ఏపీలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంపు
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంచుతున్నట్లు ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎండీ చెప్పారు. డీజిల్ ధరల పెరుగుదలతో ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని తెలిపారు. ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి రావడంతో డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నామని చెప్పారు.
లైవ్ కవరేజీ
పద్మ మీనాక్షి
అలియా భట్, రణబీర్ కపూర్ ల లవ్‌స్టోరీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది?
హిందూ రాజ్యాన్ని అంబేడ్కర్ అతి పెద్ద ప్రమాదంగా ఎందుకు భావించారు?
ఆంధ్రప్రదేశ్: ఏలూరు పోరస్ రసాయన పరిశ్రమలో పేలుడు.. ఏడుకు పెరిగిన మృతుల సంఖ్య
నేటి ముఖ్య పరిణామాలు ఇవీ...
- ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో 11 రోజుల కిందట ముస్లిం మహిళలపై రెచ్చగొట్టే విధంగా ప్రసంగించిన బజరంగ్ మునిని యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
- పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటోలో చేరటంపై వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ఫిన్లండ్ ప్రధానమంత్రి సనా మారిన్ చెప్పారు. స్వీడన్ కూడా నాటోలో చేరే అంశాన్ని పరిశీలిస్తోంది. ఆ దేశాలు నాటోలో చేరితే యూరప్‌లో అస్థిరత నెలకొంటుందని రష్యా హెచ్చరించింది.
- అస్సాంలో విషపూరిత పుట్టగొడుగులు తిని వారం రోజుల్లో 13 మంది చనిపోయారు. మరో 39 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
- మరియుపోల్‌లో వేయి మందికి పైగా యుక్రెయిన్ సైనికులు ఆయుధాలు వదిలేసి లొంగిపోయారని రష్యా చెప్పింది. అయితే మరియుపోల్ ఇంకా తమ ఆధీనంలోనే ఉందని యుక్రెయిన్ చెప్తోంది.
- తమ నగర మార్చురీల్లో ఎవరూ తీసుకెళ్లని రష్యా సైనికుల శవాలు 1500కు పైగా ఉన్నాయని సెంట్రల్ యుక్రెయిన్‌లోని నీప్రో డిప్యూటీ మేయర్ చెప్పారు.
- వివాదాస్పద వాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నిర్దోషి అంటూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది.
- ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచుతున్నట్లు ఏపీఎస్ ఆర్‌టీసి మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తిరుమలరావు చెప్పారు. పెరిగిన చార్జీలు గురువారం నుంచి అమలులోకి వస్తాయి.
- న్యూయార్క్ సబ్‌వే స్టేషన్ కాల్పులలో 20 మందికి గాయాలయ్యాయి. ఈ దాడితో 62 ఏళ్ల ఫ్రాన్స్.ఆర్.జేమ్స్‌కు ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇవీ నేటి ముఖ్య పరిణామాలు. బీబీసీ తెలుగు ఈ నాటి లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
యుక్రెయిన్ యుద్ధంలో తాజా పరిణామాలను తెలుసుకోవటానికి బీబీసీ న్యూస్ లైవ్ పేజీని ఫాలో అవండి.
ధన్యవాదాలు.
త్రికూట పర్వతం ప్రమాదంలో ప్రజలను కాపాడిన సైనిక బలగాలకు ప్రధాని మోదీ ప్రశంసలు

ఫొటో సోర్స్, ANI
ఝార్ఖండ్‌లోని త్రికూట్ పర్వతం మీద కేబుల్ కార్లు ఢీకొన్న ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించిన వివిధ శాఖల సిబ్బందితో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
‘‘ప్రజలను ప్రతి సంక్షోభం నుంచి సురక్షితంగా కాపాడగల శక్తి సామర్థ్యాలున్న మన సైన్యం, వైమానిక దళం, ఎన్‌డీఆర్ఎఫ్, ఐటీబీపీ, పోలీస్ బలగాల పట్ల దేశం గర్విస్తోంది’’ అంటూ ఆయన వారిని ప్రశంసించారు.
