హుజూరాబాద్‌‌లో 86.33 శాతం, బద్వేల్‌లో 68.12 శాతం పోలింగ్

2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో 84.4 శాతం పోలింగ్ నమోదు కాగా బద్వేల్‌లో 2019 శాసనసభ ఎన్నికలలో 76.37 శాతం పోలింగ్ నమోదైంది.

లైవ్ కవరేజీ

  1. హుజూరాబాద్‌లో 86.33 శాతం, బద్వేల్‌లో 68.12 శాతం పోలింగ్

    ఈవీఎంలు పరిశీలిస్తున్న అధికారులు

    హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది.

    కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పోలింగ్ సమయం పెంచడంతో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 12 గంటల పాటు పోలింగ్ జరిగింది.

    హుజూరాబాద్‌లో సాయంత్రం 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్ నమోదైంది.

    బద్వేల్‌లో సాయంత్రం 7 గంటల సరికి 68.12 శాతం పోలింగ్ నమోదైంది.

    2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో 84.4 శాతం పోలింగ్ నమోదు కాగా బద్వేల్‌లో 2019 శాసనసభ ఎన్నికలలో 76.37 శాతం పోలింగ్ నమోదైంది.

    హుజూరాబాద్‌లో..

    పోలింగ్ ప్రారంభం నుండే ఇల్లందకుంట, జమ్మికుంట,హుజూరాబాద్,కమలాపూర్ మండలాల్లో పలుచోట్ల టీఆర్ఎస్, బీజేపి వర్గాలమధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.

    వీణవంక మండలం గన్ముక్కుల లో టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి, బీజేపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది.

    హిమ్మత్ నగర్ ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భార్య గెల్లు శ్వేత ల మధ్య మాటలయుద్దం కాస్తా రెండు వర్గాలు కొట్టుకునేందుకు దారితీసింది.

    కమలాపూర్ మండలం మరిపల్లిగూడెం వద్ద ఈటల రాజేంధర్ కాన్వాయ్ లో అనుమతి లేని వాహనాలు తిరుగుతున్నాయని ఓ వాహనం స్వాధీనం చేసుకుని , ఈటల పీఆర్వో తో పాటు మరో ఇద్దరిని అదుపులో తీసుకున్నారు.

    పోలింగ్ ముసిగిన వెంటనే ఈవీఎం లను ప్రత్యేక భధ్రతా ఏర్పాట్ల మధ్య కరీంనగర్ తరలిస్తున్నారు. నవంబర్ 2న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్‌లో కౌంటింగ్ నిర్వహిస్తారు.

    బద్వేల్‌లో

    బద్వేల్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసినట్లు కడప జిల్లా కలెక్టర్ విజయరామరాజు ప్రకటించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని ఆయన చెప్పారు.

    కాగా.. బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా పలు గ్రామాలలో వైసీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదాలు జరిగాయి. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైసీపీ కార్యకర్తలను బీజేపీ అభ్యర్థి సురేశ్ అడ్డుకున్నారు.

    అయితే, దొంగ ఓట్లు వేస్తున్నారనేది అవాస్తవమని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ చెప్పారు.

  2. హుజూరాబాద్‌లో భారీగా, బద్వేల్‌లో మందకొడిగా పోలింగ్

    హుజూరాబాద్ నియోజకవర్గం వంగపల్లిలో పోలింగ్ కేంద్రం

    ఫొటో సోర్స్, bbc

    హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ సాయంత్రం 7 గంటలతో ముగిసింది.

    చెదురుమదురు ఘటనలు మినహా రెండు నియోజకవర్గాలలోనూ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

    హుజూరాబాద్‌లో సాయంత్రం 5 గంటల వరకు 76.26 శాతం పోలింగ్ నమోదైంది.

    బద్వేల్‌లో సాయంత్రం 5 గంటల సరికి 59.58 శాతం పోలింగ్ నమోదైంది.

    రాత్రి 7 గంటల వరకు పోలింగ్ కొనసాగినందున ఈ శాతాలు మరింత పెరగనున్నాయి.

  3. జీ20: రోమ్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను కలిసిన భారత ప్రధాని మోదీ

    భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్

    రోమ్‌ నగరంలో జరుగుతున్న జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్‌లను కలుసుకున్నారు.

    వారు సరదాగా సంభాషించుకుంటూ వెళ్తున్న ఫోటోలను ఏఎన్ఐ వార్తా సంస్థ అందించింది.

