ఆంధ్రప్రదేశ్: రేపల్లె గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్న ఎస్పీ జిందాల్
ముగ్గురు పిల్లలతో కలిసి భార్యాభర్తలు రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఉన్న సమయంలో దుండగులు తెగబడ్డారు. భర్తను తీవ్రంగా కొట్టి భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని బాపట్ల ఎస్పీ జిందాల్ మీడియాకు తెలిపారు.
లైవ్ కవరేజీ
పృథ్వి రాజ్
హీట్‌వేవ్: తెలంగాణకు ఎల్లో అలర్ట్.. వడదెబ్బ తగిలిందని ఎలా తెలుస్తుంది
నేటి ముఖ్యాంశాలు...
- రేపల్లె రైల్వే స్టేషన్‌లో ఓ వలస కూలీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో ఒక మైనర్ సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ జిందాల్ చెప్పారు.
- ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు దిశగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
- కమర్షియల్ ఎల్‌పీజీ 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం ఆదివారం నాడు రూ. 102.50 మేర పెంచింది. దీంతో ఈ సిలిండర్ ధర రూ. 2,253 నుంచి రూ. 2,355.50 కు పెరిగింది.
- పంజాబ్‌లోని పటియాలా నగరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఉద్రిక్తతకు దారితీసిన ఉదంతానికి సంబంధించి ప్రధాన నిందితుడు బర్జీందర్ సింగ్ పర్వానాను ఆదివారం ఉదయం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీ నుంచి జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల పర్యటనకు వెళ్లనున్నారు.
- 2022 ఏప్రిల్ నెలలో వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యధిక స్థాయిలో రూ. 1.66 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్డేట్లను ముగిస్తున్నాం.
రేపల్లె రైల్వే స్టేషన్ గ్యాంగ్ రేప్ ఘటనపై బాపట్ల ఎస్పీ ఏమన్నారు?
IPL 2022 CSKVsSH: చెన్నై ఓపెనర్ల వీరంగం, హైదరాబాద్ టార్గెట్ 203

ఫొటో సోర్స్, BCCI/IPL
చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్స్ తురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేల అద్భుత భాగస్వామ్యం జట్టు స్కోరును రెండొందల మార్క్ దాటించింది.
దాంతో, ఈ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 203 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బౌలిేంగ్ ఎంచుకున్నాడు.
బ్యాటింగ్‌కు దిగిన చెన్నై ఓపెనర్లు మొదట నెమ్మదిగా ఆటను ఆరంభించారు. అవకాశం దొరికినప్పుడుల్లా పరుగులు తీస్తూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు.
ఆ తర్వాత అకస్మాత్తుగా ఇద్దరూ తమ గేరు మార్చి పరుగుల వర్షం కురిపించారు. రితురాజ్ గైక్వాడ్ 99 పరుగులు చేయగా, డెవాన్ కాన్వే 85 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 182 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు ఇది తొలి వికెట్ భాగస్వామ్యానికి సంబంధించి కొత్త రికార్డు.
రితురాజ్ అవుటైన తర్వాత ధోనీ పిచ్‌పైకి వచ్చాడు.
ఈ ఐపీఎల్‌లో తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన మహేంద్రసింగ్ ధోనీ పిచ్‌పై ఎక్కువసేపు నిలవలేదు. ధోనీ 8 పరుగులు చేసి ఔటయ్యాడు. ధోని తర్వాత చెన్నై మాజీ కెప్టెన్ రవీంద్ర జడేజా వచ్చి 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు.
హైదరాబాద్‌కు చెందిన టి నటరాజన్ పరుగుల వర్షం మధ్య రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ పొదుపుగా బౌలింగ్ చేసి తన నాలుగు ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతని రెండు వికెట్లు తీశాడు. టి నటరాజన్ ఇప్పుడు పర్పుల్ క్యాప్ రేసులో 17 వికెట్లతో రెండవ స్థానానికి చేరుకున్నాడు. యుజ్వేంద్ర చాహల్ (20 వికెట్లు) అత్యధిక వికెట్లు, కుల్దీప్ యాదవ్ (17 వికెట్లు) కూడా టి నటరాజన్‌తో సమానమైన వికెట్లు తీశాడు.
టాప్-2 స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్, దిల్లీపై 7 పరుగులతో గెలుపు

ఫొటో సోర్స్, BCCI/IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 7 పరుగులతో దిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపొందింది.
ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన లక్నో 7 మ్యాచ్‌ల్లో నెగ్గి 14 పాయింట్లతో ఉంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 195 పరుగులు చేసింది.
కెప్టెన్ కేఎల్ రాహుల్ (51 బంతుల్లో 77; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), దీపక్ హుడా (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేశారు.
శార్దుల్ ఠాకూర్‌కు 3 వికెట్లు దక్కాయి.
అనంతరం 196 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన దిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 189 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ రిషభ్ పంత్ (30 బంతుల్లో 44; 7 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (24 బంతుల్లో 42 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్సర్లు) పోరాడారు.
లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్ 4 వికెట్లతో చెలరేగాడు. దుష్మంత చమీరా, రవి బిష్ణోయ్, కృష్ణప్ప గౌతమ్ తలా ఓ వికెట్ తీశారు.

