మేకపాటి గౌతమ్ రెడ్డి: ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జూన్ 23న, ఫలితాలు 26న

ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు నియోజకవర్గానికి జూన్ 23న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. జూన్ 26న ఈ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తారు.

లైవ్ కవరేజీ

శారద మియాపురం

  1. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  2. నేటి ముఖ్యాంశాలు

    ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు నియోజకవర్గానికి జూన్ 23న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

    కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మిలిటెంట్లకు నిధులకు సమకూర్చారనే ఆరోపణలపై కోర్టు తీర్పు వెల్లడించింది.

    ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లా కళింగ ఘాట్ వద్ద బస్సు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మందికి పైగా గాయాల పాలయ్యారని ఏఎన్‌ఐ తెలిపింది.

    ఉత్తర కొరియా బుధవారం ఉదయం మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.

  3. జమ్మూకశ్మీర్‌:మిలిటెంట్ల కాల్పుల్లో టీవీ ఆర్టిస్టు అమ్రీన్ భట్ మృతి

    అమ్రీన్ భట్

    ఫొటో సోర్స్, Ani

    జమ్మూకశ్మీర్‌లో మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో టీవీ ఆర్టిస్టు అమ్రీన్ భట్ మృతి చెందారు.

    బుడ్గాంలోని ఆమె నివాసం వద్దే ఆమెపై మిలిటెంట్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.

    గాయాలపాలైన ఆమెను ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె మరణించారు.

    పదేళ్ల వయసున్న ఆమె మేనల్లుడు కూడా ఘటనలో గాయపడ్డాడు.

  4. 'నేను స్కర్ట్‌ డ్యాన్స్ చేస్తుంటే చాలా మంది నువ్వు ‘గే’వా అని అడుగుతుంటారు'

  5. అమలాపురంలో విధ్వంసానికి పాల్పడ్డ 100 మందిని గుర్తించాం: ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్

  6. ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ జూన్ 23న, ఫలితాలు 26న

    మేకపాటి గౌతంరెడ్డి

    ఫొటో సోర్స్, FB/MEKAPATI GOUTHAM REDDY

    ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు నియోజకవర్గానికి జూన్ 23న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది.

    ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, త్రిపుర, దిల్లీ, జార్ఖండ్‌లలోని పలు స్థానాలకు అదేరోజున ఉప ఎన్నిక ఉంటుందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న ఆకస్మిక మరణంతో ఆత్మకూరులో ఈ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

    జూన్ 26న ఈ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది.

  7. ‘మంటలు ఆర్పడానికి వెళ్తే మా అగ్నిమాపక వాహనాలనూ తగలబెడతామని బెదిరించారు’

  8. కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు జీవిత ఖైదు

    యాసిన్ మాలిక్‌

    ఫొటో సోర్స్, AFP

    కశ్మీర్ వేర్పాటువాద నాయకుడు యాసిన్ మాలిక్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మిలిటెంట్లకు నిధులకు సమకూర్చారనే ఆరోపణలపై బుధవారం కోర్టు తీర్పు వెల్లడించింది.

    మే 19నే ఈ ఆరోపణలపై యాసిన్ మాలిక్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. అనంతరం మే 25న శిక్ష విధిస్తామని తెలిపింది.

    దేశంలో తిరుగుబాటు లేవనెత్తడం, నేరపూరిత కుట్ర, మిలిటెంట్లకు నిధులు సమకూర్చడం తదితర ఆరోపణలను మాలిక్‌పై మోపారు. ఈ ఆరోపణలను మాలిక్ అంగీకరించారు.

    అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)లోని భిన్న సెక్షన్ల కింద మాలిక్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది.

  9. ‘నా ఒంటిపై దద్దుర్లు వచ్చాయి, ఇది మంకీపాక్సేనా’

  10. ‘‘కోనసీమ భగ్గుమనడానికి కారణం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే’’- కె. నారాయణ

    నారాయణ

    కోనసీమ జిల్లాకు ముందే అంబేడ్కర్ పేరు పెట్టి ఉంటే ఏ సమస్యలు ఉండకపోయేవని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు.

    జగన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే కోనసీమ భగ్గుమందని బుధవారం మీడియాకి విడుదల చేసిన వీడియో సందేశంలో నారాయణ వ్యాఖ్యానించారు.

    జిల్లాల విభజన తరుణంలోనే అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్లు వచ్చినా పట్టించుకోకుండా సీఎం జగన్ ఊగిసలాట ధోరణిలో వ్యవహరించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

    ఈ విషయంలో ఘర్షణలు చిలికి చిలికి గాలివానలా మారాయని చెప్పారు.

    ‘‘ఈ ఘటనను కుల పరమైన ఘర్షణగా చూడలేం. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని’’ గుర్తు చేశారు.

  11. కోనసీమ: ‘విధ్వంసం వెనుక వైసీపీ కౌన్సిలర్ హస్తం ఉంది’- మంత్రి విశ్వరూప్

    విశ్వరూప్

    ఫొటో సోర్స్, YSRCP/FACE BOOK

    అమలాపురంలో ఆందోళనలు అత్యంత దురదృష్టకరమని మంత్రి విశ్వరూప్ అన్నారు.

    ఈ విధ్వంసం వెనుక వైసీపీ కౌన్సిలర్ హస్తం ఉందని, అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.

    ప్రజల్లోకి రౌడీషీటర్లు వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. చట్టానికి అందరూ సమానమే.. దాడులకు పాల్పడిన వారిని వదిలేది లేదని అన్నారు. ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.

    కావాలనే కొందరు ఆందోళనలను డైవర్ట్ చేశారని అన్నారు.

