You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ఆంధ్రప్రదేశ్: కాపులకు రిజర్వేషన్ కల్పించే అధికారం రాష్ట్రానిదే అన్న కేంద్రం

కాపుల రిజర్వేషన్లపై కేంద్రం స్పష్టతనిచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తేల్చింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి ప్రతిమా భౌమిక్ సమాధానమిచ్చారు.

లైవ్ కవరేజీ

  1. లైవ్ పేజీ అప్‌డేట్స్ సమాప్తం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ అప్‌డేట్స్‌ను ఇంతటితో ముగిస్తున్నాం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తల లైవ్ అప్‌డేట్స్‌తో రేపు ఉదయం మళ్లీ కలుద్దాం.

  2. ‘యేసు వల్లే కరోనా తగ్గింది’: తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్

    యేసు వల్లే కరోనావైరస్ వ్యాప్తి తగ్గిందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస రావు అన్నారు.

    ‘భారతదేశంలో లేదా తెలంగాణలో ఆధునిక సంస్కృతికి క్రైస్తవులే వారసులు. లార్డ్ జీసస్ వల్లే కోవిడ్-19 తగ్గిందనే విషయం అందరికీ తెలుసు’ అని ఆయన మాట్లాడారు.

    క్రిస్మస్ వేడుక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

  3. చైనాలో కరోనా కేసులపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన

    చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల మీద ప్రపంచఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఆందోళన వ్యక్తం చేసింది.

    తమతో కేసుల వివరాలను పంచుకోవడంతోపాటు తాము సూచించిన అధ్యయనాలు చేపట్టాలని చైనాను కోరుతూనే ఉంటామని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ అన్నారు.

  4. కేంద్రం: కాపులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రానిదే, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    కాపుల రిజర్వేషన్లపై కేంద్రం స్పష్టతనిచ్చింది. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని తేల్చింది.

    బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖల మంత్రి ప్రతిమా భౌమిక్ సమాధానమిచ్చారు.

    ‘విద్య, ఉపాధి కోసం కొత్తగా ఎవరినైనా ఓబీసీలలో చేర్చే ప్రతిపాదనలకు కేంద్రం అనుమతి అవసరం లేదు’ అని రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

    రాజ్యాంగంలోని ఆర్టికల్ 103కి 2019లో జరిగిన సవరణ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం వరకూ ఈబీసీ రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉందని భౌమిక్ అన్నారు.

    ఆర్టికల్-342 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలకు ఈబీసీ హోదా కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తెలిపారు.

    ఆంధ్రప్రదేశ్‌లో ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ అందులో కాపులకు 5 శాతం వాటాను కల్పించేలా గతంలో చంద్రబాబు ప్రభుత్వం చట్టం చేసింది. అయితే ప్రస్తుతం అది అమలులో లేదు.

  5. కుల్‌దీప్ యాదవ్: బాగా ఆడుతున్నప్పటికీ ఈ క్రికెటర్‌కు భారత జట్టులో ఎందుకు చోటు దక్కడం లేదు?

  6. కాఫ్ సిరప్: పిల్లలకు దగ్గు మందు వాడవచ్చా? లేదా?

  7. సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలంటూ నేపాల్ సుప్రీం కోర్టు తీర్పు

    సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభ‌రాజ్‌ను విడుదల చేయాల్సిందిగా నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశించింది.

    ఇద్దరు అమెరికా టూరిస్టులను హత్య చేశారనే ఆరోపణలతో 2003 నుంచి చార్లెస్ శోభరాజ్ నేపాల్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

    ఆయనను విడుదల చేసిన 15 రోజుల్లో దేశం నుంచి పంపించాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది.

  8. మణిపూర్: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణం

    మణిపూర్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. మరొక 40 మందికి గాయాలు అయ్యాయి.

    పిక్నిక్‌కు వెళ్తున్న తరుణంలో స్కూలు బస్సుకు ప్రమాదం జరిగింది.

    చనిపోయిన వారికి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

  9. హంపి ఆలయం: రాతి స్తంభాల్లో సంగీతం ఎలా పలుకుతోంది? 500 ఏళ్ల కిందటి ఆ రహస్యం ఏమిటి?

  10. ‘భారత్‌లో మూడు బీఎఫ్-7 వేరియంట్ రకం కరోనా కేసులు గుర్తింపు’

    ఒమిక్రాన్ సబ్‌-వేరియంట్ అయిన బీఎఫ్.7కు సంబంధించి భారత్‌లో మూడు కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి.

    గుజరాత్‌లో 2, ఒడిశాలో ఒక కేసును గుర్తించారు.

    ప్రస్తుతం చైనాలో కేసులు పెరగడానికి బీఎఫ్.7 వేరియంట్ రకమే కారణం.