ఫొటో సోర్స్, BCCI/IPL
ఉత్తరప్రదేశ్: ఉన్నావ్‌లో ఆస్పత్రి గోడకు శవమై వేలాడుతూ కనిపించిన నర్సు
చైనాతో భారత్ వ్యాపారం సరిహద్దు ఉద్రిక్తతలో సంబంధం లేకుండా ఎందుకు పెరుగుతోంది?
రేపల్లె గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురు అరెస్ట్

ఫొటో క్యాప్షన్, మీడియాతో మాట్లాడుతున్న బాపట్ల జిల్లా ఎస్పీ వకుళ్ జిందాల్ రేపల్లె రైల్వే స్టేషన్‌లో ఓ వలస కూలీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో ఒక మైనర్ సహా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ జిందాల్ చెప్పారు.
ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం శనివారం రాత్రి ముగ్గురు పిల్లలతో కలిసి రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఉన్న సమయంలో దుండగులు.. భర్తను తీవ్రంగా కొట్టి భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.
ఈ ఘటన వివరాలను ఎస్పీ జిందాల్ మీడియాకు వివరించారు. ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.
పోస్ట్ YouTube స్కిప్ చేయండిGoogle YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
లౌడ్ స్పీకర్ల విషయంలో సఖ్యత చాటిన మందిర్, మసీదుల పెద్దలు
మసీదు, మందిరాల లౌడ్ స్పీకర్ల వివాదాలు దేశంలో చాలా చోట్ల వినిపిస్తున్నాయి. అయితే, పట్నాలో రెండు మతాల వారు పరస్పర గౌరవంతో లౌడ్ స్పీకర్ల వినియోగానికి కట్టుబడుతూ మత సామరస్యాన్ని చాటుతున్నారు.
ఇక్కడ మందిరం, మసీదులు మధ్య దూరం 50 మీటర్లు కూడా లేదు. కానీ, ఇక్కడ ఈ రెండింటి లౌడ్ స్పీకర్లు ఒకేసారి మోగకుండా చూసుకుంటున్నారు. అజాన్ సమయంలో మసీదు లౌడ్ స్పీకర్లు వినిపిస్తున్నప్పుడు ఆలయం వారు తమ లౌడ్ స్పీకర్లను నిలిపేస్తున్నారు. అలాగే, ఆలయంలో పూజలు జరుగుతున్నప్పుడు మసీదు వారు కూడా తమ లౌడ్ స్పీకర్లను కట్టేస్తున్నారు.
పట్నా మసీదు చైర్మన్ ఫైజల్ ఇమాం ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ముస్లిం మతస్థుల పట్ల గౌరవసూచకంగా ఆలయ అధికారులు అజాన్ సమయంలో లౌడ్ స్పీకర్లు నిలిపి వేస్తున్నారని చెప్పారు. అంతేకాదు, శ్రీరామనవమి రోజున అలయానికి వచ్చే భక్తులకు తాము షర్బత్ అందించామని ఇమామ్ చెప్పారు.
మసీదు సమీపంలోని మహావీర్ మందిర్ చైర్మన్ కిసోర్ కునాల్ కూడా, "మేం సోదరభావంతో మెలగుతున్నాం. అజాన్ వల్ల మాకు సమస్య లేదు, మా భజనలు, కీర్తనల వల్ల వారికీ ఇబ్బంది లేదు" అని అన్నారు.
లౌడ్ స్పీకర్ల వివాదానికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ కచ్చితమైన వైఖరిని అవలంబిస్తున్నారు. 'ఇలాంటి రాజకీయాల్లోకి', మత వ్యవహారాల్లోకి ప్రబుత్వం జోక్యం చేసుకునే ప్రసక్తే ఉండదని ఆయన చెప్పారు.
ఇదిలా ఉండగా, ఈ నెల మొదట్లో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మతపరమైన ప్రార్థనా స్థలాల్లో లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని నియంత్రిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు.
ఇటీవల మహారాష్ట్రలో కూడా లౌడ్ స్పీకర్ల వివాదం రాజుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే, మసీదుల మీంచి మైకులను తొలగించాలని ఏప్రిల్ 13న రాష్ట్ర ప్రబుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, బిహార్ రాజధాని పట్నాలో 50 మీటర్ల పరిధిలో మందిర్, మసీదు గోబెల్స్ దంపతులు తమ ఆరుగురు పిల్లలతో పాటు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు?
రష్యా-యుక్రెయిన్ యుద్ధం: తాజా పరిణామాలేమిటి?

