కరోనావైరస్ వణికిస్తున్నా, మే నెలలోనే ఎన్నికలు జరుపుతామంటున్న పోలాండ్
కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 13 లక్షలు దాటింది. ఇప్పటివరకూ 74వేల మంది దీని బారినపడి మరణించారు. 2,76,000 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు.
లైవ్ కవరేజీ
ఏపీలో మరో 10 కొత్త కరోనా పాజిటివ్ కేసులు
ఏపిలో కొత్తగా మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 314కు చేరింది
కొత్త కేసుల్లో గుంటూరు జిల్లాలో 8, నెల్లూరు, కడప జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.
మొరాకోలో మాస్కులు లేకుండా బయటికొస్తే 3 నెలల జైలు శిక్ష

ఫొటో సోర్స్, EPA
ఫొటో క్యాప్షన్, ఫేస్ ప్రొటెక్టర్ తయారు చేస్తున్న కార్మికులు దేశంలో ప్రజలు ముఖానికి మాస్కులు లేకుండా బయట తిరిగితే మూడు నెలల వరకూ జైలు శిక్ష, 126 డాలర్ల(రూ.9500) వరకూ జరిమానా విధిస్తామని మొరాకో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలనే విషయంపై సమావేశమైన ప్రభుత్వం సోమవారంకొత్త ఆదేశాలను ప్రకటించింది. ఇవి మంగళవారం నుంచి అమలవుతాయి. దేశంలో మాస్కులను సబ్సిడీ ధరకు అందిస్తున్నారు. ఒక్కో మాస్కును 0.08 సెంట్లు(రూ.6)కు అమ్ముతున్నారు.
వచ్చే వారం నుంచి రోజుకు దాదాపు 60 లక్షల మాస్కులు ఉత్పత్తి చేయడానికి మొరాకో ప్రభుత్వం ప్రణాళికలుసిద్ధం చేసింది.
ప్రస్తుతం రోజుకు 33 లక్షల మాస్కులు ఉత్పత్తి చేస్తున్నామని ఆ దేశ పారిశ్రామిక శాఖ ప్రతినిధి రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.
ఉత్తర ఆఫ్రికా దేశమైన మొరాకోలో కరోనా పాజిటివ్ కేసులసంఖ్య 1141కిచేరింది. ఇక్కడ ఇప్పటివరకూ 83 మంది చనిపోయారు.
19 మార్చి నుంచి ఇక్కడ ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించారు. ఆహారం, మందులు కొనుగోలుకు మాత్రమే ప్రజలను అనుమతిస్తున్నారు.
అనుమతులు ఉన్న వారు విధులకు వెళ్లచ్చు. ఇప్పటివరకూ లాక్‌డౌన్ నియమాలు ఉల్లంఘించిన 8600 మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది.
కరోనా వణికిస్తున్నా, మే నెలలోనే పోలాండ్ ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images
కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్నా అధ్యక్ష ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం మే నెలలో నిర్వహించేందుకు అనుకూలంగా పోలాండ్ ఎంపీలు ఓటు వేశారు.
పూర్తిగా పోస్టల్ ఓటింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు అధికార నేషనలిస్ట్ లా అండ్ జస్టిస్(పీఐఎస్) పార్టీ రెండో ప్రయత్నంలో దిగువ సభ ద్వారా చర్యలు తీసుకోగలిగింది.
ఎంపీల నిర్ణయం మళ్లీ ఎన్నిక కావాలని చూస్తున్న అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా ఆశలను నిజం చేస్తుందేమో అని ప్రతిపక్షాలు ఆందోళనలో ఉన్నాయి.
సోమవారం నాటికి పోలాండ్‌లో 107 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4413కు చేరింది.
దుడా నాయకత్వంలో పోలాండ్‌లో న్యాయవ్యవస్థ, మీడియా సహా సమాజంలో ఎన్నో వివాదాస్పద మార్పులు తీసుకొచ్చారు.
ప్రస్తుత అధ్యక్షుడికి మద్దతు ఇస్తున్న పీఐఎస్ ఈ ఎన్నికల ద్వారా ఆయన మళ్లీ విజయం సాధించేలా చూస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
కానీ పీఐఎస్ ఆ విమర్శలను కొట్టిపారేస్తోంది. ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆసరాగా నిలవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెబుతోంది.
హైదరాబాద్‌లో డ్రోన్లతో లాక్‌డౌన్ పర్యవేక్షణ

