జపాన్‌ వేదికగా ఐపీఈఎఫ్ కూటమిని ప్రకటించిన అమెరికా, భారత్‌కు కూడా భాగస్వామ్యం

13 దేశాలను కలుపుకుంటూ ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీనిలో భారత్ కూడా ఉందని ఆయన చెప్పారు.

లైవ్ కవరేజీ

ఆలమూరు సౌమ్య

  1. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  2. నేటి ముఖ్యాంశాలు

    13దేశాలను కలుపుకుంటూ ఇండో పసిఫిక్ఎ కనమిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్)ను ఏర్పాటు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. దీనిలో భారత్ కూడా ఉందని ఆయన చెప్పారు.

    దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.

    వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్కడ ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్‌పై పబ్లిక్ సెషన్‌లో ప్రసంగించారు.

    మహిళల ఐపీఎల్‌ను 2023 నుంచి నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ ఐపీఎల్‌లో ఆరు జట్లు ఉంటాయని పేర్కొంది.

    డ్రైవర్ హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

  3. చూపులేని ఈ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు ఎలా రాశారంటే..

  4. దేశ స్వయంప్రతిపత్తి ఇద్దరి చేతుల్లో ఉంది–మమతా బెనర్జీ

    మమతా బెనర్జీ

    ఫొటో సోర్స్, ani

    దేశ స్వయం ప్రతిపత్తి ఇద్దరి చేతుల్లో ఉందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

    ‘‘మన దేశంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం చాలా బాధాకరం’’అని ఆమె అన్నారు.

    హిట్లర్ హయాంలోనూ ఇలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకోలేదని ఆమె వ్యాఖ్యానించారు.

    మోదీ ప్రభుత్వమే లక్ష్యంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

  5. జపాన్‌లో వివేకానందుడిని స్మరించుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

    మోదీ

    ఫొటో సోర్స్, @BJP4India

    క్వాడ్ దేశాల సదస్సుకు హాజరయ్యేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జపాన్ చేరుకున్నారు. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాలను క్వాడ్ కూటమిగా పిలుస్తారు.

    క్వాడ్ సమావేశానికి ముందుగా జపాన్‌లో భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ‘‘జీవితంలో ఒక్కసారైనా జపాన్ వెళ్లాలని స్వామి వివేకానంద చెప్పేవారు. అలానే జపాన్ యువత కూడా జీవితంలో ఒక్కసారైనా భారత్ రావాలి’’అని మోదీ అన్నారు.

    ‘‘భారత్ తమ వారసత్వ సంపద గురించి ఎంత గర్వంగా ఉంటుందో.. భవిష్యత్‌పైనా అంతే ఆశాభావంతో ఉంటుంది. నేటి ప్రపంచం కోసం బుద్ధుడు మంచి మార్గనిర్దేశం చేశారు. నేటి సమస్యలకు ఆయన ఏళ్లముందే పరిష్కారాలు చూపించారు’’అని మోదీ అన్నారు.

    మరోవైపు 13 దేశాలను కలుపుకుంటూ ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్)ను ఏర్పాటుచేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. దీనిలో భారత్ కూడా ఉందని ఆయన చెప్పారు.

  6. India vs Pakistan: పురుషుల హాకీ ఆసియా కప్‌ తొలి మ్యాచ్‌ డ్రా

  7. డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు హాజరైన కేటీఆర్

    కేటీఆర్

    ఫొటో సోర్స్, Facebook/KTR

    దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు.

    ‘‘తెలంగాణ లైఫ్‌సైన్సెస్ ఇండస్ట్రీ విజన్ ఫర్ 2030’’ అంశంపై కేటీఆర్ మాట్లాడారు. ఆయనతోపాటు రెడ్డి ల్యాబ్స్ కోఛైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్, పీడబ్ల్యూసీ ఇండియా పార్ట్‌నర్ మొహమ్మద్ ఆథర్ కూడా చర్చలో పాల్గొన్నారు.

    భారత్‌లో లైఫ్‌సైన్సెస్ రంగంలో విప్లవాత్మక మార్పులు అవసరమని కేటీఆర్ చెప్పారు. తెలంగాణను వ్యాక్సీన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్‌గా ఆయన అభివర్ణించారు.

    మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే.

  8. ఐపీఎల్: మహిళల టీ20 కప్ ప్రారంభం.. 2023 నుంచి విమెన్స్ ఐపీఎల్

    ఐపీఎల్

    ఫొటో సోర్స్, GETTY IMAGES

    క్రికెట్‌లో పురుషుల ఐపీఎల్ తరహాలోనే మహిళల ఐపీఎల్‌కూ బీసీసీఐ మార్గం సుగమం చేసింది.

    మహిళల ఐపీఎల్‌ను 2023 నుంచి నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ ఐపీఎల్‌లో ఆరు జట్లు ఉంటాయని పేర్కొంది.

    విమెన్స్ టీ 20 కప్‌ను 2018 నుంచీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 2021లో దీన్ని నిర్వహించలేదు.

    మరోవైపు విమెన్స్ టీ20కే విమెన్స్ ఐపీఎల్‌గా పేరు మార్చబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    చివరగా 2020లో జరిగిన విమెన్స్ టీ20లో ఐపీఎల్ సూపర్‌నోవాస్, ఐపీఎల్ ట్రెయిల్‌బ్లేజర్స్, ఐపీఎల్ వెలోసిటీ జట్లు పాల్గొన్నాయి.

    ప్రస్తుతం 2022లోనూ విమెన్స్ టీ 20 మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. మే 23 నుంచి ఇవి మొదలయ్యాయి.

  9. ఆంధ్రప్రదేశ్: డ్రైవర్‌ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్టు

    ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్

    ఫొటో సోర్స్, UGC

    డ్రైవర్ హత్య కేసులో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఐపీసీలోని సెక్షన్ 302 కింద ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

    మరోవైపు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై పార్టీ తర్వాత నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర విద్యా శాఖమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

    సుబ్రహ్మణ్యంరోడ్డుప్రమాదానికిగురయ్యారంటూఎమ్మెల్సీచెప్పినమాటలునమ్మశక్యంగాలేవనిమృతుడికుటుంబీకులుఆరోపిస్తున్నారు. కాళ్లు, చేతులువిరిగిఉన్నాయని, మృతదేహంపైఇసుకఉందనివారుచెబుతున్నారు.

    మృతదేహంవిషయంలోబంధువులతోఎమ్మెల్సీతగాదాపడుతున్నట్టుగాసీసీకెమెరావిజువల్స్‌లోకనిపించింది. కాకినాడజిల్లాకేంద్రంలోగురువారంరాత్రిఈపరిణామాలు చోటుచేసుకున్నాయి.

    మరోవైపు ఈ కేసుకుసంబంధించికొన్నికీలకఆధారాలుకూడాదొరికాయనిఏపీసాంఘికసంక్షేమశాఖమంత్రిమేరుగనాగార్జున ఆదివారం రాత్రి చెప్పారు.

  10. ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయిందని బాలికకు విషమిచ్చి చంపేసిన మేనమామ, బావ

  11. డబ్ల్యూహెచ్ఓ: కోవిడ్, మంకీపాక్స్, యుద్ధాలతో ప్రపంచానికి సవాళ్లు

  12. దావోస్: టెక్ మహీంద్ర సీఈవో, దసాల్ట్ సిస్టమ్స్ వైస్ ప్రెసిడెంట్‌తో ఏపీ సీఎం జగన్ సమావేశాలు

    జగన్, దసాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్

    ఫొటో సోర్స్, YSRCP

    వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అక్కడ ఫ్యూచర్ ప్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్‌పై పబ్లిక్ సెషన్‌లో ప్రసంగించారు.

    కోవిడ్ విపత్తు నుంచి ప్రపంచం పాఠాలు నేర్చుకోవాలని చెప్పిన ఆయన సమగ్ర ఆరోగ్య వ్యవస్థ అందరికీ అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు.

    దావోస్‌లో జగన్మోహన్ రెడ్డి టెక్ మహీంద్ర చైర్మన్, సీఈవో సీపీ గుర్నానీతో సమావేశమయ్యారు.