ఫొటో సోర్స్, REUTERS
ఫొటో క్యాప్షన్, మరియుపోల్‌లోని ఈ ఉక్కు కర్మాగారంలో దాదాపు 1,000 మంది పౌరులు చిక్కుకుని ఉన్నట్లు చెప్తున్నారు - యుక్రెయిన్‌లో రష్యా బలగాలు దిగ్బంధించిన మరియుపోల్ నగరంలోని ఉక్కు కర్మాగారంలో తలదాచుకుని ఉన్న పౌరులను క్షేమంగా బయటకు తరలించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ చెప్పారు.
- మరియుపోల్‌లోని ఉక్కు కర్మాగారంలో దాదాపు 1,000 మంది చిక్కుకుపోయినట్లు చెప్తున్నారు. వారిలో 20 మంది శనివారం అక్కడి నుంచి తప్పించుకుని బయటపడ్డారు.
- అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో పర్యటిస్తున్నారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీని కలిసిన పెలోసీ.. ‘‘స్వతంత్రం కోసం పోరాటం’’ చేస్తున్న ఆ దేశ ప్రజలను ప్రశంసించారు.
- యుక్రెయిన్ మీద రష్యా తన సైనిక దాడులను తీవ్రం చేస్తోందని జెలియెన్‌స్కీ చెప్పారు.
- యుక్రెయిన్ వాయువ్యంలోని ఒడెస్సా నగరంలో శనివారం నాడు వరుసగా మూడు భారీ పేలుళ్లు వినిపించాయి.

ఫొటో సోర్స్, ZelenskyyUa
ఫొటో క్యాప్షన్, అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ శనివారం కీయెవ్‌లో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీని కలిశారు ఏప్రిల్ జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.66 లక్షల కోట్లు.. వరుసగా రెండో నెల రికార్డు

ఫొటో సోర్స్, Getty Images
2022 ఏప్రిల్ నెలలో వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) అత్యధిక స్థాయిలో రూ. 1.66 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
గత నెలలో – అంటే 2022 మార్చి నెలలో అప్పటివరకూ అత్యధిక వసూళ్లు 1,42,095 కోట్ల జీఎస్‌టీ వసూళ్లు రాగా.. ఏప్రిల్ నెలలో దాని కన్నా రూ. 25,000 కోట్లు ఎక్కువ వసూళ్లు వచ్చాయి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అనకాపల్లి: తుపాకీతో బెదిరించి బ్యాంకులో రూ. 3.31 లక్షలు దోచుకున్నాడు
నెలకు 20 రోజులు పని దొరకదు, పని లేకపోతే తినడానికి తిండి కూడా ఉండదు
రేపటి నుంచి విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్‌లలో పర్యటన

ఫొటో సోర్స్, Getty Images
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీ నుంచి జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. మూడు రోజుల పర్యటనలో ద్వైపాక్షిక, బహుళపక్ష సమావేశాల్లో పాల్గొని పలు విస్తృత అంశాలపై చర్చించనున్నారు.
ప్రధాని పర్యటన షెడ్యూలు వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా ఆదివారం దిల్లీలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
జర్మనీ చాన్సలర్ ఓలాఫ్ ష్కోల్జ్ ఆహ్వానం మేరకు మోదీ మే 2వ తేదీన బెర్లిన్ వెళతారు. ఆ మరుసటి రోజు మూడో తేదీన ప్రధాని కోపెన్‌మాగెన్ వెళతారు. నరేంద్రమోదీ డెన్మార్క్‌లో పర్యటించటం ఇదే తొలిసారి.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఆ తర్వాత మే 4వ తేదీన రెండో ఇండో-నార్డిక్ సదస్సులో పాల్గొంటారు. డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్లండ్, స్వీడన్, నార్వే దేశాల ప్రధానమంత్రులు కూడా ఈ సదస్సుకు హాజరవుతారు.
ఇండో-నార్డిక్ సదస్సుకు ముందు నార్వే, స్వీడన్, ఐస్‌లాండ్, ఫిన్లండ్ దేశాల ప్రధానులతో విడివిడిగా మోదీ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు.
భారత్‌కు తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్యాన్యుయెల్ మాక్రాన్‌తో మోదీ భేటీ అవుతారు.
భారతదేశానికి యూరప్ భాగస్వాములు చాలా ముఖ్యమని, యూరప్ ప్రాంతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో తాను ఈ పర్యటన చేపట్టానని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ఉద్యోగానికి వెళ్లిన తొలి రోజునే గ్యాంగ్ రేప్‌కు గురైన నర్స్
ఆంధ్రప్రదేశ్ మరో గ్యాంగ్ రేప్.. రేపల్లె రైల్వే స్టేషన్‌లో దారుణం