    ‘సెప్టెంబరు 11న అమెరికా నుంచి వచ్చిన ఒక మహిళకు అదే నెల 18న కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

    ఆమెకు సోకిన వేరియంట్ బీఎఫ్.7గా నేడు తెలిసింది. ప్రస్తుతం ఆమె కోలుకుని బాగానే ఉన్నారు’ అని వడోదర మున్సిపాల్టీ తెలిపినట్లుగా ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది.

    ‘బీఎఫ్.7, బీఎఫ్.12 వేరియంట్ కరోనావైరస్ సోకిన ఇద్దరు పేషెంట్లను జులై-నవంబరు మధ్య గుర్తించారు.

    ఇంటి వద్దే ఐసోలేషన్‌లో వారికి చికిత్స అందించారు. వారు ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నారు’ అని గుజరాత్ ఆరోగ్యశాఖ తెలిపింది.

  11. ‘అంతర్జాతీయ ప్రయాణికులకు నేటి నుంచి కోవిడ్-19 పరీక్షలు’

    ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు నేటి నుంచి విమానాశ్రయాల్లో ర్యాండమ్‌గా కోవిడ్-19 పరీక్షలు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయని వార్తా సంస్థ ఏఎన్‌ఐ వెల్లడించింది.

  12. ఎస్సై పరీక్షల్లో పోటీపడి... మెయిన్స్‌కు సిద్ధమవుతున్న తల్లీకూతుళ్లు

    ఖమ్మం జిల్లాకు చెందిన నాగమణి ప్రస్తుతం సివిల్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. తల్లి ఖాకీ డ్రెస్ చూసి పోలీస్ ఉద్యోగం మీద ఆసక్తి పెంచుకున్నారు ఆమె కూతురు త్రిలోకిని.

    కలిసి ఎస్సై పరీక్షలు రాసిన ఇద్దరూ ప్రిలిమ్స్, ఫిట్‌నెస్ పరీక్షల్లో పాసైన తర్వాత ఇప్పుడు మెయిన్స్‌కి కూడా కలిసి ప్రిపేరవుతున్నారు.

  13. ‘ఒక రాష్ట్రం సమయానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక పోతోందనే వార్తలు వస్తున్నాయి’: నిర్మల సీతారామన్

    ఒక రాష్ట్రం సమయానికి జీతాలు ఇవ్వలేక పోతుండటంతో ప్రభుత్వ ఉద్యోగులు నిరసనలకు దిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు.

    ఆ రాష్ట్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వివిధ రకాల ప్రకటనలు ఇవ్వడానికి నిధులను ఖర్చు చేస్తుండటమే ఇందుకు కారణమై ఉండొచ్చని ఆమె తెలిపారు.

    ‘ఉచితాల’ మీద పార్లమెంటులో మాట్లాడుతున్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

    ‘రాయితీలు, ఉచితాలు సందర్భానుచితంగా ఉండాలి.

    మీరు బడ్జెట్‌లో నిధులు కేటాయించగలిగి, అందుకు తగిన ఆదాయం వచ్చినప్పుడు... మీరు డబ్బులు ఇవ్వొచ్చు. దాన్ని ఎవరూ వ్యతిరేకించరు.

    విద్య, ఆరోగ్యం, రైతులకు ఇచ్చే రాయితీలు సరైనవే.

    మీరు ఎంచుకునే విధానాలు పారదర్శకంగా ఉంటే వాటి (ఉచితాల) మీద చర్చ అనేదే అవసరం లేదు. రాష్ట్రాల ఆర్థిక విధానాలు పారదర్శకంగా బాధ్యతాయుతంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం’ అని రాజ్యసభలో నిర్మల సీతారామన్ అన్నారు.

  14. ఇండియా వర్సెస్ చైనా: మరో 4 నెలల్లో జనాభాలో చైనాను అధిగమించనున్న భారత్ - అత్యధిక జనాభా వరమా? శాపమా?

  15. కల్వకుంట్ల కవిత: ‘నా నిజాయితీని కాలమే నిరూపిస్తుంది’

    దిల్లీ లిక్కర్ కేసులో తన మీద వస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవమని తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

    ‘నా మీద చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నా నిజాయితీని కాలమే నిరూపిస్తుంది.

    బీజేపీ వాళ్ల రైతు వ్యతిరేక విధానాలను, పెట్టుబడిదారుల అనుకూల పద్ధతులను బీఆర్‌ఎస్ పార్టీ చీఫ్ సీఎం కేసీఆర్ బయట పెడుతున్నందుకు రాజకీయ కక్షలో భాగంగా వారు ఇలా చేస్తున్నారు’ అని కాంగ్రెస్ నేత మాణిక్కమ్ ఠాగూర్‌‌ను ట్యాగ్ చేస్తూ కవిత ట్వీట్ చేశారు.