    విశ్వరూప్ ఇల్లు
    ఫొటో క్యాప్షన్, విశ్వరూప్ ఇల్లు
  12. పవన్ కల్యాణ్: ‘‘కోనసీమలో గొడవలు జరగాలనే వైసీపీ కోరుకుంది’’

    పవన్ కల్యాణ్

    వైసీపీకి నిజంగా అంబేడ్కర్‌పై ప్రేమ ఉంటే ఎస్సీ సబ్ ప్లాన్‌ను సక్రమంగా అమలు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

    బుధవారం ఆయన మంగళగిరిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఏపీలోని అన్ని జిల్లాలకు ఒక విధానాన్ని పెట్టి, కోనసీమకు మాత్రం మరో విధానాన్ని అనుసరించారని ఆరోపించారు.

    జిల్లా ప్రకటించినప్పుడే పేరు పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. అంబేడ్కర్ పేరు పెట్టడానికి జాప్యం చేయడంలో ఉద్దేశ్యం ఏంటి? అని ప్రశ్నించారు.

    ‘‘పేర్లు పెట్టేటప్పుడు కాస్త సున్నితంగా వ్యవహరించాల్సి ఉంది. కృష్ణా నది తక్కువగా ఉన్నచోట కృష్ణా జిల్లా పేరు పెట్టారు. కృష్ణా నది ఎక్కువగా ఉన్నచోట ఎన్టీఆర్ పేరు పెట్టారు. అభ్యంతరాలు ఉంటే 30 రోజులు సమయం ఇస్తున్నామన్నారు. దీన్ని బట్టే వైసీపీ వైసీపీ దురుద్దేశం అర్థమవుతోంది. గొడవలు జరగాలని వైసీపీ అనుకుంది. మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా? పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే ఏమనుకోవాలి?’’ అంటూ ఆయన నిలదీశారు.

  13. స్పైస్‌జెట్‌పై ర్యాన్‌సమ్‌వేర్ అటాక్.. నిలిచిపోయిన విమాన సేవలు, గంటల తరబడి ప్రయాణికులకు ఇబ్బందులు

  14. 1947లో విడిపోయి పాకిస్తాన్ ముస్లిం కుటుంబంలో పెరిగిన చెల్లెలిని 75 ఏళ్ల తరువాత కలుసుకున్న అన్నలు

  15. ఒడిశా: బస్సు బోల్తా ఘటనలో ఆరుగురు మృతి, 40 మందికి పైగా గాయాలు

    ఒడిశా రాష్ట్రం గంజామ్ జిల్లా కళింగ ఘాట్ వద్ద మంగళవారం రాత్రి బస్సు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మరణించగా, 40 మందికి పైగా గాయాల పాలయ్యారని ఏఎన్‌ఐ తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    ‘‘ఆ సమయంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన పర్యాటకులు దరింగ్‌బడి హిల్ స్టేషన్ నుంచి తిరుగు పయనం అయ్యారు. బ్రేక్ విఫలం కావడం వల్ల లేదా బస్సు డ్రైవర్‌కు ఘాట్ రోడ్డుపై డ్రైవింగ్ చేయడం కొత్త కావడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని’’ ఫైర్ ఆఫీసర్ ప్రధాన్ అన్నారు.

    ఈ ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ట్వీట్ చేశారు.

    ‘‘మృతులకు వేగంగా పోస్టుమార్టం జరిపేందుకు, గాయాల పాలైన వారికి సత్వర చికిత్స అందించేందుకు ఒడిశా అధికారులతో మా ప్రతినిధులు సమన్వయం చేసుకుంటున్నారు’’ అని ఆమె ట్వీట్‌లో రాశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

    ఈ విషాద ఘటన తనను కలిచివేసిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 3

  16. థైరాయిడ్: ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలకే ప్రమాదం

  17. కెప్టెన్ అభిలాష: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌ తొలి మహిళా అధికారిగా ఘనత

    ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌లో తొలి మహిళా అధికారిగా కెప్టెన్ అభిలాష బరక్ నియమితులైనట్లు భారత ఆర్మీని ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది.

    విజయవంతంగా శిక్షణను పూర్తి చేసుకున్న ఆమె... ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌లో కంబాట్ ఏవియేటర్‌గా చేరారు.

    బుధవారం ఆమెకు 36 ఆర్మీ పైలట్ హోదాను ప్రదానం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. ఏపీ సరిహద్దులో పెట్రోలు బంకులు ఎందుకు మూతపడుతున్నాయి?

  19. బ్రేకింగ్ న్యూస్, కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ రాజీనామా, ఎస్పీ మద్దతుతో రాజ్యసభ సీటు కోసం దరఖాస్తు

    కపిల్ సిబల్

    ఫొటో సోర్స్, Getty Images

    కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసినట్లు తెలిపారు. మే 16వ తేదీనే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

    ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి రాజ్యసభ ఎంపీ సీటు కోసం ఆయన బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

    మోదీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షంలోనే ఉంటూ ఒక కూటమి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    తన అభ్యర్థిత్వానికి సమాజ్‌వాదీ పార్టీ సహా అనేక పార్టీల నుంచి మద్దతు లభిస్తోందని ఆయన తెలిపారు.

    చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీపై అగ్రహంతో ఉన్న ఆయన జీ-23లో కీలక సభ్యుడు.

    కపిల్ సిబల్ రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేస్తున్నప్పుడు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కూడా ఆయన వెంట ఉన్నారు.

    కపిల్ సిబల్ ఒక లాయర్‌గా అఖిలేశ్ కుటుంబానికి సన్నిహితుడు.

  20. ఆంధ్రప్రదేశ్: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు వద్దంటూ ఎందుకీ నిరసనలు... అసలేం జరుగుతోంది?