌వాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే నిర్వహించారు. ఈ సర్వేకు సంబంధించిన నివేదికను మే 19న కోర్టు సీనియర్ డివిజన్ జడ్జి రవికుమార్ దివాకర్‌కు సమర్పించారు.
కోర్టు ఆదేశాల మేరకు మే 14, 15, 16 తేదీల్లో సర్వే నిర్వహించారు.
భారత్‌లో కొత్తగా 2,685 కరోనా కేసులు
భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,685 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. శుక్రవారం మొత్తం 4,47,637 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిగినట్లు తెలిపింది.
తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 16,308కి చేరింది. వైరస్ నుంచి తాజాగా 2,158 మంది కోలుకున్నారు.
దేశంలో రోజూవారీ పాజిటివిటీ రేటు 0.6శాతంగా ఉండగా, వారం వారీగా ఇది 0.54 శాతం వద్ద నిలిచింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఎన్టీఆర్ పోషించిన తొలి పాత్ర ఏది? సినిమాల్లో ఎందుకు ఎడమచేత్తో ఆశీర్వదించేవారు?
నార్మల్ డెలివరీయా, సిజేరియనా? బిడ్డను ఎలా కనాలో నిర్ణయించుకునే హక్కు మహిళలకు లేదా
అమెరికా: వెస్ట్ వర్జీనియాలో జనాలపై కాల్పులు జరిపిన వ్యక్తిని కాల్చి చంపిన మహిళ

ఫొటో సోర్స్, Getty Images
టెక్సస్ కాల్పుల ఘటనను మర్చిపోక ముందే వెస్ట్ వర్జీనియాలో జనంపై కాల్పులకు దిగిన ఒక వ్యక్తిని ఒక మహిళ కాల్చి చంపారు.
ఒక వ్యక్తి కారులోంచి తన సెమీ ఆటోమేటిక్ రైఫిల్‌తో కాల్పులు ప్రారంభించగా, అక్కడే ఉన్న ఒక మహిళ వెంటనే తన తుపాకీతో అతడిని కాల్చి చంపారని పోలీసులు చెప్పారు.
వెస్ట్ వర్జీనియాలోని చార్ల్‌స్టన్‌లో సాయుధుడు 30-40 మందిపై కాల్పులు జరపబోయే ముందు, జనం అతడిని ఆగమని హెచ్చరించారు.
వేగంగా స్పందించిన మహిళ, ఎంతోమంది ప్రాణాలు కాపాడారని పోలీస్ అధికారి టోనీ జాజెలెట్ చెప్పారు.
టెక్సస్ కాల్పుల ఘటన తర్వాత దేశంలో తుపాకీల వినియోగంపై వాడీవేడి చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
బుధవారం సాయంత్రం అనుమానితుడు ఒక ప్రాంతంలోకి కారులో వేగంగా వస్తున్నప్పుడు, స్థానికులు పిల్లలు ఆడుకుంటున్నారని, నెమ్మదిగా వెళ్లాలని హెచ్చరించారు.
వెళ్లిపోయిన అతడు, తర్వాత ఒక ఏఆర్-15 రైఫిల్ తీసుకొచ్చాడు. తన వాహనం లోపల నుంచే ఒక అపార్ట్‌మెంట్ బయట జరుగుతున్న పార్టీలోని జనంపై కాల్పులు జరపడం ప్రారంభించాడు.
అతడిపై కాల్పులు జరిపిన మహిళకు పోలీసు నేపథ్యం లేదని హాజెలెట్ చెప్పారు. ఆ మహిళ అదే అపార్టుమెంటుకు చెందినవారు. ఆమె దగ్గర ఆయుధానికి లైసెన్స్ కూడా ఉంది అని ఆయన చెప్పారు.
ఆ ఘటన తర్వాత ఆ మహిళ ఘటనాస్థలంలోనే ఉండి పోలీసులకు సహకరించారని, ఆమెపై ఎలాంటి కేసూ నమోదు చేయలేదని పోలీసు అధికారులు చెప్పారు.
భారత్‌లో టెస్లా కార్ల తయారీ గురించి మరోసారి ట్వీట్ చేసిన ఎలాన్ మస్క్

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో తమ కార్లు విజయవంతం అయితే, టెస్లా కంపెనీ అక్కడ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ తెరుస్తుందని టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ గత ఏడాది ఆగస్టులో చెప్పారు.
“మొదట మా కార్లను విక్రయించడానికి, సర్వీస్ చేయడానికి మమ్మల్ని అనుమతించని ఏ దేశంలోనూ టెస్లా కంపెనీ మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను తెరవదు” అని తాజా ట్వీట్ ద్వారా ఆయన మరోసారి స్పష్టం చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
“టెస్లా ఏం చేస్తుంది. భవిష్యత్తులో అది భారత్‌లో తన మానుఫ్యాక్చరింగ్ యూనిట్ తెరుస్తుందా?" అని మధుసూదన్ అనే వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎలన్ మస్క్ తన వైఖరి స్పష్టం చేశారు.
"టెస్లా భారత్‌లో తమ ఉత్పత్తి చేయాలనుకుంటే, ఏ సమస్యా లేదు. కానీ, ఆ కంపెనీ చైనాలో తయారైన తమ కార్లను భారత్ తీసుకొచ్చి అసలు అమ్మకూడదు" అని అంతకు ముందు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
అమెరికాకు చెందిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ భారత్‌లో తమ కార్లను విక్రయించడానికి వీలుగా దిగుమతి సుంకం తగ్గించాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరుతోంది.
మొదట తమ కారు అమ్మడంతోపాటూ, దాని సర్వీసింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తామని, ఆ తర్వాతే అక్కడ తమ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ తెరుస్తామని టెస్లా కంపెనీ ఇప్పటికే చెప్పింది.
అనంతపురం: సిలిండర్ పేలుడుతో కూలిన ఇంటి గోడ, నలుగురు మృతి

ఫొటో సోర్స్, ANI
ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల ఒక ఇంటి గోడ కూలిపోవడంతో నలుగురు మృతిచెందారని ఏఎన్ఐ తెలిపింది.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ములకలేడు గ్రామంలో జరిగిన ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ, బీజేపీ నేతల నివాళులు
సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా చాలా మంది బీజేపీ నేతలు నివాళులు అర్పించారు.
సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఒక వీడియో ట్వీట్ చేశారు. "భరతమాత తనయుడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు" అని పెట్టారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 1X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మోదీతోపాటూ యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కూడా ట్వీట్ ద్వారా సావర్కర్‌కు నివాళులు అర్పించారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 2X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"స్వతంత్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ తన జీవితమంతా భరతమాత పూజకు, జాతీయవాద వ్యాప్తికి అంకితం చేశారు. బలమైన ఆయన జాతీయవాద ఆలోచనలు దేశాన్ని ఆరాధించేలా ప్రతి తరాన్ని ప్రేరేపిస్తూనే ఉంటాయి" అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సావర్కర్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తూ ట్వీట్ చేశారు.
పోస్ట్ X స్కిప్ చేయండి, 3X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"వీర్ సావర్కర్‌కు ఒకేసారి రెండు జీవితఖైదులు విధించినా భారతమాతను అత్యున్నత వైభవం దిశగా తీసుకెళ్లాలనే ఆయన సంకల్పాన్ని నాశనం చేయలేకపోయాయి. స్వతంత్ర పోరాటంలో, అంటరానితనాన్ని నిర్మూలించడంలో ఆయన సహకారం ఎప్పటికీ మరచిపోలేనిది" అని అన్నారు.