    దిల్లీ లిక్కర్ ‘కుంభకోణం’ కేసుకు సంబంధించి ఈడీ చార్జిషీట్‌లో కవిత పేరు ఉందనే వార్తలను ట్వీట్ చేస్తూ వీటి మీద వివరణ ఇవ్వాలంటూ మాణిక్కమ్ ఠాగూర్ కవితను ట్యాగ్ చేశారు.

  16. ‘కరోనా కథ ముగియలేదు... అప్రమత్తంగా ఉండండి’: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

    ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో దేశీయంగా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష నిర్వహించింది.

    ‘కొన్ని దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న తరుణంలో నిపుణులు, అధికారులతో సమీక్ష నిర్వహించాం.

    కోవిడ్ కథ ఇంకా ముగియలేదు. అప్రమత్తంగా ఉండి, నిఘా పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.

  17. బుర్నేషా: పుట్టుకతో ఆడవారు.. జీవితమంతా మగాళ్లు.. ఎక్కడుంటారు, ఎందుకలా మారుతారు

  18. వైఎస్ జగన్: 5 లక్షలకు పైగా ట్యాబ్‌లను పంపిణీ చేసిన ఏపీ సీఎం, వడిశెట్టి శంకర్, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    బాపట్ల జిల్లాచుండూరు మండలంయడ్లపల్లి గ్రామంలోని జడ్పీ పాఠశాలలో రాష్ర్ట వ్యాప్తంగా 8వ తరగతి చదువుతున్న 4,59,564 మంది విద్యార్థులకు, 59,176టీచర్లకు మొత్తంగా 5,18,740 ట్యాబ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.

    బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్‌తో అందించనున్న ఈ ట్యాబ్‌ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 1,466 కోట్ల ఖర్చు చేసినట్లు స్థానిక బహిరంగ సభలో సీఎం జగన్ తెలిపారు.

    2019 నుంచి పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణల హోస్ట్‌లో భాగంగా టాబ్లెట్‌లను పంపిణీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

    బుధవారం వైఎస్ జగన్ 50వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

  19. ‘ఇంటర్నెట్ లేకపోతే నేనెవరో ప్రపంచానికి తెలిసేది కాదు’

  20. మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌: పిల్లల మరణాలకు కారణమైన భారత కంపెనీపై దర్యాప్తునకు గాంబియా సిద్ధం

    తమ దేశంలో దాదాపు 70 మంది పిల్లల మరణానికి కారణమైన దగ్గు సిరప్‌ల తయారీదారు అయిన భారత కంపెనీ మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌పై విచారణకు గాంబియాలోని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది.

    కలుషిత ఔషధాలను ఎగుమతి చేసినందుకు మైడెన్ ఫార్మాస్యూటికల్స్ బాధ్యత వహించాలని పేర్కొంది.

    మైడెన్ సిరప్‌ల విక్రయాలను నిలిపివేయాలని రెగ్యులేటర్‌లకు అక్టోబర్‌లోనే డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది.

    అయితే మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఈ ఆరోపణలను ఖండించింది.

    కొన్ని వారాల దర్యాప్తు అనంతరం బాధ్యులపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గాంబియన్ పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది,

    వీటిలో దేశంలోని అన్ని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులను నిషేధించడం, సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటివి ఉన్నాయి.

    "మైడెన్ ఫార్మాస్యూటికల్స్ మందులను ఎగుమతి చేసినందుకు బాధ్యత వహించాలని అనుకుంటున్నాం" అని కమిటీ పేర్కొంది.

    "ప్రోమెథాజైన్ ఓరల్ సొల్యూషన్, కోఫెక్స్‌మలిన్ బేబీ కఫ్ సిరప్, మాకోఫ్ బేబీ కాఫ్ సిరప్, మాగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్‌లు డైథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌తో కలుషితమయ్యాయని తెలిపే రిపోర్టులు ఉన్నాయి" అని పార్లమెంటరీ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

    డైథిలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ మానవులకు విషపూరితమైనవి, వినియోగిస్తే ప్రాణాంతకం కావచ్చు.

    అయితే పిల్లల మరణాలకు కచ్చితమైన శాస్త్రీయ కారణం ఇంకా పరిశోధన దశలోనే ఉందని ప్యానెల్ తెలిపింది.

    జూలై చివరలో ఐదేళ్ల లోపు వయస్సున్న పిల్లల్లో మూత్రపిండాల సంబధిత కేసుల పెరుగుదలను గాంబియా గుర్తించింది.

    ఈ కారణంగా దాదాపు 69 మంది చిన్నారులు మరణించారని ప్రభుత్వం ఆ తర్వాత ప్రకటించింది.

    భారత మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన నాలుగు ఔషధాలు పిల్లల మరణాలకు కారణం కావొచ్చని డబ్ల్యూ‌హెచ్‌వో తెలిపింది.