ఫొటో సోర్స్, BBc
ఆంధ్రప్రదేశ్‌లోని రేపల్లె రైల్వే స్టేషన్‌లో ఓ వలస కూలీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బాపట్ల జిల్లా రేపల్లెకి వలస వెళ్లింది.
కూలి పనులు చేసుకుంటూ గడుపుతోంది. శనివారం రాత్రి ముగ్గురు పిల్లలతో కలిసి భార్యాభర్తలు రేపల్లె రైల్వేస్టేషన్‌లో ఉన్న సమయంలో దుండగులు తెగబడ్డారు.
భర్తను తీవ్రంగా కొట్టి భార్యపై అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది.
బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాత్రి చీకట్లో నిర్మానుష్యంగా ఉన్న సమయంలో స్టేషన్ లోనే ముగ్గురు దుండుగులు అఘాయిత్యానికి పాల్పడినట్టు అంచనా వేస్తున్నారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి నిందితులు పరారయినట్టు చెబుతున్నారు.
సీసీ ఫుటేజ్ సహా అక్కడ లభించిన ఆధారాల సహాయంతో నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, Darla Venkatrao/Facebook
పది రోజుల వ్యవధిలో వరుస గ్యాంగ్ రేప్‌లు...
గుంటూరు జిల్లా పరిసరాల్లో వరుస గ్యాంగ్ రేప్‌లు జరుగుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
కొద్ది రోజుల కిందట విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో దుండగులు మానసిక వికలాంగురాలిని నిర్బంధించి అత్యాచారం చేశారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో వివాహితపై తెలిసిన వారే సామూహిక అత్యాచారయత్నం చేసి, దారుణంగా హత్య చేశారు.
దానికి ముందు గురజాల రైల్వే స్టేషన్ నుంచి ఒడిశాకి చెందిన ఓ మహిళను దుండగులు అపహరించి అత్యాచారానికి ఒడిగట్టారు.
తాజాగా రేపల్లె రైల్వే స్టేషన్‌లో వలస కూలీ మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇవన్నీ పది రోజుల వ్యవధిలో వెలుగు చూసిన దారుణాలు.
రేపల్లె ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు.
బాధితురాలు గర్భిణి అని, ఎస్సీ వర్గానికి చెందిన మహిళ అని.. ఆమెపై గంజాయి తాగిన ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో ప్రతి రోజూ మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
పటియాలా ఘర్షణల కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

ఫొటో సోర్స్, ANI
పంజాబ్‌లోని పటియాలా నగరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ఉద్రిక్తతకు దారితీసిన ఉదంతానికి సంబంధించి ప్రధాన నిందితుడు బర్జీందర్ సింగ్ పర్వానాను ఆదివారం ఉదయం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిని ముంబై నుంచి విమానంలో మొహాలీ తీసుకువచ్చారని, విమానాశ్రయం వద్ద పటియాలా సెంట్రల్ ఇంటెలిజెన్స్ టీమ్ అతడిని అరెస్ట్ చేసిందని చెప్పారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
పటియాలాలోని కాళీ మాత మందిరం వద్ద శుక్రవారం నాడు శివసేన, సిక్కు బృందాల వారు ఘర్షణ పడ్డారు. వారు కత్తులు ఝళిపిస్తూ, రాళ్లు విసురుకోవటంతో ఇద్దరు పోలీసులు సహా నలుగురు గాయపడ్డారు.
ఈ హింసకు సంబంధించి ఆరు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకూ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పటియాలా ఐజీ ఎం.ఎస్.చినా తెలిపారు. ‘‘అరెస్ట్ చేసిన వారిలో మరో ప్రధాన నిందితుడు హరీశ్ సింగ్లా, అతడి సహనిందితుడు శంకర్ భరద్వాజ్, అతివాద సిక్కు గ్రూపు సభ్యులు ముగ్గురు ఉన్నారు’’ అని చెప్పారు.
కార్మిక దినోత్సవం: అడ్డా కూలీ జీవితంలో ఒక రోజు - బీబీసీ ప్రత్యేక కథనం