‘‘ఈ ప్రమాదం నుంచి, రెస్క్యూ మిషన్ నుంచి మనం కూడా పాఠాలు నేర్చుకున్నాం. మీ అనుభవం భవిష్యత్తకు ఉపయోగపడుతుంది’’ అని మోదీ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, ANI
‘‘మీరు మూడు రోజుల పాటు, 24 గంటలూ కష్టపడి క్లిష్టమైన రెస్క్యూ ఆపరేషన్‌ను పూర్తిచేసి చాలా మంది ప్రజల ప్రాణాలు కాపాడారు. ఇది బాబా వైద్యనాథ్ జీ ఆశీస్సులు కూడా ఉన్నాయని నేను భావిస్తున్నా’’ అని చెప్పారు.
అయితే కొందరి ప్రాణాలను కాపాడలేకపోవటం పట్ల ప్రధాని విచారం వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా కూడా ఎన్‌డీఆర్ఎఫ్, ఎయిర్ ఫోర్స్, ఐటీబీపీ, ఆర్మీ, జిల్లా యంత్రాంగాలను అభినందించారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
త్రికూట్ పర్వతం ఝార్ఖండ్‌లోని దేవ్‌గఢ్ జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం, ఆకర్షణీయమైన పర్యటక ప్రాంతం. అక్కడ రోప్‌వే ద్వారా పర్యాటకులు ఎత్తైన కొండపైకి వెళ్తుంటారు.
ఆదివారం శ్రీరామనవమి రోజు సాయంత్రం ప్రమాదం జరిగింది. భారత సైన్యం, వాయుసేన, ఎన్డీఆర్ఎఫ్‌లు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ 46 గంటల పాటు సాగింది. రోప్‌వే కేబుల్ కార్లలో చిక్కుకుపోయిన 46 మంది ప్రయాణికులను రక్షించారు.
కేబుల్ కార్లలో మొత్తం 48 మంది ఉండగా, వారిలో ఇద్దరు చనిపోయారని, 46 మందిని రక్షించామని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు.
కేజీఎఫ్ అసలు కథ తెలుసా?
ముస్లిం మహిళలపై రేప్ హెచ్చరికలు చేసిన బజరంగ్ ముని అరెస్ట్

ఫొటో సోర్స్, ANI
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లో ముస్లింలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టేలా ప్రసంగించిన బజరంగ్ మునిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ముస్లిం మహిళలపై అత్యాచారం హెచ్చరికలు చేస్తూ ఆయన మాట్లాడిన 11 రోజుల తర్వాత యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.
బజరంగ్ మునిని బుధవారం అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచినట్లు సీతాపూర్ పోలీస్ విభాగం ట్వీట్ చేసింది. శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎవరినైనా ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు చేపడతామని ఆ ట్వీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
సీతాపూర్‌లోని ఖైరాబాద్‌లో గల మహారుషి శ్రీ లక్ష్మణ్ దాస్ ఉదాసీ ఆశ్రమానికి మహంత్‌గా ఉన్నారు బజరంగ్ ముని దాస్.
ఆయన 11 రోజుల కిందట ఒక మతపరమైన కార్యక్రమంలో భాగంగా ఒక మసీదు ఎదుట రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు. వైరల్‌గా మారిన ఆ వీడియోలో.. ముస్లింలపై అత్యాచారం చేస్తామంటూ ఆయన బెదిరిస్తున్నట్లు ఉంది.
ఈ వీడియో వైరల్ కావటంతో ఆయనను అరెస్ట్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది.
అయితే.. ఆ తర్వాత బజరంగ్ ముని క్షమాపణ చెప్తూ, తన వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్తున్న వీడియో కూడా వైరల్ అయింది.
