రష్యా సేనలను ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ రాజధానిలోని ప్రజలకు 18,000 మెషీన్ గన్‌లు

యుక్రెయిన్‌పై రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. ఉత్తరం, తూర్పు, దక్షిణ భాగాల నుంచి రష్యా సైన్యం దాడి చేస్తోంది. ఇప్పటివరకు 137 మంది సైనికులు, పౌరులు మరణించారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు.

లైవ్ కవరేజీ

  1. రష్యా బాంబు దాడులకు ధ్వంసమైన యుక్రెయిన్‌లోని అనాథాశ్రమం

    కీవ్ నగరానికి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న వోర్జెల్‌లోని అనాథాశ్రమం రష్యన్ల బాంబుదాడిలో ధ్వంసమైందని యుక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ చెప్పారు.

    రష్యన్ క్షిపణి శకలాలు అనాథాశ్రమం మీద పడ్డాయని ఇరినా వెనెడిక్టోవా ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. ఆ అనాథాశ్రమంలో 50 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు.

    అయితే, పిల్లల్లో ఎవరికీ ప్రాణహాని కలుగలేదని, వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించే ఏర్పాటు చేస్తున్నామని ఆమె చెప్పారు.

    అయితే, తూర్పున సుమీ ఓబ్లాస్ట్ ప్రాంతంలో ఓక్‌టిర్కా అనే పట్టణంలో రష్యన్లు వేసిన బాంబుల వల్ల చాలా మంది పిల్లలు గాయపడ్డారని యుక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

    ప్రాంతీయ మిలటరీ అడ్మినిస్ట్రేషన్ అధిపతి డిమిత్రో జివివిస్కీ చెప్పిన ప్రకారం అక్కడ జనావాస ప్రాంతాల మీద, ఒక చిన్న పిల్లల బడి మీద దాడులు జరిగాయి.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Getty Images

  2. యుక్రెయిన్ నుంచి తాజా చిత్రాలు

    యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతుండడం, రాజధాని కీవ్ నగరంలోకి శత్రు సేనలు అడుగుపెడుతుండడంతో స్థానికులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.

    యుక్రెయిన్ సంక్షోభాన్ని కళ్లకు కట్టించేలా ఫోటో జర్నలిస్టులు తీసిన కొన్ని చిత్రాలివి.

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, కీవ్ నగరం నుంచి పోలండ్ వెళ్లే రైళ్లలో కిక్కిరిసిన జనం
    యుక్రెయిన్ సంక్షోభం

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, కీవ్ నుంచి వెళ్లిపోయేందుకు రైల్వే స్టేషన్లకు భారీ సంఖ్యలో చేరుకున్న ప్రజలు
    యుక్రెయిన్ సంక్షోభం

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, రాజధాని నగరంలోని రైల్వే స్టేషన్‌లో యుక్రెయిన్ సైనిక బలగాలు
    యుక్రెయిన్ సంక్షోభం

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, పేలిన రాకెట్ బాంబుల ఫోటోలు తీసుకుంటున్న కీవ్ ప్రజలు
  3. 18,000 మెషీన్ గన్‌లను వలంటీర్లకు ఇచ్చామన్న యుక్రెయిన్

    యుక్రెయిన్

    ఫొటో సోర్స్, AFP via Getty Images

    రష్యా సేనలు రాజధాని కీవ్ నగరంలోకి ప్రవేశిస్తుండడంతో వారిని అడ్డుకోవడానికి చేయాల్సిందంతా చేయాలని యుక్రెయిన్ అధికారులు స్థానిక ప్రజలకు పిలుపునిచ్చారు.

    “రష్యా దళాల కదలికలు గురించి మాకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండండి. సీసాల బాంబులు తయారు చేసుకుని శత్రువును నిలువరించాలి” అని యుక్రెయిన్ రక్షణ శాఖ, హోం శాఖ అధికారులు ప్రజలను కోరారు.

    సీసాలతో పెట్రోలు బాంబులు ఎలా తయారు చేసుకోవాలో వివరించే కరపత్రాన్ని హోం మంత్రిత్వ సోషల్ మీడియా అకౌంటులో పోస్ట్ చేశారు.

