You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

తొలి టీ20లో టీమ్ ఇండియాపై సౌత్ ఆఫ్రికా విజయం

తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 211 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని సాధించేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా చివరి ఓవర్లలో దూకుడుగా ఆడి విజయం సాధించింది.

లైవ్ కవరేజీ

  1. రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు, ఎలక్ట్రోరల్ కాలేజ్ అంటే ఏంటి?

  2. ధన్యవాదాలు..

    ఇక్కడితో బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ముగిస్తున్నాం.

    రష్యా-యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన అప్‌డేట్ల కోసంఈ లింకునుక్లిక్ చేయండి.

  3. నేటి ముఖ్యాంశాలు

    • రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) విడుదల చేసింది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో దిల్లీలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి షెడ్యూల్‌ను విడుదల చేశారు.
    • బిహార్‌లోని సమస్తీపుర్‌లో బిడ్డ శవాన్ని విడిపించుకోవడానికి అవసరమైన డబ్బుల కోసం తల్లిదండ్రులు ఇంటింటికి తిరిగి అడుక్కున్నారు.
    • నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ల వివాహం మహాబలిపురంలో జరిగింది.
    • ఇండిగో విమాన సిబ్బంది ఒకరు తనతో చాలా దురుసుగా, బెదిరించేలా మాట్లాడారని నటి పూజా హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు.
    • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలీ బెనెట్ భేటీ అయ్యారు.
    • హైదరాబాద్ జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్‌లో నిందితులుగానున్న మైనర్లందరినీ వయోజనులుగా భావించి కేసు విచారణ చేపట్టాలని జువైనల్ జస్టిస్ బోర్డుకు తెలంగాణ పోలీసులు అభ్యర్థించనున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.
  4. India Vs South Africa: తొలి టీ20లో భారత్ ఓటమి

    దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది.

    తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 211 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని సాధించేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా చివరి ఓవర్లలో దూకుడుగా ఆడి విజయం సాధించింది.

    దక్షిణాఫ్రికా బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, డస్సెన్‌లు సిక్సర్లతో విరుచుకుపడడంతో మ్యాచ్ భారత్ చేజారింది.

    డస్సెన్ 46 బంతుల్లో 5 సిక్స్‌లు 7 ఫోర్లతో 75 పరుగులు చేయగా మిల్లర్ 31 బంతుల్లో 5 సిక్స్‌లు 4 ఫోర్లతో 64 పరుగులు చేశాడు.

    చివరి ఓవర్లలో ఇద్దరూ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. భువనేశ్వర్ కుమార్ కుమార్ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదడంతో దక్షిణాఫ్రికా స్కోరు 200కి చేరింది.

    దీంతో లక్ష్యం 12 బంతుల్లో 12 బంతులుగా మారింది.

    17వ ఓవర్లో భారీగా పరుగులు సమర్పించుకున్న హర్షల్ పటేల్ 19 ఓవర్ కొంత కట్టుదిట్టంగా వేసినప్పటికీ 8 పరుగులు ఇచ్చాడు.

    దీంతో దక్షిణాఫ్రికా విజయానికి 4 పరుగులే అవసరం పడ్డాయి.

    చాహల్ వేసిన 20వ ఓవర్ తొలి బంతికే డస్సెన్ ఫోర్ కొట్టడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.

    అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఇషాన్ కిషన్ 76 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 36 పరుగులు చేశారు.

    హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ధాటిగా ఆడారు.

  5. Ind Vs SA:దక్షిణాఫ్రికా12 ఓవర్లకు 106 పరుగులు

    భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 12 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది.

    డికాక్ (22) , ప్రిటోరియస్ (29), బవుమా (10) వికెట్లు దక్షిణాఫ్రికా కోల్పోయింది.

    తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

    ఇషాన్ కిషన్ 76 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 36 పరుగులు చేశారు.

  6. బిందెడు నీటి కోసం 70 ఏళ్లుగా యుద్ధం

  7. Ind Vs SA: దక్షిణాఫ్రికా విజయ లక్ష్యం 212.. సిక్సర్లతో విరుచుకుపడిన భారత బ్యాటర్లు

    దక్షిణాఫ్రికాతో తొలి T20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్నాలుగు వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది.