హైదరాబాద్‌లో పోలీసులు డ్రోన్ టెక్నాలజీ ద్వారా లాక్‌డౌన్‌ను పర్యవేక్షించనున్నారు.
రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఈ పర్యవేక్షణకు ఉపయోగించే డ్రోన్లను తన కార్యాలయంలో ప్రారంభించారు.
మొదట పహాడీ షరీఫ్, మౌలాలీ ప్రాంతాల్లో వీటిని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. తర్వాత బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఉపయోగించారు.
ఈ డ్రోన్ల సాయంతో లాక్‌డౌన్ ప్రాంతాలను పరిశీలిస్తూ, ప్రజలు ఎక్కువగా గుమిగూడిన ప్రాంతాలను, జనం ఎక్కువగా తిరుగుతున్న ప్రదేశాలను గుర్తిస్తారు.
పోలీసులు ఉపయోగించే ఈ డ్రోన్లలో సర్వేలెన్స్ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ పేలోడ్స్, స్కై స్పీకర్లు కూడా అమర్చారు.
వీటి ద్వారా పోలీసులు ప్రజలకు వినిపించేలా హెచ్చరికలు, ప్రకటనలు కూడా చేయవచ్చు.
ఈ డ్రోన్లతో పర్యవేక్షించడం ద్వారా సిబ్బందిని ఎక్కడెక్కడ మోహరించాలో తెలుసుకోడానికి, కరోనా వ్యాప్తిని అడ్డుకోడానికి మరింత మెరుగైన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు వీలవుతుంది.
ఏపీలో కరోనా తాజా గణాంకాలు
ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం కరోనా గణాంకాలను విడుదల చేసింది
రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు-304
ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినవారు-06
కరోనా మృతులు-04
ఐసీయూలో ఉన్న రోగులు-01
ఆస్పత్రిలో ఆరోగ్య పరిస్థిత నిలకడగా ఉన్నవారు - 292
బ్రిటన్ ప్రధాని కుటుంబానికి రాణి సందేశం
ప్రధాని బోరిస్ జాన్సన్ సహచరి కారే సైమండ్స్, ఆయన మిగతా కుటుంబ సభ్యులకు రాణి సందేశం పంపారు.
ఆ సందేశంలో "మా ఆలోచనలు ఎప్పుడూ మీతోనే ఉంటాయి, ప్రధాని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం" అని రాణి, రాచ కుటుంబం చెప్పినట్లు బకింగ్‌హామ్ పాలెస్ వర్గాలు తెలిపాయి.
ఐసీయూలో చికిత్స పొందుతున్న ప్రధాని ఆరోగ్యం గురించి రాణికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత్‌లో గత 24 గంటల్లో 508 కేసులు నమోదు
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
భారత్‌లో గత 24 గంటల్లో మరో 508 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది
వీటితో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4789కి చేరింది.
వీరిలో 4312 యాక్టివ్ కేసులు, 353 మంది డిశ్చార్జ్/వలస వెళ్లిన వారు, 124 మంది మృతులు కూడా ఉన్నారు.
ముంబయిలో ఈరోజు 100 కొత్త కరోనా పాజిటివ్ కేసులు, ఐదు మరణాలు నమోదయ్యాయి. దీంతో ముంబయిలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 590కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 40కి చేరాయి అని బీఎంసీ చెప్పింది.
ఇంగ్లండ్‌లో మరో 758 మంది కరోనా రోగుల మృతి
ఇంగ్లండ్‌లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 758 మంజి కరోనా రోగులు మృతిచెందారని ఎన్‌హెచ్ఎస్ చెప్పింది.
దీంతో బ్రిటన్‌లో కరోనావైరస్‌తో ఆస్పత్రుల్లో చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 5655కు చేరింది.
సోమవారం ఇదే సమయానికి దేశంలో మృతుల సంఖ్య 4897కు చేరింది.
శ్వాస అందించే పరికరం ఉత్పత్తి ప్రారంభించిన ఫార్ములా 1 టీమ్

