కరోనావైరస్: తెలంగాణలో మరో ఇద్దరి మృతి, 872కి పెరిగిన పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,656కి పెరిగింది. ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన పడి దేశంలో 559 మంది మరణించారు. తెలంగాణలో సోమవారం కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 872కి, మృతుల సంఖ్య 23కి చేరింది.

లైవ్ కవరేజీ

  1. ప్రపంచవ్యాప్తంగా 1,66,794.. భారత్‌లో 559, తెలంగాణలో 23.. ఏపీలో 20 మరణాలు

    ప్రపంచవ్యాప్తంగా 24,32,092 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి. 1,66,794 మంది మృతి చెందారు.

    అమెరికాలో అత్యధికంగా 41,155 మంది మరణించారు.

    ఇటలీలో 23,660 మంది, స్పెయిన్‌లో 20,852 మంది మరణించారు.

    ఫ్రాన్స్‌లో 19,718, యూకేలో 16,509 మంది మరణించారు.

    * భారత్‌లో 17,656 పాజిటివ్ కేసులు, 559 మరణాలు నమోదయ్యాయి.

    * తెలంగాణలో సోమవారం ఇద్దరు మృతి చెందడంతో మరణాల సంఖ్య 23కి పెరిగింది.. పాజిటివ్ కేసుల సంఖ్య 872కి చేరింది.

    * ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది మరణించగా మొత్తం కేసులు 722.

  2. అస్సాంలో పోలీసుల బిహూ నృత్యం

    అస్సాంలోని నొగాఁవ్‌‌ ఎస్పీ కార్యాలయంలో పోలీసు సిబ్బంది స్టే హోం స్టే సేఫ్ అంటూ బిహూ నృత్యం చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  3. తెలంగాణలో మరో ఇద్దరి మృతి.. 23కి పెరిగిన మరణాలు.. 872కి పెరిగిన కేసులు

    తెలంగాణలో సోమవారం కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 872కి, మృతుల సంఖ్య 23కి పెరిగింది.

    ఇప్పటివరకు రాష్ట్రంలో 186 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 663 మంది చికిత్స పొందుతున్నారు.

    ఆదివారం నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 12, మేడ్చల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.

    తెలంగాణలో కరోనా కేసులు

    ఫొటో సోర్స్, Telangana govt

  4. కోవిడ్-19 నుంచి బయటపడ్డ మణిపుర్.. లాక్‌డౌన్ సడలింపు దిశగా అడుగులు

    మణిపుర్ కోవిడ్-19 ఫ్రీ స్టేట్‌గా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు.

    ప్రస్తుతం రాష్ట్రంలో కేసులేవీ లేకపోవడంతో లాక్‌డౌన్ క్రమంగా సడలించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

    గ్రామీణ ప్రాంతాల్లో సడలిస్తామని.. రాజధాని ఇంఫాల్‌లో లాక్‌డౌన్ కొనసాగుతుందని చెప్పారు.

    పట్టణ ప్రాంతాల్లో నిత్యవసరాల దుకాణాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెరిచి ఉంటాయన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  5. భారత్‌లో 17,656 పాజిటివ్ కేసులు.. 559 మరణాలు

    భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,656కి పెరిగింది.

    ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 559 మంది మరణించారు.

    2,841 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయ్యారు.

    ప్రస్తుతం 14,255 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మహారాష్ట్రలో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది.

    ఆ రాష్ట్రంలో 4,483 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

    మహారాష్ట్రలో అత్యధికంగా 223 మంది మరణించగా మధ్యప్రదేశ్‌లో 74, గుజరాత్‌లో 67, దిల్లీలో 45, తెలంగాణలో 21, ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది మరణించారు.

    కరోనా కేసుల వివరాలు

    ఫొటో సోర్స్, www.mohfw.gov.in/

  6. బ్రిటన్‌లో 70 మంది హెల్త్‌కేర్ సిబ్బంది మృతి

    బ్రిటన్‌లో కరోనావైరస్ ప్రబలినప్పటి నుంచి 70 మందికిపై హెల్త్ కేర్ వర్కర్లు దీనిబారిన పడి మరణించినట్లు బీబీసీ విశ్లేషణ సూచిస్తోంది.

    హెల్త్ కేర్ సిబ్బందికి రక్షణ గౌన్లు సరఫరా చేయడం కష్టంగా ఉందని.. ప్రపంచవ్యాప్తంగా వీటికి కొరత ఉండడమే కారణమని బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

    టర్కీ నుంచి త్వరలో ఇవి బ్రిటన్ చేరుకుంటాయని భావిస్తున్నారు. టర్కీ సహా పలు ఇతర దేశాల నుంచి వీటిని తెప్పిస్తున్నట్లు ప్రధానమంత్రి అధికార ప్రతినిధి చెప్పారు.