    ఇషాన్ కిషన్ 76 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 36 పరుగులు చేశారు.

    ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 3 సిక్స్‌లు, 11 ఫోర్లతో 76 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 27 బంతులలో 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 36 పరుగులు చేశాడు.

    హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్ కూడా ధాటిగా ఆడారు. రిషబ్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29 పరుగులు చేయగా రుతురాజ్ 15 బంతుల్లో 3 సిక్స్‌లతో 23 పరుగులు చేశారు. హార్దిక్ పాండ్య 12 బంతుల్లో 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో 31 పరుగులు చేశాడు.

    దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్, ప్రిటోరియస్, పార్‌నెల్, నార్జ్ ఒక్కో వికెట్ తీశారు.

  8. ఇజ్రాయెల్ ప్రధానితో యూఏఈ అధ్యక్షుడి చర్చలు

    యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నఫ్తాలీ బెనెట్ భేటీ అయ్యారు.

    అబుధాబిలో గురువారం ఈ సమావేశం జరిగింది. పెట్టుబడులు, ఆర్థిక అభివృద్ధి, ఆహార భద్రత, ఆరోగ్యం తదితర రంగాలపై వీరు చర్చలు జరిపారు.

    అమెరికా చొరవతో యూఏఈ, బహ్రెయిన్‌ కలిసి 2020లో ఇజ్రాయెల్‌తో ద్వైపాక్షిక బంధాలను ఏర్పరచుకున్నాయి. వీటిని అబ్రహాం ఎకార్డ్స్‌గా పిలుస్తున్నారు.

    యూఏఈ, బహ్రెయిన్‌లతోపాటు ఇజ్రాయెల్‌కు కూడా ఇరాన్‌తో విభేదాలున్నాయి.

  9. లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి చైనా కార్యకలాపాలపై భారత్ ఏం అంటోంది?

    లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి పెరుగుతున్న చైనా కార్యకలాపాలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది.

    సరిహద్దుల వెంబడి చైనా కార్యకలాపాలను చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోందని అమెరికా ప్రధాన సైనిక జనరల్ బుధవారం చెప్పారు. ఆందోళనకర స్థాయిలో చైనా మౌలిక సదుపాయల నిర్మాణాలను చేపడుతోందని ఆయన చెప్పారు.

    ఈ వార్తలపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చి స్పందించారు. ‘‘చైనా వైపు జరుగుతున్న పరిణామాలను భారత ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. మౌలిక సదుపాయాల నిర్మాణంపై కూడా దృష్టిపెట్టింది. మరోవైపు భారత్‌వైపు సరిహద్దు ప్రాంతాల్లోనూ ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది’’అని ఆయన అన్నారు.

    మరోవైపు భారత్, చైనాల మధ్య జరుగుతున్న సీనియర్ కమాండర్ స్థాయి చర్చలపైనా బాగ్చి స్పందించారు. ‘‘ఈ చర్చల కోసం గత వారం అంగీకారం కుదిరింది. విభేదాల పరిష్కారం కోసం ఈ చర్చల్లో దృష్టిసారిస్తారు’’అని ఆయన చెప్పారు.

  10. నారా లోకేశ్ జూమ్ మీటింగ్‌లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ

  11. అరబ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులపై ముస్లిం విద్వేష రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుంది

  12. జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్‌ కేసు: నిందితులైన మైనర్లను వయోజనులుగా పరిగణించాలని పోలీసుల అభ్యర్థన

    హైదరాబాద్ జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్‌లో నిందితులుగానున్న మైనర్లందరినీ వయోజనులుగా భావించి కేసు విచారణ చేపట్టాలని జువైనల్ జస్టిస్ బోర్డుకు తెలంగాణ పోలీసులు అభ్యర్థించనున్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

    జువైనల్ జస్టిస్ బోర్డుకు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అభ్యర్థించనున్నట్లు ఏఎన్ఐ పేర్కొంది.

    ఈ కేసులో ఐదుగురు మైనర్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరందరికీ గరిష్ఠ శిక్షలు పడేలా చూసేందుకు పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.

    పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వాగతించారు.

    మైనర్ బాలికపై ఆరుగురు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

  13. జగ్గీ వాసుదేవ్: ‘ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మించలేం, అలా చేయాలంటే దేశమంతా తవ్వుకుంటూ రావాలి’

  14. పూజా హెగ్డేకు విమానంలో చేదు అనుభవం.. సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆవేదన

    ఇండిగో విమాన సిబ్బంది ఒకరు తనతో చాలా దురుసుగా, బెదిరించేలా మాట్లాడారని నటి పూజా హెగ్డే ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ విషయంపై ఆమె గురువారం ఒక ట్వీట్ చేశారు.

    ‘‘ముంబయి నుంచి విమానంలో వస్తున్నప్పుడు అతడు చాలా దురుసుగా, కఠినంగా ప్రవర్తించాడు. బెదిరించేలా మాట్లాడాడు. సాధారంగా నేను ఇలాంటి అంశాలపై ఆన్‌లైన్‌లో స్పందించను. కానీ, అతను చాలా దారుణంగా ప్రవర్తించాడు’’అని ఆమె పేర్కొన్నారు.

  15. నయనతారతో పెళ్లి ఫొటో షేర్ చేసిన విఘ్నేశ్ శివన్

    నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ల వివాహం మహాబలిపురంలో జరిగింది.

    స్నేహితులు, సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి రజినీకాంత్, షారుక్ ఖాన్, మరికొందరు నటులు, దర్శకులు హాజరయ్యారు.

    తమ పెళ్లికి సంబంధించి విఘ్నేశ్ శివన్ కొద్దిసేపటి కిందట ట్విటర్‌లో ఫొటో షేర్ చేశారు.

    మంగళసూత్రం కట్టిన తరువాత నయనతార నుదుటిపై తాను ముద్దు పెడుతున్న ఫొటోను విఘ్నేశ్ షేర్ చేశారు.

  16. President Election 2022: జులై 18న రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్, 21న ఫలితాలు

    రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం(ఈసీ) విడుదల చేసింది.

    ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జులై 24తో ముగియనుంది. ఈ నేపథ్యంలో దిల్లీలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి షెడ్యూల్‌ను విడుదల చేశారు.

    జులై 18న ఓటింగ్ జరుగుతుందని, 21న కౌటింగ్ నిర్వహిస్తామని రాజీవ్ కుమార్ చెప్పారు.

    మొత్తం 4809 మంది ఓటర్లు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో పాలుపంచుకోబోతున్నట్లు వివరించారు.

  17. హిందీ మీడియంలో సివిల్స్ రాసే వాళ్లు సక్సెస్ కాలేక పోతున్నారా

  18. బిహార్: కొడుకు మృతదేహం కోసం డబ్బులు అడుక్కున్న తల్లిదండ్రులు

    బిహార్‌లోని సమస్తీపుర్‌లో బిడ్డ శవాన్ని విడిపించుకోవడానికి అవసరమైన డబ్బుల కోసం తల్లిదండ్రులు ఇంటింటికి తిరిగి అడుక్కున్నారు.

    సదార్ ఆసుపత్రిలో ఉన్న తమ కొడుకు మృత దేహాన్ని ఇవ్వడానికి అక్కడి సిబ్బంది రూ.50 వేలు అడిగినట్లు ఆ తల్లిదండ్రులు ఆరోపించారు.

    అయితే ఈ ఘటన మీద తాము ప్రాథమిక విచారణ చేపట్టామని ఆసుపత్రి సిబ్బంది డబ్బులు అడిగినట్లుగా తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని సమస్తీపుర్ ఏడీఎం వినయ్ కుమార్ రాయ్ తెలిపారు.

    తుది విచారణ ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని బిహార్ ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండే అన్నారు.

  19. లద్దాఖ్‌లో చైనా ఏం చేస్తోంది? కళ్లు తెరిపించేలా చైనా పనులు ఉన్నాయని అమెరికా ఎందుకు అంటోంది?

  20. ఇరాన్‌లో పెరుగుతున్న ‘పరువు’ హత్యలు.. మహిళల్ని చంపేస్తున్న కుటుంబ సభ్యులు