    “కీవ్ నగరంలో శత్రు సైనికులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న వలంటీర్లకు 18,000 మెషీన్ గన్లు అందజేశాం” అనిహోం శాఖ సలహాదారు వాడిమ్ డెనిసెంకో తెలిపారు.

    “శత్రువును అడ్డుకోవడానికి యుక్రెనియా మిలటరీ సామగ్రి కూడా కీవ్ నగరానికి చేరుకుంటోంది. ఇక్కడ చేస్తున్న పనులు, మన కదలికలు వేటినీ వీడియోలు తీయొద్దని మేం ప్రజలను కోరుతున్నాం. నగరాన్ని కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యం” అని డెనిసెంకో పిలుపునిచ్చారు.

  4. చెర్నిహివ్ నగరాన్ని చుట్టుముట్టిన రష్యన్ సేనలు

    యుక్రెయిన్ రాజధానికి ఉత్తరం వైపున 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెర్నెహివ్ నగరాన్ని తమ సేనలు చుట్టుముట్టాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

    “చెర్నెహివ్ నగర దిగ్బంధం పూర్తయింది” అని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఐగోర్ కోనాషెంకోవ్ చెప్పినట్లు ఆ దేశానికి చెందిన ఇంటర్ ఫ్యాక్స్ నూస్ ఏజెన్సీ తెలిపింది.

    కీవ్ నగరానికి దగ్గర్లో ఉన్న హోస్టోమెల్ ఎయిర్‌ఫీల్డ్‌ను స్వాధీనం చేసుకున్నామని కూడా ఆ ప్రతినిధి చెప్పారు. అంతేకాకుండా, 200 మంది యుక్రెయిన్ స్పెషల్ సైనిక బలగాలను “ధ్వంసం” చేశామని కూడా వెల్లడించారు.

    మేం ఇంతకు ముందు చెప్పినట్లుగానే, హోస్టోమెల్ ఎయిర్‌ఫీల్డ్ గురించి యుక్రెయిన్ సైన్యం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

    యుక్రెయిన్
  5. రష్యా దాడుల్లో 57 మంది పౌరులు సహా 194 మంది యుక్రెయినీలు మృతి –బ్రిటన్

    బ్రిటన్ సైనిక దళాల మంత్రి జేమ్స్ హీపే శుక్రవారం హౌజ్ ఆఫ్ కామన్స్‌లో మాట్లాడుతూ రష్యా దాడులు ప్రారంభించిన తరువాత ఇప్పటివరకు 450 మంది రష్యన్ సైనికులు, 194 మంది యుక్రెయినీలు చనిపోయారని చెప్పారు. చనిపోయిన యుక్రెయినీలలో 58 మంది సాధారణ పౌరులని తెలిపారు.

    ఐక్యరాజ్యసమితి హక్కుల మండలి ఈ ఉదయం 25 మంది చనిపోయారని ప్రకటించింది. కాగా, జేమ్స్ హీపే చెప్పిన సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.

    నాటో మిత్రదేశమైన ఇస్టోనియాకు అనుకున్న దాని కన్నా ముందుగానే యూకే దళాలను పంపిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. యుక్రెయిన్ పొరుగుదేశాల్లో శరణార్థులుగా వచ్చేవారిని చూసుకోవడానికి మొత్తంగా 1,000 మంది సైనికులును పంపిస్తున్నట్లు హీపే వెల్లడించారు.

    యుక్రెయిన్ సంక్షోభం

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్
  6. రష్యా విమాన దాడుల్లో 25 మంది మృతి - ఐక్యరాజ్యసమితి

    యుక్రెయిన్ మీద రష్యా వైమానిక దాడులు, షెల్లింగ్ కాల్పుల్లో కనీసం 25 మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం చెప్పింది.

    ఈ దాడుల్లో మరో 102 మంది క్షతగాత్రులయ్యారని తెలిపింది.

    ఈ అంచనా వాస్తవం కన్నా తక్కువ కావచ్చునని కూడా వ్యాఖ్యానించింది.