    హెల్త్ కేర్ సిబ్బంది

    ఫొటో సోర్స్, Getty Images

  7. మహారాష్ట్రలో 4,483 పాజిటివ్ కేసులు

    మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.

    సోమవారం ఉదయం 11 గంటల వరకు కొత్తగా 283 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపె తెలిపారు.

    దీంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 4,483కి పెరిగింది.

    కొత్తగా నమోదైన 283 కేసుల్లో ఒక్క ముంబయిలోనే 187 కేసులున్నాయని చెప్పారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  8. భారీ సంఖ్యలో మాత్రలు, గోధుమలను సాయం చేసిన భారత్‌కు ధన్యవాదాలు: అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ

    5 లక్షల హైడ్రాక్సీ క్లోరోక్విన్, లక్ష పారాసిటమాల్ మాత్రలను, 75 వేల టన్నుల గోధుమలను తమ దేశానికి అందిస్తున్నందుకు భారత ప్రధాని మోదీకి, భారత ప్రజలకు ధన్యవాదాలు అంటూ అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ట్వీట్ చేశారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  9. సత్తెనపల్లి పట్టణ ఎస్ఐ సస్పెన్షన్

    గుంటూరు రూరల్ జిల్లాలో పోలీసులు కొట్టడం వల్ల షేక్ గౌస్ అనే యువకుడు మరణించారన్న ఆరోపణల నేపథ్యంలో సత్తెనపల్లి పట్టణ ఎస్ఐని సస్పెండ్ చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు తెలిపారు.

    ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు. మృతుడు షేక్ గౌస్ టింబర్ డిపో నిర్వహిస్తారని.. ఆయనకు హృద్రోగ సమస్య ఉండడంతో కొంతకాలంగా విజయవాడ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారని.. ఈ సంఘటనపై గుంటూరు రూరల్ ఎస్పి సత్తెనపల్లి వెళ్లి విచారణ చేపట్టారని.. ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు.

  10. కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య తగ్గించిన చైనా

    తమ దేశంలో కరోనా మరణాల సంఖ్యను ఇటీవలే సవరించిన చైనా తాజాగా కోలుకున్నవారి సంఖ్యనూ సవరించింది.

    ముఖ్యంగా వుహాన్ నగరంలో కరోనావైరస్ బారినపడి కోలుకున్నవారి సంఖ్యను తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్యలోనూ తగ్గుదల నమోదైంది.

    శుక్రవారం చేసిన ప్రకటనలో కోలుకున్నవారి సంఖ్య 47,300గా చెప్పగా ఇప్పుడా సంఖ్యను 46,359కి తగ్గించారు.

    ఇంతకముందు దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 77,944 ఉండగా తాజా సవరణతో అది 77,084కి తగ్గింది.

    గత శుక్రవారం వుహాన్ మున్సిపల్ ప్రభుత్వం మృతుల సంఖ్యను 1290 పెంచిన విషయం తెలిసిందే.

    వుహాన్

    ఫొటో సోర్స్, Getty Images

  11. కోవిడ్ రహిత రాష్ట్రంగా గోవా.. 18 రాష్ట్రాల్లో కేసులు రెట్టింపవుతున్న వేగం జాతీయ సగటు కంటే తక్కువే: కేంద్రం

    గోవా రాష్ట్రం ప్రస్తుతం కోవిడ్ రహిత రాష్ట్రంగా మారిందని.. పుదుచ్చేరిలోని మాహె, కర్ణాటకలోని కొడగు, పౌరీ.. ఉత్తరాఖండ్‌లోని గార్వాల్ జిల్లాలో గత 28 రోజులుగా కొత్త కేసుల్లేవిన.. అలాగే దేశవ్యాప్తంగా గత 14 రోజులుగా కేసుల్లేని జిల్లాల సంఖ్య 59కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెప్పారు.

    శనివారం నుంచి ఇప్పటివరకు కొత్తగా 1553 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. దీంతో మొత్తం కేసులు 17,265కి పెరిగాయని.. గత 24 గంటల్లో 36 మంది చనిపోయారన్నారు.