నాటోలో చేరికపై వారాల్లో నిర్ణయం: ఫిన్లండ్ ప్రధాని; రష్యా హెచ్చరిక

ఫొటో సోర్స్, Paul Wennerholm/TT News Agency/Reuters
ఫొటో క్యాప్షన్, స్వీడన్ ప్రధానమంత్రి మగ్దలీనా ఆండర్సన్ (ఎడమ)తో ఫిన్లండ్ ప్రధానమంత్రి సనా మారిన్ (కుడి) పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటోలో ఫిన్లండ్ చేరే అంశంపై కొన్ని వారాల్లోనే నిర్ణయం తీసుకుంటుందని ఆ దేశ ప్రధానమంత్రి సనా మారిన్ ధ్రువీకరించారు.
స్వీడన్ ప్రధానమంత్రి మగ్దలీనా ఆండర్సన్‌తో కలిసి సనా మారిన్ బుధవారం స్టాక్‌హోంలో సంయుక్తంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఇంతకుముందు.. నాటోలో చేరే అంశాన్ని మెజారిటీ ఫిన్లండ్ దేశస్తులు వ్యతిరేకించారు. అయితే.. వారి అభిప్రాయం మారినట్లు తాజా సర్వేలు సూచిస్తున్నాయి.
ఇప్పటికే 30 దేశాలు సభ్యులుగా ఉన్న నాటో సైనిక కూటమిలో చేరే అంశాన్ని స్వీడన్ కూడా పరిశీలిస్తోంది.
ఫిన్లండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరటం యూరప్‌లో అస్థిరత్వానికి దారితీస్తుందని రష్యా హెచ్చరించింది.
నాటో కూటమిలో చేరకుండా యుక్రెయిన్‌ను బెదిరించటం కోసం కూడా తాము ఆ దేశం మీద సైనిక దండయాత్ర చేపట్టామని రష్యా పేర్కొంది.
అస్సాంలో విషపూరిత పుట్టగొడుగులు తిని 13 మంది మృతి
అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో విషపూరిత అడవి పుట్టగొడుగులు తిని వారం రోజుల్లో 13 మంది చనిపోయినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
విషపూరిత పుట్టగొడుగులు తినటం వల్ల మరో 39 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరినట్లు ఏఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత దిహింగియా చెప్పారు. వారు ప్రధానంగా కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతున్నారని వివరించారు.
ఇప్పటివరకూ 13 మంది పేషెంట్లు చనిపోయారని, వారంతా తేయాకు తోటల ప్రాంతాల వారేనని ఆయన తెలిపారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరియుపోల్‌లో విధ్వంస దృశ్యాలను విడుదల చేసిన రష్యా
రష్యా రక్షణ మంత్రిత్వశాఖ విడుదల చేసిన డ్రోన్ వీడియో దృశ్యాలు.. యుక్రెయిన్‌లోని మరియుపోల్‌లో విధ్వంసం ఏ స్థాయిలో ఉందో చూపుతున్నాయి.
యుక్రెయిన్ దక్షిణాన ఉన్న ఈ రేవు నగరాన్ని రష్యా హస్తగతం కానుందనే సూచనల మధ్య ఈ వీడియో వచ్చింది. ఈ నగరంలో యుద్ధం ముందు వరకూ 4.50 లక్షల మంది జనం నివసించేవారు.
రష్యా తీవ్ర స్థాయిలో బాంబుదాడులు చేయటంతో 21,000 మంది పౌరులు చనిపోయారని మరియుపోల్ మేయర్ చెప్తున్నారు. నగరం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించటం కోసం ఇంకా వేలాది మంది జనం వేచి చూస్తున్నారని ఆయన తెలిపారు.
వీడియో క్యాప్షన్, మరియుపోల్ నగరంలో విధ్వంస దృశ్యాల డ్రోన్ ఫుటేజీని రష్యా విడుదల చేసింది శ్రీలంకలో థియేటర్ల వద్ద అభిమానుల రద్దీ, ఆర్థిక సంక్షోభంలోనూ తగ్గేదేలేదంటున్న ఫ్యాన్స్
మరియుపోల్‌లో 1,000 మంది యుక్రెయిన్ సైనికులు లొంగిపోయారన్న రష్యా; లేదన్న యుక్రెయిన్

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌లోని మరియుపోల్‌లో వేయి మందికి పైగా యుక్రెయిన్ సైనికులు ఆయుధాలు విసర్జించి లొంగిపోయారని రష్యా చెప్పుకొచ్చింది.