    ఈ సందర్భంగా కోవిడ్ సంక్షోభంలో ముందుండి సేవలందించిన ఫ్రంట్‌లైన్ వర్కర్స్ ప్రధాని మోదీ, ఇతర దేశాల నాయకులతో కలిసి ‘ఫ్యామిలీ ఫోటో’ దిగారు.

    ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మేక్రాన్‌తో మోదీ కాసేపు సమావేశమయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  4. హుజూరాబాద్‌లో 60 శాతం దాటిన పోలింగ్, బద్వేల్‌లో 44.82 శాతం

    హుజూరాబాద్ ఉప ఎన్నిక
    ఫొటో క్యాప్షన్, వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్‌లో మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భార్య శ్వేత అనుచరుల మధ్య ఘర్షణ

    తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటల వరుక 61.66 శాతం పోలింగ్ నమోదైంది.

    పోలింగ్ సందర్భంగా వీణవంక మండలంలోని హిమ్మత్‌నగర్‌లో మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ భార్య శ్వేత అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నాన్ లోకల్ వాళ్లు పోలింగ్ రోజు ఎలా తిరుగుతున్నారని శ్వేత ప్రశ్నించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

    హన్మకొండ జిల్లా, కమలాపూర్ మండలం, మరిపల్లిగూడెం వద్ద ఈటల రాజేందర్ కాన్వాయిలోని ఒక వాహనానికి పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఈటల పీఆర్వో చైతన్యతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

    మరోవైపు, ఏపీలో జరుగుతున్న బద్వేలు ఉప ఎన్నికలో మధ్యాహ్నం 3 గంటల వరకు 44.82 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర సమాచార శాఖ ప్రచార విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.

  5. జీ20 సదస్సులో వాతావరణ మార్పులు, కోవిడ్ అంశాల మీదే ఫోకస్

    జీ20 సదస్సు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తున్న ఇటలీ ప్రధాని మారియో డ్రాగీ

    వాతావరణ మార్పులు, కోవిడ్ అనేవి త్వరలో ఇటలీలో జరుగనున్న జీ20 సదస్సులో ప్రధాన చర్చనీయాంశాలు కాబోతున్నాయి. ప్రపంచంలోని కీలక ఆర్థిక వ్యవస్థల దేశాల కూటమి అయిన జీ20 సదస్సులో ఈసారి దేశాధినేతాలు ముఖాముఖి చర్చించబోతున్నారు. కోవిడ్ మహమ్మారి రెక్క విప్పిన తరువాత ఇలా ముఖాముఖిగా సదస్సు ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి.

    అయితే, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌లు ఈ సదస్సులో పాల్గొనడానికి రోమ్‌కు రావడం లేదు. ఈ ఇరువురు నేతలూ ఈ సమావేశంలో వీడియో లింక్‌ ద్వారానే పాల్గొంటారు.

    రోమ్ నగరంలోని రోమా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థ – ప్రపంచ ఆరోగ్యం’ అనే చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు.

    కాలుష్య వ్యాప్తిని అడ్డుకోకపోతే తీవ్రమైన ముప్పు తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం జరుగనుంది. 19 దేశాలు, యూరోపియన్ యూనియన్‌ల కూటమి అయిన జీ20 దేశాలు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న కర్బన ఉద్గారాలలో 80 శాతానికి బాధ్యత వహిస్తున్నాయి.

    రెండు రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సుకు ముందుగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాట్లాడుతూ, వాతావరణ మార్పుల విషయంలో సరైన చర్యలు తీసుకోకపోతే‘మన నాగరికత’ తిరోగమించే ప్రమాదం ఉందన్నారు. దానివల్ల భవిష్యత్ తరాలకు ఇప్పుడున్న తరంతో పోల్చితే ఆమోదయోగ్యం కాని జీవితాలను ఇచ్చినవాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు.

    ఈ సదస్సులో ఆయన కోవిడ్ మీద కూడా మాట్లాడే అవకాశాలున్నాయి. “కోవిడ్‌ను మనం ఎంత త్వరగా ఎదుర్కుంటామన్న దానిపైనే ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడం ఆధారపడి ఉంటుంది” అని జాన్సన్ అన్నారు.

    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని, పెరుగుతున్న ధరలను అదుపులో పెట్టాలని పిలుపునిచ్చే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో మహమ్మారులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఈ సదస్సులో చర్చించవచ్చు.

    జీ20 దేశాలు
    ఫొటో క్యాప్షన్, జీ20 దేశాలు (యూరోపియన్ యూనియన్‌కు కూడా సభ్యత్వం ఉంది)
  6. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 45.63 శాతం పోలింగ్

    మధ్యాహ్నం ఒంటి గంట వరకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 45.63 శాతం పోలింగ్ నమోదైంది.