  7. రష్యా దాడుల నుంచి రక్షణ కోసం కీవ్ ప్రజల కష్టాలు

    రష్యా సైనిక బలగాలు రాజధాని కీవ్ నగరంలోని ఉత్తర జిల్లాల్లోకి ప్రవేశించాయని యుక్రెయిన్ అధికారులు చెప్పారు. దీంతో.. సైనిక దాడుల నుంచి తమను కాపాడుకోవటానికి నగర ప్రజలు ప్రయత్నాలు చేస్తున్నారు.

    మరోవైపు.. శత్రువులతో పోరాడటానికి సైన్యంలో చేరాలంటూ యుక్రెయిన్ సైన్యం ట్వీట్ ద్వారా ప్రజలకు పిలుపునిచ్చింది.

    కీవ్ నగరంలో శుక్రవారం ఉదయం క్షిపణి దాడితో ధ్వంసమైన ఓ నివాస భవనం ఎదుట ఆడుకుంటున్న చిన్నారి

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, కీవ్ నగరంలో శుక్రవారం ఉదయం క్షిపణి దాడితో ధ్వంసమైన ఓ నివాస భవనం ఎదుట ఆడుకుంటున్న చిన్నారి
    నగర వ్యాప్తంగా జనం బాంబు షెల్టర్లలో దాక్కుంటున్నారు

    ఫొటో సోర్స్, AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, నగర వ్యాప్తంగా జనం బాంబు షెల్టర్లలో దాక్కుంటున్నారు

    కొద్ది సేపటి ముందు ఈ పిలుపుతో ఇచ్చిన ట్వీట్‌లో.. సైన్యంలో చేరటానికి వయో పరిమితులు ఏమీ లేవని పేర్కొంది. అయితే.. తాజాగా జారీ చేసిన ప్రకటనలో.. వయో పరిమితి సడలింపు 60 ఏళ్లు పైబడిన వారికేనని తెలిపింది. మైనర్ల గురించి ఇందులో ప్రస్తావించ లేదు.

    ‘‘శత్రువును ఎదుర్కొని, ఓడించటానికి నైతికంగా, భౌతికంగా సిద్ధంగా ఉన్న 60 ఏళ్లు పైబడిన వారిని ట్రూప్స్ ఆఫ్ ది పేట్రియాట్స్‌లో చేరాలని మేం ఆహ్వానిస్తున్నాం’’ అని రక్షణ మంత్రి అలెక్సీ రెజ్నికోవ్ చెప్పారు.

    సెంట్రల్ కీవ్‌‌లో మోహరించిన యుక్రెయిన్ నేషనల్ గార్డ్ సైనికులు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, శుక్రవారం నాడు సెంట్రల్ కీవ్‌‌లో మోహరించిన యుక్రెయిన్ నేషనల్ గార్డ్ సైనికులు
    దాడి నుంచి కాపాడుకోవటానికి మనుషులతో పాటు జంతువులు కూడా భూగర్భ స్థావరాలకు చేరుతున్నాయి

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, దాడి నుంచి కాపాడుకోవటానికి మనుషులతో పాటు జంతువులు కూడా భూగర్భ స్థావరాలకు చేరుతున్నాయి
    కీవ్ లోని రైల్వే స్టేషన్లు నిండిపోతున్నాయి

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, కీవ్ లోని రైల్వే స్టేషన్లు నిండిపోతున్నాయి
    కీవ్‌ ఇండిపెండెంట్ స్వ్కేర్ దాదాపు నిర్మానుష్యంగా మారింది

    ఫొటో సోర్స్, AFP via Getty Images

    ఫొటో క్యాప్షన్, కీవ్‌ ఇండిపెండెంట్ స్వ్కేర్ దాదాపు నిర్మానుష్యంగా మారింది
  8. కీవ్‌లో నివాస ప్రాంతాన్ని తాకిన క్షిపణి

    యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరం వాయువ్య బుచ్చా ప్రాంతంలో ఒక నివాస ప్రాంతాన్ని క్షిపణి తాకిన దృశ్యం సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వీడియోను బీబీసీ ధ్రువీకరించింది.