    అనంతరం గుర్నానీ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏపీలోని విశాఖపట్నాన్ని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ హబ్‌గా మార్చాలనుకుంటున్నారని, ఆయన అభ్యర్థన మేరకు ఈ విషయంలో ఆంధ్ర యూనివర్సిటీతో కలిసి పనిచేయాలని తాము నిర్ణయించుకున్నామని చెప్పారు.

    అలాగే, దసాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వర్జలీన్‌తోనూ జగన్ సమావేశమయ్యారు.

    నైపుణ్యాభివృద్ధి, కొత్త తరహా ఇంధన వనరులపై తాము చర్చించినట్లు వర్జలీన్ చెప్పారు.

    ఏపీలో విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ సంస్థ ఉత్సాహంగా ఉందని ఆమె చెప్పారు.

  13. జ్ఞాన్‌వాపి మసీదు: విచారణను రేపటికి వాయిదావేసిన బనారస్ జిల్లా కోర్టు

    జ్ఞాన్‌వాపి

    ఫొటో సోర్స్, ROBERT NICKELSBERG/GETTY IMAGES

    బనారస్ జిల్లా కోర్టులో కాశీ విశ్వనాథ మందిరం- జ్ఞాన్‌వాపి మసీదుపై సోమవారం విచారణ జరిగింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు జడ్జి ఏకే విశ్వాస్ చెప్పారు.

    ఈ కేసులో జోక్యం చేసుకోబోమని సుప్రీం కోర్టు చెప్పడంతో ఏకే విశ్వాస్ విచారణ మొదలుపెట్టారు.

    విచారణ సమయంలో కేవలం 23 మందినే కోర్టు గది లోపలకు అనుమతించారు. వీరిలో 19 మంది న్యాయవాదులు, నులుగురు పిటిషనర్లు ఉన్నారు. మాజీ అడ్వొకేట్ కమిషనర్‌ అజయ్ మిశ్రను కూడా లోపలకు అనుమతించలేదు.

    జ్ఞాన్‌వాపి మసీదు ఆవరణలో ఉండే హిందూ దేవాలయాల్లో పూజలు నిర్వహించడానికి కోర్టు అనుమతించాలని పిటిషన్‌దారులు కోరుతున్నారు. దీనిలో భాగంగానే మసీదు ఆవరణలో సర్వే చేయించారు.

    సోమవారంనాటి విచారణ 45 నిమిషాలపాటు జరిగిందని లైవ్ లా వెబ్‌సైట్ పేర్కొంది.

  14. దిశ అత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ కేసులోని పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలి: మహిళల, ట్రాన్స్ జెండర్ల జేఏసీ డిమాండ్

  15. జో బైడెన్: ‘‘తైవాన్‌పై చైనా దాడిచేస్తే మేం జోక్యం చేసుకుంటాం’’

    బైడెన్

    ఫొటో సోర్స్, Reuters

    యుక్రెయిన్‌లో అనాగరిక చర్యలకు పాల్పడుతున్న రష్యా మూల్యం చెల్లించుకోతప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. జపాన్ పర్యటనలోనున్న ఆయన అమెరికా, దేశ మిత్ర పక్షాలు విధించిన ఆంక్షలపై మాట్లాడారు.

    ఒకవేళ తైవాన్‌పై చైనా దాడి చేస్తే, మీరు జోక్యం చేసుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు ‘‘తప్పకుండా’’అని ఆయన సమాధానం ఇచ్చారు.

    ‘‘మీం వారికి హామీ ఇచ్చాం’’అని బైడెన్ అన్నారు. తైవాన్ తమ భూభాగంలో భాగమని, ఎప్పటికైనా దాన్ని తమలో కలిపేసుకుంటామని చైనా పదేపదే చెబుతూ వస్తోంది.

    ‘‘ఒకే చైనా విధానానికి మేం అంగీకారం తెలిపాం. కానీ, బలవంతంగా అలా కలుపుకోవడానికి మేం అంగీకరించం’’అని ఆయన అన్నారు.

    ‘‘చైనా దురాక్రమణకు పాల్పడితే, ఈ ప్రాంతం మరో యుక్రెయిన్‌లా మారిపోతుంది’’అని ఆయన హెచ్చరించారు.