అయితే.. మరియుపోల్ నగరం ఇంకా తమ ఆధీనంలోనే ఉందని యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలియెన్‌స్కీ సలహాదారు ఒకరు పేర్కొన్నారు. ఈ నగర భద్రతా వ్యవస్థను బలోపేతం చేశామని, అక్కడ సైనికుల సంఖ్యను కూడా పెంచామని ఆయన చెప్పారు.
రష్యా వాదనలు, యుక్రెయిన్ ప్రతివాదనల మధ్య.. మరియుపోల్‌లో వాస్తవంగా ఏం జరుగుతోందనేది నిర్ధారించుకోవటం కష్టంగా మారింది.
ఈ నగరం మీద రష్యా కొన్ని వారాలుగా దాడి చేస్తోంది. రష్యా చెప్తున్న దాని ప్రకారం.. యుక్రెయిన్‌కు చెందిన 36వ మెరైన్ బ్రిగేడ్ సైనికులు లొంగిపోయారు.
శ్రీలంక సంక్షోభం 1991 నాటి భారత్‌ను ఎందుకు గుర్తు చేస్తోంది? పీవీ నరసింహారావు ఇండియాను ఎలా గట్టెక్కించారు?
రష్యా సైనికుల శవాలతో మా నగర మార్చురీలు నిండిపోయాయి: నీప్రో డిప్యూటీ మేయర్

ఫొటో సోర్స్, EPA
ఫొటో క్యాప్షన్, నీప్రో నగరంపై రష్యా మిసైళ్ల దాడిలో ధ్వంసమైన ఓ ఫ్యాక్టరీ కీయెవ్ నగరాల చుట్టూ విధ్వంసం, మరణాల తీవ్రత క్రమంగా వెలుగుచూస్తోంది. తమ నగర మార్చురీలు ఎవరూ తీసుకెళ్లని రష్యా సైనికుల శవాలతో నిండిపోయాయని సెంట్రల్ యుక్రెయిన్‌లోని నీప్రో డిప్యూటీ మేయర్ చెప్పారు.
నాలుగు రిఫ్రిజిరేటర్లలో 1,500 పైగా మృతదేహాలు ఉన్నాయని మిఖాయిల్ లీసెంకో చెప్పినట్లు ఏఎఫ్‌పీ వార్తా సంస్థ తెలిపింది.
ఆ మృతదేహాలను దహనం చేయటానికి కానీ, సామూహిక సమాధుల్లో పూడ్చటానికి కానీ నగర అధికారులు సుముఖంగా లేరని ఆయన చెప్పారు.
రష్యా సైనికుల తల్లులు.. చనిపోయిన తమ కొడుకుల మృతదేహాలను వెనక్కు తీసుకువచ్చేలా వారి కమాండర్లతో మాట్లాడాలని లీసెంకో విజ్ఞప్తి చేశారు.
KGF 2: 121 ఏళ్లలో 900 టన్నుల బంగారం అందించిన కేజీఎఫ్ అసలు కథ ఇది
కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా రద్దు
కేంద్రీయ విద్యాలయాల్లో (సెంట్రల్ స్కూల్స్‌లో) పార్లమెంటు సభ్యుల కోటా కింద విద్యార్థులకు సీట్ల కేటాయింపును రద్దు చేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రత్యేక నిబంధనల కింద ఇచ్చే అడ్మిషన్లను తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ జరపరాదని కేవీఎస్ ఏప్రిల్ 12వ తేదీన ఆదేశాలిచ్చింది.
ఈ పథకం కింద ప్రతి పార్లమెంటు సభ్యులూ ఒక్కొక్కరు పది మంది విద్యార్థులను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్చుకోవటానికి సిఫారసు చేయవచ్చు.
ఈ పథకాన్ని నిలిపివేస్తూ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఆదేశాలు జారీ చేసింది.