    రష్యా సైనిక బలగాలు కీవ్ నగరంలోని ఉత్తర ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు యుక్రెయిన్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. యుక్రెయిన్‌ను నిస్సైనికీకరణ చేయటమే లక్ష్యం: రష్యా విదేశాంగ మంత్రి

    యుక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలని రష్యా కోరుకోవటం లేదని, ఆ దేశాన్ని నిస్సైనికీకరణ చేయటమే తమ ఉద్దేశమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు.

    ఆయన శుక్రవారం మాస్కోలో మీడియాతో మాట్లాడినపుడు.. ప్రజాస్వామ్య దేశాన్ని కూల్చాలని రష్యా భావిస్తోందా అని ప్రశ్నించినపుడు.. యుక్రెయిన్‌ను ప్రజాస్వామిక దేశంగా పిలవజాలమని ఆయన స్పందించారు.

    యుక్రెయిన్‌లో రష్యా మాట్లాడే జనం మీద ఆ దేశం అణచివేతకు పాల్పడుతోందని ఆరోపించారు.

    రష్యా తమ పొరుగు దేశంపై దండెత్తటాన్ని ఎలా సమర్ధించుకుంటుందని బీబీసీ ప్రతినిధి స్టీవ్ రెసెన్‌బర్గ్ అడిగిన ప్రశ్నను లావ్రోవ్ కొట్టివేశారు.

    మాజీ యుగొస్లేవియా, ఇరాక్, లిబియాల్లో పశ్చిమ దేశాల జోక్యాన్ని ఆయన ఉటంకించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే పేరుతో చేసుకున్న ఆ జోక్యాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పాయరని పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    దీనికిముందు.. యుక్రెయిన్‌లో రష్యా మద్దతున్న వేర్పాటువాదుల నియంత్రణలోని రెండు కీలక ప్రాంతాల ప్రతినిధులు తతను కలిసిన వీడియోను రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

    యుక్రెయిన్ తూర్పు భాగంలోని ఈ రెండు ప్రాంతాలు.. డోనెట్స్క్ పీపుల్స్ రిపబ్లిక్, లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ పేరుతో స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకున్నాయి.

  10. రష్యా సైనికులు 450 మంది చనిపోయారు: బ్రిటన్ రక్షణ మంత్రి

    యుక్రెయిన్ మీద దండయాత్రను ప్రారంభించిన రష్యా గురువారం నాడు తన లక్ష్యాలను సాధించటంలో విఫలమైందని.. బ్రిటన్ నిఘా సమాచారం అంచనాగాబ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ చెప్పారు.

    ఆయన రేడియో-4లో మాట్లాడుతూ.. ‘‘యుక్రేనియన్లు పోరాడారు కాబట్టి రష్యా విఫలమైంది’’ అని పేర్కొన్నారు.

    ‘‘యుక్రేనియన్లు తనను విముక్తి ప్రదాతగా భావిస్తారన్న పుతిన్ అహంకారపూరిత ఆలోచన కొట్టుకుపోయింది కాబట్టి రష్యా విఫలమైంది. రష్యా యుద్ధట్యాంకులు, విమానాలపై దాడి చేయటానికి యుక్రెయిన్లకు అందించిన యుద్ధ సామగ్రి సాయం వల్ల రష్యా విఫలమైంది’’ అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.

    రష్యా సైనిక బలగాలకు చెందిన 450 మంది సైనికులు చనిపోయారని బెన్ వాలెస్ పేర్కొన్నారు.

    ‘రష్యాకు వ్యతిరేకంగా బ్రిటన్ యుద్ధ విమానాలను మోహరించం’

    యుక్రెయిన్ గగనతలంపై విమానాలు ఎగరటానికి వీలు లేకుండా ‘నో-ఫ్లై’ జోన్‌ను ఏర్పాటు చేయటానికి బ్రిటన్ మద్దతు ఇవ్వకపోవటాన్ని ఆయన సమర్ధించుకున్నారు.

    ఆ దేశం నాటో సభ్యదేశం కాదని ఆయన ఉటంకించారు.