    లాక్‌డౌన్ అమలు చేయడానికి ముందు భారత్‌లో కరోనా కేసులు సగటున 3.4 రోజులకు రెట్టింపవుతుండేవని.. లాక్‌డౌన్ తరువాత ఏప్రిల్ 19 వరకు ఉన్న డాటా ప్రకారం ఆ వేగం 7.5 రోజులకు తగ్గిందని అగర్వాల్ చెప్పారు. 18 రాష్ట్రాల్లో కేసుల రెట్టింపు రేటు ఇంతకంటే తక్కువే ఉందన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. స్పెయిన్‌లో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

    స్పెయిన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది.

    2,00,210 మందికి కరోనావైరస్ సోకినట్లు నిర్ధరణైందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

    నిన్నటి నుంచి 400కు పైగా మరణాలు నమోదయ్యాయి.

    ఇప్పటివరకు మొత్తం 20,852 మంది కరోనా కారణంగా చనిపోయారు.

    ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులున్న దేశం స్పెయినే.

    కరోనా పరీక్షలు

    ఫొటో సోర్స్, Getty Images

  13. సింగపూర్‌లో ఒక్క రోజే 1,426 కరోనా పాజిటివ్ కేసులు

    సింగపూర్‌లోనూ కరోనా పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

    ఒక్క రోజులోనే అక్కడ 1,426 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి.

    దీంతో మొత్తం కేసుల సంఖ్య 8 వేలకు పెరిగింది.

    ఆగ్నేయాసియాలో అత్యధిక కేసులున్న దేశం సింగపూరే.

    బాధితుల్లో అత్యధికులు విదేశీ కార్మికులని.. సింగపూర్ శాశ్వత నివాసులు ఇందులో 16 మందే ఉన్నారని అధికారులు చెప్పారు.

    ఇంతకుముందు కరోనాను సమర్థంగా కట్టడి చేసిందని ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకున్న సింగపూర్ ఇప్పుడు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో సతమవుతోంది.

  14. వైద్యులు, హాస్పిటళ్లపై దాడుల నిరోధక చట్టం తేకుంటే ఏప్రిల్ 23న బ్లాక్ డే: ప్రభుత్వానికి ఐఎంఏ హెచ్చరిక

    వైద్యులు, ఆసుపత్రులపై హింసాత్మక దాడుల నిరోధక చట్టాన్ని కేంద్రం అమలులోకి తేవాలని.. అలా తేని పక్షంలో ఏప్రిల్ 23ని బ్లాక్ డేగా పాటిస్తామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హెచ్చరించింది.

    ఆ రోజున దేశంలోని వైద్యులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు వస్తారని అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

    బ్లాక్ డే తరువాత కూడా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోతే ఏం చేయాలో తదుపరి నిర్ణయిస్తామని అందులో పేర్కొన్నారు.

    IMAప్రకటన

    ఫొటో సోర్స్, indian medical association

  15. ఏనుగులకు కరోనా సోకిందన్నది అవాస్తవం: ఉత్తరాఖండ్ అటవీ అధికారి

    ఉత్తరాఖండ్‌లోని రాజాజీ టైగర్ రిజర్వ్‌లోని చిల్లా రేంజ్‌లో కొన్ని ఏనుగులకు కరోనావైరస్ సోకిందంటూ వస్తున్న మీడియా అవాస్తవం, నిరాధారం అని అక్కడి ఫారెస్ట్ రేంజర్ తెలిపారు.

    చిల్లా రేంజ్‌లోని జంతువులు, అటవీ సిబ్బంది ఎవరికీ కరోనా సోకలేదని చెప్పారు. సిబ్బంది అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  16. ఏపీలో కొత్తగా 75 కేసులు.. చిత్తూరులో 25, గుంటూరులో 20

    ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 75 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేవలం మూడు జిల్లాల్లోనే వీటిలో 61 కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

    చిత్తూరులో 25, గుంటూరులో 20, కర్నూలులో 16 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

    ఇదంతా సోమవారం ఉదయం 10 గంటల వరకూ ఉన్న సమాచారం.

    కొత్త కేసులతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటివరకూ కరోనావైరస్ బారినపడ్డవారి సంఖ్య 722కు చేరుకుంది.

    వీరిలో 92 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 20 మంది మరణించారు.

    మిగతావారు చికిత్స పొందుతున్నారు.

    ఆంధ్రప్రదేశ్ కరోనా అప్‌డేట్
  17. తండ్రి అంత్యక్రియలకు యోగి ఆదిత్యనాథ్ దూరం

    ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన తండ్రి అంత్యక్రియలకు దూరంగా ఉంటున్నారు.

    లాక్‌డౌన్‌కు భంగం వాటిల్లకూడదని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

    యోగి తండ్రి సోమవారం ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. మంగళవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి

    లాక్‌డౌన్ ముగిసిన తర్వాతే ఇంట్లోవారిని యోగి పరామర్శించనున్నారు.

    ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఈ విషయాన్ని ట్విటర్‌లో తెలిపింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  18. ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలను కొట్టిపారేసిన భారత్

    మోదీ ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుందంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది.

    కరోనావైరస్ విషయంలో అనుసరిస్తున్న విధానంపై విమర్శలు రాకుండా, ప్రజల దృష్టి మరల్చేందుకు మోదీ ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుందని ఆరోపిస్తూ ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.

    జర్మనీలో నాజీలు యూదులతో వ్యవహరించినట్లుగా భారత ప్రభుత్వం తీరు ఉందని ఆయన అన్నారు. మోదీ ప్రభుత్వ హిందుత్వ జాత్యహంకార వాదానికి ఇవి మరిన్ని సాక్ష్యాలని వ్యాఖ్యానించారు.

    ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ హ్యూమన్ రైట్స్ బాడీ (ఓఐసీ) కూడా భారత్‌లో ఇస్లామోఫోబియా పెరుగుతోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

    అయితే ఇమ్రాన్ ఖాన్, ఓఐసీ ఆరోపణలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఖండించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

    ‘‘పాకిస్తాన్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. సొంత దేశంలో కరోనావైరస్‌పై పాక్ ప్రభుత్వం పోరాడలేకపోతోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా అక్కడి ప్రజల దృష్టిని మరల్చాలనుకుంటుంది. అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు’’ అని శ్రీవాస్తవ అన్నట్లు పేర్కొంది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  19. భారత్‌లో గత 24 గటంల్లో 1,553 కోవిడ్ కేసులు

    కరోనా

    ఫొటో సోర్స్, Getty Images

    గత 24 గంటల్లో భారతదేశంలో అత్యధికంగా 1,553 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయని ఏపీ వార్తా సంస్థ తెలిపింది. దేశంలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

    దీనితో ఇప్పటివరకు భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 17 వేలకు పెరిగింది. మృతుల సంఖ్య 543కు చేరుకుంది.

    భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం ఈ మొత్తం కేసులలో 2,547 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. 543 మంది చనిపోయారు. ఇంకా, 14,175 మంది యాక్టివ్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. గత 24 గంటల్లోనే 36 మంది మృతి చెందారు.

    దేశంలో కరోనావైరస్‌కు తీవ్రంగా ప్రభావితమైన మహారాష్ట్రలో 4,203 కేసులు నమోదుకాగా, 507 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 223 మంది చనిపోయారు.

    ఆ తరువాతి స్థానంలో ఉన్న దిల్లీలో 2,003 కేసులు నమోదయ్యాయి. వారిలో 72 మంది కోలుకున్నారు. 45 మంది చనిపోయారు.

    రాజస్థాన్‌లో 1,478, తమిళనాడులో 1,477 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో 14 మంది, తమిళనాడులో 15 మంది వైరస్ దెబ్బకు ప్రాణాలు విడిచారు.

    మధ్యప్రదేశ్‌లో 1,407 కేసులు నమోదయ్యాయి. 127 మంది రోగులు వ్యాధి నుంచి కోలుకున్నారు. 70 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా కోవిడ్ బాధితుల సంఖ్య వేయి దాటింది.

    దేశంలో మొదటి కోవిడ్ కేసును గుర్తించిన కేరళ రాష్ట్రంలో ఇప్పటివరకు 402 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  20. బీజింగ్‌లో తెరుచుకుంటున్న పర్యాటకం

    బీజింగ్

    ఫొటో సోర్స్, Getty Images

    రెండు నెలల లాక్‌డౌన్ తర్వాత చైనాలో తిరిగి నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.

    చైనా రాజధాని బీజింగ్‌లో పర్యాటకం మళ్లీ మొదలైంది.

    నగరంలోని 73 పర్యాటక ప్రదేశాలు తిరిగి తెరుచుకున్నట్లు అక్కడి ప్రభుత్వ మీడియా సంస్థ షిన్హువా తెలిపింది.

    ఈ 73 ప్రదేశాలు బహిరంగ ప్రాంతాలే.

    వాటి సామర్థ్యంలో 30 శాతం మేర సందర్శకులను మాత్రమే అనుమతిస్తామని బీజింగ్ పర్యాటక విభాగం తెలిపింది.

    మరోవైపు షాంఘై పట్టణంలో మే నుంచి రాత్రిపూట షాపింగ్‌లు ఊపందుకునేలా ప్రభుత్వం కార్యక్రమం చేపడుతోంది.