ఫొటో సోర్స్, James Tye / UCL
యూనివర్సిటీ కాలేజ్ లండన్ ఇంజనీర్లు, యూసీఎల్‌హెచ్ వైద్యులతో కలిసి తమ ఎఫ్1 బృందం రూపొందించిన శ్వాస అందించే పరికరం ఉత్పత్తిని మెర్సిడెస్-ఏఎంజీ హెచ్‌పీపీ ప్రారంభించింది.
ఈ ‘కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెజర్’(సీపీఏపీ) పరికరాన్ని వెంటిలేటర్ ఉపయోగించకుండానే రోగుల ఊపిరితిత్తులకు ఆక్సిజన్ అందించడానికి ఉపయోగిస్తారు.
సీపీఏపీ పరికరాలను ఇప్పటికే బ్రిటన్‌లోని ఆస్పత్రుల్లో ఉపయోగిస్తున్నారు. కానీ వీటి సరఫరా తక్కువగా ఉంది.
కంపెనీ సోమవారం దాదాపు 600 సీపీఏపీ పరికరాలను ఉత్పత్తి చేసింది. వీటిని రోజుకు వెయ్యి తయారు చేయగలమని భావిస్తోంది.
బ్రిటన్ ప్రభుత్వం మొత్తం 11 వేల శ్వాస పరికరాలకు ఆర్డర్ ఇచ్చింది. వాటిని సాధారణంగా ఫార్ములా 1 పిస్టన్స్, టర్బో చార్జర్స్ తయారు చేసే మెషిన్ల మీద తయారు చేస్తున్నారు.
స్థిరంగా బ్రిటన్ ప్రధాని ఆరోగ్య పరిస్థితి
కరోనావైరస్ లక్షణాలు తీవ్రం కావడంతో రాత్రి ఐసీయూలో ఉన్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయన ప్రస్తుతం బాగున్నారని ప్రధాని కార్యాలయం చెప్పింది.
ఆయన ‘స్టాండర్డ్’ ఆక్సిజన్ చికిత్స తీసుకుంటున్నారని. ఎలాంటి పరికరాల అవసరం లేకుండానే శ్వాస తీసుకోగలుగుతున్నారని ప్రతినిధి చెప్పారు.
ఆయనకు మెకానికల్ వెంటిలేషన్ లేదా బయట నుంచి శ్వాస తీసుకోడానికి ఇచ్చే సాయం అవసరం రాలేదు. ప్రధానికి న్యుమోనియా కూడా నిర్ధారణ కాలేదు అని ఆయన వివరించారు.
అంటార్కిటికా నుంచి స్వదేశం చేరుకోనున్న బ్రిటన్ పరిశోధకులు

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ వల్ల రవాణా సమస్యలు ఉన్నప్పటికీ అంటార్కిటికాలో పరిశోధనలు చేస్తున్న బ్రిటన్ శాస్త్రవేత్తలను క్షేమంగా స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.
దక్షిణార్థ గోళంలో వేసవి చివరి నాటికి ఈ పరిశోధకులలో కోర్ టీమ్ మినహా మిగతా బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే సిబ్బందిని అక్కడి నుంచి తీసుకురానున్నారు.
కానీ, వారు ప్రయాణించగలిగే, మార్గాలు అన్నీ లాక్‌డౌన్ వల్ల మూసివేసి ఉన్నాయి. దీంతో, శాస్త్రవేత్తలను ఫాక్‌లాండ్ వరకూ పడవల్లో తీసుకురానున్నారు. తర్వాత అక్కడి నుంచి వారిని రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానాల సాయంతో బ్రిటన్ తీసుకువస్తారు.
ఈ పరిశోధన సంస్థ ప్రస్తుతం ఫాక్‌లాండ్ దీవుల రాజధాని అయిన స్టాన్లీ రేవు దగ్గర ఉన్న ఒక క్రూయిస్ నౌకలో ఉంది. అది ఇప్పుడు వారికి తాత్కాలిక ఆశ్రయంగా ఉంది.
'ఫార్వార్డ్ మెసేజి'లపై వాట్సాప్ కఠిన ఆంక్షలు

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తిని అడ్డుకోడానికి వాట్సాప్ ఫార్వార్డ్ మెసేజిలపై కఠిన ఆంక్షలు విధించింది.
‘తరచూ ఫార్వార్డ్’ చేసే సందేశాలను ఇవాళ్టి నుంచి ఒకసారి ఒకరికి మాత్రమే పంపించగలిగేలా మార్పులు తీసుకొచ్చింది.
అప్పటికే ఐదు సార్లు ఫార్వార్డ్ అయిన మెసేజిలను వాట్సాప్ తరచూ పంపే సందేశాలుగా గుర్తిస్తుంది. అవి ఒరిజినల్ కాదని చెప్పడానికి, వాటిపై రెండు బాణాల గుర్తులను చూపించనుంది.
ఫార్వార్డ్ మెసేజిలపై వాట్సాప్ ఆంక్షలు విధించడం ఇది మొదటిసారి కాదు. 2018లో వాట్సాప్‌లో తప్పుడు సమాచారం ఫార్వార్డ్ చేయడం వల్ల మూకదాడులు జరిగినపుడు కూడా భారత్‌లో ఒక సందేశాన్ని ఒకేసారి ఐదు గ్రూపులకే పంపించేలా పరిమితం చేసింది.
ఆరు నెలల తర్వాత 2019 జనవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా అదే విధానాన్ని అమలు చేసింది.
వైద్య సిబ్బంది ‘నిస్వార్థ సేవల’కు రాణి ధన్యవాదాలు

ఫొటో సోర్స్, Getty Images
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రాణి విడుదల చేసిన తాజా ప్రకటనలో దేశంలో కరోనా మహమ్మారితో పోరాడుతున్న వైద్య సిబ్బందికి, నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు.
ఆదివారం టీవీలోఅరుదైన ప్రసంగం ఇచ్చిన రాణి కరోనాతో పోరాటంలో వైద్య సిబ్బంది అంకితభావం, నిస్వార్థ సేవలను ప్రశంసించారు.
కామన్‌వెల్త్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులును ఉద్దేశించి చేసిన ప్రసంగంలో “కామన్ వెల్త్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల సంక్షేమం, ఆరోగ్యం మెరుగు పడడానికి, వారిని కాపాడ్డానికి చాలా కీలక పాత్ర పోషిస్తున్నందుకు,శ్రద్ధ, నిస్వార్థ నిబద్ధత చూపిస్తున్నందుకు నేను వైద్య నిపుణులు అందరికీ ధన్యవాదాలు చెబుతున్నాను” అని సందేశం ఇచ్చారు.
“పరీక్షాసమయంలో అత్యుత్తమ మానవ స్ఫూర్తి తెరపైకి రావడం మనం తరచూ చూస్తున్నాం. ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో, ఎంతోమంది నర్సులు, వైద్య సిబ్బంది అంకితభావంతో సేవలు అందించడం దానికి ఒక ఉదాహరణ. నేను, నా కుటుంబం వారికి మా ప్రశంసలు, శుభాకాంక్షలను పంపుతున్నాం” అన్నారు.
సెల్ఫ్ ఐసొలేషన్‌లో బ్రిటన్ సీనియర్ మంత్రి

ఫొటో సోర్స్, PA Media
బ్రిటన్ కేబినెట్ మంత్రి మైకేల్ గోవ్ తన కుటుంబంలోని ఒక వ్యక్తికి కరోనావైరస్ లక్షణాలు కనిపించడంతో, తన ఇంట్లో ఐసొలేషన్‌లో ఉంటున్నారు.
“ప్రధాన మంత్రి అనారోగ్యానికి గురైన సమయంలో కాబినెట్ కార్యాలయం చాలా కీలకం కావడం వల్ల ఆయన డిజిటల్‌గా పనిచేస్తుంటారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు” అని బీబీసీ న్యూస్‌సైట్ పాలసీ ఎడిటర్ లూయిస్ గుడాల్ అన్నారు.
“ఈ పరిస్థితుల్లో గోవ్ చాలా కీలకమైన వ్యక్తి. ఇది పరిస్థితులను మరింత కఠినంగా మారుస్తుంది” అన్నారు.
ఇంగ్లండ్, వేల్స్ జైళ్లలో మరో నలుగురు ఖైదీల మృతి
ఇంగ్లండ్, వేల్స్ జైళ్లలో కరోనా సోకి మరణించిన మొత్తం ఖైదీల సంఖ్య 9కి చేరింది.
వీరిలో కేంబ్రిడ్జ్ షైర్ లిటిల్ హే జైలులోని ముగ్గురు ఖైదీలు, డర్హమ్‌లోని, లోన్యూటన్ జైలులోని మహిళా ఖైదీ కూడా ఉన్నారు.
ఇంగ్లండ్, వేల్స్ లోని 38 జైళ్లలో మొత్తం 107 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ వచ్చింది. వైరస్ లక్షణాలు కనిపించడంతో 1300 మంది ఖైదీలు ఒంటరిగా ఉంటున్నారు.
7200 మంది జైలు సిబ్బంది కోవిడ్-19 కారణాలతో గైర్హాజరు అయ్యారు. వారిలో 19 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
జైళ్లలో వైరస్ వ్యాపించకుండా, ఖైదీలను విడిగా ఒక్కో సెల్‌లో ఉంచడానికి వీలుగా 4 వేల మంది ఖైదీలను ముందే విడుదల చేస్తామని ప్రభుత్వం ఈ వారాతంలో ప్రకటించింది.
స్పెయిన్‌లో మళ్లీ పెరిగిన రోజువారీ మరణాలు

ఫొటో సోర్స్, Getty Images
స్పెయిన్‌లో గత 24 గంటల్లో 743 మంది కోవిడ్-19 బాధితులు మృతి చెందారు.
వీటితో కలిపి దేశంలో మొత్తం మరణాల సంఖ్య 13,798కి చేరిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
గత నాలుగు రోజులపాటు స్పెయిన్‌లో రోజువారీ మరణాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ మంగళవారం మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు అధికారులు చెప్పారు.
స్పెయిన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,40,500కి చేరింది. అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసులు ఉన్న దేశం ఇదే.
అత్యవసర స్థితిని ప్రకటించిన జపాన్ ప్రధాని

ఫొటో సోర్స్, Getty Images
జపాన్ ప్రధాని షింజో అబే కరోనావైరస్ వ్యాపించకుండా రాజధాని టోక్యో, పోర్ట్ సిటీ ఒసాకా, మరో ఐదు రాష్ట్రాల్లో అత్యవసర స్థితి ప్రకటించారు.
ఇది బుధవారం నుంచి అమలులోకి వస్తుంది. దాదాపు నెల రోజులపాటు కొనసాగుతుంది అని జపాన్ టైమ్స్ చెప్పింది.
ఆయా రాష్ట్రాల గవర్నర్లు స్కూళ్లు, వ్యాపారాలు మూసేయవచ్చు, కానీ పౌరులు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించే అధేశించే అధికారాలు ఉండవు.
కానీ, కొంతమంది వైద్య నిపుణులు ఇది చాలా ఆలస్యంగా తీసుకున్న నిర్ణయంగా చెబుతున్నారు.
లాక్‌డౌన్ పొడిగించాలంటున్న రాష్ట్రాలు
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను పొడిగించాలని కోరుతున్నారని, కేంద్రం దానికి సంబంధించి యోచిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయని ఏఎన్ఐ తెలిపింది.
రష్యాలో వెయ్యికి పైగా కొత్త కేసుల నమోదు

ఫొటో సోర్స్, Getty Images
రష్యాలో ఒకే రోజు వెయ్యికి పైగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7497కు చేరిందని దేశ క్రైసిస్ రెస్పాన్స్ సెంటర్ చెప్పింది.
రష్యాలో కొత్తగా 1154 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 58కి చేరింది.
కరోనా మహమ్మారికి రాజధాని మాస్కోలో తీవ్రంగా ఉంది. నగరంలో పాక్షిక లాక్‌డౌన్ విధించారు. నిత్యావసరాలు, మందులు లాంటివి కొనుగోలు చేయడానికి మాత్రమే ప్రజలను బయటికి అనుమతిస్తున్నారు.