    ‘‘నో-ఫ్లై జోన్‌ను ఏర్పాటు చేయాలంటే నేను బ్రిటిష్ యుద్ధ విమానాలను నేరుగా రష్యా యుద్ధ విమానాలకు వ్యతిరేకంగా మోహరించాల్సి ఉంటుంది. రష్యా మీద నాటో దాదాపుగా యుద్ధం ప్రకటించాల్సి ఉంటుంది’’ అని ఆయన బీబీసీతో మాట్లాడుతూ చెప్పారు.

    ‘‘యుక్రెయిన్‌కు 2008 నుంచీ బ్రిటన్ మద్దతు, ప్రోత్సాహం అందిస్తున్నప్పటికీ, నాటోలో చేరటానికి సాయపడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఆ దేశం నాటోలో చేరటాన్ని ఇతర దేశాలు ఇష్టపడటం లేదు’’ అన్నారాయన.

  11. '24 గంటల్లో 33 పౌర ప్రాంతాలపై రష్యా బాంబు దాడులు' - యుక్రెయిన్

    రష్యా సైనిక బలగాలు డజన్ల కొద్దీ పౌర ఆవాస ప్రాంతాలు లక్ష్యంగా దాడులు చేశాయని యుక్రెయిన్ అంతర్గత మంత్రిత్వశాఖ అధికారి వాద్యిమ్ డెనిసెంకో చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

    ‘‘రష్యన్లు తాము పౌర ప్రాంతాలపై దాడులు చేయటం లేదని చెబుతున్నారు. కానీ గడచిన 24 గంటల్లో 33 పౌర ప్రాంతాలపై దాడులు జరిగాయి’’ అని ఆయన పేర్కొన్నారు.

  12. తమ గగనతలంపై బ్రిటన్ విమానాలను నిషేధించిన రష్యా

    బ్రిటన్ విమానాలు

    ఫొటో సోర్స్, EPA

    బ్రిటన్‌తో సంబంధమున్న విమానాలేవీ తన గగనతలంపై ఎగరకుండా రష్యా నిషేధించింది.

    యుక్రెయిన్ మీద రష్యా దండయాత్రకు ప్రతిస్పందనగా.. రష్యాకు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థ ఏరోఫ్లోట్ విమానం తమ దేశంలో దిగకుండా బ్రిటన్ అడ్డుకోవటంతో, బ్రిటన్ విమానాలను తమ గగనతలంలో నిషేధిస్తూ రష్యా నిర్ణయం తీసుకుంది.

    ‘‘బ్రిటన్‌తో సంబంధమున్న విమానాలేవీ రష్యా గగనతలంలో వెళ్లకూడదని ఆంక్షలు విధించాం. ఆ దేశంలో రిజిస్టరయిన సంస్థల విమానాలు కానీ, వాటితో ఏ రకమైన సంబంధం ఉన్న విమానాలు కానీ ఎగరడానికి వీల్లేదంటూ నిషేధం అమలు చేస్తున్నాం’’ అని రష్యన్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.

    బ్రిటన్ విమానయాన అధికారుల విరోధపూరిత నిర్ణయాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ తెలిపింది.

  13. ఉగ్రవాదుల నుంచి చెర్నోబిల్‌ను కాపాడుతున్నాం: రష్యా

    చెర్నోబిల్ న్యూక్లియన్ ప్లాంటును తమ సైనిక బలగాలు ఆధీనంలోకి తీసుకున్నది ‘‘దానిని రక్షించటం కోసమే’’ అని చెబుతూ రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

    ‘‘జాతీయవాద గ్రూపులు, ఉగ్రవాద సంస్థలు దేశంలో పరిస్థితిని ఉపయోగించుకుని అణుదాడికి పాల్పడకుండా చూడడానికి’’ ఈ పని చేస్తున్నట్లు తెలిపింది.

    ఈ ప్లాంటు పరిసర ప్రాంతాల్లో అణుధార్మికత స్థాయి సాధారణ స్థితిలో ఉందని, సిబ్బంది దీనిని నిరంతరం పర్యవేక్షిస్తోందని కూడా చెప్పింది.