  16. దిశ అత్యాచారం కేసు: 'ఫేక్' ఎన్‌కౌంటర్‌లో మరణించిన నిందితుల కుటుంబాలు ఏం చెబుతున్నాయంటే...

    దిశ అత్యాచారం కేసు
    ఫొటో క్యాప్షన్, జొల్లు శివ తల్లి మణెమ్మ

    "దిశ సంఘటన తరువాత, నేను బయటకి వెళితే చాలు, నన్ను చూసి జనాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చెన్నకేశవులు భార్య అట, చెన్నకేశవులు అలా చేశాడట అని నా గురించి కూడా ఘోరంగా మాట్లాడుకుంటారు. అందుకే, నేను ఊరు వదిలి ఎక్కడికీ వెళ్ళను. ఇలా మాట్లాడే వారు మమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని భయం వెంటాడుతూ ఉంటుంది."

    దిశ హత్య కేసు నిందితుడు చెన్నకేశవులు భార్య రేణుక చెప్పిన మాటలివి.

    డిసెంబర్ 6న జరిగిన దిశ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్ మైనర్లు కాగా, ఈ కేసులోని ప్రధాన నిందితుడు ఆరిఫ్ మొహమ్మద్ వయసు 23 ఏళ్లు అని మొహమ్మద్ తల్లి తండ్రులు చెప్పారు.

  17. ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ అల్బనీస్..

    ఆస్ట్రేలియా

    ఫొటో సోర్స్, Getty Images

    ఆంథోనీ అల్బనీస్ ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ,తరువాత, ఒక అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కానున్నారు.

    శనివారం జరిగిన ఎన్నికల్లో అల్బనీస్ లేబర్ పార్టీ, స్కాట్ మోరిసన్ ప్రభుత్వాన్ని ఓడించింది.

    ప్రపంచ దేశాలతో సంబంధాల గురించి అల్బనీస్ మాట్లాడుతూ, చైనాతో సంబంధాలు ఇబ్బందికరంగానే ఉంటాయన్నారు. మారింది చైనాయే కాని, ఆస్ట్రేలియా కాదని ఆయన అన్నారు.

  18. పది లక్షల మంది ఆశా వర్కర్లకు 'గ్లోబల్ హెల్త్ లీడర్స్' అవార్డు ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

    WHO

    ఫొటో సోర్స్, TWITTER/WHO

    భారతదేశంలోని 10 లక్షల మంది ఆశా వర్కర్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డుతో సత్కరించింది.

    ఆశా వర్కర్లకు దక్కిన గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీ, వారికి శుభాకాంక్షలు తెలిపారు.

    గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించినందుకు, కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించడంలో వారి కృషికి ఆశా వర్కర్లు ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఆ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా ఆశా వర్కర్లకు అభినందనలు తెలిపారు.

    "ఆశా కార్యకర్తలు ఆరోగ్య సేవలు అందించడంలో, కోవిడ్ 19 వ్యాప్తి నివారణలో కీలక పాత్ర పోషించారు. వారికి అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు.

  19. అస్సాంలో వరద బీభత్సం.. ఇప్పటివరకు 18 మంది చనిపోయారు

    అస్సాం

    ఫొటో సోర్స్, DILIP SHARMA/BBC

    గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. ఈ భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 18 మంది చనిపోయారు.

    ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది వరదల ప్రారంభ దశలో నౌగావ్ జిల్లాలోని కాంపూర్ రెవెన్యూ సర్కిల్ పరిధిలోని గ్రామాలకు అత్యధిక నష్టం కలిగింది.

    శనివారం సాయంత్రం అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 31 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఈ జిల్లాల్లో 2248 గ్రామాల్లో వరదల కారణంగా 6 లక్షల 80 వేల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. వరదల కారణంగా నిరాశ్రయులైన ప్రజల కోసం 496 సహాయ శిబిరాలను తెరిచారు. వీటిలో సుమారు 75 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు.

  20. బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    గుడ్ మార్నింగ్! బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక వార్తల లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవండి.