You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తారకరత్న: బెంగళూరు ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స, విషమంగానే ఆరోగ్యం

వివిధ విభాగాలకు చెందిన నిపుణుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స జరుగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.తారకరత్నకు అందుతున్న చికిత్సపై డాక్టర్ల తో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు అనంతరం తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, తండ్రి మోహన కృష్ణలతో కూడా మాట్లాడారు

లైవ్ కవరేజీ

  1. నందమూరి తారకరత్న: హృదయాలయ ఆసుపత్రికి వెళ్లనున్న జూ.ఎన్టీఆర్, కల్యాణ్ రామ్

    నారా లోకేశ్ పాదయాత్రలో తీవ్రంగా అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను ఆదివారం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ పరామర్శించనున్నారు.

    ఈ మేరకు ఈరోజు ఉదయం వారిద్దరూ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి వెళ్లనున్నారు.

    హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు వెళ్లనున్నట్లు సమాచారం.

    నారాయణ హృదయాలయ ఆసుపత్రికి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వస్తుండటంతో టీడీపీ శ్రేణులు,అభిమానులు భారీగా తరలి రానున్నారు.

  2. ఒడిశా: కాల్పులకు గురైన ఆరోగ్య శాఖ మంత్రి నవ్ కిశోర్ దాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

  3. ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులను జగన్ సర్కారు ‘కేర్’ చేయటం లేదా?

  4. లైవ్ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్ ఇంతటితో సమాప్తం. మళ్లీ రేపు ఉదయం కలుద్దాం.

  5. నారాయణ హృదయాలయలో చంద్రబాబు - తారకరత్నకు అందుతున్న చికిత్సపై వైద్యులతో మాట్లాడిన టీడీపీ అధినేత

    బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డాక్లర్లను అడిగి తెలుసుకున్నారు.

    తారకరత్నకు అందుతున్న చికిత్సపై డాక్టర్ల తో మాట్లాడిన టీడీపీ అధినేత అనంతరం తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, తండ్రి మోహన కృష్ణలతో పాటు ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

    అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తారకరత్నకు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని, ఆయన కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పారు.

    వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తూ అన్నిరకాలుగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

  6. సరోగసీ: సెలబ్రిటీలు తమకోసం పిల్లలను కనే సరోగేట్ మహిళలతో ఎలా ప్రవర్తిస్తారు?

  7. 200 ఏళ్ల నాటి హెరిటేజ్ బిల్డింగ్ పునరుద్ధరణ, ఈ భవనం మీకు తెలుసా?

  8. గ్రీన్ కామెట్ తోకచుక్క భూమికి దగ్గరగా ఎప్పుడు వస్తుంది, దాన్ని ఎలా చూడాలి?

  9. రాష్ట్రపతి భవన్ గార్డెన్స్‌ పేరు ‘అమృత్ ఉద్యాన్’గా మార్పు

    ‘అజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకలు నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఉద్యానాలకు ‘అమృత్ ఉద్యాన్’ అని పేరు పెట్టారు.

    ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయించినట్లు రాష్ట్రపతి డిప్యూటీ ప్రెస్ సెక్యూరిటీ నవిక గుప్తా వెల్లడించారు.

  10. బంగారంతో చేసిన గుండె, నాలుక...సున్తీ చేయని పురుషాంగం పక్కనే ఓ వస్తువు, మూలన పడేసిన మమ్మీలో కోట్ల విలువైన సంపద

  11. ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం

    కార్డియాక్ అరెస్ట్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన సినీనటుడు తారకరత్న ఆరోగ్యం ఇప్పటికీ విషమంగానే ఉందని ఆయనకు చికిత్స చేస్తున్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వెల్లడించింది.

    తారకరత్న తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

    వివిధ వైద్య విభాగాలకు చెందిన నిపుణులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, ఇప్పటికీ ఆయన లైఫ్ సపోర్ట్ మీదనే ఉన్నారని పేర్కొంది.

    ‘‘జనవరి 27న తారక రత్నను కార్డియాక్ అరెస్టుతో కుప్పం లోని ఒక ఆసుపత్రిలో చేర్చారు. 45 నిమిషాల పాటూ ప్రాథమిక చికిత్స, పేషెంట్ ని రివైవ్ చేసే ప్రక్రియ చేశారు (రిసస్టియేషన్). అయినప్పటికీ తారక రత్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన్ను కాస్త పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. బెంగళూరు నుంచి కుప్పం వెళ్లిన నారాయణ హృదయాలయ వైద్యులు, మంచి చికిత్స కోసం, తారకరత్నను బెంగళూరు తరలించాలని సూచించారు’’ అని పేర్కొన్నారు వైద్యులు.

    మరికొన్ని రోజులపాటు నిపుణుల పర్యవేక్షణలో ఆయన ఈ ట్రీట్‌మెంట్ కొనసాగించాల్సి ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

  12. ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతిపై కేటీఆర్ దిగ్భ్రాంతి

    నల్లగొండలోని ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటం చేసిన ఫ్లోరోసిస్ బాధితుడు అంశాల స్వామి మృతి చెందారు.

    మర్రిగూడ మండలం శివన్నగూడెంలోని తన నివాసంలో ఆయన మరణించారు.

    వీల్ చెయిర్ పైనుంచి పడిపోవడం వల్ల ఆయన మృతి చెందినట్లు వార్తా పత్రిక తెలంగాణ టుడే పేర్కొంది.

    శుక్రవారం సాయంత్రం వీల్‌చెయిర్‌పై నుంచి పడిన తర్వాత ఆయన మామూలుగానే ఉన్నారని, కానీ శనివారం ఉదయం రక్తపు వాంతులు చేసుకొని ఆయన మరణించినట్లు తెలంగాణ టుడే వెల్లడించింది.

    ఆయన మృతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ అంశాల స్వామి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

    అంశాల స్వామి ఒక యోధుడని, ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కేటీఆర్ అన్నారు. ఆయనకు తన గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంటుందని ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ఈ మేరకు అంశాల స్వామి ఇంట్లో తాను భోజనం చేస్తోన్న ఫొటోను కేటీఆర్ పంచుకున్నారు.

  13. మహారాష్ట్ర: మహిళల కోసం మహిళలే నడిపే బ్యాంక్

  14. భారత జనాభా గణనలో జాప్యం, డేటా విడుదలలో రాజకీయ జోక్యం... ఎందుకిలా?

  15. భరత్‌పూర్ డీఎస్పీ: ‘అది ఫైటర్ విమానమా? లేక సాధారణ విమానమా తెలియట్లేదు’

    రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కూడా ఒక విమానం నేలకూలింది.

    అయితే అది ఫైటర్ విమానమా? లేక సాధారణ విమానమా? అనేది సరిగ్గా తెలియట్లేదని భరత్‌పూర్ డీఎస్పీ రాజ్ అన్నారు.

    ‘‘విమానం కూలినట్లు మాకు 10-10:15 గంటల మధ్య సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లాక అది ఐఏఎఫ్‌కు చెందిన ఫైటర్ జెట్ అనుకున్నాం.

    కానీ, శిథిలాలను చూస్తే అది ఫైటర్ విమానమా? లేక సాధారణ విమానమా? అనేది తెలియట్లేదు.

    పైలట్లు అందులో నుంచి బయటకు వచ్చారా? లేదా అనేది కూడా ఇంకా తెలియదు’’ అని ఆయన వార్తా సంస్థ ఏఎన్‌ఐతో అన్నారు.

  16. నాలుగేళ్ళ పిల్లాడు ఏడు భాషల్లో అంకెల్ని లెక్కిస్తున్నాడు

  17. బ్రేకింగ్ న్యూస్, సుఖోయ్, మిరాజ్: కుప్పకూలిన యుద్ధ విమానాలు

    మధ్యప్రదేశ్‌లోని మొరేనా ప్రాంతంలో సుఖోయ్-30, మిరాజ్- 2000 విమానాలు కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.

    ఘటనా ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పింది.

    శిక్షణలో భాగంగా గ్వాలియర్ ఎయిర్‌బేస్ నుంచి ఈ విమానాలు టేకాఫ్ అయ్యాయని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించినట్లు తెలిపింది.

    గాలిలో ఈ రెండు విమానాలు ఢీకొన్నాయా? అనే అంశంపై ఐఏఎఫ్ దర్యాప్తు చేయనుంది.

    విమానాలు క్రాష్ అయిన సమయంలో సుఖోయ్ విమానంలో ఇద్దరు పైలట్లు, మిరాజ్‌లో ఒక పైలట్ ఉన్నారు.

    ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందిందని డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి.

    ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం గురించి సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరీలతో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంప్రదింపులు జరుపుతున్నారు.

  18. థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది? మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి?

  19. టైర్ నికోల్స్‌ను పోలీసులు క్రూరంగా చితకబాదుతున్న ఫుటేజీ విడుదల

    హత్యా నేరం ఆరోపణలు ఎదుర్కొంటున్న అయిదుగురు మాజీ మెంఫిస్ పోలీసులు, ఒక వాహనదారుడిని క్రూరంగా చితకబాదుతున్నట్లు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రికార్డు అయిన ఫుటేజీ ద్వారా తెలుస్తోంది.

    పోలీసులు కొడుతున్న సమయంలో అతను అమ్మా అంటూ ఏడవడం ఫుటేజీలో వినిపిస్తోంది.

    29 ఏళ్ల టైర్ నికోల్స్ అనే వ్యక్తిని పోలీసులు కొన్ని నిమిషాల పాటు కొట్టడం వీడియోలో కనిపిస్తోంది.

    అమెరికాలోని టెన్నెసీలో ఈ ఘటన జరిగింది.

    భయంకరమైన ఈ వీడియోలు తనను తీవ్రంగా బాధించాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

    నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారనే అనుమానంతో నికోల్స్ ఆపినట్లు పోలీసులు తొలుత చెప్పారు. అయితే, అతను నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు నిరూపితం కాలేదు. పోలీసులు అతన్ని దారుణంగా కొట్టిన మూడు రోజుల తర్వాత అంటే జనవరి 10వ తేదీన ఆసుపత్రిలో నికోల్స్ మరణించారు.

    నికోల్స్ నల్లజాతి వ్యక్తి. అతనిపై దాడి చేసిన అయిదుగురు పోలీసు అధికారులు కూడా నల్లజాతి వారే.

    ఈ ఘటన సంభవించిన ట్రాఫిక్ సిగ్నల్‌కు సంబంధించిన, అక్కడ జరిగిన హింసాత్మక పరిణామాలకు చెందిన నాలుగు గ్రాఫిక్ వీడియోలను మెంఫిస్ పోలీసు శాఖ విడుదల చేసింది.

  20. ముస్లిం ఫండ్ పేరుతో ప్రజల నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అబ్దుల్ రజాక్