    చెర్నోబిల్ అణు కేంద్రాన్ని రష్యా సైనిక బలగాలు గురువారం నాడు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

    ఇదిలావుంటే, యుద్ధంలో తాము పలుచోట్ల పైచేయి సాధించామని, డోనెట్స్క్, లుహాన్స్క్‌లలో తమ బలగాలు పురోగమించాయని కూడా రష్యా ప్రకటించింది.

    యుక్రెయిన్ సైనికులు 150 మందికి పైగా లొంగిపోయారని, డజన్ల సంఖ్యలో యుక్రెయిన్ సైనిక కేంద్రాలు, ఆయుధ స్థావరాలు, వాహనాలు ధ్వంసమయ్యాయని తెలిపింది.

    అయితే, దీనికి ముందు యుక్రెయిన్ సైనిక బలగాలు ఫేస్‌బుక్‌లో విడుదల చేసిన ఓ ప్రకటనలో, డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో రష్యా బలగాలను నిరోధిస్తున్నామని, వాటికి ఎలాంటి విజయం సాధించలేదని, ఇతర ప్రాంతాల్లో రష్యా బలగాలను తిప్పికొట్టామని తెలిపాయి.

    ఇరుపక్షాల్లో ఎవరి వాదననూ ప్రస్తుతం తనిఖీ చేసి ధ్రువీకరించే పరిస్థితి లేదు.

  14. సైన్యంలో చేరండి.. వయసు పరిమితులు లేవు: పౌరులకు సైన్యం పిలుపు

    పౌరులు వయసుతో నిమిత్తం లేకుండా సైన్యంలో చేరాలని కోరుతూ యుక్రెయిన్ సైన్యం తాజాగా మరో ట్వీట్ చేసింది. అంటే మైనర్లు కూడా సైన్యంలో చేరాలని పిలుపునిచ్చినట్లు కనిపిస్తోంది.

    సైనిక బలగాల కమాండర్ యూరి గాలుష్కిన్ పేరుతో చేసిన ఆ ప్రకటన ఇలా చెప్తోంది:

    ‘‘ఈరోజు యుక్రెయిన్‌కు అన్ని అంశాలూ అవసరం. (సైన్యంలో) చేరిక విధానాలన్నిటినీ సరళతరం చేశాం. మీ పాస్‌పోర్టు, గుర్తింపు నంబరు మాత్రమే తీసుకురండి. వయసు పరిమితులేమీ లేవు.’’

    సైన్యంలో చేరే విషయంలో సమస్యలు ఎదురైతే.. ఈ అధికారిక ట్వీట్‌ను సంప్రదించాలని కూడా ప్రజలకు సూచించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  15. శత్రువు మీద పెట్రోల్ బాంబులతో పోరాడండి: కీవ్ ప్రజలకు యుక్రెయిన్ సైన్యం పిలుపు

    రష్యా సైనిక బలగాలు కీవ్ నగరంలోకి ప్రవేశించాయని యుక్రెయిన్ అధికారులు ఒక ట్వీట్ ద్వారా ధృవీకరించారు.

    ‘‘శత్రువులు ఒబోలాన్ జిల్లాలోకి ప్రవేశించా’’రని యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. కీవ్ నడిబొడ్డున ఉన్న పార్లమెంటుకు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం.

    రష్యా సైనికుల మీద పోరాడటానికి స్థానికులు మాలటోవ్ కాక్‌టెయిల్స్ (పెట్రోల్ బాంబులు) ఉపయోగించాలని యుక్రెయిన్ సైన్యం సూచించింది. ఇతరులు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. కీవ్ నగరంలో రష్యా యుద్ధ ట్యాంకులు

    రష్యా యుద్ధ ట్యాంకులు కీవ్ నగర కేంద్రానికి ఉత్తరంగా ఉన్న ఒబోలాన్ ప్రాంతం నుంచి ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తున్న వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్టయ్యాయి.

    రష్యా బలగాలు కీవ్ నగరంలోని నివాస ప్రాంతాల్లోకి చొరబడ్డాయని యుక్రెయిన్ రక్షణ మంత్రి గంట సేపటి కిందటే ధృవీకరించారు.

    ఈ వీడియోలను స్థానికులు తమ ఇళ్ల నుంచే చిత్రీకరించినట్లు కనిపిస్తోంది. వాటిలో కనిపిస్తున్న ప్రాంతాలు ఒబోలాన్ ప్రాంతానివేనని బీబీసీ ధృవీకరించుకుంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  17. కీవ్ శివార్లలో రష్యా సైన్యంతో పోరాడుతున్నాం: యుక్రెయిన్ సైన్యం

    యుక్రెయిన్ రాజధాని కీవ్ శివార్లలోని డైమర్, ఇవాన్కీవ్ ప్రాంతాల్లో రష్యా దళాలతో తమ సైనికులు పోరాటం కొనసాగిస్తున్నారని యుక్రెయిన్ సైన్యం తెలిపింది. ఈ ప్రాంతాలకు రష్యా సైనిక వాహనాలు పెద్ద సంఖ్యలో చేరుకున్నాయి.

    రాజధాని నగరం వాయువ్యంలో రష్యా బలగాలను తమ సైనికులు ఎదుర్కొంటున్నారని యుక్రెయిన్ సైన్యం తమ అధికారిక ఫేస్‌బుక్ పేజిలో పేర్కొంది.

    రష్యా బలగాలు మరింత ముందుకు సాగకుండా అడ్డుకునేందుకు.. టెతిరీవ్ నది మీద వంతెనను తమ సైన్యం ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.

    నగర శివార్లలోని వైమానిక స్థావరాన్ని తమ బలగాలు ఇంకా సంరక్షిస్తూనే ఉన్నాయని కూడా చెప్పింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    మరోవైపు కీవ్ నగరంలో సైతం అనేక చోట్ల కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    గత పది నిమిషాల్లో రెండు సార్లు తుపాకీ కాల్పులు వినిపించాయని బీబీసీ ప్రతినిధి పాల్ ఆడమ్స్ ట్వీట్ చేశారు.

    దీని వివరాలు తెలుసుకోవటం అసాధ్యమని, ‘‘అయితే రష్యా తరఫున ఇప్పటికే నగరంలో విద్రోహులు పనిచేస్తున్నట్లు వదంతులు వినిపిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  18. యుక్రెయిన్ నుంచి తెలుగు విద్యార్థుల తరలింపుపై జయశంకర్‌కు జగన్ ఫోన్

    వై.ఎస్.జగన్ ఉన్నత స్థాయి భేటీ

    ఫొటో సోర్స్, AP Govt.

    యుక్రెయిన్‌లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చే అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వై.యస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌కు ఫోన్‌ చేసి చర్చించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.

    ఆ ప్రకటన ప్రకారం.. తెలుగు విద్యార్థుల క్షేమం కోసం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని జయశంకర్‌ చెప్పారు.

    విద్యార్థులను యుక్రెయిన్‌ పొరుగు దేశాలకు తరలించి, అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా భారత్ తీసుకొచ్చే దిశగా సత్వర చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి వివరించారు.

    అంతకుముందు సీఎం జగన్.. రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్‌ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

    యుక్రెయిన్‌లోని తెలుగు విద్యార్థుల క్షేమం కోసం రాష్ట్ర స్థాయిలో ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను ఈ భేటీలో అధికారులు వివరించారు. కలెక్టర్ల స్థాయిలో కాల్‌సెంటర్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

    రాష్ట్రానికి చెందిన ప్రతి ఒక్కరితో కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకోవాలని.. వారి యోగక్షేమాలను కనుక్కుంటూ వారి భద్రతకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

    కేంద్ర ప్రభుత్వాధికారులకు అవసరమైన సమాచారాన్ని అందించాలని, యుక్రెయిన్‌లో ఉన్న తెలుగు వారి నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా దాన్ని విదేశాంగశాఖ అధికారులకు చేరవేయాలని చెప్పారు.

    అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా తరలింపులో రాష్ట్రం నుంచి తగిన సహకారం అందించాలని ఆదేశించారు.

  19. రాత్రంతా అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో గడిపిన యుక్రెయిన్ ప్రజలు

    యుక్రెయిన్ సంక్షోభం

    ఫొటో సోర్స్, EPA

    రష్యా సైనిక దాడుల నుంచి తప్పించుకోవటానికి యుక్రెయిన్ ప్రజలు గురువారం రాత్రి కూడా భూగర్భ మెట్రో స్టేషన్లలోనే గడిపారు.

    కీవ్, ఖార్కీవ్ నగరాల్లో.. పసివారు, వయోవృద్ధులతో సహా కుటుంబాలకు కుటుంబాలు రాత్రంతా మెట్రో స్టేషన్లలో తలదాచుకున్న దృశ్యాలు కనిపించాయి.

    చాలా మంది దుప్పట్లు కప్పుకుని, చుట్టూ బ్యాగులు పెట్టుకుని ఒకే చోట కూర్చున్నారు.

    యుక్రెయిన్ సంక్షోభం

    ఫొటో సోర్స్, EPA

    యుక్రెయిన్‌లో గురువారం రాత్రి కర్ఫ్యూ విధించారు. మెట్రో స్టేషన్లను బాంబు షెల్టర్లుగా ఉపయోగించుకోవటానికి తెరిచే ఉంచారు.

    మరోవైపు పొరుగు దేశాల్లో రక్షణ పొందటానికి యుక్రెయిన్ ప్రజలు వేలాదిగా ఇళ్లు వదిలి వెళ్లారు. లక్ష మందికి పైగా అలా వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి శరణార్థుల హై కమిషనర్ అంచనా వేసింది.

    యుక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న పోలండ్.. యుద్ధ శరణార్థుల కోసం సరిహద్దు వెంట ఆహ్వాన కేంద్రాలను ఏర్పాటు చేసింది.

    యుక్రెయిన్ సంక్షోభం

    ఫొటో సోర్స్, EPA

  20. యుక్రెయిన్, రష్యా సైనిక బలగాల మధ్య ఎక్కడెక్కడ పోరు జరుగుతోందంటే...

    యుక్రెయిన్, రష్యా సైనిక బలగాల మధ్య యుద్ధం

    రష్యా బలగాలు ముందుకు సాగుతుండటంతో యుక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌లో పోరు తీవ్రమైనట్లు కనిపిస్తోంది. నగరం లోపల, నగరం చుట్టూ శుక్రవారం ఉదయం నుంచి పేలుళ్లు, తుపాకీ కాల్పులు, క్షిపణి దాడుల శబ్దాలు వినిపిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

    కీవ్ నగరంలోని డార్నిట్స్కీ జిల్లాలో ఒక రష్యా విమానాన్ని కూల్చివేసినట్లు యుక్రెయిన్ అంతర్గత మంత్రి ఒకరు చెప్పారు. అయితే ఈ వార్తలను ఎవరూ ధృవీకరించలేదు.

    కీవ్ శివార్లలోని ఒక వైమానిక స్థావరం వద్ద కూడా పోరు ముదురుతోంది. రష్యా బలగాలు ఆ స్థావరాన్ని చేజిక్కించుకున్నట్లయితే ఆ సైన్యం నగరంలోకి ప్రవేశించటానికి అది మార్గంకావచ్చు.

    రష్యా బలగాలు కీవ్ వెలుపలున్న ఈ ప్రాంతంలోకి శుక్రవారం నాడు ప్రవేశించవచ్చునని యుక్రెయిన్ ఉప రక్షణ మంత్రి చెప్తుననారు.

    యుక్రెయిన్ ఉత్తర ప్రాంతంలోని చెర్నోబిల్ న్యూక్లియర్ కాంప్లెక్స్‌ను రష్యా బలగాలు స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. బెలారుస్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం కీవ్ నగరానికి కేవలం 93 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ యుక్రెయిన్ సైనికులను రష్యా సైన్యం బందీలుగా పట్టుకున్నట్లు అమెరికా చెప్తోంది.

    రష్యా దండయాత్ర మొదలైనప్పటి నుంచీ రష్యా బలగాలను మూడు యుద్ధ రంగాల్లో – ఉత్తరాన, దక్షిణాన, తూర్పున - ఎదుర్కొంటోంది యుక్రెయిన్. ఆ మూడు చోట్లా భీకర పోరాటం సాగుతోంది.