    మరోవైపు, బద్వేలు నియోజకవర్గంలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.47 శాతం పోలింగ్ నమోదైంది.

  7. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్

    తెలంగాణలోని హుజూరాబాద్‌ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.

    ఉదయం 11 గంటల వరకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 33.27శాతం పోలింగ్ నమోదైంది.

    ఇక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస యాదవ్‌, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట నరసింగ రావు ఎన్నికల బరిలో ఉన్నారు.

    హుజూరాబాద్‌లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ చెప్పారు.

    “2018 ఎన్నికల్లో ఇక్కడ 84.4 శాతం పోలింగ్ అయ్యింది. ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కోవిడ్-19 గైడ్‌లైన్స్ ప్రకారం పోలింగ్ జరుగుతోంది” అని ఆయన చెప్పారు.

    హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పలువురు ట్రాన్స్‌జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

    హుజూరాబాద్ ఓటర్ల జాబితాలో థర్డ్ జెండర్‌లో నమోదైన ఒకే ఒక్క ఓటరు రొంటాల కుమారి కూడా ఓటేశారు.

    ట్రాన్స్ జెండర్ ఓటర్లు

    ఫొటో సోర్స్, ugc

    ఫొటో క్యాప్షన్, హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటేసిన ట్రాన్స్‌జెండర్ ఓటర్లు
  8. ఆర్యన్ ఖాన్: ఈ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు

    డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచా‌లకు బాంబే హైకోర్టు 14 షరతులతో బెయిల్ మంజూరు చేసింది.

    ఈ 14 షరతులను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దవుతుందని స్సష్టం చేసింది.

    ఇవీ షరతులు

    * బెయిల్ మంజూరైన ముగ్గురూ ఒక్కొక్కరు రూ. లక్ష చొప్పున పూచీకత్తు సమర్పించాలి.

    * ఒకరు కానీ ఇద్దరు కానీ ష్యూరిటీ సంతకాలు పెట్టాలి.

    * ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న నేరారోపణల తరహా కార్యకలాపాల్లో పాల్గొనరాదు.

    * నిందితుల్లో ఎవరూ తమ సహ నిందితులతో మాట్లాడే ప్రయత్నం చేయరాదు. డ్రగ్స్ సంబంధిత వ్యవహారాల్లో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రమేయం ఉన్న ఎవరినీ సంప్రదించరాదు.

    * ముగ్గురూ వెంటనే తమతమ పాస్‌పోర్టులను ప్రత్యేక కోర్టుకు సమర్పించాలి.

    * కోర్టు అనుమతి లేకుండా దేశం దాటి వెళ్లేందుకు ప్రయత్నించరాదు.

    * ముంబయి దాటి బయటకు వెళ్లాలన్నా దర్యాప్తు అధికారికి తమ ప్రయాణ వివరాలు తెలపాల్సి ఉంటుంది.

    * ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేయడానికి ఎలాంటి ప్రయత్నం చేయరాదు.

    * మీడియాకు ఏ రూపంలోనూ స్టేట్మెంట్లు ఇవ్వరాదు.

    * ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య ముంబయిలోని ఎన్‌సీబీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరుకావాలి.

    * బలమైన కారణం ఉంటే తప్ప విచారణకు గైర్హాజరు కావడానికి వీల్లేదు.

    * విచారణ ప్రారంభమైన తరువాత నిందితులు ఏ రకంగాను జాప్యానికి కారణం కారాదు.

    * ఎన్‌సీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా నిందితులు తప్పనిసరిగా హాజరుకావాలి.

    * ఈ షరతులలో దేనిని ఉల్లంఘించినా బెయిల్ రద్దు చేయాలని ఎన్‌సీబీ అధికారులు కోరవచ్చు.

  9. ఆర్యన్ ఖాన్ జైలు నుంచి బయటకు వస్తున్న వీడియో

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  10. జైలు నుంచి ఆర్యన్ ఖాన్ విడుదల

    ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్‌ జైలు నుంచి విడుదల అయ్యారు.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  11. 'ఆర్యన్ ఖాన్ విడుదలకు సంబంధించిన ఆదేశాలు అందాయి. ఆయన విడుదలకు సంబంధించిన ప్రక్రియ ఒకట్రెండు గంటల్లో పూర్తవుతుంది' అని ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్ నితిన్ వేచల్ చెప్పారు.

    డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్, అర్బాజ్ మర్చంట్, మున్‌మున్ ధమేచా‌లకు బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  12. మరికొద్దిసేపట్లో జైలు నుంచి విడుదల కానున్న ఆర్యన్‌ ఖాన్

    ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్నారు.

    ఆర్యన్ ఖాన్ విడుదలకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిందని ముంబయి ఆర్థర్ రోడ్ జైలు అధికారులు చెప్పినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ ట్వీట్ చేసింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

  13. టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డిని అడ్డుకున్న బీజేపి కార్యకర్తలు

    హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక పోలింగ్ బూత్‌లో టీఆర్ఎస్ ప్రచారం నిర్వహిస్తోందంటూ బీజేపీ ఆందోళనకు దిగింది.

    టీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

    మరోవైపు హుజూరాబాద్ నియోజక వర్గంలో ఉదయం 9 గంటల వరకు 10.50శాతం పోలింగ్ నమోదైంది.

    ఈటల దంపతులు కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

    అటు, బద్వేలు నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 10.49 శాతం పోలింగ్ నమోదైంది.

    ఓటు వేసిన ఈటల

    ఫొటో సోర్స్, UGC

    ఫొటో క్యాప్షన్, కమలాపూర్‌లో ఓటు వేసిన ఈటల దంపతులు
  14. ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక

    ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయన బీజేపీ నుంచి బరిలో ఉన్నారు.

    గెల్లు శ్రీనివాస యాదవ్‌ను తమ అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది.

    కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట నరసింగ రావు అభ్యర్థిగా ఉన్నారు.

    ఈ ముగ్గురు కాకుండా మరో 27 మంది పోటీలో ఉన్నారు. అంటే మొత్తం 30 మంది ఎన్నికల బరిలో ఉన్నారు.

    స్థానిక పరిస్థితులను బట్టి ప్రధాన పోటీ బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్యే ఉండబోతున్నట్టు అర్థమవుతోంది.

    ఇక కరీంనగర్, హుజూరాబాద్ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రాబల్యం ఎక్కువే. 2004 నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీదే గెలుపు.

    అదే సమయంలో బీజేపీ క్రమంగా తన ఉనికిని చాటుకుంటూ వచ్చింది.

    హుజూరాబాద్
  15. సాయంత్రం ఏడు గంటల వరకు ఓటు వేసే అవకాశం

    హుజురాబాద్‌లో పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం ఏడు గంటల వరకు ఓటు వేయవచ్చు.

    అన్ని పోలింగ్ కేంద్రాలలో హెల్త్ డెస్క్ పెట్టారు. ఓటర్లందరూ మాస్కులు పెట్టుకోవాలి. అదనంగా బూత్‌ల దగ్గర కూడా కొన్ని మాస్కులు ఉంచారు. శానిటైజర్లు పెట్టారు.

    ఈవీఎం బటన్ నొక్కడం కోసం చేతికి ఒక డిస్పోజబుల్ గ్లౌస్ ఇస్తారు. క్యూలలో భౌతిక దూరం పాటించాలి. పోలింగ్ స్టేషన్లను శానిటైజ్ చేశారు.

    306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు

    మొత్తం 2,36,873 మందికి సాధారణ ఓటు హక్కు ఉంది. వారిలో 1, 17, 779 మంది పురుషులు, 1, 19, 993 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ వ్యక్తి ఉన్నారు.

    వీరిలో పాటు 149 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 14 మంది ఎన్ఆర్ఐలను కలుపుకుంటే మొత్తం 2, 37, 36 మందికి ఓటు హక్కు ఉంది.

    ఈ ఎన్నికల్లో మొత్తం 306 కంట్రోల్ యూనిట్‌లూ, 612 బ్యాలెట్ యూనిట్లూ వాడుతున్నారు. అదనంగా మరో 279 బ్యాలెట్ యూనిట్లు సిద్ధం చేసుకున్నారు.

    కేంద్ర బలగాల నుంచి 1, 520 మంది పోలీసులు, రాష్ట్ర రిజర్వు పోలీసు నుంచి 174 మంది, కరీంనగర్ జిల్లా నుంచి 700 మంది పోలీసులు, ఇతర జిల్లా నుంచి 1, 471 మంది పోలీసులు కలపి మొత్తం 3, 865 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

    ఓటరు
    ఫొటో క్యాప్షన్, హుజూరాబాద్‌లో ఓటు వేసిన వ్యక్తి
  16. బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. ఈరోజు తెలంగాణలోని హుజూరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాత్రి 7 గంటల వరకూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ పేజీని చూడండి.