యుక్రెయిన్‌లో రష్యా యుద్ధ ట్యాంకులను భారీగా ఎందుకు కోల్పోతోంది?
అది రాజీనామా కాదు.. థాంక్స్ గివింగ్ లెటర్: మేకతోటి సుచరిత

ఫొటో సోర్స్, MEKATHOTI SUCHARITHA/FB
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ‘‘కొంతమందిని మారుస్తానని సీఎం జగన్ ముందే చెప్పారు. దానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం’’ అని రాష్ట్ర మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో తాజా మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో చోటు దక్కకపోవటంతో సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో మాజీ హోంమంత్రి బుధవారం నాడు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పదవి ఆశించి రాకపోవడంతో చిన్న ఎమోషన్‌కి గురైనట్లు పేర్కొన్నారు. తాను థ్యాంక్స్ చెబుతూ లేఖ రాస్తే దానిని రాజీనామా అంటూ ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు.
‘‘మా అమ్మాయి చాలా చిన్నపిల్ల. రాజకీయాలు తెలిసినమ్మాయి కాదు. రాజీనామాకు, కృతజ్ఞతల లేఖకు తేడా తెలీదు. ఆమెను జనంలోకి, మీడియా ముందుకు తెచ్చారు. ఎలా మాట్లాడాలో తెలీక ఆమె అలా చెప్పింది. మా అబ్బాయి ‘థాంక్స్ గివింగ్ లెటర్’ అని పక్కనుండి చెప్తున్నారు. అయినా కానీ రాజీనామా అనేది పట్టుకుని హైలైట్ చేశారు’’ అని సుచరిత పేర్కొన్నారు.
‘‘పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. నాడు జగన్ బయటకు వచ్చినపుడు నేను కూడా ధైర్యంగా రాజీనామా చేశాను. పదవులు మాకు ఎప్పుడూ ముఖ్యం కాదు. అవి శాశ్వతం కాదు. ప్రజలు దీవించినంత కాలం నేను అధికారంలో ఉంటాను. వై.ఎస్.జగన్ 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగటానికి పార్టీ కోసం పని చేస్తాను’’ అని పేర్కొన్నారు.
‘‘సీఎం జగన్ నన్ను కుటుంబంలో సభ్యురాలిగా ఆదరిస్తారు. సుచరిత రాజకీయాల్లో ఉంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. జగన్మోహన్‌రెడ్డి.. నా చెల్లి అని ఎప్పుడూ చెప్తుంటారు. అదే అభిమానం ఇప్పుడూ చూపిస్తున్నారు’’ అని సుచరిత చెప్పారు.
‘‘జగన్ దగ్గర ప్రవేశం లేదంట, ఏవో చర్యలంటున్నారు, కోపగించుకుంటున్నారు’ అని మీడియాలో రకరకాల కథనాలు వస్తుండటంతో దానికి పుల్‌స్టాప్ పెట్టటానికి జగన్‌మోహన్‌రెడ్డిని కలవటానికి వచ్చాను. నాకు ఆరోగ్యం బాగోలేదు. అయినా వెంటనే ఈ ప్రచారానికి ముగింపు పలకాలని వచ్చాను’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.
ఏపీలో బస్సు చార్జీల పెంపు

ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచుతున్నట్లు ఏపీఎస్‌ఆర్‌టీసి మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తిరుమలరావు చెప్పారు.
డీజిల్ ధరల పెరగుదలతో ఛార్జీలు పెంచేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాలను బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు.
"ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి రావడంతో డీజిల్ సెస్ మాత్రమే విధిస్తున్నాం" అని చెప్పారు.
పల్లె వెలుగు బస్సుల్లో రూ.2, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.5 చార్జీలు పెంచుతున్నారు.
ఈ చార్జీలు గురువారం నుంచి అమలులోకి వస్తాయి.
పల్లె వెలుగు బస్సులో గురువారం నుంచి కనిష్ఠ ధర రూ.10 ఉంటుంది.
డీజిల్ సెస్ వల్ల ఏడాదికి రూ.720 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
